30, డిసెంబర్ 2011, శుక్రవారం

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు.. చింత చెట్టుతో

ఆయుర్మాత పుత్రులారా! చింతచెట్టులేని ఊరులేదు. చింతచెట్టు పోగొట్టలేని రోగము లేదు. చింత అంటే
విచారము, దు:ఖము లేకరోగము అనే అర్థంలో అలాంటి చింతలను పోగొట్టేశక్తి ఈ చెట్టులో వుంది కాబట్టే
మన పెద్దలు దీనికి చింతచెట్టు అని నామకరణం చేశారు. చింతచిగురుతో, చింతపువ్వుతో, చింతపండుతో
చింతాకుతో వివిధరకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని నిలువచేసుకొని వాడుకొనే సంప్రదాయ
ఆహారపద్ధతులు మన తెలుగునాట బహుళ ప్రచారంలో వుండేవి. దురదృష్టవశాత్తు ఆధునిక యుగారంభంతో
ఆరోగ్యసంప్రదాయాలు మరుగునపడిపోవడంతో ఆ అమూల్యమైన దేశీయ ఆహారవిజ్ఞానాన్ని మనం
కోల్పోయాం. మరలా ఆ విజ్ఞానాన్ని వెలికితీసి అందరికి పంచిపెడదాం....

చింతచెట్టు - పేర్లు

సంస్కృతంలో తింత్రిణీ, వృక్షామ్ల, ఫలామ్లక,
అని, హిందీలో ఇట్లే అని, తెలుగులో చింతచెట్టు
అని, లాటిన్లో Tamarindus Indica ఆంగ్లంలో The
Tamarind tree అంటారు.

చింతచెట్టు - రూప గుణ ప్రభావాలు..

దీని లేతకాయలు వగరు, పులుపు రుచులతోను,
ముదిరిన కాయలు పుల్లగాను వుంటయ్. బాగా పండిన
తరువాత పులుపు తీపి కలిసి వుంటయ్. ఇవి వేడిచేసే
గుణంతో వాతరోగాలను పోగొడతయ్. అయితే, కొత్త
చింతపండును అతిగా వాడితే రక్తదోషమేర్పడుతుంది.
కడుపులో ఉబ్బరం పుడుతుంది. అందువల్ల ఎప్పుడు
పాతచింతపండునే వాడాలి.


తేలువిషం - విరిగిపోవుటకు

చింతగింజను నీటితో అరగదీసి ఆ గంధాన్ని
దట్టంగా తేలుకుట్టినచోట పట్టిస్తే అది ఆరేటప్పటికి
విషం దిగిపోతుంది.



1 . వాపులు తగ్గుటకు ( FOR SWELLINGS )

చింత ఆకు
ఆముదం లేదా నెయ్యి

ఆకును  నలగ కొట్టి ,ఆముదముతో గాని నెయ్యితో గాని దోరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెట్టాలి.

uses - వాపులు తగ్గిపోతాయి.

2 . అతి మూత్ర రోగం తగ్గుటకు ( FOR EXCESSIVE URINATION )

చింత ఆకు రసం - 30 gm
గేదె మజ్జిగ - 1/2 cup

 పై వాటిని కలిపి రోజూ రెండు పూటలా సేవించాలి.

uses -  40 రోజులలో అతిమూత్ర వ్యాధి తగ్గిపోతుంది మేహ రోగాలు కూడా అదుపులోకి వస్తాయి.

3 . వీర్య వృద్ధి , వీర్య స్థంభన కొరకు ( FOR SEMEN IMPROVEMENT AND PENIS STRENGTH )

చింత గింజల పొడి - 1 స్పూన్
పాలు - 1 కప్ 

చింత గింజలను వేయించి నానబెట్టి పైై పొట్టు తీసి పప్పును ఎండబెట్టి మెత్తగా పొడిచేసి జల్లించి నిల్వ ఉంచుకోవాలి ఒక స్పూన్ పొడి ఒక కప్పు వేడి పాలలో కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి.

uses -  వీర్య వృద్ధి ,వీర్య స్తంభన కలుగుతాయి

4 . కామెర్లు తగ్గుటకు ( FOR JAUNDICE )

చింతాకు రసము - 1 ఔన్స్

 చింత ఆకును దంచి రసం తీసి రోజూ పరగడుపున ఒక మోతాదుగా మూడు రోజులపాటు తాగాలి. చప్పిడి పథ్యం పాటించాలి.

uses - కామెర్లు తగ్గిపోతాయి

5 . విరిగిన ఎముకల నొప్పి తగ్గుటకు ( FOR PAINS OF BROKEN BONES )

నువ్వుల నూనె ,చింతపండు, మెత్తని ఎర్ర మట్టి.

 పై వాటిని కలిపి కొద్దిగా వేడిి చేసి ,బట్టలో వేసి కాపడం పెట్టాలి.

uses -  ఎముకల నొప్పి త్వరగా తగ్గిపోతుంది.అని భావ మిశ్ర పండితుల మాట.

6 . RECIPE FOR BODY SWELLINGS

వాపులు తగ్గడానికి

చింతాకు
ఆముదం లేదా నెయ్యి

ఆకును నలగగొట్టి ఆముదం లేదా నెయ్యి తో గాని దోరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెడుతుంటే వాపులు తగ్గిపోతాయని హరీత మహర్షి నిర్ధారించారు.

7 . RECIPE FOR SMALL POX

మశూచికం తగ్గడానికి

చింతాకు రసం
మంచిపసుపు

పై రెండింటిని కలిపి 1 , 2 చెంచాలు , రోజూ రెండు పూటలా సేవిస్తుంటే మశూచికం తగ్గిపోతుంది

8 . RECIPE FOR TASTE LESS NESS OF TOUNGE

అరుచి తగ్గడానికి

చింతపండు
కొద్దిగా బెల్లం
కొద్దిగా దాల్చిన చెక్కపొడి
కొద్ది  ఏలకుల పొడి
కొద్దిగా మిరియాల పొడి

పై అన్నింటిని కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బుగ్గన పెట్టుకొని చప్పరించి రసం మింగుతుంటే నోటి అరుచి తగ్గిపోయి బాగా ఆకలి పుడుతుంది.

ఉదరములో పాములు - ఉరికి వచ్చుటకు

చింతపండు, రేలచిగుర్లు సమంగా కలిపి మెత్తగా
నూరి రేగిపండంత మాత్రలుచేసి ఆరబెట్టి నిలువ
చేసుకోవాలి. రోజూ రాత్రి నిద్రించేముందు పిల్లలకు
ఒక మాత్ర పెద్దలకు రెండు మాత్రలు చప్పరించి
తింటూ వుంటే ఉదయం లేవగానే సుఖ విరేచనమై దాని
ద్వారా ఏలికపాములు పడిపోతయ్.

తామర వ్యాధిని - తరిమి కొట్టుటకు

చింతగింజలను నిమ్మకాయ రసంతో అరగదీసి ఆ
గంధాన్ని తామర పైన పట్టిస్తూవుంటే నాలుగైదు
రోజుల్లో తామర వ్యాధిని తరిమి కొడుతుంది.

కుష్ఠు పుండ్లు - ఖతం ఖతం

చింత బెరడును కాల్చి జల్లించిన బూడిద, సూరే
కారంపొడి సమంగా కలిపి ఆ మొత్తంలో సగభాగం
వంతు రాతి సున్నంపొడి కలిపి వుంచుకొని రోజూ
తగినంత పొడిని నీటితో నూరి కుష్టుపుండ్లపైన లేపనం
చేస్తూవుంటే ఆ పుండ్లు అతి త్వరగా మాని పోతయ్.

