31, డిసెంబర్ 2011, శనివారం

USES OF TOMATO

ఆరోగ్యానికి టొమేటో
ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే టొమేటోలు
అన్ని వయసుల వారికి నోరూరిస్తాయి. ఇవి ప్రకృతి
సహజంగా ఆరోగ్యం, అందం అందించేవి. అప్పుడే కోసిన
టొమేటోని చర్మం మీద నల్లని మచ్చలున్న చోట రుద్దు
కుంటే ఆ నల్లనిమచ్చలు తగ్గుతాయి.
ఎండలో తిరిగినపుడు చర్మం కమిలినట్టవుతుంది.
టౌ మేటో గుజ్జును, పెరుగును కలిపి రాసుకుంటే ఆ
కమిలిన భాగం మెరుగవుతుంది. చర్మానికి వెలుగునిచ్చి,
వయసుతో వచ్చే మార్పులు చర్మం మీద రాకుండా
చూడగలిగిన శక్తి టొమేటోలకు ఉంది.
ప్రతిరోజు ఒక
టొమేటోను తినగలిగితే వైద్యుడి దగ్గ
రికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. క్యాన్సర్ ని నివారించ
గలిగినది. గుండె జబ్బులు రాకుండా నిరోధించగలిగినది
టొమేటో. దీనిలోని లైకోపేన్ అనే యాంటీ ఆక్సిడెంట్
వల్ల అది అద్భుత పోషక పదార్థం అవుతుంది.
టొమేటోలోని పలురకాల విటమిన్లు, లవణాలు మాన
వుల ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తాయి.

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు - తులసి తో

సంస్కృతంలో తులసి, వైష్ణవి, వృందా , బృందా,
సుగంధా, పవిత్ర, పావని, విష్ణుప్రియ, లక్ష్మీప్రియ,
కృష్ణవల్లభ, మాధవి, దేవదుందుభి అని, హిందీలో
రామతులసి, కృష్ణతులసి అని, తెలుగులో లక్ష్మీతులసి,
కృష్ణతులసి, భూతులసి, అరణ్యతులసి, గగ్గిర అని,
లాటిన్లో Ocinum Sanctum అని, ఇంగ్లీషులో Holy
Basil అని అంటారు.

తులసి - గుణ ప్రభావాలు..

లక్షీతులసి ఆకుపచ్చని ఆకులతో మృదువైన
స్వభావంతో వుంటుంది. దీని ఆకులరసం లేక
కషాయం లేక వేరుకషాయం కొంచెం కారం చేదు
కలిసి వుంటుంది. వేడిచేసే స్వభావంతో జ్వరాలను
కఫాన్ని, దగ్గును, క్రిమిరోగాలను, కఫవాతములను
హరింపచేసి రుచిని పుట్టిస్తుంది. బుద్ధిని, జఠరాగ్నిని
పెంచుతుంది. ఇది వాత పిత్త కఫములనే త్రిదోషము
లను హరిస్తుంది.

కృష్ణతులసి లక్ష్మీతులసికన్నా అధిక శక్తివంతమై
నది. ముఖ్యంగ అంటువ్యాధులను కఫ రోగములను
ఉదరరోగములను చర్మరోగములను గుండెరోగము
లను పొగొట్టడంలో ఇది గొప్పది.

1.) కుష్టు వ్యాధులకు..

పూర్వజన్మ పాపవశమున శరీరమంతా కుష్టు
వ్యాపించినప్పటికీ ఆరోగ్యంగా నిర్భయంగా ఉండాలంటే రోజు
రెండుపూటలా కృష్ణతులసి మొక్కకు పూజచేసి దాని
ఆకులరసం 10 నుండి 20 గ్రా|| మోతాదుగా ఒక
సంవత్సరంపాటు సేవిస్తే ఎంత వికృతంగా మారిన
కుష్టురోగి అయినా తిరిగి తనస్వరూపాన్ని పొంద
గలుగుతాడని మహర్షుల ఆజ్ఞ.వయస్సును బట్టి
మోతాదు నిర్ణయించుకోవాలి.

 మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ,
గోంగూర, చింతపండు మొదలగునవి నిషేధం.

2. ) పాముకాటుకు తులసి చికిత్స..

చరక, సుశ్రుత, వాగ్భటాది ఆయుర్వేద మహర్షు
లంతా ముక్తకంఠంతో తులసిరసం ద్వారా సర్పవిషాన్ని
విరిచివేయవచ్చని ఎలుగెత్తి చాటారు.

పాము కరిచిన వెంటనే గుప్పెడు కృష్ణతులసి
ఆకులను నమిలించాలి. ఆ వెంటనే ఆకులు, వెన్న
కలిపి నూరి ఆ ముద్దను కరచినచోట లేపనంచేయాలి.
అప్పుడు లోపలినుండి విషం బయటకు లాగబడి
తెల్లగా వున్న వెన్న నల్లగా మారుతుంది. అది తీసివేసి
మరలా కొత్త లేపనం చేయాలి. ఈ విధంగా వరుసగా
ఆ లేపనం నల్లగా మారనంతవరకు మారుస్తూ వుంటే
సర్పవిషం విరిగిపోతుందని సమస్త ఆయుర్వేద
గ్రంథాలలో అనుభవపూర్వకంగా చెప్పబడింది.

 పొగ, మద్యమాంసాలు నిషేధం.

3. ) నపుంసకత్వమునకు మంగళం..

తులసి వేర్లు, విత్తనాలు రెండింటిని సమంగా
పొడి చేసుకొని ,ఆ మొత్తానికి సమంగా మంచిబెల్లం
కలిపి దంచి ముద్ద చేసి నిలువచేయాలి. రోజూ రెండు
పూటలా 5గ్రా||నుండి 10గ్రా||మోతాదుగాతిని ఒక
కప్పుపాలు సేవిస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూవుంటే
పురుషాంగం గట్టిపడి తిరిగి యౌవనం సిద్ధిస్తుంది.

పులుపు, వేడి పదార్థాలు నిషేధం.

4. ) పిల్లల లివర్ సమస్యలకు

కప్పునీటిలో పదితులసిదళాలువేసి అరకప్పుకు
మరిగించి వడపోసి గోరువెచ్చగా తాగిస్తూవుంటే లివర్
ఆరోగ్యవంతమౌతుంది.

అతివేడి పదార్థాలు, మాంసాహారాలు నిషేధం.

5. ) ముక్కులో పుండ్లు - గాలి ఆడకపోవడం..

తులసి దళాలను నీడలో ఆరబెట్టి దంచి వస్త్ర
ఘాళితంచేసి రెండుపూటలా చిటికెడు పొడిని ముక్కు
లతో నశ్యంలాగా పీలుస్తూ వుంటే ముక్కులో పుండ్లు,
జలుబు, గాలి ఆడకపోవడం, కనుబొమ్మలు, నొసలు,
శిరస్సులలో నొప్పిరావటం హరించిపోతయ్..

* జలుబుచే సే పదార్థాలు నిషేధం. 

6. ) గజ్జి, తామర, చిడుములకు..

కృష్ణతులసి ఆకులు, నిమ్మకాయ రసంతో కలిపి
మెత్తగా నూరి రెండుపూటలా పైన లేపనం చేస్తూవుంటే
అతిత్వరగా ఆ చర్మరోగాలు హరించిపోతయ్.

ఆ గోంగూర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.

7. ) మలేరియా మొదలగు విషజ్వరాలకు..

కృష్ణతులసి ఆకురసం 10నుండి 20 గ్రా తీసుకొని
దానిలో 2గ్రా మిరియాలపొడి కలిపి రెండుపూటలా
సేవిస్తూ వుంటే మలేరియా హరించిపోతుంది. అంతే
గాకుండా, విపరీతమైన జలుబు, అజీర్ణము, మందాగ్ని,
దగ్గు, ఒగర్పు, గొంతుపుండు కూడా తగ్గిపోతయ్.

అజీర్ణ పదార్థాలు,
మాంసాహారం నిషేధం..

