4, డిసెంబర్ 2015, శుక్రవారం

SHIREESHA KASHAYAM - VEGETABLES CLEANING - AYURVEDAM



కూరగాయలపై ఉండే పెస్టిసైడ్ అవశేషాలు తొలగించే
శిరీష కషాయం
కూరగాయలను పండించడంలో రైతులు అనేక రకాల క్రిమి, తెగుళ్ళ
నివారణ మందులు వాడుతున్నారు. వాటివల్ల కాపు కూడా బాగా
ఉంటుంది. కాయలు ఏపుగా పెరుగుతాయి. కాని వాటిపై
రసాయనిక అవశేషాలు ఉండిపోయి, త్వరగా పోవు.
వాటిని ఎంతగా కడిగినప్పటికీ, రసాయనిక అవశేషాలు కొన్ని అలాగే
ఉంటాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా
దెబ్బతింటుంది. ఇలాంటి తెగుళ్ళ మందులలో ఎక్కువగా ఆర్గనో
ఫాసర (మలాథియాన్) ఉంటుంది.
కాయగూరలను ఎంతగా కడిగినప్పటికీ, ఈ కెమికల్ అవశేషాలు
పూర్తిగా పోవు. అయితే దీన్ని పూర్తిగా తొలగించే అవకాశం కూడా
ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లోని షెకావటి
ఆయుర్వేద కాలేజిలో ఒక అధ్యయనం జరిగింది.




వాటిని శిరీష క్వాతతో ధావన (కడ
గడం) చేసి ఫలితం తెలుసుకోవడం వారి
-లక్ష్యం. మంచినీటితో ఆనపకాయను కడ
గడం, శిరీష క్వాతతో ఆనపకాయను కడగడం
వల్ల కనిపించే తేడా ఏమిటి? ఫ్రిజ్ లో ఆనప
కాయలను ఉంచినందువల్ల వాటిలోని రసాయ
నిక అవశేషాలు తొలగుతాయా? లేదా? అనే
దానిని పరిశీలించడం ముఖ్య ఉద్దేశ్యం.
పద్ధతి
పరిశోధకులు అప్పటికప్పుడు కొన్ని
ఆనపకాయలను (సొరకాయలు) తెప్పించి
వాటిని రెండుగా విభజించారు. ఒకటి
కంట్రోల్ గ్రూపు, రెండవది. ప్రయోగాత్మక

గ్రూపు రెందవగ్రూపును మళ్ళీ నటి
గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూపులోని
కాయలపై మలథాన్ వేశారు. రెండో గ్రూపు
లోని కాయలను మంచినీటితో కడిగారు..
మూడో గ్రూపులోని కాయలను శిరీష క్పాతతో
ఉంచారు. దీని తర్వాత అన్ని ఆనపకాయలపై
శుభ్రం చేశారు. నాలుగో గ్రూపులోని
కాయలను నాలుగు రోజులపాటు ఫ్రీజ్ లో
రసాయనిక పరీక్షలు చేశారు.
ఫలితం
మంచినీటితో కడిగిన వాటికంటే
ఫ్రిజ్ లో ఉంచిన వాటికంటే శిరీష క్వాతతో
శుభ్రంచేసిన కాయలలోని రసాయనిక
అవశేషాలు చాలావరకు తొలగిపోయాయి.
ముగింపు
ఈ ప్రయోగాన్నిబట్టి కాయగూరలను
మంచినీటితో కాకుండా శిరీష క్వాథతో పరిశు
భ్రం చేయడం చాలా మంచిదని రుజువైంది.

PADHALALO MANTALU - AYURVEDAM

పాదాలలో
మంటలు
• గోరింటాకు ఆకులను మెత్తగా నూరి కాళ్లకు, పాదాలకు
రోజు పొద్దున్నే పూయాలి. మళ్లీ సాయంత్రం పూయాలి.
ఇలా మంటలు తగ్గే వరకు పూస్తుండాలి.
• వస ఆకులను మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని పాదాలకు,
మడిమలకు రాయాలి. పాదాలలో మంటలు తగ్గేవరకు ఇలా
చేయాలి.
• శతావరి వేర్లను తెచ్చి వాటిని మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని రోజు పొద్దున,
సాయంత్రం పాదాలకు మడిమలకు రాయాలి. ఇలా పాదాలలో మంటలు తగ్గేవరకు
చేయాలి.
• పాదాల్లో మంటలు తగ్గే వరకు నూనె పదార్థాలు, తియ్యటి పదార్థాలు, ఘాటైన
పదార్థాలను తినరాదు.

CHEVI POTU / KARNA SHOOLA - AYURVEDAM

శరీరంలో చెవి చాలా సున్నితమైన
భాగం కావడం వల్ల అనేక సమస్యలు
వస్తాయి. ఎక్కువగా చెవిలో ఇన్ఫెక్షన్
వచ్చినప్పుడు చెవిపోటు వస్తుంది. ఇది
వచ్చినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా
ఉంటుంది. అయితే సాధారణంగా ఇది
చిన్న పిల్లలకు వస్తుంటుంది. ఇది
వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుంది.
కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే
వైద్యం చేయించకపోతే చెవుడు కూడా వచ్చే
అవకాశం ఉంటుంది.
ఎక్కువ సేపు నీటిలో నానడం, ఈత
కొట్టడం, దాని వల్ల చెవిలోకి నీరు పోవడం,
మనిసి
నీటిలో బాక్టీరియా ఉండి ఇన్ ఫెక్షన్ రావడం,
జలుబు, ఒత్తిడి, సరైన ఆహారాన్ని తీసుకోక
పోవడం మున్నగు వాటి వల్ల చెవిపోటు
వస్తుంది.
తులసి రసాన్ని కొద్దిగా వేడిచేసి, ఆ
రసం రెండు మూడు చుక్కలు చెవిలో
వేస్తే నొప్పి తగ్గుతుంది.
ఉల్లిగడ్డను వేయించి, దాని రసాన్ని తీసి,
ఆ రసం రెండు మూడు చుక్కలను
చేవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది.
నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలను
వేసి, కాచి వడబోసి మూడు నాలుగు
చుక్కలను చెవిలో వేస్తే నొప్పి
తగ్గుతుంది. లేదా వేపాకుల రసం తీసి
రెండు చెక్కలను చెవిలో వేసినా నొప్పి
తగ్గుతుంది.


