Tuesday 5 January 2016

పాలకూర తినకూడని వ్యాధులు / PALAKOORA - THINAKOODANI VYADHULU .

పాలకూరను జీవంతి అంటారు.పేరుకుతగ్గ ఆహారద్రవ్యం ఇది.గొప్ప బలకరమైన ఔషధాల్లో పాలకూర ఒకటి.ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా తినిపించాలి.క్యాన్సర్ లాంటి ఉద్రేక స్వభావం ఉన్న వ్యాధుల్లో ఉపశమనం కలిగిస్తుంది.క్యాన్సర్,స్థూలకాయం,బిపి,షుగరు వ్యాధి,గుండె జబ్బులు,అల్సర్లు,జీర్ణకోశ వ్యాధులు ఇలా అనేక వ్యాధులకు పాలకూరలో ఔషధ గుణాలున్నాయి.కె విటమిన్ తో పాటు శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ ఉన్నాయి.రక్షనయంత్రాంగం పాలకూరలో పుష్కలంగా ఉంది.ఇది బాగా చలవ చేస్తుంది.సాధారణంగా అన్ని వ్యాధుల్లోనూ తినతగినదిగా ఉంటుంది.కొన్ని ఔషధాలతో ఇది రసాయన చర్యలు జరుపుతుంది.దానివల్ల ఆయా ఔషధాలను బట్టి ,వ్యాధులను బట్టి కొన్ని ప్రభావాలుంటాయి.చక్కెర వ్యాధిలో వాడే మందులతో పాటు పాలకూరను తీసుకుంటే చక్కెర స్థాయి బాగా తగ్గుతుందని పరిశోధనల్లో తెలిసింది.కాబట్టి షుగర్ బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళు పాలకూర తిన్నప్పుడు ఔషధాల మోతాదుని డాక్టర్ సలహా మేరకు మార్పుచేసుకోవాల్సి రావచ్చు.షుగరు సరిగా కంట్రోల్ లో లేని వాళ్ళు పాలకూరను తినటం అలవాటు చేసుకోవాలి.గుండె జబ్బులు,బిపి వ్యాధుల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మది చేసేందుకు కొన్ని ఔషధాలు వాడతారు.దీని చలువచేసె స్వభావరీత్యా రక్తస్రావాన్ని ఆపే స్వభావం కలిగి ఉంటుంది.దీనిలోని కె వితమిన్ ఇందుకు తోడ్పడుతుంది.ఇది రక్తం గడ్డ కట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నమాట.రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ఆలస్యం చేసే మందులు ,వేగవంతం చేసే ఆహరమూ రెండూ విరుద్ధ స్వభావాలను కలిగినవవుతాయి.అలాంటప్పుడు ఆ రోగులకు మాత్రమే పాలకూరను తగ్గించాలని వైద్యులు చెబుతారు.అలాగే మూత్రపిండాల్లో కాల్షియం ఆగ్జలేట్ రాల్లు ఉన్నవాళ్ళకి పాలకూరను తినవద్దని చెబుతారు.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి పొటాషియం ఉన్న పాలకూర బిపి ని తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది.బిపి రోగులు పాలకూరను తప్పని సరిగా తినాలి.కానీ మూత్రపిండాలు బాగా చెడిపోయి సోడియం,పొటాషియం సమతుల్యతలో తేడాలేర్పడతాయి.డయాలసిస్ మీద ఉన్న రోగులకు సోడియం నిలవలు తగ్గిపోయే పరిస్థితి వస్తే పాలకూరను వద్దంటారు.ఇలా పాలకూరను  తప్పనిసరిగా మానాల్సిన వ్యాధుల్లో మాత్రమే వైద్య్లు ఆ విధంగా సూచిస్తారు.దాని అర్థం పాలకూరతో కిడ్నీలో రాళ్ళొస్తాయి,కిడ్నీలు చెడిపోతాయని కాదని గుర్తించాలి.