Sunday, 19 June 2016

అట్టు,చపాతి,పుల్కా,పూరి ,వీటిలో ఏది మంచిది? /ATTU ,CHAPATHI , PULKA ,POORI MANCHIDHA?POORI ,VEETILO EDI MANCHIDHI?

మంచి చెడు అనేవి అట్టులోనో ,పూరీలోనో ఉండవు.ఏ ఆహర పదార్థమైనా దాని తయారీలో కలిపిన ద్రవ్యాలు ,వాటిని వండే తీరును బట్టి ఉంటాయి.చపాతీని గోధుమ పిండితో చేసి ,కుర్మాతో తినాలని,పూరిని ఆలుగడ్డ కూరతోనే తినాలనీ, పుల్కాలను పాలక్ పనీర్ , మిక్ష్ డ్ వెజిటబుల్ కర్రీ లంటి వాతితో తినాలని నియమాలు పెట్టుకున్నది మనమే.ఇడ్లీ ,అట్టు ,పూరీల్లాంటివి విందు భోజనాల్లో వడ్డించేందుకే గాని , ఇలా ఉదయం పూట పెరుగన్నానికి బదులుగాను,రాత్రి పూట ఉపాహరంగాను తినటానికి  ఉద్దేశించినవి కాదు.ఉత్తరాది వారు రోటీలు తింటారు.మనం రోటీలు , అన్నం రెండూ తింటాం,అదీ తేడా.
అట్టు లేదా దోసెలను మినప పప్పు,బియ్యం రుబ్బి తయారు చేస్తారు.రెండూ ఎక్కువ కెలొరీలను పెంచేవే.చపాతీలను ,రాగులు,జొన్న,సజ్జలతో కూడా చేసుకోవచ్చు.ఆరోగ్యానికి మంచివి.నంజుకునేందుకు అన్నంలోకి తయారు చేసుకున్న కూర ,పప్పు లాంటివి మంచివి.
వొంటి పొర మీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద వత్తితే దౌపాతి ,మూడు పొరల మీద వత్తితే త్రిపాతి, నాలుగు పొరల మీద వత్తితే చపాతి అంటారని పరిశోధకులు భావిస్తున్నారు.పొరల మధ్య నూనె ఎక్కించి చపాతీలు తయారు చేస్తారు.నూనె లేకుండా నాలుగు మడతలు వేసి వత్తినందువల్ల అది మందపాటి రొట్టె అవుతుంది అంతే.కావున పూరీలు ,చపాతీలు నూనెకు నిలయాలుగా ఉంటాయి.వాటిని సరదాగా అప్పుడప్పుడు మాత్రమే తినటం మంచిది.చక్కగా విశ్లేషిస్తే పుల్కానే మంచిది అని చెప్పవచ్చు.