Saturday, 16 January 2016

అన్నం తినబుద్ధి కాకపోవడం / అజీర్ణం ,నోటికి రుచి తెలియకపోవడం జరిగినప్పుడు ఏం చేయాలి? / అల్లం - అజీర్ణం - ఆయుర్వేదం / ALLAM - AJEERNAM - AYURVEDAM


దీనిని అరుచి అంటారు.అజీర్త్ కారణంగానైన, లేదా ఇతర కారణాలవల్లనైన ఇది కలగవచ్చు. కారణం ఏదైనా ముందు జీర్ణ వ్యవస్థ బలకరం కావాలి.

ప్రతి రోజూ అల్లనికి తగినంత ఉప్పు వేసుకుని దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తినాలి.నాలుక మీద జిగురు తగ్గి ,అన్న హితవు కలుగుతుంది.అన్నంలో మొదటి ముద్దగా అల్లం, ఉప్పు ( వీలైతే సైంధవ లవణం ) మిశ్రమాన్ని తినాలి.అరోగ్యవంతులు కూడా దీనిని పాటిస్తే భుక్తాయాసం కలుగదు.అహారం తేలికగా జీర్ణం అవుతుంది.అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.ఉసిరికాయ తొక్కుడు పచ్చది లేద నల్ల పచ్చడిని ఈ అల్లం మిశ్రమానికి కలిపి తింటే మరీ మంచిది.భోజనంలో మొదటి పదార్థంగా దీనిని తీసుకోవాలి.
పచారీ కొట్లలో దొరికే పిప్పళ్ళను దోరగా వేయించి మెత్తగా దంచాలి.ఈ చూర్ణానికి ఆరు రెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరుచు కోవాలి.జీర్ణవ్యవస్థ బలంగా లేని వాళ్ళు వీటిని ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ వుంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది.శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.