పాలవిరుగుడు తినవచ్చా?
విరిగిన పాలు ఆరోగ్యానికి మంచివేనా? పాలవిరుగుడుతో చేసిన
స్వీట్లు తినవచ్చా?
* పాలు విరగడం అంటే పాలలో
పాలకు సంబంధించిన పదార్థాలను,
నీటినీ విడగొట్టటం అని అర్థం.
పాలలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం,
ఫాస్పరస్, కొవ్వు ఇవి గట్టిపడి,
ముద్దగా అయి, నీళ్లు వేరవుతాయి.
పాలలో విషదోషాల వలనగానీ,
పాలకు వ్యతిరేకమైన ఉప్పు, కారం, పులుపు వంటివి తగలటం వలన గానీ, పాలు
కుళ్లటం వలన గానీ విరిగితే అవి మంచివి కానట్టే లెక్క! పాలను ఫ్రిజులో భద్రపరచ
కుండానూ, కాయకుండానూ ఉంచేసినందు వలన విరిగే పాలు పులిసిపోయి విరిగి
నట్టు లెక్క. అవి చేదుగానూ, వాసనగానూ ఉన్నప్పుడు అవి నిస్సందేహంగా పారబో
యాల్సినవే! విరిగిన పాలంటే మన పెద్దలకు సదభిప్రాయం లేదు. పాల విరుగుడుతో
వంటకాలు మనకు లేవు. రసగుల్లాలు, రసమలై లాంటి పాల విరుగుడు స్వీట్లను విదేశీ
పద్ధతిలో ఆమ్లాలను కలిపి విరగొట్టి తయారు చేస్తారు. పాలను పద్ధతి ప్రకారం విరగ
కొడితే, అందులో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. అదే, జున్నుపాలే
కొవ్వు తక్కువ, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ జున్నుని వైద్య పరిభాషలో 'కొలో
సమ్' అంటారు. విరిగే పాలని 'సోర్ మిల్క్' అంటారు.
No comments:
Post a Comment