21, మార్చి 2024, గురువారం

సరైన దంతసిరికి ఏమి చేయాలి

 ప్రతి మనిషి వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే దంతాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పంటి చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి భరించలేని నొప్పితో పాటు శాశ్వతంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ప్రకారం మనదేశంలో 95% మంది ఏదో ఒక రకమైన చిక్కుళ్ళ సమస్యతో బాధపడుతున్నారు 15 ఏళ్లలోపు పిల్లల్లో కనీసం 70 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు ఇవి

పిల్లలకు స్వీట్లు పండ్ల రసాలు తక్కువగా ఇవ్వాలి ఏదైనా తీపి పదార్థం ఇవ్వాలనుకుంటే దాన్ని భోజనం సమయంలో ఇవ్వడం వల్ల నేరుగా పళ్ళ మీద ప్రభావం ఉండదు

నిద్ర లేచాక బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడం దురలవాటు దానివల్ల క్రమంగా దంతాలు తీవ్రంగా దెబ్బతింటాయి

బ్రష్ చేయడం వల్ల దంతాలు 60 శాతం వరకు శుభ్రం అవుతాయి దంతాల మధ్య గారాని శుభ్రం చేసే ఫ్లాసింగ్ వల్ల నోటిలోని బాక్టీరియా తగ్గుతుంది

సెన్సిటివ్ దంతాలు ఒక సమస్య మాత్రమే కాదు పళ్ళు దెబ్బతింటున్నాయి అని ఎందుకు సూచన కూడా ప్రత్యేకమైన పేస్టు వాడితే సరిపోదు దంత వైద్యుడిని సంప్రదించాలి


ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగవచ్చా

 ఎండాకాలం అంటే ఒకప్పుడు నిమ్మకాయ షర్బత్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్యాకేజ్డ్ జ్యూస్  అధికంగా దొరుకుతున్నాయి వాటిని ఎండ నుంచి ఉపశమనం కోసం తాగవచ్చా అలాగే గ్లూకోజ్ పొడి ఓఆర్ఎస్ లు రోజు తీసుకోవచ్చా ఎవరైనా వీటిని తాగకూడదు అన్న నియమం ఉందా

ఎండ వేడిమి వల్ల శరీరంలో నీరు ఆవిరవుతున్న కొద్దీ ఏదో ఒకటి తాగాలన్న తపన పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఎదురుగా కనిపించే ప్యాకేజీ డ్రింక్స్ జ్యూస్ ల మీదకి మనసు మల్లుతుంది అయితే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతులైన వాళ్ళు అప్పుడప్పుడు తాగవచ్చు తప్ప ఎండ నుంచి ఉపశమనం కోసం అన్నది వీటి పరంగా కరెక్ట్ కాదు అలాగే గ్లూకోజ్ పొడి ఓఆరస్ లాంటివి కూడా వడదెబ్బ నుంచి కోలుకోవడానికి మాత్రమే వాడాలి వీటిలోనూ చక్కెర అధికంగా ఉంటాయి కాబట్టి రోజు తీసుకోకూడదు

ఇవి మంచిది..

మనం రోజువారి తాగడానికి ఇంట్లో చేసుకునే హైడ్రేషన్ సొల్యూషన్స్ చాలానే ఉన్నాయి. నిజానికి నీళ్లలో పంచదార ఉప్పు వేస్తే సోడియం క్లోరైడ్ అనే ఎలక్ట్రోలైట్లు వస్తాయి అదనంగా రుచు కోసం కలిపే నిమ్మకాయలో కూడా శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ సి ఉంటుంది ఇది మనం ఇంట్లో చేసుకోగలిగే చక్కటి ఓఆర్ఎస్ వేడు ఎక్కువ ఉన్న రోజులు ఎండలో తిరిగి వచ్చిన శరీరం డిహైడ్రేట్ అయిన దీన్ని తాగవచ్చు ఆరు నెలల పాప నుంచి 60 ఏళ్ల వాళ్ళ దాకా ఎవరైనా వీటిని తీసుకోవచ్చు అలాగే ద్రాక్షరసంలో నీళ్లు ఉప్పు పంచదార కలిపి తీసుకున్న మంచిదే లీటర్ నీళ్లలో కొంచెం అల్లం పుదీనా రసాన్ని కలిపి ఉప్పు పంచదార జోడించి అప్పుడప్పుడు తాగుతూ ఉండవచ్చు ఉప్పు మిరియాల పొడి నిమ్మకాయ రసం వేసి ఎక్కువ నీళ్లు పోసి చేసిన మజ్జిగ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మజ్జిగలో కరివేపాకు కొత్తిమీర వేసిన రుచికరంగా ఉండి తాగేందుకు రుచికరంగా ఉంటుంది పుచ్చకాయ రసం ఖర్జూరం నీళ్లు ఉడికించి చల్లార్చిన బార్లీ నీళ్లు కూడా మంచిది కండ చక్కెర నీళ్లు తాగిన చలవ చేస్తుంది. ఆమ్పన్న కూడా నీళ్లలో కలుపుకొని తాగవచ్చు పచ్చిమామిడికాయ తురుము పంచదార కలిపి దగ్గరికి చేసి నీళ్లలో కలుపుకొని తాగిన ఈ కాలానికి చక్కటి డ్రింక్ తయారవుతుంది జల్జీరా కొబ్బరి నీళ్లు చెరుకు రసం లాంటివి ఎండ వేడిమిని తట్టుకునేందుకు సహాయపడతాయి ఇక బరువు తగ్గేందుకు కూడా ఎండాకాలం మంచి సమయం ఘన పదార్థాలు ఎక్కువగా సహించని ఈ కాలంలో ఇలా చలవ చేసే రసాలు తాగుతూ ఒంట్లో కొవ్వును కరిగించడం ఎంతో సులువు