8. ) సంధివాతమునకు (కీళ్ళనొప్పులు) ..

కృష్ణతులసి ఆకులు, వావిలాకులు, ఉత్తరేణి ఆకులు
సమంగా నీడలో గాలికి ఆరబెట్టి ,పొడిచేసి వస్త్రఘాళితం
పట్టి రెండుపూటలా 5 గ్రా. మోతాదుగా గోరువెచ్చని
నీటితో సేవిస్తూ వుంటే కీళ్ళనొప్పులు తగ్గిపోతయ్.

తులసితైలం : అలాగే, పై మూడుచెట్ల ఆకుల
సమానరసం ఎంతవుంటే అంత నువ్వులనూనె కలిపి
నూనె మిగిలేవరకు ,చిన్నమంటపైన మరిగించి వడపోసి
రెండుపూటలా గోరువెచ్చగా నొప్పుల పైన మర్ధన
చేస్తుంటే అతిత్వరగా సంధివాతం సమసిపోతుంది.

 వాతకరపదార్థాలు, మాంసాహారం నిషేధం..

9. ) పిచ్చిచేష్టలు చేసేవారికి..

తులసిదళాలు 8, మిరియాలు 8, సహదేవిచెట్టు
వేరు 5 గ్రా వీటిని ఆదివారంనాడు విధి పూర్వకంగా నమస్కరించి
స్వీకరించి ఒక తాయెత్తులో పెట్టి రోగులమెడలో
కట్టివుంచితే క్రమంగా పిచ్చి చేష్టలు తగ్గిపోతయ్.

 పొగ, మద్య మాంసాలు నిషేధం.

10. ) స్పృహతప్పి పడిపోతే..

తులశాకురసంలో చిటికెడు సైంధవలవణం కలిపి
కరిగించి వడపోసి రెండుముక్కుల్లో మూడుచుక్కలు
వేస్తే ఏవిధమైన స్పృహ తప్పినా వెంటనే తెలివిలోకి
వస్తారు.

  అజీర్ణకరపదార్థాలు నిషేధం.

11. ) కడుపునొప్పి, కడుపుబ్బరం తగ్గడానికి.

తులసి గింజల పొడి 3గ్రా, పటికబెల్లంపొడి
3గ్రా ఒకమోతాదుగా గోరువెచ్చనినీటితో సేవిస్తూ
వుంటే కడుపునొప్పి, ఉబ్బరం తగ్గిపోతయ్.

 అజీర్ణకరపదార్థాలు నిషేధం.

12. ) నీళ్ళ, జిగట విరేచనములకు..

తులశాకులరసం 20గ్రా, చిటికెడు జాజికాయ
పొడికలిపి సేవిస్తుంటే, నీళ్ళ విరేచనాలు, జిగట విరేచ
నాలు కట్టుకుంటయ్.

13. ) ఉబ్బసానికి - ఉధృతమైనయోగం.

తులశాకులు 100గ్రా, తానికాయబెరడు
200గ్రా కలిపి ఒకలీటరునీటిలో ఒక రోజంతా నాన
బెట్టి ,పొయ్యిమీద పెట్టి ,పావులీటరు కషాయం మిగిలే
వరకు మరిగించి ,వడపోసి రెండు మూడు చెంచాల
మోతాదుగా రెండుపూటలా ఆహారానికి ముందు
సేవిస్తుంటే క్రమంగా
ఉబ్బసం హరించి పోతుంది.