వడ దెబ్బనుండి - రక్షణ పొందుటకు

నీటిలో చింతపండును బాగా పిసికి వడపోసి
తగినంత పంచదార కలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు
పూటలు తాగుతూ వుంటే వడదెబ్బ వలన కలిగిన
నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో
రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో
తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

అజీర్ణం హరించి - ఆరోగ్యం కలుగుటకు

చింతపండు 20 గ్రా, మంచినీరు 50 గ్రా కలిపి
పిసికి వడకట్టి అందులో నల్లుప్పు 3 గ్రా, మిరియాల
పొడి 1 గ్రా, పుదీనా ఆకులు 40 కలిపి తాగుతుంటే
అరుచి, అజీర్ణం హరించిపోతయ్. *

వాంతులు,డోకులు - హరించుటకు

గింజలు తీసిన చింతపండును మెత్తగా నూరి శనగ
గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
పూటకు రెండుమూడు మాత్రలు బుగ్గన పెట్టుకొని
రెండుపూటలా చప్పరిస్తుంటే వాంతులు ఆగిపోతాయి.

ప్రతి ఇంటా -చింత పూల కారంపొడి

చింతపూవులను ఎక్కువగా తెచ్చుకొని గాలికి
ఆరబెట్టి ఎండిన తరువాత శుభ్రమైన కుండలో నిలువ
చేసుకోవాలి. నెలకు ఒకసారి తగినంత పువ్వును తీసి
దంచి పొడిచేసి సమంగా కరివేపాకు పొడి కలిపి
మిగతా జిలకర ధనియాలవంటి దినుసులు చేర్చి
కారంపొడి తయారుచేసుకోవాలి. ఇది చాలా రుచిగా
సకల రోగాలకు పథ్యంగావుండి జీవితంలో ఎప్పుడూ
కాలేయ (లివర్)రోగాలు రాకుండా కాపాడుతుంది.
ప్రతిరోజూ ఆహారంలో వాడుకోవచ్చు.
* ఇదే ఎండిన పూవ్వులను ప్రతిరోజూ
కూరలలో చింతపండుకు బదులుగా పులుపుకోసం
ఉపయోగించుకొంటూ వుంటే ఇక ఆ యింట్లో
వ్యాధులు రానే రావు. ఎందుకంటే దీనివల్ల ఎల్లప్పుడు
లివర్ బాగుంటుంది కాబట్టి, అది బాగుంటే శరీర
మంతా బాగుంటుంది.


దురదలు, వ్రణాలు-దూరం దూరం

చింతగింజలను నీటితో సాన రాయిపైన అరగదీసి ఆ
గంధాన్ని పైన పట్టిస్తూ వుంటే భయంకరమైన మంట
లతో పోట్లతో బాధపెట్టే వ్రణాలు గానీ, దురదలు గానీ
దూరంగా పారిపోతయ్..

DR. ELCHURI RECIPES WITH GORINTA CHETTU ( HENNA PLANT )


గురిచూసి రోగాలను తరిమికొట్టు - గోరింటచెట్టు

ప్రియాతి ప్రియమైన అభిమానపాఠకులారా! పూర్వకాలంలో గోరింట చెట్టును ఊరూరా విరివిగా
పెంచుకునేవారు. ప్రతి పండుగ సందర్భంలో గోరింటాకును చేతులకు అలంకరించుకునే వారు. స్త్రీలు పాదాలకు
కూడా గోరింటాకును పెట్టుకోవడం పాద సౌందర్యాన్ని పెంచుకోవడం మన ఆచారంగా వుండేది. అయితే,
చాలామందికి గోరింట అంటే కేవలం చేతులకు అలంకారంగా పెట్టుకునే సాధనం మాత్రమే అని తెలుసు. కానీ,
గోరింట ఒక గొప్ప ఔషధం కూడా అని తెలియదు. ఈనాడు గోరింట పేరుతో అనేకరకాల విష రసాయనాలు కలిపిన
మిశ్రమాలు అలంకరణ కోసం అమ్మ బడుతున్నయ్. ఈ విషపు గోరింటను వాడటమే చాలా సులభం అనే
ఆలోచనలతో నేటి ఆధునికులు ఆ విషాన్ని తమ చేతులకు పాదాలకు పులుము కుంటూ లేనిపోని కొత్త రోగాలను
కొనుక్కుంటున్నారు. ప్రజలలో ఈ విష గోరింట దుష్పరిణామాలను వివరించి అసలైన మనదేశవాళ గోరింటాకు
మాత్రమే వాడుకోవాలని చెబుతూ ఈ క్రింద వివరించబోయే ఇతర ఉపయోగాలను కూడా అందరికీ పంచిపెట్టండి.



గోరింట చెట్టు రూప గుణ ప్రభావాలు 

దీని మానుబెరడు రసం గానీ, కషాయం గానీ, లేక చూర్ణం గానీ చెడిపోయిన శరీర తత్వాన్ని మంచిగా మారుస్తయ్‌. పాండు రోగం,ప్లీహ రోగం, మూత్ర కృచ్చం కలిగిన చర్మరోగాలు, కాలిన పుండ్లు, (వ్రణాలు, నోటిపూత, తలనొప్పి, స్ఫోటకము, కంతులు, గ్రంథులు, తల వెంట్రుకల రోగాలు మొదలైన అనేక అనారోగ్య సమస్యలను గోరింట చెట్టు సునాయాసంగా పరిష్కరించగలదు. 

వాపులు, నొప్పలు తగ్గుటకు

గోరింటాకు కొంచెం సబ్బు ముక్క కలిపి నీటితో మెత్తగా నూరి పైన పట్టు వేస్తుంటే, దెబ్బల వల్ల కలిగిన వాపులు, దెబ్బల నొప్పి, కీళ్ళనొప్పులు, కీళ్ళ పట్లు, మేహవాత నొప్పులు కూడా తగ్గిపోతయ్‌. 



కాళ్ళు, చేతులు పగిలి వుంటే 

గోరింటాకును మెత్తగా నూరి చేతుల పైన, కాళ్ళ పైన, పిప్పిగోళ్ళ పైన, వ్రేళ్ళ సందులలో, పాచి వున చోట లేపనం చేయాలి. ఇలా రోజూ రాత్రిపూట చేస్తూవుంటే పై సమస్యలు తొలగి పోవడమే కాక, లేనివారికి ఎప్పటికీ రాకుండా వుంటయ్‌. 

శరీరంపై కంతులకు, మొండి గ్రంథులకు

 పచ్చి గోరింటాకును తెచ్చి నీరు కలపకుండా మెత్తగా నూరి ఆ ముద్దను రాత్రి నిద్రించే ముందు కంతుల పైన, గ్రంధుల పైన వేసి దూది పెట్టి ఊడిపోకుండా కట్టు కడుతూవుంటే అవి తగ్గిపోతాయి. 

వేసవిలో నీరసం తగ్గుటకు

 పచ్చి గోరింటాకులు 10 గ్రా. తీసుకొని పావు లీటరు మంచినీటిలో వేసి రాత్రి నుండి ఉదయం వరకు నానబెట్టి, ఉదయంపూట ఆకులను పిసికి బట్టలో వడ పోసుకోవాలి. ఆ నీటిలో కండ  చక్కెర పొడి 50(గ్రా .కలిపి పరగడుపున నెల రోజుల పాటు విడవకుండా తాగుతుంటే ఎంత ఎండలో తిరిగినా గ నీరసం రాకపోవడమే కాక రక్తశుద్ధి జరి శరీరానికి బలం కూడా కలుగుతుంది. 

