ఆ నూనె పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు సైడ్ ఎఫెక్టులు రాకుండాఏమైనా ఉపాయాలున్నాయా?
* అతిగా నూనె పదార్థాలు తిన్నప్పుడు దాహంగానూ, కడుపులో తిక్కతిక్కగానూఉంటుంది. ఇది తగ్గడానికి మజ్జిగలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే
కొంత సుఖంగా ఉంటుంది.ధనియాలు, జీలకర్ర, శొంటి
మూడింటినీ దంచిన పొడిని మజ్జిగలో కలుపుకుని తగినంత ఉప్పు,పంచదార కలుపుకుని తాగితే
నూనె వలన కలిగిన వికారం తగ్గుతుంది.తేలికగా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటే నూనె వల్ల కలిగిన అజీర్తి తగ్గుతుంది. దానిమ్మ గింజలు కానీ,ఉసిరికాయ తొక్కుడు పచ్చడి/ నల్ల పచ్చడి కలిపిన అన్నం కానీ తింటే వాంతి ఆగుతుంది.