వంకాయ వంకలు
వంకాయ ఎలర్జీ కలిగిస్తుందనేది నిజమేనా?
* వంకాయ నూరు శాతం భారతీయమైనది. తరతరా
లుగా మన పూర్వులు తిని ఆనందించిన ఆరోగ్యదాయకమైన
ఆహార ద్రవ్యమే! దాన్ని ద్వేషించాల్సిన పని లేదు.
సరిపడని ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు కలిగే వ్యాధి లక్ష
జాలను 'ఓరల్ ఎలెర్జీ సిండ్రోమ్' అంటారు. దీనిపైన చేసిన ఒక
సర్వేలో 10% భారతీయులకు వంకాయ సరిపడదనీ, వారిలో
14% మందికి తీవ్ర రియాక్షన్ వస్తోందని తేలింది. మన శరీర
తత్వం వలన, వాటిని వండే విధానం వలన కూడా వంకాయలు సరి
పడట్లేదని గమనించాలి. (మనుషులందరికీ వంకాయ పడద
నటం సరికాదు.) ఏ ద్రవ్యం అయినా మన శరీరానికి సరిపడ డా.జి.వి.పు
కపోవచ్చు. లేత వంకాయ పిందెలు అన్ని వ్యాధుల్లోనూ తిన
దగినవిగా ఉంటాయి. వంకాయ ముదిరితే దాన్ని పారేయండి గానీ, చెల్లబెట్టా
లని చూడకండి. వంకాయతో చింతపండు, శనగపిండి లాంటివి కలిపి
వండటం వలన నూనెలో వేసి బొగ్గుముక్కల్లా మాడ్చటం వలన కూడా అది
అపకారం చేసేదిగా మారు
తుంది. అల్లం, ధనియాలు,
జీలకర్ర, మిరియాల్లాంటి
జీర్ణశక్తిని పెంచే ద్రవ్యాలతో
వంకాయని వండుకుంటే
దాని దోషాలు చాలావరకూ
తగ్గుతాయి.
ఒక్క వంకాయ విషయం
లోనే కాదు సరిపడని ఏ కూర
గాయనైనా ఇలా సంస్కరించి సరిపడేలా చేసుకోగలగాలి. తక్కువ మోతాదుతో
మొదలు పెట్టి, క్రమేణా పెంచుకుంటూ పడని దానిని పడేలా చేసుకోవడాన్ని
డీ-సెన్సిటైజేషన్ (సాత్మీకరణం) అంటారు.
జలుబు, ఉబ్బసం లాంటి ఎలెర్జీ
వ్యాధులున్న వారు పడని వస్తువుల్ని ఇలా సాత్మీకరణం చేసుకోవటం అవసరం.