Monday 12 December 2011

HEALTHY CONCEIVING ,HEALTHY DIET DURING PREGNANCY - DR . I. RAMAKRISHNA

ఆరోగ్యకరమైన గర్భధారణ ఆరోగ్యకరమైన ఆహారం గర్భధారణ సమయంలో
స్త్రీ జీవనానికి పరాకాష్ట అర్థం ఆ మాతృత్వం ఆమెకి పరిపూర్ణతని జీవితానికి ఒక అర్థాన్ని అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది రెండవ నెల ఆరంభమయ్యాక తను గర్భవతినని తెలిసిన క్షణం నుంచి ఇల్లాలు గర్భవతిగా మారి ఆరవ నెల వచ్చేసరికి ద్రౌ హృద్రి గా మారి తొమ్మిదో నెల దాటాక పూర్ణవతిగా మారి ప్రసవం తర్వాత సూదికగా తల్లిగా మారుతుంది ఆ మొదటి క్షణం నుంచి ఈ క్షణం దాకా అది ఆహార భరితమై ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మీరు గుర్తించారో లేదో కానీ ఈ లోకంలో ఒక అద్భుత శక్తి ఉంది దాన్నే మనం దేవుడు భగవంతుడు అని అంటున్నాం భార్యాభర్తలు ఇద్దరూ కలిసే సంయోగ సమయంలో విడుదలైన రెండు విభిన్న స్వరూపాలు కలిగిన చిన్న జీవ కణాలు లాంటివి కలిసి తమ రూపురేఖ విలాసాలను కోల్పోయి మరో కొత్త జీవిగా క్షణకాలంలో ఏర్పడి జీవం సంతరించుకొని బుజ్జి పాపాయిగా గర్భంలో స్థిరపడి పెరుగుతుంది
అందుకే కరుణశ్రీ అంటారు పుట్టబోయేది బుల్లి బుజ్జాయి కోసమై పొదుపు గిన్నెలో పాలు పోసి అలసిపోయితినేమో అని భగవంతుడిని పిలుస్తారు ఈ గర్భిణిగా ఉన్న కాలాన్ని అమృతమయం చేసుకునేటట్లు తీర్చిదిద్దారు
అపోహలు వద్దు.. ఆధునిక ఆలోచన ధోరణిలో గర్భధారణ హఠాత్తుగా జరిగే ఒక ప్రమాదం అని అనుకోకుండా జీవితం అనుభవించడానికి కాలం చాలటం లేదని టీవీలో వచ్చే మందులతో గర్భస్రావం చేసుకోకుండా చక్కటి ప్రణాళికతో అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించాలి. ఆలస్యంగా వివాహాలు అవుతున్న కాలంలో అంతకుముందున్న హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల గర్భం రావడం అవుతుంది అందుకే గుణవంతమైన తొలి గర్భాన్ని తొలగించుకోకుండా ఉండటం మంచిది. గర్భం గురించి భయపడటం బాధపడటం కన్నా అర్థం చేసుకుని మంచి ప్రణాళికతో ముందుకు సాగండి చాలామంది స్త్రీలు గర్భధారణ సమయంలో మన వాళ్లు చెప్పే ప్రక్రియ గురించి అపోహ పడతారు కానీ వాటిని అర్థం చేసుకొని ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఆయుర్వేదంలో గర్భిణీ పరిచర్య అన్ని కాలాలకి అన్ని వర్గాల ప్రజలకి అన్ని దేశాల వారికి అన్ని స్వభావాల వారికి అనుగుణంగా చెప్పబడ్డాయి అందుకే గర్భిణీ చేసే సంస్కారాలను గాను ఖర్చుతో కూడిన ఆడంబరంగానో చూడకూడదు ఆయా మాసాలలో చేసే ఆ సంస్కారాల ప్రభావం గర్భిణీకి ఆమెలో పెరుగుతున్న బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి బిడ్డ ఆరోగ్యంగా అందంగా ఎదగడానికి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా కాపాడతాయి గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు నుంచే ఆలోచించడం ఆరంభించాలి ముందు నుంచే భార్య భర్తలు ఇద్దరు మంచి ఆహారం తీసుకోవాలి దీన్ని శుక్ర ఆవృత ఆప్యాయనం అంటారు  పురుషునిలోని శుక్ర బీజం, స్త్రీలోని ఆర్థవబీజం  పుష్టికరమైన ఆహారం తీసుకోవడానికి ఆప్యాయనం అంటారు.
