రోటి పచ్చళ్లు
వచ్చళ్లు తినవచ్చా తినకూడదా?
* పచ్చడిలేకపోతేకడుపునిండినట్టుఅనిపించదు.నిండదుకూడా! పచ్చడి,మన ప్రాచీన వంటకాల్లో ఒకటి. ఏరోజుకారోజు తినేందుకు చేసే పచ్చళ్లను రోటిపచ్చళ్లంటారు. చింతపండు కలపకుండా చేసే రోటీ పచ్చళ్లు కూరతో సమానమైనగుణ ధర్మాలు కలిగి ఉంటాయి. వంకాయ కూరకీ - వంకాయ పచ్చడికీ, బీరకాయ కూరకీ - బీరకాయ పచ్చడికీ సమానంగానే ఉపయోగపడతాయి. రుచికావాలి, రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలంటే పచ్చళ్లనిచక్కగాఉపయో
గించుకోవాలి.తొక్కు పచ్చడి,నంజుపచ్చడి,ముక్కలపచ్చడి, బజ్జీ పచ్చడి ఇలా పచ్చళ్లనుచాలా రకాలుగా చేస్తుంటారు. మనవాళ్లు, ఎలా చేసుకున్నా అందులో అతిపులుపు, అతి మషాలాలు లేకుండా తయారుచేసుకుంటే వేపుడు కూరల కన్నా,పులుసు కూరల కన్నా ఈ పచ్చళ్లే ఆరోగ్యానికి మెరుగైనవి. ఆవకాయ, మాగాయలాంటి ఊరగాయల్లో లేని శాకాహార స్ఫూర్తి రోటీ పచ్చళ్లలో ఉంది. కాయగూ
రల్నీ, ఆకుకూరల్నీ అధికంగా తీసుకోవడానికి పచ్చడి ఒక మంచి అవకాశం.వాటిని ముచ్చటగా తినాలి.