Thursday 21 March 2024

ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగవచ్చా

 ఎండాకాలం అంటే ఒకప్పుడు నిమ్మకాయ షర్బత్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్యాకేజ్డ్ జ్యూస్  అధికంగా దొరుకుతున్నాయి వాటిని ఎండ నుంచి ఉపశమనం కోసం తాగవచ్చా అలాగే గ్లూకోజ్ పొడి ఓఆర్ఎస్ లు రోజు తీసుకోవచ్చా ఎవరైనా వీటిని తాగకూడదు అన్న నియమం ఉందా

ఎండ వేడిమి వల్ల శరీరంలో నీరు ఆవిరవుతున్న కొద్దీ ఏదో ఒకటి తాగాలన్న తపన పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఎదురుగా కనిపించే ప్యాకేజీ డ్రింక్స్ జ్యూస్ ల మీదకి మనసు మల్లుతుంది అయితే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతులైన వాళ్ళు అప్పుడప్పుడు తాగవచ్చు తప్ప ఎండ నుంచి ఉపశమనం కోసం అన్నది వీటి పరంగా కరెక్ట్ కాదు అలాగే గ్లూకోజ్ పొడి ఓఆరస్ లాంటివి కూడా వడదెబ్బ నుంచి కోలుకోవడానికి మాత్రమే వాడాలి వీటిలోనూ చక్కెర అధికంగా ఉంటాయి కాబట్టి రోజు తీసుకోకూడదు

ఇవి మంచిది..

మనం రోజువారి తాగడానికి ఇంట్లో చేసుకునే హైడ్రేషన్ సొల్యూషన్స్ చాలానే ఉన్నాయి. నిజానికి నీళ్లలో పంచదార ఉప్పు వేస్తే సోడియం క్లోరైడ్ అనే ఎలక్ట్రోలైట్లు వస్తాయి అదనంగా రుచు కోసం కలిపే నిమ్మకాయలో కూడా శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ సి ఉంటుంది ఇది మనం ఇంట్లో చేసుకోగలిగే చక్కటి ఓఆర్ఎస్ వేడు ఎక్కువ ఉన్న రోజులు ఎండలో తిరిగి వచ్చిన శరీరం డిహైడ్రేట్ అయిన దీన్ని తాగవచ్చు ఆరు నెలల పాప నుంచి 60 ఏళ్ల వాళ్ళ దాకా ఎవరైనా వీటిని తీసుకోవచ్చు అలాగే ద్రాక్షరసంలో నీళ్లు ఉప్పు పంచదార కలిపి తీసుకున్న మంచిదే లీటర్ నీళ్లలో కొంచెం అల్లం పుదీనా రసాన్ని కలిపి ఉప్పు పంచదార జోడించి అప్పుడప్పుడు తాగుతూ ఉండవచ్చు ఉప్పు మిరియాల పొడి నిమ్మకాయ రసం వేసి ఎక్కువ నీళ్లు పోసి చేసిన మజ్జిగ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మజ్జిగలో కరివేపాకు కొత్తిమీర వేసిన రుచికరంగా ఉండి తాగేందుకు రుచికరంగా ఉంటుంది పుచ్చకాయ రసం ఖర్జూరం నీళ్లు ఉడికించి చల్లార్చిన బార్లీ నీళ్లు కూడా మంచిది కండ చక్కెర నీళ్లు తాగిన చలవ చేస్తుంది. ఆమ్పన్న కూడా నీళ్లలో కలుపుకొని తాగవచ్చు పచ్చిమామిడికాయ తురుము పంచదార కలిపి దగ్గరికి చేసి నీళ్లలో కలుపుకొని తాగిన ఈ కాలానికి చక్కటి డ్రింక్ తయారవుతుంది జల్జీరా కొబ్బరి నీళ్లు చెరుకు రసం లాంటివి ఎండ వేడిమిని తట్టుకునేందుకు సహాయపడతాయి ఇక బరువు తగ్గేందుకు కూడా ఎండాకాలం మంచి సమయం ఘన పదార్థాలు ఎక్కువగా సహించని ఈ కాలంలో ఇలా చలవ చేసే రసాలు తాగుతూ ఒంట్లో కొవ్వును కరిగించడం ఎంతో సులువు

No comments:

Post a Comment