పల్లీల ఎలెర్జీ?
2 వేరుశనగ పప్పులు వాడితే మంచిదేనా?
* వేరుశనగ గుళ్ళు, పల్లీలు, వేరు గుళ్ళు పేరుతో మన ప్రాంతాల్లో దొరికే వేరుశనగ
గుళ్ళు మనకి మధ్య యుగాల
మలిదశలో విదేశీయులు దిగు
మతి చేసిన నూనె గింజలే. నూనె
సంగతి అలా ఉంచితే వేరుశన
గలు శనగల్లాగే పైత్యం చేసే
స్వభావం కలిగి ఉంటాయి.
యాసిడ్ని పెంచి ఆకలి చంపు
తాయి.
వేరుశనగ పప్పుల్ని కొద్దిగా
నెయ్యి వేసి దోరగా వేయించుకుని
బెల్లంముక్కతో కలిపి తింటే, అజీర్తిబాధలు, కడుపునొప్పి, గ్యాసురాకుండా ఉంటా
యని మన పెద్దవాళ్ళు వేయించిన శనగగుళ్ళను తీపితో కలిపి పెడతారు. గాంధీగారు
వేరుశనగ పప్పు, బెల్లం ముక్కతోపాటు మేకపాలు కూడా తీసుకునేవారని ప్రతీతి.
ఏమైనా వేరుశనగ గుళ్ళు మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కావు. అలాగని
నిషేధించాల్సినవి కూడా కావు. సరదాగా అప్పుడప్పుడు వేయించిగాని, ఉడకబెట్టుకు
నిగాని, తంపట పెట్టుకునిగానీ తీసుకోవచ్చు. కొందరిలో ముఖ్యంగా పిల్లల్లో
ఉబ్బసం వ్యాధికి ఇవి కారణం అవుతాయని ఇటీవల అమెరికన్ పరిశోధకులు
గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒక ఊపిరితిత్తుల ఆసుపత్రిలో పిల్లల మీద జరి
పిన పరిశోధనలో ఈ హెచ్చరిక చేశారు. వేరుశనగపప్పు తిన్న కొంత
మందిలో ఎలెర్జీని నియంత్రించే ఇమ్యునోగ్లోబులిన్-ఇ అసాధారణంగా
పెరగడాన్ని గమనించారు. ఆ వ్యక్తులకు వేరుశనగ సరిపడదని దాని
అర్ధం. సరిపడనివారు తప్ప తక్కినవారికి వేరుశనగ విరోధం లేదు.
అయినా అవి నూనెగింజలు కాబట్టి స్థూలకాయులకు జాగ్రత్త తప్పదు.