9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హెల్త్ బిట్స్..9-2-2024

 భోజనం వేళలు ముఖ్యమే..

ఉదయం 8 గంట టిఫిన్ మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం సాయంత్రం  చిరు తిండ్లు, రాత్రి 9:00 కి మళ్ళీ భోజనం దాదాపుగా ఇలానే ఉంటుంది మన భోజన దిన చర్య. అంటే దాదాపు 12 నుంచి 13 గంటల వ్యవధిలో తినాల్సినవన్నీ తినేస్తాం. ఆ పరిధి అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని ఓ అధ్యయనం సూచిస్తుంది ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్ ను అధిగమించవచ్చని చెబుతున్నారు . ఉదయం 8 గంటలకు టిఫిన్ తో మొదలుపెట్టి రాత్రి భోజనం 9 గంటలకు పూర్తి చేయడం కంటే దానిని ఓ నాలుగు గంటలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల డయాబెటిస్ రోగుల శరీరాలు రాత్రి సమయంలో ఉపవాస స్థితికి చేరుకుంటాయి దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి ఈ అధ్యయనం మాస్ ట్రిక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో చేశారు గతంలో జరిగిన ఓ పరిశోధన కూడా ఇలాంటి విషయాన్ని వెల్లడించింది ఊబకాయిల శరీరంలోని కణాలు ఇన్సులిన్ కు స్పందించే గుణం కూడా మెరుగుపడుతుందని ఈ అధ్యాయంలో తేలింది

ఆ గ్రూప్ రక్తంతో పక్షవాతం ముప్పు .. ఇటీవల కాలంలో 60 ఏళ్ల లోపు వారిలోనూ పక్షవాతం కేసులు పెరుగుతున్నాయి

అయితే న్యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇతరులతో పోలిస్తే ఏ బ్లడ్ గ్రూప్ వారికి పక్షవాతం వచ్చే అవకాశం 16% ఎక్కువ అంట  అదే ఓ బ్లడ్ గ్రూపు వారికైతే ఇది 12 శాతం తక్కువ అట , మొత్తానికి ఏ బ్లడ్ గ్రూప్ వారిలో రక్త కణాలు గుచ్ఛంగా మారే ముప్పు ఎక్కువ అని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అంశాల చిట్టాలో బ్లడ్ గ్రూప్ అనేది ఒకానొక అంశం మాత్రమేనని ఆ అధ్యయనం వెల్లడించింది ఇతర కారణాలు కూడా తోడైతేనే ఏ వ్యాధి అయినా శరీరంపై దాడి చేసే ఆస్కారం ఉంటుంది ధూమపానం మానివేయడం సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారం మితంగా తీసుకోవడం రక్తపోటును అదుపులో పెట్టుకోవడం తదితర జాగ్రత్తల వల్ల దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవచ్చు

ఆటో ఇమ్యూన్ సమస్యలా?

ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగు శాతం మంది కీళ్లవాతానికి సంబంధించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వివిధ ఆటో ఇమ్యూన్ రుగ్మతల్లో ఒకటి కంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా అయితే ఆటో ఇమ్యూన్ రుగ్మతలు మనుషులలో ఒకటి పాయింట్ నాలుగు రెట్లు అధికంగా గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు దారితీస్తాయని బెల్జియం లోని కేథలిక్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది రెండు ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నవాళ్లలో ఈ ముప్పు రెండు రెట్లు ఎక్కువ అట కాబట్టి ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నవారు గుండె రక్తనాళాల సమస్యల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

విటమిన్ బి12 లభ్యమయ్యే శాఖాహార పదార్థాలు ఏమిటి

 మామిడిపండు పిక్కలోని జీడీలు విటమిన్ బి ట్వెల్ లభ్యమవుతుందా పుట్టగొడుగులు తినడం ద్వారా ఈ విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చా. ఇవే కాక బి12 లభ్యమయ్యే ఇతర శాకాహార పదార్థాలు ఏమిటి..

