29, జులై 2016, శుక్రవారం

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు. / PAGATI NIDRA - RATHRI DUTIES - HEALTH TIPS

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు.

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం 5,6 ఏళ్ళ పాటూ రాత్రిళ్ళు మేల్కొని పని చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ప్రకృతికి ఇలా విరుద్ధంగా జీవించటాన్ని సర్కాడియన్ రిథం డిస్రప్షన్ అంటారు .పాతికేళ్ళకు పైగా నైట్ డ్యూటీలు చేస్తున్నవాళ్ళు ఉన్నారు,వాళ్ళలో చాలామందికి పగటి డ్యూటీ వేస్తే చేయలేనంతగా రాత్రి డ్యూటీకి అలవాటు పడిపోయి ఉంటారు.కొన్ని తరాలపాటూ ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చు కూడా.వీళ్ళు ఒక సామాజిక అవ్యవస్థకు / సోషల్ జెట్ లాగ్ గురవుతుంటారు.స్త్రీలలో ఈస్ట్రోజన్ లాంటి పునరుత్పాదక హార్మోనుల ప్రభావం తోడవడం వల్ల , నడివయస్సు దాటిన వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మన అవసరాలు గడవడం కోసం , బాహ్య ప్రకృతిని, పర్యావరణాన్నే కాకుండా , మన శరీర ప్రకృతులను కూడా మనం విధ్వంసం చేస్తున్నాము.అతిగా నిద్ర మేల్కోవడం వల్ల బుర్ర పని చేయడం తగ్గిపోతుంది.పనిలో నాణ్యత పడి పోతుంది.మనిషి పక్షవాతానికి, బీపీ,గుండె జబ్బులు,షుగరు,జీర్ణకోశవ్యాధులకు,కీళ్ళవాతానికి లోనవుతాడు.చీకట్లో మెలకువ, పగలు నిద్ర ప్రకృతి విరుద్ధాలే.తప్పనిసరిగా పనిచేసినపుడు శరీరంలో వాతం,వేడి పెరిగిపోతాయి.కావున ఆహారపదార్థాల ద్వారా వాతాన్ని తగ్గించి,చలువ చేసే వాటిని తీసుకోవాలి.రాత్రి జాగరణవల్ల వాతం వికారం చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.ఇది పక్షవాతానికి కారణంకూడా కావచ్చని తాజా పరిశోధన తెలుపుతోంది.కాబట్టి చలువ చేసే ఆహారపదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి.పులుపులేని కూరగాయలు,ఆకుకూరలు అన్నీ మేలు చేస్తాయి.కానీ వాటిని అతిగా చింతపండుతోనో ,అల్లం వెల్లుల్లితోనో ,శనగపిండితోనో,నూనెతోనో వండినందువల్ల వేడి , వాతం చేసేవిగా మారిపోతాయి.

ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి,ఒక ఆపిల్ / లెద పులుపు లేని ఒక పండు  ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగాలి.వాతం , వేడి తగ్గుతాయి.శరీర అనుకూలత సాధించుకోవటానికి , వాతహరంగా, వేడిని రూపు మాపేదిగా ఉండే ఆహార పదార్థాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. బూడిద గుమ్మడిని సోరకాయా పద్ధతిలో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.ఇది శరీరంలో నిద్రలేమి వల్ల కలిగే అలసటను పోగొడుతుంది.మర్నాడు నిద్రచాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.బార్లీ జావ , సగ్గు బియ్యం జావ , స్బజా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి నైట్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి.అలసటను నివారిస్తాయి.
పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి.రకరకాల కూరగాయల ముక్కలు వేసి చేసిన పెరుగు పచ్చడి జీర్ణకోశాన్ని బల సంపన్నం చేస్తుంది.ధనియాలు, జిలకర,శొంఠి లను సమానంగా తీసుకొని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకొని , కొద్దిగా ఉప్పు వేసుకొని రోజూ ఒకటి రెండుసార్లు తాగాలి.

పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ఏమీ తినకుండా పడుకొని నిద్రపోవడం మంచిది.రాత్రి 10 గంటల తర్వాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఇలాగే ఉదయం నిద్రపోతే నిద్రలేమి రాదు అని సుశ్రుతుడు చెప్పడం జరిగింది.పచ్చళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి.మద్యం,సిగరెట్లు వాడడం రాత్రి డ్యూటీలు చేసేవారిలో అనారోగ్యాన్ని వేగవంతం చేస్తుందని గ్రహించాలి.

19, జూన్ 2016, ఆదివారం

లడ్డూలు - ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలుLADDOOLU AYURVEDA AROGYA PRAYOJANALU.


లడ్డూ అంటే తెలుగువారికెంతో భక్తి ,పవిత్రం , శుభం.ఇవి మన సంస్కృతిలో ఒక భాగం.సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం.లడ్డూ చేసుకోవడం అంటే తెలుగు వారికి పండగ చేసుకోవడమే.పెళ్ళిళ్ళలో తొలి వడ్డన లడ్డు.తిరుపతి లడ్డు లాగా బందరు లడ్డు / తొక్కుడు లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది.

లడ్డూలను శనగపిండితోనే చేయాలని నియమం ఏమీ లేదు.సున్ని ఉండలు , కొబ్బరి ఉండలు ,నువ్వుండలు ఇవన్నీ లడ్డూలే.మహారాష్ట్ర , బెంగాళీల ప్రభావంతో స్వాతంత్రోద్యమ కాలంలో శనగ పిండి వంటకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి.అంతకు పూర్వం మినప,జొన్న,సజ్జ,వరి ,గోధుమ,ధాన్యం వంటి చిరుతిళ్లన్నీ వండుకునే వాళ్లు.ఇటీవలి కాలంలో శనగ పిండి వాడకం వేలం వెర్రి అయింది.లడూకి ఆ రుచినిస్తుంది శనగ పిండి మాత్రమే కాదు అందులో చేర్చిన నెయ్యి , పటిక బెల్లం,పచ్చ కర్పూరం,జీడి పప్పు , కిస్మిస్ , యాలకులూ వగైరా.ఇవి సమృద్ధిగా ఉంటే ఏ పిండితో చేసినా రుచిగానే ఉంటాయి.

" ద " అనే అక్షరంలో ఉండే చిర్రి శనగలు లేదా దేశవాళీ శనగలతో చేసినదైతే శనగ పిండి మంచిదే.శనగ పప్పుని మర పట్టించిన శనగ పిండిని వాడుకోవడం మంచిది.బలకరం,కానీ కష్టంగా అరుగుతుంది.జీర్ణశక్తి బలకరంగా లేనివారికి అపకారం చేస్తుంది.పర్వతాలు ఫలహారం చేయగలవారికి శనగ పిండి మేలు చేస్తుంది.శనగ పిండి తిని తట్టుకోగలగాలి.అంతేకాని శనగ పిండి మంచిది కాదు అని ముద్ర వేయడం సరికాదు.

బొంబాయి రవ్వతో ఆయుర్వేద , ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ? BOMBAYI RAVVATO AYURVEDA AROGYA PRAYOJANALU EMITI?


బొంబాయి రవ్వను గోధుమల్లోంచే తయారు చేస్తారు.మెత్తగా పిండి చేస్తే అదే మైదా పిండి అవుతుంది.రవ్వగా పట్టిస్తే అది బొంబాయి రవ్వ అవుతుంది.గోధుమ రవ్వను రవ్వ గోధుమల నుండి తీస్తారు.రెండూ వేర్వేరు గోధుమలు.గోధుమ రవ్వలో కేలొరీలు తక్కువ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి.బొంబాయి రవ్వకన్నా గోధుమ రవ్వ మేలైనది.చక్కెర వ్యాధిలో కూడా తినదగినదిగా ఉంటుంది.బొంబాయి రవ్వ ఆకలిని , జీర్ణ శక్తిని చంపుతుంది.కడుపులో ఆంలాన్ని పెంచుతుంది.వేడి చేస్తుంది.కాబట్టి పరిమితంగా వాడుకోవాలి.