తెలుగు - గోరింట , గోరింత,మైదాకు
english - henna plant
హిందీ - మెహందీ
సంస్కృతం - నఖ రంజన ,మేధిక

1 . అరికాళ్ళ మంటలు తగ్గుటకు ( FOR FOOT BURNS )

గోరింటాకు - 1 భాగం
మాచికాయ - 1 భాగం
నారింజ ఆకు - 1 భాగం

 పై వాటిని కలిపి మెత్తగా నూరి అరికాళ్ళకు పూసుకోవాలి.

uses -  మంటలు త్వరగా తగ్గిపోతాయి.

2 . నోటి పూత తగ్గడానికి ( FOR MOUTH ULCERS )

మంచి నీరు- 1 గ్లాస్
గోరింటాకు లు - 15

 పై వాటిని కలిపి చిన్న మంటపైన ఒక కప్ కషాయం మిగిలే వరకు మరిగించాలి .తర్వాత వడ పోసి గోరువెచ్చగా అయిన తర్వాత నోటిలో పోసుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు పుక్కిలించి ఊసివేయాలి . రోజూ రెండు పూటలా ఇలా చేయాలి.

uses - తీవ్రమైన నోటి పూత ,నోటి  పుండ్లు అతి త్వరగా తగ్గిపోతాయి.

3 . తల నొప్పి తగ్గడానికి ( FOR HEADACHE )

గోరింటాకు

ఆకును మెత్తగా నూరి ఆ గుజ్జును కనతలపైన మందంగా పట్టువేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.

uses - గోరింట గుజ్జు ఎండిపోయేటప్పటికి తలనొప్పి తగ్గిపోతుంది.

4 . గజ్జి,తామర, చిడుము,దురదలు,దద్దుర్లు ( FOR SCABIES ,RING WORM ,ITCHINGS ETC SKIN DISEASES )

గోరింటాకు

 ప్రతిరోజు పచ్చి గోరింటాకును తెచ్చి మెత్తగా రుబ్బాలి. గుజ్జును చర్మ సమస్య ఉన్నచోట దట్టంగా లేపనం చేయాలి లేపనం పూర్తిగా ఎండిపోయిన తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఒకసారి చేస్తూ వంకాయ గోంగూర మాంసాహారం చేపలు వంటి పదార్థాలను తినకుండా ఆహార నియమాలు పాటించాలి.

uses -  గజ్జి తామర మొదలగు చర్మ సమస్యలు సులువుగా తగ్గిపోతాయి.

5 . గోర్ల సమస్యలు తగ్గడానికి. ( FOR VARIOUS NAIL PROBLEMS )

గోరింటాకు

 ఆకును మెత్తగా నూరి నిద్రపోయే ముందు గోర్ల పైన లేపనం చేసుకోవాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేయాలి.

uses -  పుచ్చిన గోర్లు , గొగ్గిరి గోర్లు , మొదలగు గోర్ల సమస్యలు తగ్గుతాయి.
.
కండ్ల నొప్పికి - కమనీయ మార్గం

పచ్చిగోరింటాకు 40గ్రా. తీసుకొని మెత్తగా
దంచి ముద్ద చేయాలి. ఆ ముద్దను గారె లాగా
వెడల్పుగా చేతితో చరిచి దానిని ఒక నూలు బట్టపై
పెట్టి ఆ ముద్ద ఆను కొనేటట్లు ఆసనానికి పెట్టి గోచీ
కట్టుకోవాలి. రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచి
ఉదయంపూట గోచీ గుడ్డను తీసివేయాలి. ఇలా
చేస్తుంటే కండ్ల నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది.

పుండ్లు పడి - చర్మం మందమైతే

కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన
పుండ్లు వచ్చి అవి తగ్గిన తరువాత పై చర్మం లావుగా
మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి
రోజూ నిదురించే ముందు తగినంత గోరింటాకు
తీసుకొని మెత్తగా నూరి ఆ ముద్దను పైన వేసి కట్టు
కడుతూ వుంటే క్రమంగా మందంగా వున్న చర్మం
తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది.

జగ మొండి - చర్మ రోగములకు

గోరింటాకు చిగుర్లు, పూలు వీటిని 20 గ్రా.
మోతాదుగా తీసుకొని ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక
కప్పు కషాయం అనగా నాలుగవ వంతు కషాయం
మిగిలే టట్లు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా
తాగుతుంటే చర్మరోగాలు హరించి పోతయ్. *


సంభోగ సౌఖ్యానికి - ముళ్ళ గోరింట

ముళ్ళ గోరింట గింజలను మేలి రకమైన తేనెతో
మెత్తగా నూరి దానిని పురుషులు తమ మర్మాంగము పై లేపనం చేసుకొని ఆరిన తరువాత సంభోగం
చేస్తుంటే ఎక్కువ సమయం వీర్యం నిలుస్తుంది.

దంతాలు ఊడకుండా - గట్టి పడుటకు

ఒక గ్లాసు నీటిలో పది గ్రాముల నల్ల పూల ముళ్ళ
గోరింటాకును వేసి ఒక కప్పు కషాయం మిగిలే
వరకు మరిగించి వడపోసి అది గోరువెచ్చగా
అయిన తరువాత నోటిలో పోసుకొని అయిదు నిమిషాలసేపు పుక్కిలించి వూసి వేయాలి. ఇలా చేస్తుంటే
పండ్లు గట్టిపడి నోటిపూత కూడ తగ్గిపోతుంది.

నోటినుండి రక్తం పడుతూ వుంటే 

పసుపుపచ్చని పూలు పూసే ముళ్ళ గోరింట
వేరును తెచ్చి కడిగి ఆర బెట్టుకోవాలి. ఈ వేరును
కొంచెం తేనెతో అరగదీసి ఆ గంధాన్ని 5 గ్రా. మోతాదుగా కొద్దికొద్దిగా నాలుకతో నాకుతూ వుంటే నోటి
నుండి పడే రక్తం ఆగిపోతుంది.

నిద్ర రాని వారికి - నిద్ర వచ్చుటకు

చాలామందికి వివిధరకాల మానసిక ఆందోళనల వల్ల లేక నరాల బలహీనతల వల్ల రాత్రిపూట
చాల సేపటి వరకు నిద్ర రాదు. అలాంటివారు
గోరింట చెట్టునుండి పూలు తెచ్చుకొని ఆ పూలను
దిండు కింద పరచి ఆ దిండు పైన తల బెట్టి కళ్ళు
మూసుకొని పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.

అన్నిరకాల - సర్పి రోగాలకు

గోరింటాకు,ధనియాలు, ఎర్రచందనం, వీటిని
సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి,
జల్లెడ పట్టి ఆ తరువాత ఒకదానిలో ఒకటి వరుసగా
కలిపి ఒక గాజు పాత్రలో నిలువ వుంచుకోవాలి.

రోజూ పూటకు 3 గ్రా. మోతాదుగా నీటితో
రెండుపూటలా ఆహారానికి అరగంట ముందు
సేవిస్తూ, ఉప్పు వేయని గోధుమ రొట్టెను నేతితో తింటూ 
వుంటే క్రమంగా అన్నిరకాల సర్పి వ్యాధులు
తప్పకుండా హరించి పోతయ్.  


