Sunday, 29 May 2016

గుండె సమస్యలు - ఆయుర్వేదం


గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్త
నాశాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి
ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స,
ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి.
- వి. పట్టాభిరామ్, విజయనగరం
గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయ
బద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవి
తాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి.
1.దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2.
దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూ
డదు. 3. ఈ కండరానికి 'కొరనరీ ధమనుల ద్వారా రక్తప్రసరణ
జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4.
కొన్ని సూక్ష్మక్రిములు గుండె పారలను, కవాటాలను పాడు
చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు.
అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి
లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.
హార్ట్ ఎటాక్ లో గుండెకు జరిగే రక్తప్రసరణలో
అంతరాయం
కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా
నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు
ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం
సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల
ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ
ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి
కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసా
గిస్తే హార్ట్ ఎటాక్లు నివారితమవుతాయి.
నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన
అంశం.
ఆలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు.
ఆహారం: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణం
లోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదాఆర్థాలు
తీసుకోడానికి, తగినంత నీరు తాగ 
డానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో 
అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త 
తీసుకోవడం, చక్కెర పదార్థాలు, కొవ్వులు
ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్
పుడు, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు
పాటించాలి.
విహారం: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి
తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే
అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో
రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి.
పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు
ఔషధాలు: అల్లం5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5. పసుపు ఐదు
చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం
కాచుకుని రోజూ 30మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడు
పున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా
పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరు
గుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ,
హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం
కావడం కూడా బాగా జరుగుతుంది.
మద్ది (అర్జున) చెట్టు 'తెలుపు, నలుపు' అని రెండు రకాలు.
తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు
కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు
మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు
ఉనల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు
రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది.
బజారులో లభించే మందులు: • ప్రభాకరవటి లేదా నాగార్జునాష్ట్ర
రస మాత్రలు ఉదయం 1,
రాత్రి 1 వాడాలి - త్రిఫలా చూర్ణం 5
గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి.