పోషకాలు అందించే ముఖ్యమైన ఆహారపదార్థాలలోపెసర్లు ముఖ్యమైనవి.పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసర్లలో విటమినులు , ప్రొటీనులు ,ఖనిజ లవణాలు,ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.మొలకెత్తిన పెసర్లతో చాలా ప్రయోజనాలు ఉంటాయి.
1 . వీటిలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకుకొవ్వు కరిగించేందుకు చెడు కొలెస్టరాల్ ను నిర్మూలించేందుకు దోహదపడుతుంది.
2 .వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువగాతిన్న భావనకలుగుతుంది.అందువల్లమాటిమాటికిఆకలివేయదు.క్రమంగా ఒక మంచి డైట్ విధానం అలవడుతుంది.
3 .పెసర్లను మొలకెత్తిన గింజల రూపంలో తీసుకోవడంవల్ల మలబద్ధకం తొలగిపోతుంది.
4 .విటమిన్ ఏ,బి,సి,డి,ఇ,కె,థయమిన్,రిబోఫ్లావిన్,ఫోలిక్ ఆసిడ్స్,మొలకెత్తిన పెసర్లలో ఎక్కువగాఉంటాయి.ఇవిశరీర పెరుగుదలకు,కణజాలాలనిర్మాణానికిఉపయోగపడతాయి.
5 . దృష్టి సంబంధ సమస్యలు కూడానయమౌతాయి.గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.
6.రక్తహీనతసమస్యతొలగిపోయిజీర్ణక్రియమెరుగుపడుతుంది.రక్తంలోని చక్కెర స్థాయులను తగ్గించే గుణం వీటిలో ఉంటుంది.
7 .యాంటి ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి.ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి.
8 . శరీరంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ లను తొలగించే యాంటి ఆక్సిడెంట్ గుణాలు పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి కణజాల నాశనాన్ని అడ్డుకుంటాయి .