సంస్కారాలు... బెల్లం నెయ్యితో చేసిన మినప సున్ని ఉండలు, వేయించిన జీడిపప్పు బాదం వంటి బలమైనా ఆహారాన్ని తీసుకోవడం గర్భిణికి హితకరం. గర్భిణికి మినుములతో చేసిన గారెలు నువ్వులు బెల్లం కలిపిన ఉండలు తినడం రాత్రి పాలు తాగడం హిత కరం.. శరీరాన్ని ముఖ్యంగా గుహ్య భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం పంచకర్మ చికిత్సల ద్వారా శరీరాన్ని నవోన్వేషం చేసుకోవడం చాలా మంచిది నెలసరి అయిన ఆరవ రోజున స్త్రీలు తైలవస్తి చేయించుకోవడం వల్ల గర్భాశయ శ్లోతస్సులు శక్తివంతమై ఉత్తేజితమై గర్భధారణకు అనుకూలంగా మారుతాయి అక్కడ అభ్యంగనాదుల వల్ల ఉత్తేజితమై కలయిక సమయంలో తొందరగా ప్రేరేపితమవుతాయి. ఒక్కో ఆలోచన ఒక్కో పని వలన మనసులో ఒక ముద్రని అనుభూతుని కలిగించి వదులుతుంది అది శాశ్వతంగా ఉండిపోతుంది. అలాంటి మంచి ముద్రలే సంస్కారాలు అంటారు స్త్రీ పురుషుల శుక్ర ఆర్తవ సంయోగం చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం వాళ్లలో ఉండే ఆలోచన సరళి ఉద్వేగాదులు ఇవన్నీ సంస్కారాలను ప్రభావితం చేస్తాయి ఈ సంస్కారాలు రెండు విధాలు ఒకటి శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భస్థ సంస్కారాలు రెండవది అతను జన్మించాక చేసే సంస్కారాలు జన్మాంతర సంస్కారాలు
దేవుడిచ్చిన వరం.. మొదటి సంస్కారాలలో తొలి సంస్కారాన్ని గర్భదానం అంటారు రెండవది పుంస వనం, సీమంతోత్సవం ఈ మూడింటిని గర్భిణీ సంస్కారం అంటారు అలాగే పుట్టిన తర్వాత చేసేటటువంటి ఉపనయనం బ్రహ్మచర్య సంస్కారం గృహస్థ సంస్కారం ఇవి మూడు జన్మాంతర సంస్కారాలు
గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి సంభోగం శారీరక శ్రమ ఆరాటం ఎక్కువ వేడి వస్తువులు తినడం తీవ్రమైన మందులు వాడటం గర్భపాతక పదార్థాలు ఇంగువ బొప్పాయి నువ్వులు వంటివి తినడం మానివేయాలి. పరుగెత్తడం ఎగిరే ఆటలు ఆడడం కుర్చీ చేతుల మీద గడపల పైన కూర్చోవడం భయంకరమైన దృశ్యాలు చూడటం కడుపులో గాలిని బిగబట్టడం మలమూత్ర వేగాలని ఆపుకోవడం విపరీతంగా శ్రమించడం తనకు తాను కానీ ఇతరుల చేతకాని నొప్పించబడటం పుట్టపై బరువు మోపడం ఎండిన బాగా కారంగా వేడిగా ఉన్న పదార్థాలు తినడం ఆకలిని చంపుకోవడం చేయకూడదు ముఖ్యంగా గర్భిణీలు చెడు ఆలోచనలు వాటి వల్ల వచ్చే ఉద్రేఖదులు దరిచేరనివ్వకూడదు
 ఈ కాలంలో ముఖ్యంగా మద్యం తీసుకోకూడదు ఇది ఎదుగుతున్న గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుంది ఎక్కువ తీపి పదార్థాలు తినకూడదు దీనివల్ల అంతశక్తి తగ్గుతుంది అలాగే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు దీనివల్ల నీరు శరీరంలో నిలవబడుతుంది గర్భిణులు మంచి మాటలు వింటూ మంచి పుస్తకాలు చదువుతూ మంచి ఆలోచనలతో సంతోషంగా శరీరం మనసు పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉంటాయి
తేనెలో ఊరవేసిన ఉసిరికాయలు రోజుకు ఒకటి చొప్పున తీసుకొని రాత్రి పాలు తాగుతుంటే గర్భిణీకి బలంతో పాటు గర్భం కూడా చక్కగా ఎదుగుతుంది
సొంటి అర చెంచా సరస్వతీ ఆకుల చూర్ణం అర చెంచా యాలకుల చూర్ణం అర చెంచా మిరియాల చూర్ణం అర చెంచా ఈ మూడింటిని చూర్ణాన్ని రోజుకు 200 గ్రాములు అర గ్లాసు పాలతో తీసుకుంటే అందమైన పిల్లలు పుడతారు.






No comments:

Post a Comment