మనకు గోధుమ పిండి , గోధుమ రవ్వ తెలిసినంతగా బొంబాయి రవ్వ తెలియదు.కొందరు దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు.జొన్న రవ్వ , గోధుమ రవ్వ , బియ్యపు రవ్వలతో చేసే వంటకాలన్నీ బొంబాయి రవ్వ వంటకాలుగా మారిపోయాయి.ఉప్పుడు రవ్వ స్థానం లో బొంబాయి రవ్వ ఇడ్లీ వచ్చింది.గోధుమ పిండితో చేసే హల్వా స్థానంలో కేసరి వచ్చింది.బియ్యపు రవ్వ ఉప్మా స్థానే బొంబాయి రవ్వ ఉప్మా ,జొన్న రవ్వ లేదా గోధుమ రవ్వతో చేసే కిచిడీ స్థానే బొంబాయి రవ్వ కిచిడి ఇలా వంటకాలు బొంబాయి రవ్వ పార్టీలోకి వెళ్ళిపోయాయి.సజ్జ అప్పాలను సజ్జ రవ్వతో చేసే వాళ్ళు ఇప్పుడు బొంబాయి రవ్వతో చేస్తున్నారు.బొంబాయి రవ్వ పూర్ణాలు ,బొంబాయి రవ్వ ఉప్మా బోండాలు , రవ్వ దోశెలు ,రవ్వ లడ్డూలు ఇలా ఒకటేమిటి వంట గదిలో బొంబాయి రవ్వ ఉంటే ఇంకేమి అక్కర్లేదన్నంతగా పరిస్థితి మారిపఒయింది.ఉపయోగం తక్కువ , అపకారం ఎక్కువ ఉండేదే బొంబాయి రవ్వ.

అట్టు,చపాతి,పుల్కా,పూరి ,వీటిలో ఏది మంచిది? /ATTU ,CHAPATHI , PULKA ,POORI MANCHIDHA?POORI ,VEETILO EDI MANCHIDHI?

మంచి చెడు అనేవి అట్టులోనో ,పూరీలోనో ఉండవు.ఏ ఆహర పదార్థమైనా దాని తయారీలో కలిపిన ద్రవ్యాలు ,వాటిని వండే తీరును బట్టి ఉంటాయి.చపాతీని గోధుమ పిండితో చేసి ,కుర్మాతో తినాలని,పూరిని ఆలుగడ్డ కూరతోనే తినాలనీ, పుల్కాలను పాలక్ పనీర్ , మిక్ష్ డ్ వెజిటబుల్ కర్రీ లంటి వాతితో తినాలని నియమాలు పెట్టుకున్నది మనమే.ఇడ్లీ ,అట్టు ,పూరీల్లాంటివి విందు భోజనాల్లో వడ్డించేందుకే గాని , ఇలా ఉదయం పూట పెరుగన్నానికి బదులుగాను,రాత్రి పూట ఉపాహరంగాను తినటానికి  ఉద్దేశించినవి కాదు.ఉత్తరాది వారు రోటీలు తింటారు.మనం రోటీలు , అన్నం రెండూ తింటాం,అదీ తేడా.
అట్టు లేదా దోసెలను మినప పప్పు,బియ్యం రుబ్బి తయారు చేస్తారు.రెండూ ఎక్కువ కెలొరీలను పెంచేవే.చపాతీలను ,రాగులు,జొన్న,సజ్జలతో కూడా చేసుకోవచ్చు.ఆరోగ్యానికి మంచివి.నంజుకునేందుకు అన్నంలోకి తయారు చేసుకున్న కూర ,పప్పు లాంటివి మంచివి.
వొంటి పొర మీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద వత్తితే దౌపాతి ,మూడు పొరల మీద వత్తితే త్రిపాతి, నాలుగు పొరల మీద వత్తితే చపాతి అంటారని పరిశోధకులు భావిస్తున్నారు.పొరల మధ్య నూనె ఎక్కించి చపాతీలు తయారు చేస్తారు.నూనె లేకుండా నాలుగు మడతలు వేసి వత్తినందువల్ల అది మందపాటి రొట్టె అవుతుంది అంతే.కావున పూరీలు ,చపాతీలు నూనెకు నిలయాలుగా ఉంటాయి.వాటిని సరదాగా అప్పుడప్పుడు మాత్రమే తినటం మంచిది.చక్కగా విశ్లేషిస్తే పుల్కానే మంచిది అని చెప్పవచ్చు.

18, జూన్ 2016, శనివారం

మొలకెత్తిన పెసర్లతో ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు. / MOLAKETTHINA PESARLATHO AYURVEDA AAROGYA PRAYOJANAALU.....