మామిడి టెంకలోని పిక్కలు కొన్ని పోషక పదార్థాలు ఉన్నాయని పలు శాస్త్రీయ పరిశోధన పత్రాలు తెలుపుతున్నాయి విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ మొదలైన పోషకాలు వివిధ అమాయనో యాసీడ్లు పిక్కల్లో ఉంటాయి అయితే విటమిన్ బి ట్వెల్ బి 12 కూడా ఉన్నట్టు కేవలం ఒక పరిశోధన పత్రంలోని ప్రస్తావించబడి ఉంది దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది మిగిలిన పోషకాల కోసం ఐదు పది గ్రాముల మామిడి పిక్కల పొడిని రోజు తీసుకోవచ్చని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి కొన్ని రకాల పుట్టగొడుగుల్లో మాత్రమే బి12 లభిస్తుంది 100 గ్రాముల ఎండిన చిటాకి పుట్టగొడుగుల్లో బీ12 అధికంగా ఉంటుంది కానీ మనకు మార్కెట్లో సాధారణంగా దొరికే వైట్ బటన్ పుట్టగొడుగులు బీ12 ఉండదు. శాఖాహారులకు పాలు పాల పదార్థాలైన పెరుగు పన్నీర్ నుండి కూడా బీ12 లభిస్తుంది. రోజు పావు లీటర్ నుండి అర లీటర్ వరకు పాలు పెరుగు లాంటివి తీసుకోవడం వల్ల బి12 లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

పచ్చిమిర్చిలోని పోషక విలువలు ఏమిటి

 కారం ఘాటు తేడాలతో రకరకాల పచ్చిమిర్చి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మిర్చికి ఈ కారాన్ని ఇచ్చే గుణం కెప్సిసింగ్ అనే పదార్థం వల్ల వస్తుంది విటమిన్ సి ఏ కె వి సిక్స్ కాపర్ పొటాషియం పీచు పదార్థం లాంటి పోషకాలు మిర్చిలో ఉంటాయి కానీ మనం తీసుకునే మొత్తం తక్కువగా ఉండడం వల్ల మిర్చి ద్వారా అందే ఈ పోషకాల మోతాదు తక్కువే కప్ శాంతిన్ వయోలా శాంతిన్  లూటీన్ చిన్నమిక్ యాసిడ్ ఫెరోలిక్ యాసిడ్ మొదలైన యాంటీ ఆక్సిడెంట్ కూడా మిర్చిలో ఉంటాయి కేవలం కూరల్లో వాడడం మాత్రమే కాకుండా సలాడ్లలో చట్నీలు రైతాలలో పచ్చిమిర్చి వాడినప్పుడు వాటిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మనకందే అవకాశం ఎక్కువ అవసరానికి మించి అధికంగా కారం ఉండే మిర్చి తీసుకున్నప్పుడు కడుపులో మంట డయేరియా వస్తాయి ముఖ్యంగా ఇరిటేబుల్ బవెల్స్ సిండ్రుమ్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువ అవుతుంది రుచిని కారాన్ని కొద్దిపాటి పోషకాలను అందించే మిర్చిని మితంగా వాడుకుంటేనే మంచిది



ఫ్యాట్ బర్నర్స్ వల్ల ఉపయోగం ఏమిటి ?

 కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడే ప్రత్యేక పోడులు టాబ్లెట్లు మందుల గురించి ఈమధ్య ఎక్కువ వింటున్నాము ఇవి ఆరోగ్యానికి మంచివేనా వీటిని వాడి ఒంట్లో కొవ్వు తగ్గించుకోవడం బరువు తగ్గడం సాధ్యమవుతుందా?


కొవ్వు జీవక్రియ లేదా శక్తివ్యాయాన్ని పెంచడం కొవ్వు  శోషణ ను తగ్గించడం ద్వారా ఫ్యాట్ బర్నర్ అనే పదార్థాలు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయని ప్రచారం జరుగుతుంది గ్రీన్ టీ కెఫిన్ ఆల్ఫా లైపోయిక్  ఆసిడ్ జిన్సింగ్ ఆపిల్ సెడార్ వినగార్ మొదలైనది ఫ్యాట్ బర్నర్స్ లేదా కొవ్వు కరిగించే పదార్థాలుగా మార్కెట్లో లభిస్తున్నాయి కొన్ని ఉత్పత్తుల్లో ఒకటి కంటే ఎక్కువ క్యాట్ బర్నర్లు కూడా ఉంటాయని వీటిలో కొన్ని శరీరంలో రక్త పోటు ను పెంచి తద్వారా జీవ క్రియా శక్తి వ్యయాన్ని పెరిగేలా చేస్తాయి.. దీని వల్ల కాల క్రమేణా బరువు తగ్గడానికి దారి తీసే అవకాశం ఉంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె పోటు కిడ్నీల సమస్య లు కాలేయ సమస్య లు మొదలైన దుష్పరిణామాలు కలుగ వచ్చును.కొన్ని ఫ్యాట్ బర్నర్ లు మీరు తీసుకునే మందుల ప్రభావాన్ని కూడా మారుస్తాయి.. అధిక బరువు తగ్గించడంలో ఈ పదార్థాలు కేవలం 10 శాతం లోపు మాత్రమే సహాయ పడ గలవు.. మిగతా 90 శాతం కంటే ఎక్కువ తీసుకునే ఆహారం , చేసే శారీరక శ్రమ,నిద్ర ల పైనే ఆధార పడి ఉంటుంది అందుకే బరువు తగ్గాలంటే కేలరీలు పరిమితి మించ కుండా తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ముఖ్యం. ఎలాంటి సప్లిమెంట్స్ ఐనా వైద్యులు నిపుణుల సలహా లేకుండా వాడరాదు..