29, డిసెంబర్ 2011, గురువారం

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు - కలబంద తో( ALOE VERA )



కన్నకూతురిలా కుటుంబానికి అనుబంధ కలబంద* 

భారత విజ్ఞాన ధనరాశులకు వారసులైన సోదరీ సోదరులారా! ఈనాడు యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్నిచేసిన కలబంద గొప్పతనాలు మనభారతీయులకు ఏమాత్రం తెలియకపోవడం అత్యంత విషాదకరం. ఏ దేశంలోనో పుట్టిన శాస్త్రజ్ఞులు ఈ దేశానికి వచ్చి మన ఆయుర్వేద గ్రంథాలు చదివి మన కలబందను తీసుకుపోయి వాళ్ళ దేశాలలో లక్షల హెక్టార్లలో పెంచుకొని మన గ్రంథాలను బట్టి వందల రకాల కలబంద బెషధాలను తయారుచేసి వాటిని మనదేశానికి తీసుకొచ్చి కలబంద గొప్పతనం గురించి ఊరూరా ప్రచారం చేస్తు వేలరూపాయలకు అమ్ముకుంటూ ప్రతిరోజు వేలకోట్ల రూపాయలను వాళ్ళదేశాలకు తరలించుకుపోతున్నారు. అయినా మనకు చీమకుట్టినట్లుకూడా లేదు. మీరంతా గొంతెత్తి అరచి చెప్పండి. మన కలబంద మన కుమార్తె వంటిదని అందుకే దాన్ని సంస్కృతంలో కుమారీ అని పిలుస్తారని దానిద్వారా 

మన కుటుంబాలను బృందావనాలుగా మార్చుకోవచ్చని తెలుసుకోండి ,ఉపయోగించుకోండి. 

కలబంద రూప గుణ ప్రభావాలు 

ఇది ఒక ఆందమైన చెట్టు. దీని మట్టలు పొడవుగా ఆకుపచ్చగా పెరుగుతయ్‌. మట్టల చుట్టూ సన్నని ముండ్లలాగా కొనలుంటయ్‌. ఇది బాగా పెరిగిన తరువాత దీని మధ్యనుండి మూడడుగుల ఎత్తుగా ఎర్ర రంగు గల కాడ పొడవుగా పెరుగుతుంది. ఈ కాడ తలపైన ఎర్రటి పూలు పూస్తయ్‌. 

కలబంద మట్టలను అడ్డంగా కోస్తే దానినుండి 
తెల్లని చిక్కని ద్రవం కారుతుంది. దాన్ని ఎండలో పెడితే 
అది నల్లగా మారుతుంది. దానినే మూసాంబరం అంటారు. దీనిని తయారుచేసుకొని ఎల్లప్పుడూ నిలువ వుంచుకొని అనేక వ్యాధులకు బెషధంగా ఉపయోగించుకొనే గొప్ప సంప్రదాయం మన తెలుగునాట యుగ యుగాలుగా ఉంది. ఈ దరిద్రపు ఆధునిక యుగంలో ఈ అలవాటు నశించిపోయింది. దానిని ప్రచారంలోకి తెచ్చి ఆరోగ్యవంత మైన సమాజాన్ని నిర్మించుకుందాం.


తెలుగు లో- కలబంద
english లో - అలోవెరా 
హిందీ లో- గీకవార్ 
సంస్కృతంలో - కుమారి 


కలబంద మట్ట లను అడ్డంగా కోస్తే తెల్లని , చిక్కటి ద్రవం కారుతుంది. దీనిని ఎండలో పెడితే  నల్లగా మారుతుంది.. దీనినే మూసంబరం అంటారు. దీనిని నిలువచేసుకొని అనేక వ్యాధులకు ఔషధంగా వాడుకోవచ్చు.

1 . కంటి కలక తగ్గిపోవుటకు  ( CONJUNCTIVITIS ) ( SORE EYES )

కలబంద చిన్న ముక్క
పసుపు

 చిన్న కలబంద ముక్కను తీసుకొని ఒకవైపు పొర తొలగించి దానిపై పసుపును చల్లి బొటనవేలి అడుగుభాగాన అంటించి కట్టు కట్టాలి.

uses - కండ్ల కలక తగ్గిపోతుంది

2 . ఎక్కిళ్ళు వెంటనే తగ్గడానికి ( FOR QUICK RELIEF FROM HICCOUGHS )

కలబంద రసం - 30 gm
శొంఠి పొడి - 3 చిటికెలు.

 పై వాటిని కలిపి లోనికి సేవించాలి.

uses -  ఎక్కిళ్ళు వటనే తగ్గిపోతాయి.

3 . బహిష్టులో వచ్చే కడుపు నొప్పులకు ( STOMACH PAINS DURING PERIODS TIME )

కలబంద గుజ్జు- 1 స్పూన్ 
నెయ్యి - 1 స్పూన్ 
కరక్కాయ ల పొడి- 3 చిటికెలు
సైంధవ లవణం - 3 చిటికెలు

 పై అన్నింటినీ కలిపి రోజూ రెండు పూటలా ఆహారానికి ఒక గంట ముందు తినాలి..

uses -  బహిష్టులో కడుపునొప్పి తగ్గిపోయి ఇక ముందు రాకుండా ఉంటుంది.

4 . బలం పెరగడానికి ( FOR BODY STRENGTH ) 

కలబంద వేరు ముక్కల పొడి- 5 gm
ఆవు పాలు - 1 కప్ 
పటిక బెల్లం - 1 స్పూన్

 కలబంద వేరు తెచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి దంచి పొడిి చసి నిలువ ఉంచుకోవాలి .రోజు పరగడుపున ఐదు గ్రాములు పొడిని, ఒక కప్పు ఆవుపాలతో కలిపి ఒక స్పూన్ పట్టిక బెల్లం కూడా కలిపి తాగుతూ ఉండాలి.

uses -  స్త్రీ పురుషులకు అత్యంత బలం కలుగుతుంది.

5 . సంతాన ప్రాప్తి కొరకు ( FOR INFERTILITY )

కలబంద గుజ్జు - 10 gm
శంఖ పుష్పి - 10 gm
గంధపు చెక్క - 10 gm
తానికాయల పొడి - 10 gm

 పై అన్నింటిని ఆవుపాలతో కలిపి బహిష్టు స్నానం చేసిన రోజున సేవించి భర్తతో సంసారం చేయాలి.

uses -  సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది..

6 .  కంటి నొప్పి తగ్గడానికి  (  FOR  EYE PAIN ) 

కలబంద సొన  -  4 చుక్కలు

 కలబందను కోయగా వచ్చిన సొనలు బట్టలో వేసి మూడు, నాలుగు చుక్కలు చెవులలో పిండాలి.

uses  -  కంటి నొప్పి తగ్గిపోతుంది.

7 . ముదిరిన కామెర్లు (  పసిరికల జబ్బు )  తగ్గడానికి (  FOR CHRONIC JAUNDICE )

కలబంద రసం  -  1 భాగం
నెయ్యి  -  1 భాగం 

 పై వాటిని కలిపి చిన్న గిన్నెలో వేసి కామెర్ల రోగి ముక్కు వద్ద పెట్టి మాటిమాటికి వాసన చూపిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇతర మందులు లోనికి వాడుకోవాలి.

uses  -  కామెర్లు తగ్గిపోతాయి

8 . కుక్క కాటు విషం తగ్గుటకు  (  FOR DOG BITE  )

కలబంద మట్ట 
సైంధవ లవణం ( rock salt )

 కలబంద మట్టను మధ్యలోకి చీల్చి ఆ గుజ్జు పైన సైంధవ లవణం పొడి చల్లి కుక్క కరిచిన చోట దానిని వేసి కట్టు కట్టాలి .రోజు ఒకసారి కట్టు మారుస్తూ ఉండాలి.

uses  -   నాలుగైదు సార్లు పై విధంగా చేస్తే కుక్క విషము హరించిపోతుంది

9 . మధు మేహం తగ్గుటకు  (  FOR DIABETES )

కలబంద గుజ్జు -  5 gm
తిప్ప సత్తు  -  3 చిటికెలు  (  3 pinches )

 పై వాటిని కలిపి రెండు పూటలా ఆహారానికి అరగంట ముందు సేవిస్తుండాలి.

uses  -  మధుమేహం , అతిమూత్రం తగ్గిపోతాయి.