* పదార్థానికి బూజుపట్టకుండా జాగ్రత్తపడాలి

 కఫం పెంచే చల్లని పదార్థాలు నిషేధం. *



మంచి నిద్రకు..12 సూత్రాలు



మనిషికి శక్తినిచ్చే సాధనం నిద్ర, నిద్ర తగినంత పోకపోవటంవల్లనే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. రాత్రివేళ పడుకోగానే మంచి ' విద్రపట్టగలగటం ఒక వరం. సరిగా నిద్రపోలేని వారి జీవితం నరక(ప్రాయమే అవుతుంది. మనిషి జీవితం ఒక (క్రమపద్దతి ప్రకారం నడిచేందుకు వీలుగా పరిణమించింది నిద్ర. రాత్రి, పగలు వేళలలో చేయటానికి భిన్నమైన పనులు ఆశించింది ప్రకృతి. రాత్రివేళ నిద్రపోవాలి, పగటిపూట ఆట, పాట, ఉపాధి అంశాలను చూసుకోవాలి.శరీరం కూడా ఒక్కొక్క సమయంలో ఒక రకమైన పనికి సిద్దంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో నిర్దేశిత పనులు చేయాలి. అదే విధంగా నిద్రకు కూడా సమయం కేటాయించు కోవాలి. (ప్రతిరోజూ పడుకునే సమయం, మెలకువ తెచ్చుకునే సమయం ఒకటిగా పాటించాలి, దీనివలన శరీరానికి తగినంత వి(శ్రాంతి లభిస్తుంది. 

6,7 గంటల సమయం తప్పకుండా కేటాయించు కోవాలి.

 ఆరుగంటల కన్నా తక్కువ నిద్ర పోవటమంటే శరీరాన్ని కష్టపెట్టటమే. ఆ నిద్రను ఒక (క్రమపద్దతిలో అందించకపోయినా ఇబ్బంది తప్పదు. పెద్ద వాళ్ళకన్నా పీల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. వారికి పది గంటల వరకు నిద్ర అవసరమవుతుంది. 

 నిద్రకు తప్పనిసరిగా ఆరునుండి ఎనిమిది గంటల సమయం అవసరం.

అవసరం మేర కన్నా ఎక్కువ సమయం నిద్ర 
పోతున్నట్టు అనిపిస్తే ఆ నిద్రను నియంత్రించుకునేందుకు అలారం క్లాక్‌ని ఆశ్రయించవచ్చు. నిర్దేశిత నిద్రగంటలు గడవ గానే మెలకువ తెచ్చే విధంగా అలారం పెట్టకోవాలి. 

పడక గదిలో అలారం క్లాక్‌ లేదా వాల్‌క్లాక్ ఉండటంవల్ల ఇబ్బంది ఉంటుంది అంటారు చాలా మంది. ప్రతి పదినిమిషాలకు గడియారం వైపు చూడాలనిపిస్తుంది. ఆలా చూడటంవల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. ఇటువంటి సందేహం మనసులో ఉంటే గడియారాన్ని ఎదురుగా కాక ధ్వని వినిపించేలా కొంచెం దూరంగా పెట్టుకోండి. 

రాత్రివేళ నిద్ర తగినంత పాందాలంటే పగటి పూట నిద్రకు దూరంగా ఉండాల్సిందే. పగటి వేళ గంటసేపు పడుకున్నా చాలు .రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకుండా పోవటానికి.
పగటిపూట కొద్దిసేపు పడుకుని లేద్దానునుకుని చాలామంది ఆ నిద్రను గంటలసేపు కొనసాగిస్తారు. ఫలితంగానిద్రపోవాల్సిన రాత్రిసమయంలో కళ్ళుతెర్చుకుని కూర్చోవాల్సొస్తుంది. ఇటువంటి సమస్యలకు విరుగుడు సాయం(తం వేళ చేసే వ్యాయామం, సాయంత్రం వేళ నడక లేదా యోగాసనాలు వంటివి వేయటం వల్ల సులభంగా నిద్రపోగలుగుతారు. 

పడుకునే ముందు దీర్ఘంగా గాలి పీల్చి వదలటంవల్ల శరీరం తేలికపడుతుంది. నిద్రలోకి తీసుకునివెళ్ళే మార్గాలలో అది ఒకటి మాత్రమే. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవటం చాలా సులభం. 

నిద్ర పట్టక పోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి .వీటిలో ఒకటి మానసిక ఆందోళన, ఒత్తిడికి గురయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం లేదా శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు, భారీకాయం వంటి ఆంశాలవల్ల సరిగా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచవలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటువంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవడం మంచిది. 

నిద్ర సరిగా రాకపోవడానికి అనేక కారణాలు..

