మాంసాహారం అంటే మృతాహారం అని అర్థం. మృతం అంటే చచ్చిపోయింది, వ్యర్థమైంది, నీచమైంది అని చెప్పుకోవాలి. చచ్చిపోయిన ఏ ప్రాణిలో అయినా మరుక్షణమే కోటానుకోట్ల వ్యాధికారక సూక్ష్మ జీవులు ఉత్పన్నమై క్షణ క్షణం పెరుగుతూ ఉంటాయి. అందుకే చనిపోయిన మనిషి వద్ద కూడా ఈ సూక్ష్మజీవుల వల్ల ఇతరులకు హాని కలుగకుండా పొగ వేస్తుంటారు. అంతేకాక చనిపోయిన వ్యక్తి ఎంత గొప్ప వాడైనా ఆ రోజు సూర్యాస్తమయం లోపుగా అతడిని కాల్చివేయడమో, భూమిలో పూడ్చి వేయడమో జరుగుతుంది. ఆ కొద్ది సేపు శవం వద్ద ఉన్న వారు ఆ బట్టలు తీసివేసి స్నానం చేసిన తర్వాతే ఇళ్లకు పోతారు. శవం మోసిన వారు స్మశానంలోనే గుండు గొరిగించుకుని తల స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇంటికి వస్తారు. అంతే కాక చనిపోయిన వ్యక్తి ఇంటికి దినం జరిగే వరకు ఇతరులెవరూ రారు. ఎందుకంటే ఆ ఇల్లంతా శవం నుండి పుట్టిన క్రిములతో నిండి ఉంటుంది కాబట్టి . ఇలా వ్యాధి కారకమైన మాంసాహారం మానవులకు యోగ్యమైనది కాదు. మాంసాన్ని తాము తింటున్నాం అనుకుంటారు చాలా మంది. నిజానికి మాంసమే వారి అందాన్ని, ఆరోగ్యాన్ని , ఆనందాన్ని, ఆయువును తింటుందని వారికి తెలియదు. ఇక శాకాహారంలో మృత కణాలు ఉండవు. ఇది సజీవమైనది. శక్ అంటే శక్తివంతమైన, సౌందర్యవంతమైన, పరాక్రమవంతమైన అనే అర్థం. శాకాహారం వల్ల మానవులకు సర్వశక్తులు అందడమే కాక వారికి సత్వ గుణం, కాంతి, తేజస్సు ఆయువు పెంపొందుతూ వారి జీవితం స్వర్గ ధామంగా మారుతుంది. ఇంగ్లీషు చదువులు చదవడం తప్ప దేశీయ విజ్ఞానం అణు మాత్రమైనా తెలియని ఆధునిక మేధావులు వ్రాసిన అవాస్తవాలు నమ్మి తిరిగి నరక కూపంలో పడిపోకుండా శాకాహారంతో శక్తిని , ఆ శక్తితో దేశ భక్తిని, ఆ భక్తితో జీవన్ముక్తిని సాధించాలి.
పెట్టుడు మందు సమస్య..
వందేళ్ళ వయసు గల వేప చెట్టు నుండి ఆకులు 100 గ్రాములు , దోరగా వేయించిన మిరియాలు 50 గ్రాములు , సైంధవ లవణం పొడిని 25 గ్రాములు , తేనె 100 గ్రాములు తీసుకోవాలి. తేనె తప్ప మిగిలిన వాటిని మెత్తటి చూర్ణాలుగా తయారు చేసుకొని , తేనెతో కలిపి మెత్తగా దంచి ముద్ద చేసుకుని నిలువ చేసుకోవాలి. దీన్ని పాపకు 2 గ్రాముల మోతాదుగాను, అమ్మకు 5 గ్రాములు మోతాదుగాను ఆహారానికి గంట ముందు తినిపించాలి. దీనివల్ల శరీరంలో ఎలాంటి విషమైనా విరిగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మహా ఋషుల ఆజ్ఞ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి