వార్ణచందు చిలకడ దుంపలు
చిలకడ దుంపల వలన లాభాలు?
ఆలూ దుంపల్లాగానే చిలకడ దుంపలు కూడా 17వ శతాబ్దిలో అమెరికా
నుంచి విదేశీ వ్యాపారుల ద్వారా మనకు చేరాయి. వాతం చేస్తాయని, షుగరు
పెంచుతాయనీ, మలబద్ధతని తెస్తా
యని చాలామంది వీటిని తినరు.
కానీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి
ఇవి మేలే చేస్తాయి. పైగా జీర్ణశక్తిని
పెంచుతాయి కూడా! ఆ విషయంలో
ఆలూ కన్నా ఇవే మెరుగు.
ఎర్రగా ఉండే చిలకడదుంపల్ని
పిల్లలకు తరచూ వండి పెడుతూ
ఉంటే చీటికీ మాటికీ విరేచనాలయ్యే
వ్యాధిని తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెప్తోంది. చిలకడదుంపల్లో ఉండే ఎ విట
మిన్ (బీటా కెరొటీన్) పేగుల లోపలి గోడల్ని బలసంపన్నం చేస్తుందని నిర్ధారించారు.
అందువలన పేగుల్లో ఉద్రేకం కలిగించే ఆహార పదార్థాల్నీ, బాక్టీరియా దోషాలున్న
ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు పిల్లల్లో విరేచనాలు అవకుండా ఇవి పేగుల్ని కాపా
డతాయని నిర్ధారించారు.
చిలకడదుంపల్ని ఉడికించి, తాలింపు పెట్టి పిల్లలకు సాయంకాలం పూట స్కూలు
నుంచి రాగానే పెట్టడానికి వీలుగా ఉంటాయి. క్యారట్, చిలకడదుంపలు సమానశక్తి
కలిగిన ద్రవ్యాలు, వాటిని ఎ విటమిన్ లోపం ఉన్న పిల్లలకు తగుపాళ్ళలో అందించవ
లసి ఉంది. శనగపిండి స్వీట్లు, హాట్లు పేగుల్ని పాడుచేస్తాయి. చిలకడ దుంప స్వీట్లు
పేగుల్ని బాగుచేస్తాయి.