 జీర్ణక్రియ సరిగా జరగకపోయినా నిద్ర పట్టదు. జీర్ణక్రియ తీవ్రస్తాయిలో జరుగుతున్నప్పుడు నిద్ర రావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొవ్వులు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది. రాత్రివేళ భోజనం మితంగా తినాలి. కడుపులో ఇంకొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందునుండి లేవటం మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్ది సమయం ఉండి ఆ పైన ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే రాత్రిపూట హాయిగా ని(ద్రపోగలుగుతారు. 
రాత్రివేళ నిద్ర పట్టడంలో ఇబ్బంది అనిపిస్తే శ్రావ్యమైన కర్ణాటక లేదా వాయిద్య సంగీతం  వినాలి. అది ఏదైనా పరవాలేదు. 
మంద్రంగా వినిపించే సంగీతమైతే చాలు, అది జోకొట్టివట్టుగా చేస్తుంది. పుస్తకం చదువుతూ ని(ద్రలోకి జారుకోవటం కూడా మంచి ఆలవాటే.మంచి సంగీతం వింటే ఆది మెదడులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతనిస్తుంది. 
 

నిద్రలోకి ఎందుకు జారుకోలేకపోతున్నది గమనించండి, సాయం(త్రంవేళ తీసుకునే కాఫీ, టీ, మత్తుపానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. 

సాయంత్రంవేళ అతిగా పాగ తాగిన వారికి, నిద్రకుముందు రెండు మూడు గంటలు టెలివిజన్‌ కార్యక్రమాలు తిలకించేవారికి నిద్ర సమస్య తలెత్తుతుంది. 

కొందరికి ఏదో ఒక రకమైన మాత్రలు, వైద్యుడు సూచించకపోయినా వేసుకునే అలవాటు ఉంటుంది. ఆ మాత్రలలోని రసాయన (ప్రభావంవల్ల కూడా నిద్రపోలేక పోతారు. కాబట్టి అటునంటి ఆలవాట్లను గుర్తించి దూరం చేసుకుంటే ఇబ్బంది లేకుండా నిద్రపోగలుగుతారు. 

ఉష్ణోగ్రత కూడా కారణం కావచ్చు. 

పడకగదిలో ఉండే ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి, అధిక వేడి ఉన్నా, మరీ చల్లగా ఉన్నా నిద్రపట్టటంలో సమస్య వస్తుంది. వెలుతురు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. మరీ చీకటిగా ఉండకూడదు. అలాగే కంటి మీద వెలుతురు పడే తీరు కూడ. గదిలో ఒక మూలగా బెడ్‌ లాంప్‌ వెలుగుతూ ఉంటే బాగుంటుంది. గాలి, శబ్దాలు కూడా నిద్రను పాడు చేస్తాయి. రోడ్లకు దగ్గరలో ఇల్లు ఉంటే రోడ్ల మీద వెళ్ళ వాహనాల ధ్వనులు రాత్రంతా వేధించి నిద్ర పోనివ్వవు , కాబట్టి గదిలో ధ్వనులు ఎక్కువగా రాకుండా వాతావరణం ఉండాలి, ఇంటిలో టెలివిజన్‌ శబ్దాలు కూడా వినిపించ కూడదు. 

నిద్ర సమస్యకు పడక గది వాతావరణం..

నిద్ర వస్తే ఎక్కడైనా నిద్ర పోగలము అనేది అన్ని సమయాలలో నిజం కాదు .నిద్రలో పక్కకు పాత్ర ఉంటుంది. సౌకర్యంగా పక్క ఏర్పాటు ఛేసుకుంటే హాయిగా నిద్రించగలుగుతారు. పడుకునే ముందు పక్కను బాగా దులిపి వేసుకోవాలి. పక్కమీద ముడుతలు లేని విధంగా బెడ్‌షీట్‌ని పరవాలి, దిండు మరీ ఎత్తుగా లేదా మరీ లోతుగా లేనిదిగా ఉండాలి. మిగిలిన అన్ని అంశాలు సక్రమంగానే ఉన్నప్పటికీ నిద్రపోలేకపోతుంటే అతి ఆలోచనలు మెదడులో ముసురుతున్నాయేమో చూసుకోండి. 