10  . పగలని మొండి గడ్డలు  (  FOR HARD CYSTS )

కలబంద మట్ట
ఉప్పు పొడి (  salt powder )-  1 gm
పసుపు పొడి ( turmeric powder  )  -  2 gm

 కలబంద మట్టను ఒక వైపు తోలు తీసి లోపలి గుజ్జు పైన ఉప్పు పొడి పసుపు పొడి చల్లి దానిని గడ్డలపైన పెట్టి కట్టు కడుతుండాలి.

uses  -  గడ్డలు  త్వరగా పక్వానికి వచ్చి  పగిలిపోయి బాధ తగ్గుతుంది.

11 . నారి కురుపులు తగ్గడానికి 

కలబంద గుజ్జు, మెంతి పొడి 

పై కట్టు -  కలబంద గుజ్జు, మెంతి పొడి కలిపి నారి కురుపుల పైన వేసి కట్టు కట్టాలి .ఉదయమే కట్టు విప్పి చూస్తే పురుగులన్నీ బట్టలోకి వస్తాయి. వాటిని తీసిపారవేయాలి.

లోపలికి సేవనం - 

కలబంద గుజ్జు  - 1 చెంచా
ఉప్పు  -  1 గ్రాము
మిరియాల పొడి  - 1 గ్రాము
నెయ్యి  - 1 చెంచా

 పై అన్నింటినీ కలిపి రోజుకు రెండుసార్లు తినాలి.

ఉపయోగాలు - కురుపులు తగ్గిపోతాయి.

12 . కంటి పొరలు తగ్గడానికి  (  FOR EYE LAYERS )

చిల్ల గింజలు ( ఇండుప గింజలు )
కలబంద రసం 

 గింజలను రసంలో పది రోజులు నానబెట్టి తీసి బాగా ఎండబెట్టి శుభ్రంగా తుడిచి నిలువ ఉంచుకోవాలి. రోజూ రాత్రి నిద్రించే ముందు ఆ గింజను సానరాయి పైన కొంచెం నీటితో అరగదీసి కంది బద్ద అంత గంధం కంటిలో పెడుతూ ఉండాలి.

ఉపయోగాలు  - కంటి పొరలు హరించి పోయి , చూపు నిర్మలంగా వస్తుంది

13 . కీళ్ల నొప్పులు తగ్గడానికి హల్వా ( FOR JOINT PAINS )

కలబంద గుజ్జు  - 1 kg
గోధుమ పిండి - 1/2 kg
ఆవు నెయ్యి  - 1/2 kg
పటిక బెల్లం పొడి -  2 1/2 kg

 కలబంద రసాన్ని నెయ్యిలో వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే గోధుమ పిండిని కూడా ఆవు నేతిలో కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. ఆ తర్వాత పట్టిక బెల్లాన్ని చిన్న మంటపైన మరిగిస్తూ, పాకం రాగానే కలబంద గుజ్జును మరియు గోధుమ పిండిని, ఆవు నెయ్యిని అందులో కలిపితే హల్వా తయారవుతుంది. ఈ హల్వాను రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా తింటుండాలి.

ఉపయోగాలు  - మొండి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.


DR . KONDAPALLI NARASIMHAREDDY RECIPES WITH ALOE VERA ( KALABANDA )

1 . చర్మవ్యాధులు (  FOR SKIN DISEASES )

 కలబంద ఆకుల రసాన్ని చర్మం పైన లేపనం చేయాలి.

2 . ముఖం మీది నల్లని మచ్చలు తగ్గడానికి (  మంగు )( FOR BLACK SPOTS ON THE FACE )

కలబంద రసం - 1 భాగం 
వెన్న  -  1 భాగం

పై రెండింటినీ కలిపి రాయాలి మచ్చలు తగ్గిపోతాయి.

3 . చర్మ సౌందర్యం కొరకు (  FOR BEAUTIFUL FACE )

కలబంద గుజ్జు 

 కలబంద గుజ్జును పేస్ట్ గా చేసి  ప్రతిరోజు ముఖానికి లేపనం చేసుకోవాలి. ముఖ సౌందర్యం కలుగుతుంది.

4 . కాలిన పుండ్లు తగ్గడానికి  ( FOR BURNS )

కలబంద ఆకుల రసం 

 ఆకులను వేడి చేసి రసం తీసి కాలిన వ్రణాల పైన లేపనం చేయాలి. బాధ తగ్గి త్వరగా మానిపోతాయి.

5 . సెగ గడ్డలు , దెబ్బలు తగ్గడానికి ( FOR BOILS AND WOUNDS )

కలబంద గుజ్జు 

గుజ్జును ఉడికించి గడ్డల పైన, దెబ్బల పైన వేసి కట్టు కట్టాలి.

6 . స్థన వాపు తగ్గడానికి ( FOR BREAST SWELLING )

కలబంద ఆకుల లోని గుజ్జు లేదా వేరు 
పసుపు 

 పై రెండింటినీ సమాన భాగాలలో కలిపి నూరి లేపనం చేయాలి. వాపు తగ్గిపోతుంది.

7 . చెవి పోటు తగ్గడానికి (  FOR EAR PAIN 
 
కలబంద ఆకు.

 కలబంద ఆకును వేడి చేసి రసము తీసి చెవిలో ఒకటి ,రెండు చుక్కలు వేసిన చెవి బాధ తగ్గుతుంది.

8 . పంటి నొప్పి తగ్గడానికి ( FOR TOOTHACHE )

 కలబంద ఆకు రసమును చిగుర్లకు పట్టించాలి లేదా తొక్కు తీసిన కలబంద గుజ్జు ముక్కలను నమలాలి.

9 . కంటి కలక తగ్గడానికి ( FOR CONJUCTIVITIS )

కలబంద గుజ్జు - 1 భాగం
పసుపు  - 1 భాగం

పై రెండింటినీ కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనురెప్పల పైన వేసి కట్టు కట్టాలి.

10  మల బద్ధకం తగ్గడానికి  (  FOR CONSTIPATION )

కలబంద గుజ్జు ముక్క -  1 నుండి 1 1/2 అంగుళాలు

 రోజు రెండు పూటలా ముక్కను తినాలి,

11 . శరీర బరువు తగ్గడానికి (  FOR WEIGHT REDUCTION )

కలబంద ఆకు రసం  - 2 స్పూన్లు

 రసాన్ని ప్రతిరోజు రెండు నెలల పాటు సేవించాలి.

12 . ఆనెలు తగ్గడానికి ( FOR CORNS )

కలబంద గుజ్జు 

 గుజ్జును అరికాలిలో వచ్చు ఆనెల పైన వేసి కట్టు కట్టాలి.

13 . వడ దెబ్బ తగ్గటానికి (  FOR SUN STROKE )

కలబంద రసం 
నీరు 
చక్కెర

 పై వాటిని కలిపి సేవించాలి  .వడదెబ్బతో కలిగిన అలసట తగ్గిపోతుంది.

14 . దగ్గు తగ్గటానికి  ( FOR COUGH )

కలబంద రసం -  1 స్పూన్ 
మిరియాల చూర్ణం  - 1/2 స్పూన్ 
శొంఠి చూర్ణం  - 1/4 స్పూన్ 
తేనె - 1 స్పూన్ 

 పై అన్నింటినీ కలిపి సేవించాలి. దగ్గు తగ్గిపోతుంది.

15 . పిల్లల కడుపులోని నులి పురుగుల సమస్య తగ్గటానికి  (  FOR STOMACH WORMS IN THE CHILDREN )

కలబంద రసం - 2 స్పూన్లు
పొంగించిన ఇంగువ  - చిటికెడు

పై రెండింటిని కలిపి పిల్లలకు పట్టించాలి.

16 . అర్ష మొలలు తగ్గడానికి ( FOR PILES )

 ప్రతిరోజు కలబంద రసం 10 నుండి 30 గ్రాములు తాగిస్తూ కలబంద గుజ్జును పసుపుతో నూరి మొలల పైన లేపనం చేయాలి.

17 . కడుపుబ్బరం తగ్గడానికి (  FOR GAS PROBLEM )

 కలబంద గుజ్జు ,గోధుమపిండి, వాము, సైంధవ లవణం, జిలకర కలిపి చపాతీలు చేసుకుని భుజించినచో కడుపులో గ్యాస్ ఉబ్బరం తగ్గిపోతాయి.

18 . వరి బీజం తగ్గడానికి (  FOR HYDROCELE )

కలబంద గుజ్జు - 1 భాగం
బెల్లం  - 1 భాగం

 పై రెండింటినీ కలిపి, నూరి ఎండించి శనగ గింజంత గోలీలు చేసి రోజూ రెండు తినిపించాలి.

19 . రుతు శూల తగ్గడానికి (  FOR MENSUS PAIN )

 ప్రతి నెల ముట్టు శూలతో బాధపడే స్త్రీలు కలబంద ఆకుల రసమును 1/2 ఔన్స్ చొప్పున వారం రోజులు త్రాగాలి.

20 .శరీరంలో వేడి తగ్గడానికి ( FOR BODY HEAT )

కలబంద రసం 
పాలు
చక్కెర

 పై వాటిని కలిపి సేవిస్తే శరీరంలోని వేడి తగ్గటమే కాకుండా ధాతు పుష్టి ఆరోగ్యము బలము కలుగుతాయి.

21 . కుక్క కాటు తగ్గటానికి ( FOR DOG BITE )

కలబంద గుజ్జు 
ఉప్పు 

 పై రెండిటిని కలిపి ముద్దగా నూరి కాటుపై వేసి కట్టు కట్టాలి.
22 . కాలేయ, ప్లీహ వ్యాధులు తగ్గటానికి (  FOR LIVER ,SPLEEN DISEASES )

కలబంద రసం - 1 భాగం
పసుపు - 1 భాగం 

 పై రెండింటిని కలిపి 1/2 ఔన్స్ సేవించాలి

23 . పిల్లలలో మల బద్ధకం తగ్గటానికి ( FOR CONSTIPATION IN THE CHILDREN )

 కలబంద రసంతో తయారుచేసిన మూసాంబరం ఒక పలుకు చనుబాలతో పట్టించాలి.
24 . కీళ్ల నొప్పులు తగ్గటానికి ( FOR JOINT PAINS )

 మూసంబరం, జిలకర సమానంగా కలిపి నిమ్మరసంతో నూరి గురిగింజంత మాత్రలు చేసుకుని రోజూ రెండుసార్లు ఒక్కొక్కటి చొప్పున సేవించాలి.
25 . చనుబాలు మరిపించడానికి  ( FOR CHILDREN TO FORGET BREAST FEEDING  ) 

 మూసాంబరాన్ని చను బాలతో అరగదీసి చను మొనలపైన లేపనం చేయాలి.

ఉసిరిక చెట్టు - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు


ఉరకలు వేసే యౌవన శక్తుల తొలిమెట్టు - ఉసిరిక చెట్టు
ప్రియ పాఠకా! వేదకాలం నుండి త్రిఫలాలలో ఒక ప్రధాన ఫలంగా చేర్చబడిన
ఉసిరిక కాయల చెట్టు భారతీయుల జీవితంతో పెన వేసుకుపోయింది. అనేకరకాల
తిను బండారాలలో, ఆహార పదార్థాలలో సౌందర్య సాధనాలలో ప్రధాన పదార్థంగా ఉసిరిక
చేర్చబడింది. మన ఆయుర్వేద మహర్షులు ఉసిరిక చెట్టుపైన చేసిన పరిశోధనలు గమనిస్తే
మానవులకు వేరే చెట్టుతో అవసరం లేకుండా ఒక్క ఉసిరిక చెట్టు తోనే సంపూర్ణ ఆరోగ్యం
చేకూరగలదని అర్ధమౌతుంది. నిత్యజీవితంలో అనేక విధాలుగా వాడుకోవలసిన ఉసిరిక చెట్టు
గురించి వివరంగా తెలుసుకుందాం.

ఉసిరిక చెట్టు - పేర్లు

సంస్కృతంలో అమలకీ, ధాత్రి అని, హిందీలో
ఆంవలా అని, తెలుగులో ఉసిరిక అని, లాటిన్లో
Phyllanthus Emblica అని ఇంగ్లీషులో Emblica
Myrabolan , ఇండియన్ గూస్ బెర్రీ.

ఉసిరిక - రూప గుణ ప్రభావాలు..

దీని పై బెరడు, ఆకు రసం ,వీటితో కాచిన కషాయం
కొంచెం వెగటుగా, కారంగా, చేదు, పులుపు కూడా
కలిసిన రుచులతో చలువ చేసే గుణం కలిగి
వుంటుంది. వాత, పిత్త, కఫాలను మూడింటిని
హరించి వేస్తుంది.
ఈ చెక్కరసం కుళ్ళిన వ్రణాలను మాన్పుతుంది.

దీని బెరడు ,పసుపు సమంగా తేనెతో కలిపి 10 గ్రా
ఎనిమిది పూటలిస్తే సుఖ రోగం మాయమౌతుంది.

ఉసిరిక పచ్చడి - ఔషధగుణాలు

పండు ఉసిరిక కాయల పచ్చడి ఆదివారం తప్ప
ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ఆహారంలో సేవిస్తూ
వుంటే మేహ శాంతి, పైత్య శాంతి కలుగుతుంది.
అయితే, వాత రోగులు కొత్త ఉసిరికపచ్చడి తిన
కూడదు. పాతది తినవచ్చు. ఇది వీర్యము లోని వేడిని
తగ్గించి శీఘ్ర స్కలనాన్ని ఆపుతుంది.

ఉసిరిక వడియాలు, ఔషధగుణాలు

పండిన ఉసిరిక కాయల రసం, మినప్పప్పు,
తగినంత ఉప్పు కారం కలిపి రుబ్బి చేసిన వడియాలు
చాలా రుచికరంగా వుంటయ్. మూలవ్యాధి, శరీర
తాపం, మేహ రోగం, పైత్యం మొదలైన వ్యాధులున్న
వారికి, లేనివారికి కూడా అనుకూలంగా వుంటయ్.

* చైత్రమాసంలో పండిన ఉసిరికకాయలు
అత్యంత శ్రేష్ఠమైనవి.


రక్త, జిగట విరేచనములను తగ్గించడానికి

ఉసిరిక ఆకులు 50 గ్రాములు, మెంతులు 3 గ్రా.
అరలీటరు మంచినీటిలో వేసి పావు లీటరు కషాయానికి
మరిగించి వడపోసి, ఆ కషాయాన్ని సగం సగం
రెండుపూటలా తాగుతూ వుంటే ఎంతోకాలం నుంచి
బాధ పెడుతూ వున్న రక్త లేదా జిగట విరేచనాల సమస్య 
అతి సులువుగా హరించి పోతుంది.



 

స్త్రీల ఎర్ర బట్ట వ్యాధికి..

 ఉసిరిక కాయల పొడి  ఒక టీ స్పూన్‌, తేనె ఒక టీ స్పూన్‌ కలిపి రెండు పూటలా తింటూ వుంటే ఎర్ర బట్ట తగ్గిపోతుంది. 

స్త్రీల తెల్లబట్ట వ్యాధికి..

 ఉసిరిక పండ్లలో ఉండే గింజలను దంచి పొడిచేసి సమంగా పటిక బెల్లం పొడి కలిపి రెండుపూటలా పూటకు ఒకటీ స్పూన్ మోతాదుగా మంచినీటితో సేవిస్తుంటే తెల్లబట్ట తగ్గిపోతుంది. 

మూత్రాశయ బాధల నివారణకు 

ఉసిరిక కాయల బెరడును మంచినీటితో బాగా మెత్తగా నూరి పొత్తి కడుపు పైన పట్టు వేస్తూ ఉంటే మూత్ర సంచి బాధలు తొలగి పోతయ్‌. 

 మేహ రోగమునకు మేలైన యోగం

 ఉసిరిక కాయల పొడి, మంచి పసుపు సమంగా కలిపి  నిలువ వుంచుకొని రెండుపూటలా అరచెంచా మోతాదుగా
 ఒక చెంచా మంచి తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే మేహ రోగాలు హరించి పోతయ్‌. 

గుండెజబ్బులకు గట్టి యోగం..

 ఉసిరిక కాయల బెరడు,పటిక బెల్లం పొడి సమంగా కలుపు  కొని పూటకు 5 (గ్రా మోతాదుగా రెండు పూటలా తింటూ వుంటే క్రమంగా అన్నిరకాల గుండె జబ్బు లు హరించి పోతయ్‌. 

అద్భుతమైన - ఆమ్లా తైలం..

చైత్రమాసంలో పండిన ఉసిరిక పండ్లరసం, అర
లీటరు మంచి కొబ్బరినూనె, అరలీటరు గుంట
గలగరాకు నిజ రసం, నీటితో నూరిన గంధ కచ్చూరాల
ముద్ద 50 గ్రాములు నీళ్ళతో నూరిన వట్టి వేర్లముద్ద 50
గ్రాములు ఇవన్నీ కలిపి ఒక మట్టిపాత్రలోపోసి చిన్న
మంట పైన రసాలన్నీ ఇగిరి పోయి నూనె మిగిలే వరకు
మరిగించి దించి చల్లార్చి నిలువ చేసుకోవాలి. ఇదే
ఆమ్లా తైలం.

దీనిని ప్రతిరోజూ కుటుంబ సభ్యులంతా తలకు
రాసుకుంటూ వుంటే క్రమంగా వెంట్రుకలు గట్టిపడి
నల్లబడి ఊడిన చోట కూడా తిరిగి మొలుస్తూ కేశ
సౌందర్యం ఎల్లప్పుడూ కాపాడబడుతుంది.

* బట్టతల పైన కూడా వెంట్రుకలు మొలుస్తయ్.

పుట్టిన శిశువు - పాలు తాగకుంటే?

ఉసిరిక బెరడు, కరక్కాయ బెరడు, సైంధవ లవణం
సమంగా కలిపిన పొడి ఒక చిటికెడు అనగా రెండు
వేళ్ళకు వచ్చినంత పొడి, ఒక చుక్కతేనె, రెండు చుక్కల
నెయ్యి కలిపి నాలుకకు అంటిస్తే వెంటనే శిశువు పాలు
తాగుతాడు. *


1 . బొల్లి మచ్చలు తగ్గడానికి ( FOR LEUCODERMA )

ఉసిరిక బెరడు - 10 gm
కాచు - 10 gm
నీరు - 1/2 litre
బావంచల podi - 3 gm


బెరడు , కాచు నల్గగొట్టి,నీటిలో వేసి 1/4 లీటర్ కు మరగబెట్టాలి. ఈ కషాయమును 2 భాగాలు చేసి  ఉదయం ,సాయంత్రం 3 gm బావంచల పొడి కలుపుకొని తాగాలి.

ఉపయోగాలు - బొల్లి వ్యాధి తగ్గిపోతుంది.

2 . తల వెంట్రుకలు బాగా పెరగడానికి ( FOR THICK HAIR GROWTH )

ఉసిరి కాయల బెరడు - 1 భాగం
మామిడి టెంకలోని జీడి - 1 భాగం

.పై వాటిని కలిపి మంచినీటితో ముద్దలాగా నూరి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి .

 ఉపయోగాలు - తల వెంట్రుకలు దట్టంగా ,గుబురుగా పెరుగుతాయి.

3 . నీళ్ల విరేచనాలు తగ్గుటకు ( FOR LOOSE MOTIONS )

ఉసిరిక బెరడు - 25 gm
మంచి నీరు - 1/2 litre

బెరడును నీటిలో వేసి ,1/4 లీటర్ కషాయం అగునట్లు మరిగించి ,రెండు పూటలా సగం సగం తాగాలి.

ఉపయోగాలు - నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి.

4 . కను గుడ్లు ,నుదురు, తలమాడు , కణతల పోట్లు తగ్గుటకు ( FOR PAINS OF EYE BALLS,FOREHEAD,SCALP,TEMPLES )

ఉసిరి కాయల బెరడు - 1 భాగం
తిప్పతీగ ముక్కలు - 1 భాగం
మంచి నీరు - తగినంత

పై వాటిని కలిపి  మంచి నీటితో  మెత్తగా నూరి ,తలకు పట్టించి 2 గంటల తర్వాత స్నానం చేయాలి.

ఉపయోగాలు - తల లోని దుష్ట వేడి తగ్గిపోయి , కళ్ళకు చలువ చేసి అన్ని నొప్పులు తగ్గిపోతాయి.

5 . ఎండి పోయే పిల్లలకు బలం కలగడానికి ( FOR THIN CHILDREN TO BECOME STRONG )

ఉసిరి కాయల బెరడు
పెరుగు మీది తేట నీరు

 పై వాటిని కలిపి మెత్తగా నూరి శనగ గింజంత మాత్రలు చేసి నీడలో గాలి తగిలేటట్లు పూర్తిగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. తల్లులు తమ బిడ్డలకు పూటకు ఒక మాత్ర చొప్పున తమ చనుబాలతో రంగరించి తినిపించాలి.

ఉపయోగాలు - ఎండి పోయే పిల్లలు బలంగా ,దృఢంగా అవుతారు.

