Thursday, 28 January 2016

KOBBARI PALU - KOBBARI NEELLU

కొబ్బరిపాలు కొబ్బరినీళ్ళు

కొబ్బరి తినటం మంచిదేనా? ఉపకారాలు, అవకా
రాలు వివరించగలరు

* కూరగాయల్ని ఎలా లేతగా ఉన్నప్పుడే తినాలో అలానే లేత
కొబ్బరినీ తినాలి. లేతగా ఉండే కొబ్బరికాయలు మార్కెట్లో దొరకటం
అపురూపం అవుతోంది. ముదిరిన కొబ్బరి, కొబ్బరినీళ్ళు కూడా వాత
వ్యాధులకు దారితీస్తాయి. దగ్గు, ఉబ్బసం, పైత్యరోగాలు వస్తాయి. లేత
కొబ్బరిని అతిగా తిన్నా ముదురు కొబ్బరిని కొద్దిగా తిన్నా రెండూ అప
ఇతర నూనెలతో పోల్చినప్పుడు కొబ్బరి నూనెలో 87 శాతం కొవ్వు
ఉంది. మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ మిశ్రమంగా ఉండే ఈ నూనె
గుండెకు అవకారం చేసేదని కొందరు, మేలుచేసేదని కొందరు
భావిస్తున్నారు. స్థూలకాయం తగ్గాలంటే కొబ్బరి తినటం మంచి
దంటారు ఇంకొందరు.
కొబ్బరిని ఇష్టంగా తినబోయే
ముందు, దానిలోని కొవ్వుని
దృష్టిలో పెట్టుకోవాలి. లేత కొబ్బరి
కోరును కొద్దిగా కొబ్బరి నీళ్ళుపోసి
పిండితే వచ్చే తెల్లని నీటిని కొబ్బరి
పాలు అంటారు. ముదిరిన కొబ్బరి
కన్నా లేత కొబ్బరిలో కొవ్వు శాతం
తక్కువగా ఉంటుంది. కొబ్బరిపా
లుగా తీసుకున్నప్పుడు మరింత
తక్కువగా ఉంటుంది. దీన్ని ఆహార పదార్థాల్లో వాడుకోవటం మంచిది. కొబ్బరి
నీళ్ళనీ, కొబ్బరిపాలనూ ఆహార పదార్థాలుగా తయారుచేసుకోవటం మంచిది. తగి
నంత పొదాషియం కోసం వీటి వాడకం అవసరం కూడా!
సాధారణంగా తెలుగువారి ఆహారంలో పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా
ఉంటాయి. అధిక ఉప్పు తినేవారికి తగినంత పొటాషియం ఉన్న కొబ్బరి పదార్థాలు
తీసుకోవటం అవసరం. అలాగే కూర అరటికాయ, అరటిపళ్లను కూడా తీసుకోవటం
మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో వడకొట్టి శోష కలగకుండా లవణ సమతుల్యత
(ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్) కోసం ఈ రెండింటినీ వాడుకుంటూ ఉండాలి.