Sunday 19 June 2016

బొంబాయి రవ్వతో ఆయుర్వేద , ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ? BOMBAYI RAVVATO AYURVEDA AROGYA PRAYOJANALU EMITI?


బొంబాయి రవ్వను గోధుమల్లోంచే తయారు చేస్తారు.మెత్తగా పిండి చేస్తే అదే మైదా పిండి అవుతుంది.రవ్వగా పట్టిస్తే అది బొంబాయి రవ్వ అవుతుంది.గోధుమ రవ్వను రవ్వ గోధుమల నుండి తీస్తారు.రెండూ వేర్వేరు గోధుమలు.గోధుమ రవ్వలో కేలొరీలు తక్కువ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి.బొంబాయి రవ్వకన్నా గోధుమ రవ్వ మేలైనది.చక్కెర వ్యాధిలో కూడా తినదగినదిగా ఉంటుంది.బొంబాయి రవ్వ ఆకలిని , జీర్ణ శక్తిని చంపుతుంది.కడుపులో ఆంలాన్ని పెంచుతుంది.వేడి చేస్తుంది.కాబట్టి పరిమితంగా వాడుకోవాలి.

మనకు గోధుమ పిండి , గోధుమ రవ్వ తెలిసినంతగా బొంబాయి రవ్వ తెలియదు.కొందరు దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు.జొన్న రవ్వ , గోధుమ రవ్వ , బియ్యపు రవ్వలతో చేసే వంటకాలన్నీ బొంబాయి రవ్వ వంటకాలుగా మారిపోయాయి.ఉప్పుడు రవ్వ స్థానం లో బొంబాయి రవ్వ ఇడ్లీ వచ్చింది.గోధుమ పిండితో చేసే హల్వా స్థానంలో కేసరి వచ్చింది.బియ్యపు రవ్వ ఉప్మా స్థానే బొంబాయి రవ్వ ఉప్మా ,జొన్న రవ్వ లేదా గోధుమ రవ్వతో చేసే కిచిడీ స్థానే బొంబాయి రవ్వ కిచిడి ఇలా వంటకాలు బొంబాయి రవ్వ పార్టీలోకి వెళ్ళిపోయాయి.సజ్జ అప్పాలను సజ్జ రవ్వతో చేసే వాళ్ళు ఇప్పుడు బొంబాయి రవ్వతో చేస్తున్నారు.బొంబాయి రవ్వ పూర్ణాలు ,బొంబాయి రవ్వ ఉప్మా బోండాలు , రవ్వ దోశెలు ,రవ్వ లడ్డూలు ఇలా ఒకటేమిటి వంట గదిలో బొంబాయి రవ్వ ఉంటే ఇంకేమి అక్కర్లేదన్నంతగా పరిస్థితి మారిపఒయింది.ఉపయోగం తక్కువ , అపకారం ఎక్కువ ఉండేదే బొంబాయి రవ్వ.