MEDICINAL USES OF VUMMETTA ( DATURA )




Aaధ్యాత్మిక ప్రాముఖ్యత. ఔషధ విలువలు గల
మొక్క ఉమ్మెత్త. శివునకు ప్రీతి పాత్రమైనది.
బంజరు భూములలో ఎక్కువగా పెరుగుతుంది.
అందమైన మొక్క : సుమారు రెండు నుండి మూడు
మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొడవుగా గరాటు ఆకా
రంలోవుండే ఈ పుష్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.
ఇవి తెలుపు లేక వంగపండు రంగులో ఉంటాయి.
ఈ మొక్క కాయలు ఇంచుమించు గుండ్రంగా
వుండి అనేకముళ్ళతో నిండివుంటాయి. ఫలాలు, పుష్పాలు
సంవత్సరం పొడవునా లభిస్తాయి.
ఉమ్మెత్త శాస్త్రీయ సమాచారం : ఉమ్మెత్త మొక్కను
ఇంగ్లీష్ లో థార్నీ యాపిల్ (Thorny Apple)అంటారు.
శాస్త్రీయ నామాలు- దతూరా (
స్టెమోలియం, దతూరా
మెటల్. ఇది పాలనేసీ కుటుంబానికి చెందినది.
మిర్చి, పొగాకు, వంగ, టొమేటో, బంగాళదుంప,
బెల్లడోనా, పెర్యూనియా వంటి అనేక ఉపయుక్తమైన
-మొక్కలు కూడా సొలనేసీ కుటుంబానికి చెందినవే.
ఆసియా ఖండానికి చెందిన ఈ ఉమ్మెత్త మొక్క భారత
దేశంలో అన్నిచోట్లా పెరుగుతుంది.
పుత్రప్రాప్తి కొరకు : ఉమ్మెత్త పూలతో శివుని పూజిస్తే
పుత్ర సంతానం కలుగుతుందని శివపురాణంలో చెప్ప
బడి వుంది. ఉమ్మెత్త కాయలు, ఉమ్మెత్త పూలు శివునికి
అత్యంత ఇష్టమైనవి. ఎర్రని కాడగల ఉమ్మెత్త పూలు
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
ఉమ్మెత్త కాయలతో శివునిపూజిస్తే స్వర్గప్రాప్తి కలుగు
తుంది అనేది శివపురాణాంతర్గతం. నల్లటి ఉమ్మెత్త
మొక్కకు పాలు కలిపిన నీళ్ళు 40 రోజులు పోస్తే అప
మృత్యుభయం తొలగుతుందనే నమ్మకమూ ఉంది.
రసాయనిక ప్రాముఖ్యత : ఉమ్మెత్త మొక్కలో ఎన్నో
విలువైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అవేగాక ఎట్రో పైన్,
- కీళ్ళనొప్పులు వంటి
స్కోపోలమైన్, హిస్టోలియమైన, నికోటినమైన్, హయోసైస్,
హయాసయోమిన్ వంటి మరెన్నో రసాయనిక పదార్థాలు
కూడా ఉమ్మెత్త మొక్కలో ఉన్నాయి.
మొక్కలోని అన్ని భాగాలు ఔషధాలే : ఉమ్మెత్త మొక్క
కాండం, ఆకులు, పుష్పాలు, వేర్లు,
కాయలు అన్నీ కూడా
చక్కని ఔషదగుణాలు కలిగి వున్నాయి.
ఆకులు- చెవిపోటు, గాయిటర్,
కీ,
వ్యాధులను తగ్గిస్తాయి. వేర్లు - ఫైల్సు, పన్నుపోటులను
నయం చేస్తాయి. విత్తనాలు - జ్వరం, పిప్పిపన్ను పోటు,
మానసిక రుగ్మతలను అరికడతాయి. పుష్పాలు - పేలు,
చుండ్రు తగ్గించడంలో ఉపకరిస్తాయి.
సయాటికా నివారణలో : ఉమ్మెత్త, మాదర్, ఎడ్యూజా,
నిర్గుండి, ఒకయాన్, సహజనా మొక్కల ఆకులు ఒక్కొక్క
రకానికి ఆరేసి గ్రాములు తీసుకోవాలి.
వీటిని మెత్తని చూర్ణముగా చేసి ఆవనూనెతో కలిపి
సంబంధిత శరీరభాగం పై మర్దనా చేస్తే సయాటికా బాధ
నుంచి ఉపశమనం కలుగుతుంది.
పేలు, చుండ్రు, చర్మవ్యాధులు : ఉమ్మెత్త
మొక్క
కాయలు, ఆకులు, పూలు, వేర్లు, కాండం అన్నీ కలిపి
ఎండబెట్టి భస్మంచెయ్యాలి. ఈ భస్మాన్ని కొబ్బరినూనెతో
కలిపి తలకు రాసుకుంటే పేలు, చుండ్రు తగ్గుతాయి.
ఇదే భస్మాన్ని ఆవనూనెతో కలిపి ఉపయోగిస్తే ఎగ్జిమా
వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.
వాపులు, నొప్పులు : ఉమ్మెత్త ఆకులపై కొద్దిగా వేరు
చెనగనూనె రాసి గోరువెచ్చగా చెయ్యాలి. దీనిని నొప్పు
లపై వేస్తే కొద్దిగంటలలో వాపులు తగ్గుతాయి. అవసర
మైతే తిరిగి వెయ్యవచ్చు. ఆకుల పొడిని పసుపుతో కలిపి
వేసినా కూడా వాపులు నయమవుతాయి.
పిచ్చికుక్క కాటుకు విరుగుడు : ఉమ్మెత్త ఆకులు
ముద్దగా చేసి కుక్క.కోతి కరిచిన చోటవేస్తే వారంలో గుణం
L
కనిపిస్తుంది. ఈ ఆకులరసం, బెల్లం,పాలు, నెయ్యి సమ
పాళ్ళలో తీసుకొని సేవిస్తే పిచ్చికుక్క కాటుకు మంచి
విరుగుడు. హైడ్రోఫోబియా రాకుండా కాపాడుతుంది.
ఆస్మా : ఎండిన ఉమ్మెత్త ఆకులను, చిలుములో వేసి
వెలిగించి పొగపీలిస్తే ఆస్మా వ్యాధికి ఉపశమనం కలుగు
తుంది. దగ్గు కూడా తగ్గుతుంది.
పిప్పిపన్ను : ఉమ్మెత్త విత్తనాలు బాగా నూరి పిప్పిపన్నులో
పెడితే పన్నుపోటు నుంచి స్వస్థత కలుగుతుంది.
మూలశంఖ : ఉమ్మెత్త వేరును మెత్తగా దంచి పేన్గా
తయారుచేసి రాస్తే ఫైల్సు తగ్గుతాయి.
అన్ని రకాల జ్వరాలకు : ఉమ్మెత్తతో తయారుచేసిన
ఆరోగ్యవటి మాత్రలు అన్ని జ్వరాలను హరిస్తాయి.
మానసిక
వ్యాధులు:
: మూడు, నాలుగు ఉమ్మెత్త విత్తనా
లను కొద్దిగా నెయ్యితో కలిసి, నూరి తీసుకుంటే అన్ని
రకాల మానసిక రుగ్మతలు తగ్గుతాయి.
ఉమ్మెత్త నివారించే మరికొన్ని రోగాలు : చెవిపోటు,
అల్సర్, గాయిటర్, గవదబిళ్ళలు, మూర్ఛ,వరిబీజం,
సిఫిలిస్, మలేరియా, లైంగిక శక్తి తగ్గుట, జీర్ణశక్తి మంద
గించుట, కుష్టు వ్యాధి వంటి రోగాలకు ఉమ్మెత్త చక్కటి
ఔషధం. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతో మాత్రమే!
ఆయా రోగాల నివారణకు ప్రయత్నించాలి.
రక్తపోటును తగ్గించే ఉమ్మెత్త : ఉమ్మెత్త ఆకులతో కలిపి
నూరితే పాదరసం ఘనీభవిస్తుంది. ఘనరూపంలో ఉండే
పాదరసాన్ని పూసలుగా మార్చి నల్లటి సిల్కు దారంతో
గుచ్చి మెడలో ధరిస్తే రక్తపోటు స్థిరపడుతుంది.
ఉమ్మెత్తతో తయారుచేసే కొన్ని ఔషధాలు : కనకతైలం,
మృతసంజీవని, దతుర్ ఫలివస్మ, దతూరాది ప్రలేపం.
దుగ్ధవిటి, కనకాసనం, దుర్దురాదితైలం, స్వల్ప జరాం
కుశరసం, లఘు విషగర్వతైలం.

SUGAR IN OBESITY PERSONS - CARING TIPS

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...