పైన తెలుపబడిన పన్నెండు సూత్రాలను ఆచరిస్తే నిద్ర సమస్యను అధిగమించి, హాయిగా నిద్రపోయి ,నిద్రతో వచ్చే లాభాలను అందుకో గలుగుతారు. 

ఉద్యోగికి అనువైన ఆహారం..



రోజంతా ఆఫీసులో డెస్క్‌ దగ్గర కూర్చోవడమనేది ఆరోగ్యరీత్యా అంత మంచిదికాదు. అయితే పగలంతా ఆలా కూర్చున్నా కూడా ఇబ్బంది కలుగని విధానాలు కొన్ని పాటించాల్సి ఉంది.  శీతాకాలంలో ఆఫీసుకి సైకిల్‌ మీద వెళ్ళడం చాలా మంచిది, అది కాలి కండరాలకే కాక, మొత్తం శరీరానికి చక్కని వ్యాయామాన్ని ఇస్తుంది. 

 ఆఫీసులో మూడు అంగుళాల మడమ గల చెప్పులు వేసుకోకూడదు, సునాయాసంగా తిరిగేందుకు అనువైన పాదరక్షలనే వేసుకోవాలి. 

 లంచ్‌ కి జంక్‌ఫుడ్‌ మాని, ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తినడం శ్రేయస్కరం. 

పని మధ్యలో కొంత విరామం తీసుకోవడం ఎంతో మంచిది. కుర్చీకి అతుక్కుపోయి ఉన్నట్టయితే వెన్ను నొప్పే వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాస్త ఆటూ ఇటూ నడవడం,కాలు జాడించడం వంటివి చేయాలి. 

 మధ్యాహ్న భోజనం తర్వాత కనీసం పావు గంటసేపు నడవడం మరువకండి. 

 దవడలకు గాసిప్‌ మంచి వ్యాయామమే. ఆయితే ఓ పావు గంటసేపు జోకులు పేల్చుతూ హాయిగా నవ్వినట్టైతే గుండెకు ఎంతో మేలు. 

ఫస్ట్ నైట్ / తొలి రాత్రి ఆహారము

ఫస్ట్ నైట్ ఫుడ్ / తొలి రాత్రికి ఆహారం..

తొలిరాత్రి అద్భుతమైన అనుభవాలను పంచు కోవాలని అమ్మాయి, అబ్బాయి భావిస్తారు. వారిలో ఏదో తెలియని ఆదుర్దా మొదలవుతుంది. 

చక్కటి అనుభవం కోరుకునేవారు ..

ఆ రోజుకు ముందునుండే తమ ఆరోగ్యం విషయంలో 'శ్రద్ద వహించాలి. వారు తీసుకునే ఆహారంలో విటమిన్‌ ఇ అందించే ఎండు పళ్ళు తీసుకోవాలి. 

బాదం, పిస్తా, యాలకులతో పాటు, కొబ్బరిని ఆహారంగా తీసుకోండి. పుచ్చకాయ, గుడ్డు, దంపుడు బియ్యం వంటివాటిని తీసుకుంటే శరీరానికి అవపరమైన జింక్‌ పుష్కలంగా లభిస్తుంది. 

మునగ, క్యారెట్‌ ద్వారా ఎ విటమిన్‌ ని పొందాలి. సీ విటమిన్‌ కోసం టమేటో, ఉసిరి తీసుకోవాలి. ఈ విటమిన్లు అన్నీ సెక్స్‌ కోరిక ను, శక్తిని పెంచే సాధనాలు. అలా ఆరోగ్యం మీద శ్రద్ధతో తొలి రాత్రికి తయారైన వ్రారికి మరచిపోలేని అనుభవం మిగులుతుంది .