30, నవంబర్ 2015, సోమవారం

DETOX CHEYADAM ANTE

డిటాక్స్ చేయడం అంటే?

శరీరానికి సంబంధించి డిటాక్సిఫి
కేషన్ అంటే క్యాలరీ లోడ్ను తగ్గించు
కోవడం. ముఖ్యంగా కొవ్వు, ఆల్కాహాల్, ప్రాసెస్ట్ పదా
ర్థాల తాలూకూ భారాన్ని తగ్గించడం.
ఈ డిటాకు ఫేడ్ డై గానో లేక వెయిట్ లాస్
టెక్నిక్ గానో ఏమాత్రం భావించకూడదు.
డిటాక్సిఫికేషన్ వెనుకగల ఆలోచన శరీరంలోకి
టాక్సిన్లు లేదా విషతుల్యాలు ప్రవేశించకుండా అడ్డు
కోవడం. కాబట్టి చెడు ఆహార అలవాట్లకు స్వస్తి చెప్పి,
కొత్త అలవాట్లు సృష్టించుకోవాలి.
ఇందుకోసం ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి
21 రోజులనుంచి 62 రోజులదాకా పట్టవచ్చు.
కాబట్టి వీటిని ఓపిగ్గా అనుసరించాలి. అంటే రెగ్యు
లక్ఆహారాన్ని పూర్తిగా మానేసి రోజు మొత్తం గ్రీన్
జ్యూస్లు తాగుతూ బ్రతికేయాలని అర్థం కాదు. సింపు
గా ఆరోగ్యవంతమైన ఆహారం తింటే చాలు.
రోజుకు మూడు భోజనాలు,ఒక స్నాక్ సరిపోతాయి.
చక్కెర పదార్థాలన్నింటినీ కట్చేసేయాలి. అలాగే ఆల్కా
హాల్, డిజర్టులూనూ, పండ్లు వీలయినంత ఎక్కువగా
తినాలి. దీనివల్ల శరీరానికి ఇతర పోషకాలతోపాటు
మంచి చక్కెరలు కూడా లభిస్తాయి.
మధ్యమధ్యలో రోజుకు కనీసం ఎనిమిదినుంచి
పదిగ్లాసుల నీరు తాగాలి. వేయించిన పదార్థాలు అవి
చిప్స్ అయినా సరేతినవద్దు. ఏది తినాలనిపించినా శరీ
రాన్ని డిటాక్సింగ్ చేస్తున్నామన్న విష
యాన్ని గుర్తుంచుకోవాలి. పప్పు,
మొలకలు, లీన్మట నుంచి ప్రొటీన్లు
అందే మాదిరి చూసుకోవాలి.
స్టీమ్ చేసిన లేదా ఉడికించిన
పదార్థాలు తినాలి. ఇక్కడ ఆహారం
తినడం మానేయమని అర్థం కాదు-
చెడు ఆహారాన్ని పూర్తిగా మానేయా
లన్నది కీలకాంశం.

BHOJANAM THARVATHA - FRUITS

భోంచేశాక ఇవి తినాలి!



భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది.
ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!
ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న
వారు భోంచేశాక ఆపిల్ను తినడం అలవాటు చేసు
కోవాలి. ఫలితంగా ఆ
సమస్యలన్నీ దూరమవు
తాయి. భోంచేశాక పదిహేను నిమిషాల తరవాత
దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసు
కుంటే ఇంకా మంచిది.
అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం
తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం
తేలిగ్గా జీర్ణం అవుతుంది.
బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా
ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి
పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి
పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి
అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనా
రోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు
బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా
తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే
బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను
గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్ర
పరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా
సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని
తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.


27, నవంబర్ 2015, శుక్రవారం

SHADRASOPETHA PULIHORA - AYURVEDAM

షడ్రసోపేతంగా పులిహోర

పులిహోర తింటే ఆల్బర్లు రావా?

* పులిహోర మన ప్రాచీన ఆహార పదార్థం. ఉగాది పచ్చడిలాగానే, తెలుగు
ప్రజలు పులిహోరను కూడా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదూరుచుల సమ్మేళనంగా తయారు
చేస్తారు. ఉప్పు, కారం, చింత
పండు రసాలతో పాటు బెల్లం
(లేదా పటిక బెల్లం), ఒక
చెంచా ఆవపిండి, ఒక
చెంచా మెంతి పిండి వీటిని
కూడా కలిపితేనే ఆరు
రుచుల పులిహోర ఆరోగ్య
దాయకంగా ఉంటుంది. పులుపు పరిమితంగా వేస్తే ఉప్పు
ర్ణచందు కారాలూ కూడా తక్కువే పడతాయి. ఎంత పులిస్తే అంత ఘన
మైన పులిహోర కావచ్చు గానీ తిని తట్టుకోగలగాలి!

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...