Thursday 26 November 2015

JUNK FOOD - NOLLALO VELLALU

నోళ్ళలో వెల్లలు

జంక్ ఫుడ్స్ గురించి చెప్పండి!

చిన్నపిల్లల్లో స్థూలకాయం, ఈడు రాకుండానే రజస్వలలు
కావటం, బాల్యంలో షుగరు, బీవీ వ్యాధులు, అనేక మానసిక
ప్రవర్తనా వ్యాధులు కలగడానికి జంక్ ఫుడ్స్ తప్పకుండా కారణం
అవుతున్నాయి.
వెల్ల అంటే తెల్లరంగు. ఏరంగూ లేని తెల్లని స్వీటు కూడా ఈ వెల్ల (తెల్ల
రంగు) కలిపి తయారుచేసిందేనని స్వీట్ షాపువాళ్ళు చెప్తున్నారు. రంగుక
లిసిన ఆహారవిషాలు మాకు వద్దనవలసింది ప్రజలే. స్థూలకాయం వస్తుం
దీని ఇంట్లో పిల్లలకు నెయ్యి, నూనె, జీడిపప్పుల్లాంటివి పెట్టటం మానేసి,
రోడ్డుపక్కన ఆంక్ విషాహారాలు కొనిపెట్టడం ఒక రివాజు అయ్యింది.
సమోసాలు, మైనం లామినేషన్ చేసిన కరకరలు, రంగు
నీళ్ళు, చవకబారు బిస్కట్లు, కోక్ ఎక్కువగా కలిసిన చాక్లెట్లు,
రంగులద్దిన కేకులు, నీలిరంగు బూందీ, ఆకుపచ్చ కారప్పూన
ఇలాంటివి విషాలకిందకు తీసుకురావలసిన అవసరం ఉంది.
ఏవి జంక్ ఫుడో నిర్వచించి, అవి
విషపదార్థాలని ప్రభుత్వం స్పష్టం
చేయాలి. హానికారక జంక్ ఫుడ్స్న
విద్యాలయాల దగ్గర్లో అమ్మకుండా
నిషేధించే ఆలోచన ప్రభుత్వం
చేస్తున్నట్టు 2015 ఆగష్టు నెలాఖ
రులో ఒక ప్రకటన వెలువడింది.
స్కూలు యూనిఫారంలో ఉన్న
పిల్లలకు జంక్ ఫుడ్స్ అమ్మకూ
డదు, పెద్దలకు మాత్రమే అనే
నియమం పెడతారట. ఈ నియమం ఎంత అమలౌతుందో తెలీదు. తల్లిదండ్రులే జంక్
ఫుడ్స్ కొని, పిల్లలకిచ్చి సూళ్ళకు పంపుతున్నారు. తమ పిల్లలు వాటి బారినపడకుండా
నియంత్రించుకోవలసింది కన్నవారే కదా!