Thursday, 26 November 2015

RUDRA JADA / SABJA GINJALU - AYURVEDAM

చలవ చేసే సజ్జాగింజలు

సజ్జాగింజలు నానబెట్టి షుగరు రోగులు తీసుకోవచ్చా? లాభాలేమిటి? 

? - రుద్రజడ దీని అసలు పేరు. సబ్దా అనేది అరబ్బీ పదం. వేడి ఎక్కువగా ఉన్నవా
రికి ఈ గింజల్ని పది నిమిషాల సేపు నీళ్లలో నానించి ఇస్తే వెంటనే చలవ
చేస్తుంది. షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు, పోట్లు ఉన్నవారికి ఈ గింజల్ని రోజూ
తాగిస్తే మంటలు ఉపశమిస్తాయి. మూత్రంలో మంట, కడుపులో మంట, అరికాళ్లు
చేతుల్లో మంట, కళ్లు మంటలు, నాలుక మీద మంట, విరేచనంలో మంట ఇలా
మంటగా ఉండటమే వేడి అంటే! సజ్జాగింజలు ఈ వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పి
మీద కూడా పనిచేస్తాయి. పంచదార కలపకుండా షుగరు రోగులకూ, స్థూలకాయు
లకూ ఇవ్వొచ్చు. మజ్జిగలో కూడా నానబెట్టుకుని తాగవచ్చు. పాలలో వేసి ఉడికించి
టీలాగా కాచుకుని తాగవచ్చు. కిరాణా కొట్లలో ఇవి తేలికగా దొరికేవే!