7, ఫిబ్రవరి 2024, బుధవారం

పతంజలి మిలనోగ్రిట్కు అంతర్జాతీయ గుర్తింపు

 పతంజలి ఆయుర్వేద ఔషధం మిలనోగ్రిట్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది స్వచ్ఛమైన వనమూలికలతో చర్మ సౌందర్య రక్షణకు సంబంధించి తయారు చేసిన ఔషధం మిలనోగ్రిట్ పై ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ బయోసైన్స్ రిపోర్ట్ లో కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది చర్మ సౌందర్య రక్షణకు సంబంధించి పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన పరిశోధనల్లో మిలలో గ్రేట్ అద్భుతంగా పనిచేస్తుందని వెళ్లడైనట్లు పతంజలి యోగపీట్ ప్రొఫెసర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో వివరించారు ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన మేగజైన్ బయోసైన్స్ రిపోర్ట్స్ లో శాస్త్రీయంగా నిరూపిస్తూ కథనాన్ని వెలువరించింది అని తెలిపారు మిలినోక్రిపై ప్రచురించిన కథనాన్ని పోర్టల్ అండ్ ప్రెస్ డాట్ కామ్ పబ్లిక్ బయో portalandpress.com/bioscirep లో చూడవచ్చు అన్నారు..

సబ్జా ,షియా ఏది ఎక్కువ ఆరోగ్యకరం.. వీటిని ఎలా తీసుకోవాలి

 సబ్జా ,షియా ఈ రెండు ఒకటేనా.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం.. వీటిని ఎలా తీసుకోవాలి ..ఇలా ఈ విత్తనాల గురించిన అనుమానాలు ఉన్నాయా.. అయితే వీటి గురించి కొంత అవగాహన పెంచుకుందాం.

 సబ్జా, షియా.. ఈ రెండిట్లో సమాన పోషక విలువలు ఉంటాయి. అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు ఇవి రెండు సూపర్ ఫుడ్స్. ఈ రెండింటిని నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. అయితే చూడడానికి ఒకేలా ఉండడంతో రెండు ఒకటేనని పొరపాటు పడుతూ ఉంటాం. అయినా పర్వాలేదు పోషకాల పరంగా రెండు ఉత్తమమైనవి. అయితే నీళ్లలో నానబెట్టే సమయాలు రెండింటికి భిన్నంగా ఉంటాయి. మధ్య దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన షియా విత్తనాలలో పీచు, ఒమేగా త్రి ప్రోటీన్లు ఉంటాయి. మన దేశానికి చెందిన తులసి విత్తనాలైన సబ్జా జాతిలో మంట ,శరీరంలోని టాక్సిన్ లను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇక షియా విత్తనాలు నాన్నడానికి కనీసం అరగంట సమయమైనా పడుతుంది. సబ్జా విత్తనాలు నీళ్లలో వేసిన క్షణాలలోపే నాని ఉబ్బిపోతాయి .శియా విత్తనాలు నీళ్లలో నాని బరువెక్కి, జెల్ లాగా మారి పాత్ర అడుగుకు చేరుకుంటాయి. నానిన తర్వాత వాటి అసలు బరువుకు పదింతలు పెరుగుతాయి. సబ్జా విత్తనాలు నీళ్లలో క్షణాల్లో నానిపోయి వాటి చుట్టూ పారదర్శక పోర ఏర్పడుతుంది.

ఇలా వాడుకోవాలి..

 చియా విత్తనాలను నానబెట్టి లేదా నానబెట్టకుండా నేరుగా కూడా తినవచ్చు. కానీ సబ్జా విత్తనాలను కచ్చితంగా నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. స్మూతీలు, మిల్క్ షేక్స్లో, షియా ,సబ్జా రెండింటినీ కలుపుకొని తాగవచ్చు. సబ్జా విత్తనాలు లెమనెడ్స్, సలాడ్స్ లో కూడా బాగుంటాయి.

బరువు తగ్గాలంటే ..

షియా లేదా సబ్జా ఈ రెండిట్లో దేనినైనా మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా మారి అతిగా తినే కోరిక తగ్గిపోతుంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...