17, మార్చి 2024, ఆదివారం

హరిద్వార్ లో ఘనంగా జిజ్ఞాస కార్యక్రమం

 హరిద్వార్ లోని పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సంప్రదాయ గిరిజన తెగలు వనమూలికల సంరక్షణపై శనివారం జరిగిన జిగ్యాస కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎన్ఎంపిబి మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుశీల్ ఉపాధ్యాయ డాక్టర్ ఆచార్య బాలకృష్ణ సంప్రదాయ విజ్ఞాన వనమూలికల విభాగం చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ అవస్థలు పాల్గొని మాట్లాడారు



ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం

 పతంజలి ఆవాల నూనె ప నిర్వహించిన పరిశోధనలు క్యాన్సర్ నిరోధక సమ్మేళనం ఉన్నట్లు కనుగొంది కొలుహూ అనే భారతీయ సంప్రదాయ పద్ధతి ప్రకారం తీసిన నూనెపై

ఈ అధ్యయనాన్ని నిర్వహించింది ఈ అధ్యాయం ప్రముఖ పరిశోధన జర్నల్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైంది చెక్క మోర్టార్ రోకలితో కొలుహూను ఉపయోగించి తీసిన ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం అయినా అవురా అంటియమైడ్ అసిటేట్ ఉనికిని కనుగొన్నారు ఈ విధంగా తీసిన నూనె కేన్సర్ను నివారించడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని పేర్కొంది దీనిపై స్వామి రాందేవ్ జి స్పందిస్తూ మన భారతీయ సంప్రదాయ దినచర్యలో సహజంగానే రుగ్మతలను ఎదుర్కొని పద్ధతులు నిక్షిప్తమై ఉంటాయన్నారు భారతీయ సంప్రదాయ వారసత్వం ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి తీసే ప్రకృతి స్నేహపూర్వక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అని పేర్కొన్నారు


29, ఫిబ్రవరి 2024, గురువారం

గర్భిణులకే కాకుండా పోలిక్ యాసిడ్ ఇంకా ఎవరికి ఎవరికి అవసరం

 గర్భిణులకు పోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమని చెబుతారు దీనిని మాత్రల రూపంలో కాకుండా ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చా పోలిక్ యాసిడ్ గర్భిణులకే కాకుండా ఇంకా ఎవరికి అవసరం అంటే ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి 9 అని కూడా అంటారు ప్రతి మనిషికి ఇది అవసరమే మన శరీరంలో కొత్త కణాల పెరుగుదలలో పోలిక్ యాసిడ్ చాలా కీలకము అలాగే గర్భిణిగా ఉన్న తొలి నెలలో బిడ్డ వెన్నెముక మెదడు ఎదుగుతాయి అందులో పోలిక్ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది తక్కువైతే న్యూరల్ క్యూబ్ డిఫెన్స్ లాంటివి వస్తాయి గర్భిణులే కాదు ఆడపిల్లలంతా తొలి నుంచి పోలిక్ యాసిడ్ లోపం లేకుండా చూసుకోవాలి. క్యాబేజీ కాలీఫ్లవర్లతో పాటు తోటకూర పాలకూర పుట్టగొడుగులు మొలకలు స్వీట్ కార్న్ మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది పండ్లలో నారింజ ద్రాక్ష అరటితోపాటు బెర్రీలు అన్నింటిలోనూ పోలిక్ యాసిడ్ ఆపారంగా దొరుకుతుంది శనగలు సోయాబీన్స్ రాజ్మా కిడ్నీ బీన్స్ వైట్ బీన్స్ లో కూడా ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. బాదం వాల్ నట్స్ లాంటి గింజలలోనూ ఉంటుంది పోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ ధాన్యాలు కూడా మంచివే గర్భధారణ తర్వాత కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి రెండు నెలల ముందు నుంచే పోలిక్ ఆసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలి అప్పుడే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో పుడతారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