పోషకాలు అందించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో పెసర్లు ముఖ్యమైనవి.పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసర్లలో విటమినులు , ప్రొటీనులు ,ఖనిజ లవణాలు,ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.మొలకెత్తిన పెసర్లతో చాలా ప్రయోజనాలు ఉంటాయి.

1 . వీటిలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకు , కొవ్వు కరిగించేందుకు చెడు కొలెస్టరాల్ ను నిర్మూలించేందుకు దోహదపడుతుంది.

2 .వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువగా తిన్న భావన కలుగుతుంది.అందువల్ల మాటిమాటికి ఆకలి వేయదు.క్రమంగా ఒక మంచి డైట్ విధానం అలవడుతుంది.

3 .పెసర్లను మొలకెత్తిన గింజల రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.

4 .విటమిన్ ఏ,బి,సి,డి,ఇ,కె,థయమిన్,రిబోఫ్లావిన్,ఫోలిక్ ఆసిడ్స్,మొలకెత్తిన పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి ఉపయోగపడతాయి.

5 . దృష్టి సంబంధ సమస్యలు కూడా నయమౌతాయి.గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.

6 . రక్తహీనత సమస్య తొలగిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.రక్తంలఒని చక్కెర స్థాయులను తగ్గించే గుణం వీటిలో ఉంటుంది.

7 .యాంటి ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి.ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి.

8 . శరీరంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ లను తొలగించే యాంటి ఆక్సిడెంట్ గుణాలు పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి కణజాల నాశనాన్ని అడ్డుకుంటాయి .

17, జూన్ 2016, శుక్రవారం

అంజూర ఆకులతో గ్రీన్ టీ



అంజూర ఆకులతో గ్రీన్ టీ!

ఆరోగ్యదాయకమైన గ్రీన్ టీని
తయారు చేసుకోవడానికి కుండీల్లో
పెంచుకునే వివిధ మొక్కల ఆకుల
పొడి శ్రేష్టమని నిపుణులు చెబుతు
న్నారు. తులసి, మునగ, స్టీవియా
ఆకుల పొడితో టీ తయారు చేసుకో
వడం తెలిసిందే. అదే జాబితాలో
అంజూర కూడా చేరింది. అంజూర ఆకుల టీ తాగితే మధుమేహం,
రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
పెద్ద ఆకులను కోసి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన ఆకు
లను నలిపి పొడి చేసి పెట్టుకోవాలి. లీటరు నీటిలో రెండు చెంచాల
పొడిని వేసి 15 నిమిషాలు.. నీరు సగం ఆవిరయ్యే వరకు మరగబెట్టి..
వడకడితే టీ సిద్ధమైనట్లే. ఇలా తయారు చేసుకున్న టీని ఫ్రిజ్ లో నిల్వ
ఉంచుకొని కూడా వాడుకోవచ్చు.

29, మే 2016, ఆదివారం

చిరుధాన్యాలు - ఆరోగ్యానికి రక్ష





 పెను సవాలు విసురుతోంది నీటి
సమస్య దైనందిన జీవితంలో సగటు మానవుడు సుమారు 4వేల లీటర్లకు పైగా
నీటిని పరోక్షంగా వినియోగించుకుంటున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
మొత్తంగా ఒక కేజీ బియ్యం మన ముందు ప్రత్యక్షమయ్యేందుకు 3వేల లీటర్లు
ఖర్చవడమే అందుకు ఉదాహరణగా సూచిస్తున్నారు. అంతేకాదండోయ్ ప్రపం
చానికి చెమటలు పుట్టిస్తోన్న నీటి సమస్యను చిరుధాన్యాలతో జయించవచ్చని
సూచిస్తున్నారు. వరితో పోల్చితే మూడో వంతుకన్నా తక్కువ నీరు తీసుకొని
దిగుబడినిచ్చే గోదుమ, జొన్న, సజ్జలు, కొర్రలు వంటి పంటలకు జైకొట్టాలని నిపు
ణులు సూచిస్తున్నారు. వీటితో చక్కటి ఆరోగ్యం కూడా సాధ్యమవుతుందని ఉస్మా
నియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన పురాతన విత్తన ప్రదర్శన
చాటి చెప్పింది. రైతు స్వరాజ్ వేదిక ఇక్కడి దూరవిద్య కేంద్రంలో ఏర్పాటుచేసిన
మూడు రోజుల ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల రైతులు వారి వారి సేంద్రియ పంట
లను, పురాతన విత్తనాలను ఉంచి నేటి తరాన్ని మేల్కొలుపుతున్నారు.
కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు,
బరిగెలు, సజ్జలు, జొన్నలు, రాగులు,
అందుకొర్రల వంటి అనేక రకాల చిరు
ధాన్యాతో చేసిన వంటలే గతంలో
ప్రధాన ఆహారం సంగటి, అంబలి,
రొట్టెలు తిని నాటి ప్రజలు ఎంతో ఆరో
గ్యంగా, ద్రుఢంగా జీవించారని ఇప్ప
టికీ పెద్దలు చెబుతుంటారు. హరిత
విప్లవంలో భాగంగా వరి పంటకు
ప్రాధాన్యం పెరగడం, దాని పోషణకు
సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహ
కాలు, ఎరువులకు రాయితీలు ఇవ్వ
డంతో చిరుధాన్యాలను పండించే
రైతులు తగ్గిపోతూ వచ్చారు. రాగులు,
జొన్నలు, సజ్జలు తప్ప మిగిలిన ధాన్యాలను నేటి తరానికి చూపించలేని పరిస్థితి
వచ్చింది. ఇక నేడు విపరీతమైన ఆహార అలవాట్ల కారణంగా ఎక్కువ శాతం
ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా మధుమేహం, హృద్రోగం,
అధిక బరువు వంటి రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇంటి భోజ
నంలో రాజుల్లా మెలిగిన చిరుధాన్యాలు లేకపోవడమే దీనికి కారణం. ఏదిఏ
మైనా పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంకప్పుడు అలవాటుపడిన నేటి తరం మళ్లీ నాటి
వంటలవైపు మొగ్గుచూపుతోంది. అనేకమంది ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు
వీటిని తీసుకుంటున్నారు. మార్కెట్లోనూ చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోం
ది"అని రైతు స్వరాజ్ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశాలత చెబుతున్నారు.
ఎంత నీరు అవసరమంటే
• కేజీ బియ్యం ఉత్పత్తికి 3000
లీటర్ల నీరు
• కేజీ గోధుమల ఉత్పత్తికి 1,350
లీటర్ల నీరు
• కేజీ జొన్నలకు 900లీటర్ల నీరు
•కేజీ సజ్జలకు 850లీటర్ల నీరు

గుండె సమస్యలు - ఆయుర్వేదం


గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్త
నాశాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి
ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స,
ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి.
- వి. పట్టాభిరామ్, విజయనగరం
గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయ
బద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవి
తాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి.
1.దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2.
దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూ
డదు. 3. ఈ కండరానికి 'కొరనరీ ధమనుల ద్వారా రక్తప్రసరణ
జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4.
కొన్ని సూక్ష్మక్రిములు గుండె పారలను, కవాటాలను పాడు
చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు.
అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి
లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.
హార్ట్ ఎటాక్ లో గుండెకు జరిగే రక్తప్రసరణలో
అంతరాయం
కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా
నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు
ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం
సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల
ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ
ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి
కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసా
గిస్తే హార్ట్ ఎటాక్లు నివారితమవుతాయి.
నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన
అంశం.
ఆలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు.
ఆహారం: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణం
లోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదాఆర్థాలు
తీసుకోడానికి, తగినంత నీరు తాగ 
డానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో 
అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త 
తీసుకోవడం, చక్కెర పదార్థాలు, కొవ్వులు
ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్
పుడు, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు
పాటించాలి.
విహారం: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి
తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే
అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో
రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి.
పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు
ఔషధాలు: అల్లం5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5. పసుపు ఐదు
చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం
కాచుకుని రోజూ 30మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడు
పున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా
పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరు
గుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ,
హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం
కావడం కూడా బాగా జరుగుతుంది.
మద్ది (అర్జున) చెట్టు 'తెలుపు, నలుపు' అని రెండు రకాలు.
తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు
కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు
మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు
ఉనల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు
రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది.
బజారులో లభించే మందులు: • ప్రభాకరవటి లేదా నాగార్జునాష్ట్ర
రస మాత్రలు ఉదయం 1,
రాత్రి 1 వాడాలి - త్రిఫలా చూర్ణం 5
గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి.

28, మే 2016, శనివారం

ఇడ్లీలు తినడం మంచిదేనా?

ఇడ్లీలు తినటం మంచిదేనా?
* ఇడ్లీల్ని మన పూర్వులు ఇద్దెనలు' అని పిలిచేవారు.
వాటిని తీపి వంటకంగా కూడా చేసుకునే వాళ్లు, పంచదార
పాకంలో నానబెట్టుకుని తినేవాళ్లు కూడా! అల్లప్పచ్చడి, శనగ
చట్నీ సాంబారులతో మాత్రమే తినాలనే విధానం తెలుగువారిది
కాదు. ఉడిపి కాఫీ హోటళ్ల పుణ్యమా అని, మొత్తం దక్షిణ భారతదే
శంలోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వంటకం అయ్యింది. ప్రొద్దునపూట
చలిది అన్నం వదిలేసి, ఐదులుగా టిఫిన్ చేయటం అలవాటయ్యింది.
అట్టు, బజ్జీ, పునుగు, పూరీల్లా నూనె పదార్థం కాదు కదా... ఇడ్లీ 'సేఫ్
పుది అనడానిక్కూడా వీల్లేదు. కొబ్బరి శనగ చట్నీ, నెయ్యీకారప్పొడి,
సాంబారు, అల్లం పచ్చడి వీటి వలన కడుపులో ఆమ్లసముద్రా
లేర్పడి, అల్సర్లు పెరుగుతాయి. వీటితో ఇడ్లీ తిని వెంటనే కాఫీ
తాగితే కడుపులో పాలు విషపదార్థాలుగా మారిపోతాయి.
ఇద్దెనల కన్నా ఆవిరి కుడుములే కొంతలో కొంత మేలు. మినప్పప్పులో
కొద్దిగా బియ్యం, కాసిన్ని మెంతులు
వేసి రుబ్బి పూటే ఇద్దెను వేసుకుంటే
దాన్నే ఆవిరికుదుములంటారు. బడికి
వెళ్లే పిల్లలకు, వయోవృద్ధులకు ఇవి
ఎక్కువ శక్తిదాయకంగా ఉంటాయి.
వాతాన్నీ, వేడిని తగ్గిస్తాయి. అన్ని
వ్యాధుల్లోనూ పెట్టదగినవిగా
ఉంటాయి. బలహీనంగా ఉన్న
వారికీ, చిక్కి శల్యమై పోతున్న వారికీ మేలు చేస్తాయి. స్థూలకాయం, షుగరు
వ్యాధి ఉన్న వారిక్కూడా పెట్టవచ్చు. ఇందులో అల్లం, మిరియాలు, కొత్తిమీర
లాంటివి కూడా తగుపాళ్లలో కలుపుకుని వండుకుంటే తేలికగా అరుగుతాయి.

పచ్చళ్ళు తినవచ్చా ? తినకూడదా?

రోటి పచ్చళ్లు

వచ్చళ్లు తినవచ్చా తినకూడదా?
* పచ్చది లేకపోతే కడుపు నిండినట్టు అనిపించదు. నిండదు కూడా! పచ్చడి,
మన ప్రాచీన వంటకాల్లో ఒకటి. ఏరోజుకారోజు తినేందుకు చేసే పచ్చళ్లను రోటి
పచ్చళ్లంటారు. చింతపండు కలపకుండా చేసే రోటీ పచ్చళ్లు కూరతో సమానమైన
గుణ ధర్మాలు కలిగి ఉంటాయి. వంకాయ కూరకీ - వంకాయ పచ్చడికీ, బీర
కాయ కూరకీ - బీరకాయ పచ్చడికీ సమానంగానే ఉపయోగపడతాయి. రుచి
కావాలి. రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలంటే పచ్చళ్లని చక్కగా ఉపయో
గించుకోవాలి.
తొక్కు పచ్చడి, నంజుపచ్చడి, ముక్కల పచ్చడి, బజ్జీ పచ్చడి ఇలా పచ్చళ్లను
చాలా రకాలుగా చేస్తుంటారు మనవాళ్లు, ఎలా చేసుకున్నా అందులో అతి
పులుపు, అతి మషాలాలు లేకుండా తయారుచేసుకుంటే వేపుడు కూరల కన్నా,
పులుసు కూరల కన్నా ఈ పచ్చళ్లే ఆరోగ్యానికి మెరుగైనవి. ఆవకాయ, మాగాయ
లాంటి ఊరగాయల్లో లేని శాకాహార స్ఫూర్తి రోటీ పచ్చళ్లలో ఉంది. కాయగూ
రల్నీ, ఆకుకూరల్నీ అధికంగా తీసుకోవడానికి పచ్చడి ఒక మంచి అవకాశం.
వాటిని ముచ్చటగా తినాలి.

SHOBHI KI AHARA CHIKITHSA

శోభికి ఆహార చికిత్స

జీపుమీద, మెడమీద మచ్చలు పడ్డాయి. ఆహారం,
ఇతర జాగ్రత్తలు చేస్తారా?
• శోభి మచ్చల్ని పిటీరియాసిస్ వెర్సీకలర్ అనే వ్యాధిగా పీలు
స్తారు. నీడన ఉన్నప్పుడు లేత తేనె రంగులో ఉండి, ఎండలోకి వెళ్ళగానే
బాగా ముదురు గోధుమ రంగులోకి మారి కనిపిస్తాయి. కాబట్టి రంగు
మార్చుకునే వ్యాధి అనే అర్థంలో ఈ పేరుతో పిలుస్తారు. ఇది
వార్ణచందు మెడ, వీపు భాగాలలోనే ప్రధానంగా వస్తుంది. ఈ వ్యాధి బాగా
చెమట పట్టే ఉష్ణ స్వభావం ఉన్నవారిలో ఎక్కువ. ఒక్కొక్కసారి
మరీ ఎక్కువ చెమట పడితే పొట్టు లేస్తుంటుంది కూడా. అయోడిన్ టింక్చరని
దూదితో తడిపి ఈ మచ్చ మీద రాస్తే, మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇదే ఈ
వ్యాధికి మంచి పరీక్ష, ముగరు వ్యాధి, స్థూలకాయం, రక్తహీనత, అతిగా చెమటన
ట్టించే ఇతర వ్యాధుల్లో కూడా ఈ శోభి మచ్చలు రావచ్చు.
మందుల విషయం డాక్టర్లకు వదిలేయండి. శోభి మచ్చలు వచ్చిన వారు శరీ
రంలో వేడిని తగ్గించుకోవాలి. ఆ వేడిని చల్లార్చడానికి శరీరం ఎక్కువ చెమట
పట్టేలా చేస్తుంది. చెమ్మ వలన ఫంగస్ అనే బూజు జాతి శిలీంద్రాలు చర్మం మీద చేరి
శోళి, తామరలాంటి వ్యాధుల్ని తెస్తాయి. వేడి చేసే ఆహార విహారాలను తగ్గించుకుని
చలవ చేసే వాటిని ఆచరిస్తే చెమట
తగ్గుతుంది. పులుపు, అల్లం వెల్లుల్లి
మసాలాలు బాగా కలిపి వండిన
ఆహార పదార్థాలన్నీ వేడి చేసేవే!
ఊరుగాయలు, నూనె పదార్థాలు,
బిరియానీ, పలావు, పులిహోర
లాంటి పదార్థాలన్నీ వేడిచేస్తాయి.
వేడి చేసే శరీరతత్వం ఉన్నవారిని
మరింత ఇబ్బంది పెడతాయి. శోలి
తగ్గాలంటే, చలవ చేసేవి తినాలి.
పులుపు, మసాలాలు లేకుండా వండుకుంటే కూరగాయలన్నీ చలవ చేసేనని గుర్తిం
చండి. బూడిదగుమ్మడి బాగా చలవ చేస్తుంది. సబ్యాగింజలు,
బార్లీ గింజలు, నగు
బియ్యం, బాగా చిలికిన మజ్జిగ చెమటను తగ్గిస్తాయి. ఇలాంటి ఆహారం తీసు
కుంటూ, ఎంద నుండి రక్షణ ఉపాయాలు పాటిస్తే లోభి చాలా తేలికగా తగ్గుతుంది.
అది మొండి వ్యాధిగా మారితే తగ్గించటం కష్టం అవుతుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...