అతిబల చెట్టు, ఆయుర్వేద ఉపయోగాలు - డా ఏల్చూరి

ఆయుర్వేద అభిమాన పాఠకులారా! మనరాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో కనిపించే
చెట్టు అతిబల. దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు వుండరు. అమితమైన బలాన్ని అందించే శక్తి
ఇందులో వుంది. కాబట్టే దీనికి అతిబల అని పేరు వచ్చింది. ప్రాచీనకాలంలో కూడా
రామాయణంలోనూ, భారతంలోనూ ఆ తరువాత కాలాలలో కూడా ఈ అతిబల మొక్క ప్రశంస
చాలాచోట్ల కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనవి.
ఇలాంటి అసాధారణమైన ఔషధ శక్తిగల ఓషధులు గ్రామ గ్రామాన వుండి కూడా వాటి గురించి
తెలుసుకోలేక ఉపయోగించుకోలేక మన భారత జాతి బలహీనమైపోతుందంటే ఇది ఎంత
దురదృష్టమో ఆలోచించండి. ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు ప్రజలందరికి తెలియజేసి
అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము.

అతిబల- పేర్లు

సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని,
తెలుగులో ముద్రబెండ, తుత్తురుబెండ, దువ్వెనకాయల
చెట్టు, అతిబల అని, లాటిన్లో Mallya Rotondifolia
ఆంగ్లంలో Mallow Tree అంటారు.

అతి బల- రూప గుణ ధర్మాలు..

తుత్తురుబెండ ఆకులు మృదువుగా, జిగట కలిగి
మేహశాంతిని కలుగజేస్తయ్. శరీరంలోని సకల
మలినాలను బయటికి తోసివేసి శుద్ధి చేస్తయ్,
గడ్డలను ,వ్రణాలను మెత్తపరచి, పక్వంచేసి మాన్పి
వేస్తయ్. ఇంకా అనేక ఉపయోగాలు తెలుసుకుందాం.

మూత్రంలో మంట, రాళ్ళు వుంటే ?

తుత్తురుబెండ నాలుగైదు ఆకులు నలిపి పావు
లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి
చల్లార్చి ఒకచెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా
తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్ళు
కరిగి మూత్రం ద్వారా పడిపోతయ్.



నేత్ర దోషాలకు - ఆకు కషాయం..

పైన చెప్పినట్లు కషాయంచేసి చల్లార్చి ఆ కషా
యాన్ని మూసిన కండ్ల పైన కడుగుతూవుంటే కంటి 
దోషాలు హరించి కంటిచూపు పెరుగుతుంది.

జ్వర తీవ్రత లో - అతి బల..

అతి బలాకులను నీటిలో నానబెట్టి వడపోసి
అందులో కొద్దిగా కండచక్కెర కలిపి కొద్ది కొద్దిగా
తాగుతూ వుంటే వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది.

* ఇదేనీరు మూడుపూటలా సేవిస్తుంటే
మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు,
దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతయ్.

పిచ్చి కుక్కవిషానికి - అతి బల

పిచ్చికుక్క కరచిన వెంటనే అతిబల ఆకుల రసం,
70 గ్రా. మోతాదుగా తాగించాలి. ఆకు ముద్దను
కాటు పైన వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి
పోతుంది.

శీఘ్ర స్కలనానికి - అతి బల

తుత్తురుబెండ గింజలు 50గ్రా,శతావరి వేర్ల పొడి
100గ్రా, ఆ రెండింటికి సమంగా పటిక బెల్లంపొడి
కలిపి నిలువ వుంచుకోవాలి. రోజు రెండుపూటలా
ఒక చెంచా పొడి చప్పరించి తిని ఒక కప్పు పాలు
తాగుతూ వుంటే శీఘ్రస్కలనం మాయమై పోయి వీర్యం
గట్టిపడి యౌవనం పెరుగుతుంది.

పైత్యపు - గుండెదడకు

అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో
నూరి బట్టలో వడపోసి ఆ రసంలో చక్కెర కలిపి
తాగుతూ వుంటే అధిక వేడి వల్ల కలిగిన గుండెదడ
తీవ్రంగా హరించి పోతుంది.

నడుము నొప్పికి - నాణ్యమైన మార్గం..