కళ్ళు తిరగడం రక్తం తక్కువ ఉండడం ఎలాంటి ఆహారం తీసుకోవాలి

 70 ఏళ్ల వయసున్న వ్యక్తికి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది రక్తం తక్కువగా ఉందని కూడా అంటున్నారు అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి

తలా కళ్ళు ఎప్పుడు తిరుగుతున్నట్లు అనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు రక్తంలో గ్లూకోజ్ తగ్గడం నీరు తక్కువగా తాగడం మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం నిద్ర సరిగా పోకపోవడం కూడా ఇలా తల తిరగడం జరగవచ్చు ఆహారం మితంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజు తగ్గిపోకుండా చూసుకోవచ్చు పండ్లు కాయగూరలు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి ఆయా కాలాలలో వచ్చే అన్ని పనులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి కాఫీ టీలు పూర్తిగా మానేయాలి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పాలు పెరుగు గుడ్లు మాంసం చేపలు పప్పులు వీటిల్లో ఏదో ఒకటి ప్రతిరోజు తీసుకోవాలి నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలి ఆందోళన తగ్గి విశ్రాంతిగా ఉండడానికి ఏవైనా వ్యాపకాలు అలవాటు చేసుకోవాలి. తగినంత నిద్రకూడా తప్పనిసరి శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే రక్తహీనత వలన కూడా కళ్ళు తిరిగే అవకాశం ఉంది రక్తహీనత నుండి బయటపడడానికి వైద్యులు సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లను వాడడం ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే నల్ల సెనగలు అలసందలు సోయాచిక్కుడు గింజలు మాంసం ఆకుకూరలను చేర్చుకోవడం ముఖ్యం మీ సమస్య ఆహారానికి సంబంధించినది కానప్పుడు వైద్యుల సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి

రక్తంలో పొటాషియం అధికంగా ఉంటే

 28 సంవత్సరాల వయసున్న వ్యక్తి రక్త పరీక్షలలో పొటాషియం అధికంగా ఉందని తెలిసింది అరటిపండు టమాటా వంటివి మానేయాలని సూచించారు ఆహారంలో ఇంకెటువంటి మార్పులు చేసుకోవాలి

పొటాషియం శరీరం సరిగా పనిచేయడానికి అవసరమైన ఒక ఖనిజం ఇది ఒక రకమైన ఎలక్ట్రోలైట్ ఇది నేరాలు కండరాలు సక్రమంగా పనిచేయడానికి హృదయ స్పందన సక్రమంగా ఉండడానికి సహాయపడుతుంది కణాలలోకి పోషకాలను కణాల నుండి వ్యర్ధ ఉత్పత్తులను తరలించడానికి కూడా సహాయపడుతుంది రక్తపోటుని నియంత్రించేందుకు కూడా పొటాషియం అవసరం కిడ్నీల పనితీరు సక్రమంగా లేకపోవడం వలన రక్తంలో పొటాషియం పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని రకాల మందుల వాడకం వలన కూడా రక్తంలో పొటాషియం పెరిగే అవకాశం ఉంది ఆకుకూరలు తాజా కాయగూరలు అరటి పండ్లు బంగాళదుంప పాలకూర బ్రకోలి, టమాట కొబ్బరి నీళ్లు పాలు పెరుగు అన్ని రకాల పప్పు ధాన్యాలు బాదం అక్రూట్ వంటి గింజలు మొదలైన వారిని పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు వీటిని చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం లేదా మానేయడం చేయవలసి ఉంటుంది బెర్రీ ద్రాక్ష పండ్లు కమలా పండ్లు పరిమిత మోదాతులు పుచ్చకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కజొన్న దోసకాయ వంకాయ ఉల్లి ముల్లంగి మొదలైన వాటిలో పొటాషియం కొంత తక్కువగా ఉంటుంది ఒకవేళ మీకు కిడ్నీలకు సంబంధించిన అనారోగ్యం ఉంటే రీనల్ డైటీషియన్ సలహా మేరకు ఆహారం తీసుకోవడం ఉత్తమము

