శనగపిండి మంచి - చెడూ
శనగపిండి మంచి ప్రొటీన్లతో కూడిన ఆహారం కదావైద్యులు దాన్నితినవద్దని ఎందుకు చెప్తారు?
* శనగపిండి తినకూడని చెడ్డ ఆహార పదార్ధం కాదు. ఆ మాటకొస్తే ఏ ఆహారద్రవ్యాన్ని తినకూడనిదిగా ముద్ర వేయటము మంచిది కాదు. మీరన్నట్టు
శనగపిండి మంచి పోషక విలువలు కలిగిన ఆహార ద్రవ్యమే!
సహజంగా శనగపిండితో చేసిన వంటకాలు కష్టంగా అరిగే స్వభావం కలిగిఉంటాయి.ఆకలి కలిగిన వారికి దీన్ని నిరభ్యంతరంగా పెట్టవచ్చు. తిన్న తరువాత అరుగుదల సమస్య కలిగి ఉంటాయి. అయినప్పటికీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికీ, అదిఎలాంటి ఇబ్బంది కలిగించనప్పుడు దాన్ని మానాలని చెప్పాల్సిన అవసరం లేదు. జఠరాగ్ని బలహీనంగా ఉన్న వారికి మాత్రమే దీని జాగ్రత్తలు
వర్తిస్తాయి.
పోషక విలువలు ఉన్నవన్నీ అరిగించుకోగల స్థితిలో వ్యక్తి
ఉన్నప్పుడేవంటబడతాయి. కాబట్టి, అరిగించుకోగల
వారికి వర్తించే విషయాలు, అగ్నిబలం తక్కువగా ఉన్నవారికివర్తించవని అర్ధం చేసుకోవాలి. అలాంటి వాళ్లకు శనగలు, శనగపప్పు, శనగపిండిఅపకారం చేసేవిగానే ఉంటాయి. జీర్ణశక్తి ననుసరించి, శనగపిండి తినడమో మానడమో ఎవరికివారు నిర్ణయించుకోవాలని చెప్పవచ్చు.
శనగపిండి వేడి శరీర తత్వం ఉన్నవారికి కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. వాత శరీరతత్వం ఉన్నవారికి
కీళ్ళవాతం ఇతర వాత బాధలనుపెంచుతుంది. కఫతత్వం ఉన్నవారిలోమందగుణం, ఉత్సాహం, చలాకీతనం లేకుండా చేస్తుంది. షుగరు,బీపీ, అర్ధరయిటీస్, ఎలర్జీలు, పేగుపూత, స్థూలకాయం వగైరా వ్యాధులున్నవారికి
అపకారం చేస్తుంది. చిక్కిపోతున్నవారికి, శుష్కించిపోతున్న వారికి జీర్ణశక్తిని పెంపొందేలా చికిత్స చేస్తూ శనగపిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.శరీర శ్రమ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఏది తిన్నా అరిగించుకోగలవాళ్ళకు శనగ
పిండి మేలే చేస్తుంది. ఆయుర్వేదశాస్త్రంలో చెప్పిన చికిత్సా సూత్రం ప్రకారం,ప్రయత్న పూర్వకంగా రోగి జఠరాగ్ని బలాన్ని కాపాడవలసి ఉంది. అగ్ని బలం పెరిగితే, రోగి బలం పెరిగి, రోగ బలం తగ్గుతుంది. అప్పుడు వ్యాధిని తగ్గించటం తేలికవుతుంది.శనగపిండి ప్రస్తావన దీర్ఘ వ్యాధుల విషయంలో వచ్చినప్పుడు జీర్ణశక్తిని బట్టి తినాల్సి ఉంటుంది.
అప్పటికప్పుడు ముంచుకొచ్చిన వ్యాధుల్లో అగ్నిబలం ముఖ్యం కాబట్టి శనగపిండిని ఆపాలని చెప్పవచ్చు.. ఏ వ్యాధులూ లేనివాళ్లకు, మంచి జీర్ణశక్తిఉన్నవాళ్లకు శనగపిండిని నిరభ్యంతరంగా వాడుకోవాలని చెప్పవచ్చు.