పైన తెలిపినట్లు అతి బల ఆకులతో కాచిన
కషాయం రెండుపూటలా తాగుతూ ఆకులను నలగగొట్టి
వేడిచేసి నొప్పుల పైన వేసి కట్టు కడుతూ వుంటే
కేవలం నడుము నొప్పేకాక ఎక్కడి నొప్పులైనా తగ్గి
పోతయ్.

మొలల కు - అతి బల ఆకుకూర

అతి బల ఆకులను కూర లాగా వండి రెండు పూటలా
తింటుంటే మొలల నుండి కారే రక్తం ఆగిపోతుంది.

స్త్రీల - స్తనాల వాపుకు

అతి బలవేరును నిలువ చేసుకొని, రోజూ రెండు
పూటలా కొంచెం నీటితో సానరాయిపైన ఆ వేరును
అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ వుంటే
రొమ్ముల వాపు తగ్గిపోతుంది.
అలాగే కండరాల వాపు పైన కూడా పట్టిస్తూ వుంటే
ఆ వాపు తగ్గుతుంది.

దగ్గు, ఉబ్బసం - హరించిపోవుటకు

బాగా ముదిరిన అతి బల చెట్టును సమూలంగా
పెకలించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో
ఎండబెట్టాలి. తరువాత దాన్ని కాల్చి బూడిదగా
చేయాలి. ఆ బూడిదను ఒక కుండలో పోసి నిండా
నీరుపోసి మూడు రోజులపాటు వుంచాలి. రోజుకు
ఒకసారి కర్రతో కలుపుతూ వుండాలి.
నాలుగవ రోజున పైకి తేలిన నీటిని మాత్రమే
ఉంచుకొని చిన్న మంట పైన మరిగిస్తే అంతా తెల్లటి
క్షారంగా మిగులుతుంది.దాన్ని మెత్తగా నూరి నిలువ
చేసుకోవాలి.
ఈ క్షారం రెండు మూడుచిటికెల మోతాదుగా
ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తు వుంటే దగ్గు,
ఉబ్బసం హరించిపోతయ్.

మూత్రపిండాల - నొప్పి తగ్గుటకు

అతి బల ఆకులను 50 గ్రా. తీసుకొని మెత్తగా
నూరి చిన్నచిన్న బిళ్ళలుగా తయారుచేయాలి.
తరువాత ఆవునెయ్యి 50 గ్రా. పాత్రలో పోసి పొయ్యి
మీద పెట్టి నెయ్యి మరుగుతుండగా ఈ బిళ్ళలను
అందులో వేయాలి. బిళ్ళలన్నీ వేగేవరకువుంచి దించి
వడపోసి వాటిని నిలువ చేసుకోవాలి. రోజూ
రెండుపూటలా ఒకటి లేక రెండు చెంచాల మోతాదుగా
వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గి
పోతుంది.

నులిపురుగులు హరించుటకు..

అతి బల గింజలను నిప్పుల పైన వేసి ఆ పొగను
పిల్లల గుద స్థానమునకు తగిలేటట్లుగా చేస్తే దాని
ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించి పోతయ్.

మొలల కు - అతి బల గోలీలు..

అతిబల ఆకులు ఇరవై ఒకటి, అలాగే మిరియాలు
ఇరవై ఒకటి తీసుకొని మొత్తం మెత్తగా నూరి ఏడు
గోలీలు చేయాలి. రోజు ఒక గోలీ చొప్పున ఏడు
రోజులు పరగడుపున ఒక గోలీని మంచినీటితో సేవి
స్తుంటే వాత దోషంవలన కలిగిన మొలలు హరించి
పోతయ్.

గుండె బలానికి - ముఖ కాంతికి

అతి బలవేర్లను దంచి పొడిచేసి జల్లించి నిలువ
వుంచుకోవాలి. ఈ పొడిని మూడునాలుగు చిటికెల
మోతాదుగా ఆవునెయ్యితో కలిపి రెండుపూటలా
ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గుండెకు
బలం కలగడమే కాక ముఖం కూడా కాంతివంతంగా
మారుతుంది. *



Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...