కృత్రిమ తీపి కారకాలు మంచివేనా

 చక్కెరకు ప్రత్యామ్నాయలుగా మార్కెట్లో లభిస్తున్న స్టీవియా షుగర్ ఫ్రీ తదితర కృత్రిమ తీపి కారకాలను ఆర్టిఫిషియల్ స్వీట్ అనర్స్ రోజు కాఫీ టీ లలో వాడడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా

మామూలు చక్కెర బెల్లం తేనె వంటి తీపి పదార్థాలలో ఉండేటటువంటి పిండి పదార్థాలలో క్యాలరీలు అధికంగా ఉంటాయి పైగా అవి రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని పెంచుతాయి కూడా కృత్రిమ తీపి కారకాలలో కేలరీలు చాలా తక్కువ రక్తంలో గ్లూకోస్ ను కూడా పెంచవు చక్కెరతో పోలిస్తే ఈ కృత్రిమ తీపికా రకాలు తక్కువ మోతాదులు మోతాదుల్లో కూడా ఎక్కువ తీయదననిస్తాయి కాబట్టి మితంగా వాడిన తీపి సరిపోతుంది. ఆస్పార్టెం సాకారన్ సుక్రాలోస్ స్టీవియా మొదలైన కృత్రిమతి తీపి కారకాలు మార్కెట్లో లభిస్తున్నాయి

ఇది కొన్ని రకాల జన్యుపరమైన వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు వారు కేవలం వైద్యుల సలహాతో మాత్రమే వీటిని వాడాలి మిగిలిన వారు టీ కాఫీ ఇంట్లో తయారు చేసే చరితీళ్లు స్వీట్లు మొదలైన వాటిలో ఈ కృత్రిమ తీపి కారకాలు వాడవచ్చు కానీ మోతాదు మించకూడదు ఒక్కొక్క రకమైన కృత్రిమ తీపి కారకానికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది దానిని మించకుండా వాడవచ్చు స్వీట్లు చర్చిళ్ళు కేవలం వాటిలోని చక్కెర వలన మాత్రమే కాక వాటిలోని కొవ్వు పదార్థాలు పిండి పదార్థాల వల్ల కూడా క్యాలరీలు ఎక్కువగా కలిగి ఉంటాయి అందువల్ల చక్కెర ప్రత్యామ్నాయలు వాడినంత మాత్రాన స్వీట్లు ఆరోగ్యకరమైనవిగా మారిపోవు ఎప్పుడైనా ఎటువంటి ఆహారమైన ఎవరైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

కూరగాయలు ఎలా తినాలి

 కూరగాయలలో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కాబట్టే వాటిని తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అలాకాని పక్షంలో తినాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే తింటాము అందుకే అన్నంతో సమానంగా కూరగాయలు తినమని చెబుతారు ఇలా తినడం అనేది బరువు తగ్గేందుకు కొలెస్ట్రాల్ కరిగించుకునేందుకు బీపీ డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడుతుంది కూరగాయల్లో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి విటమిన్ ఏ ఈ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకుతాయి ఆకుకూరలు కూరగాయలు దుంప కూర లాంటివి అన్ని కూరలకి ఎందుకే వస్తాయి అందులోనూ ఆకుకూరల్ని వారానికి మూడుసార్లు అయినా తినవలసింది మైక్రో గ్రీన్స్ బేబీస్ పీనచ్ లాంటివి సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు ఆకుకూరలను ఊరికే పోపు పెట్టి అయినా పచ్చకూరలా వండుకోవచ్చు పప్పులోను వేసుకోవచ్చు మిర్యాల పొడి చల్లి కాస్త నూనె వేసి తినొచ్చు. గుమ్మడి టమాట లాంటిది వెజిటబుల్ సూప్ చేసుకోవచ్చు. కూరల్లో ఉల్లి వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది వెజిటబుల్ ఫ్రై అనే ఒక పద్ధతి ఉంది అంటే కూరగాయల్ని కాస్త ఉడికించి తీసి బాండ్లలో కొంచెం నూనె వేసి కాస్త వేయించి తినడం లేత చిక్కుళ్ళు క్యాబేజీ ఆలుగడ్డ సొరకాయ బీరకాయ ఇలా కూరగాయలు చేసుకోవచ్చు అందుకే దీనిలో ఉడకబెట్టిన శనగలు ఎక్కువ సోయా లాంటిది జోడించి చేస్తే బాగుంటుంది, కూరలు తినలేకపోతే వెజిటేబుల్ ప్యూరీలు చూపులు కూడా ప్రయత్నించవచ్చు అన్నంతో ఇష్టం లేకపోతే వామాకు మెంతి క్యారెట్ లాంటి వివిధ ఆకుకూరలు కూరగాయలతో పరాటాలు చేసుకుని తినవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది వీటిలో నచ్చిన పెంచుకోవచ్చు

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి

 రోజు యోగా చేసిన సరైన ఆహారం తీసుకున్న కూడా బరువు తగ్గి పొట్ట తగ్గకపోతే పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి

పుట్ట చుట్టూ కడుపులోని అవయవాలపై పేరుకొనే కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు చర్మం కింద పేర్కొనే కొవ్వును సబ్ క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు విసరల్ ఫ్యాట్ అధికంగా ఉండడం వల్ల వివిధ రకాల జీవనశైలి వ్యాధులు వస్తాయి ముఖ్యంగా మధుమేహం ఫ్యాటీ లివర్ గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరుగుతుంది పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఆహారంలో జీవన శైలిలో మార్పులు తప్పనిసరి అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం మైదా పాలిచ్చేసిన బియ్యం చక్కెర బెల్లం లాంటి తీపి పదార్థాలు నూనెలో వేయించిన ఆహారం మొదలైనవి తీసుకోవడం వలన వేల కాని వేళ భోం చేయడం రాత్రిపూట అధికంగా ఆహారం తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం తదితరాల వలన ఇలా పొట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలిp నూనెలో వేయించినవి క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి ప్రతిరోజు కనీసం అరగంట పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్రమంగా పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వును తగ్గించుకోవచ్చు బరువు తగ్గే కొద్ది శరీరంలోని కొవ్వు అన్ని భాగాల నుంచి కొద్దికొద్దిగా తగ్గుతుంది అందువలన పొట్ట తగ్గుతుందో లేదో తెలుసుకోవడానికి రెండు వారాలకు ఒకసారి నడుము కొలత తీసుకోవాలి యోగ నడకబండి తేలికపాటి గాయమాలతో నెలకు 1:30 నుంచి 2 1/2 సెంటీమీటర్ల మేరకు మాత్రమే నడుము కొలత తగ్గుతుంది పొట్ట చుట్టూ కొవ్వు పేరు కోవడానికి సమయం పట్టినట్టే తగ్గడానికి అధిక సమయం పడుతుందని గ్రహించాలి



వడియాలు అప్పడాలలో ఉండే ఆహార ప్రయోజనాలు

 వడియాలు అప్పడాలు మొదలైనవి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. వీటి వల్ల ఆహార ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే వడియాల్లో వివిధ రకాలు ఉన్నాయి. తయారీకి వాడే పదార్థాలను బట్టి వాటిలో పోషకాలు కూడా ఉంటాయి గుమ్మడి బూడిద గుమ్మడి రేగు మొదలైన వాటితో పెట్టే వడియాలలో కొంచెం విటమిన్ ఏ పీచు పదార్థాలు ఉంటాయి. సగ్గుబియ్యం బియ్యం పిండితో చేసే వడియాల్లో పిండి పదార్థాలు తప్ప వేరే పోషకాలు ఉండవు మినప్పిండితో చేసే వడియాలు అప్పడాలలో కొద్దిగా పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు కొన్ని బి విటమిన్లు పీచు పదార్థాలు కూడా ఉంటాయి అయితే ఎటువంటి వడియాలైనా అప్పడాలైనా నూనెలో వేయించి మాత్రమే తింటాం కాబట్టి వీటిలో కొవ్వు పదార్థాలు క్యాలరీలు రెండు అధికమే కేవలం రుచి కోసం అప్పుడప్పుడు పరిమిత మోతాదులో తీసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ఈరోజు వారి ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే అనవసరమైన క్యాలరీలు ఎక్కువ బరువు పెరగడం కొద్ది మందిలో కొలెస్ట్రాల్ పెరగడం లాంటి పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా బీపీ ఉన్నవారు రోజు వడియాలు తీసుకున్నట్లయితే అవసరానికి మించి సోడియం ఆహారం ద్వారా చేరి బీపి నియంత్రణ కష్టమవుతుంది



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...