Thursday, 28 January 2016

ATTU - AYURVEDAM


| రోజువారీ టిఫిన్లకు పెసరట్టు మంచిదా? మినపట్టు
మంచిదా? ఆరోగ్యానికి ఈ రెండింటిలో దేనికి ప్రాధా
అర్థచందు
న్యతనివ్వాలో చెప్పండి!

* అట్టు అనే వంటకం (దోసెలు, రొట్టెలు, అప్పచ్చులు) ఏ పిండితో చేసిందైనా
సరే, మిగిలిన పిండివంటల మాదిరే పండగకో పబ్బానికో తినవలసిందేగానీ, రోజూ
తప్పనిసరిగా తినేవి కావు. ఉదయం పూట సాంప్రదాయ పద్ధతిలో చద్దన్నం (చల్లన్నం
లేదా పెరుగన్నం) తినటం మానేసి, రోజూ అట్లు, పూరీలు, బజ్జీలు, పునుగులూ
తినటం ఉర్ణాశయానికి మేలు చేసే
అలవాటు కాదు. అది పెసరట్టినా,
మినపట్టినా, ఇదే సూత్రం. ఆ
రెండింటికీ గుణాల రీత్యా పెద్ద
వ్యత్యాసం లేదు. ఆరోగ్యవంతులు
కూడా పిండిపదార్థాల వాడకం తగ్గి
స్తేనే మంచిది.
ఏ కారణం చేతనో మనవాళ్ళు
ప్రొద్దున పూట మెతుకు తగలకూడ
దనే అపోహని బలంగా పెంచుకున్నారు. నిజానికి, ఇడ్లీలో గానీ, అట్టులోగానీ అధిక
శాతం బియ్యమే కదా! అయినా అన్నం మెతుకు సెంటిమెంట్ దేనికో అర్ధం కాదు.
నాగరికత పేరుతో మనకు మనమే సృష్టించుకునే ఇలాంటి కొన్ని అవరోధాల్లోంచి
బయటపడితే ఆరోగ్యానికి మేలు.
అట్టు మాత్రమే తినాలనుకుంటే తక్కువ కేలరీలు కలిగిన రాగులు, జొన్నలు,
సజ్జలు, గోధుమలు, ఉలవలు ఇలాంటి వాటిని రుబ్బి అట్లు వేసుకోవచ్చు. పెనరట్టు
గానీ, మినపట్టుగానీ సరదాగా అప్పుడప్పుడూ తినండి. మధ్య మధ్య కమ్మగా తాలింపు
పెట్టిన దధ్యోదనం (దధోజనం) కరైన్ లాంటివి కూడా తింటూ ఉండండి. రాగిపిం
డితోనూ, జొన్నపిండితోనూ, గోధుమపిండితో కూడా బజ్జీలు, పునుగులూ, పకోడీలు
వేసుకోవచ్చు. అన్ని రుచులను ఆస్వాదించడమే మంచిది.