Thursday 21 March 2024

సరైన దంతసిరికి ఏమి చేయాలి

 ప్రతి మనిషి వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే దంతాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పంటి చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి భరించలేని నొప్పితో పాటు శాశ్వతంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ప్రకారం మనదేశంలో 95% మంది ఏదో ఒక రకమైన చిక్కుళ్ళ సమస్యతో బాధపడుతున్నారు 15 ఏళ్లలోపు పిల్లల్లో కనీసం 70 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు ఇవి

పిల్లలకు స్వీట్లు పండ్ల రసాలు తక్కువగా ఇవ్వాలి ఏదైనా తీపి పదార్థం ఇవ్వాలనుకుంటే దాన్ని భోజనం సమయంలో ఇవ్వడం వల్ల నేరుగా పళ్ళ మీద ప్రభావం ఉండదు

నిద్ర లేచాక బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడం దురలవాటు దానివల్ల క్రమంగా దంతాలు తీవ్రంగా దెబ్బతింటాయి

బ్రష్ చేయడం వల్ల దంతాలు 60 శాతం వరకు శుభ్రం అవుతాయి దంతాల మధ్య గారాని శుభ్రం చేసే ఫ్లాసింగ్ వల్ల నోటిలోని బాక్టీరియా తగ్గుతుంది

సెన్సిటివ్ దంతాలు ఒక సమస్య మాత్రమే కాదు పళ్ళు దెబ్బతింటున్నాయి అని ఎందుకు సూచన కూడా ప్రత్యేకమైన పేస్టు వాడితే సరిపోదు దంత వైద్యుడిని సంప్రదించాలి


No comments:

Post a Comment