ఏలకులు - ఎలా
(ELATTERIA CARDOMUM)
ఏలకులు సుగంధ ద్రవ్యాలకు చెందినవి. కేరళ కొంకణ ప్రాంతంలో ఎక్కువగా
పండుతాయి. వీనిని మసాలా దినుసులలో వేసి వంటలలో ఉపయోగిస్తున్నారు.
భోజనానంతరము కూడా, వక్కలతో పాటు నమలడం, తమలపాకులలో వేసుకోవడం
అందరెరిగిందే.
ఏలకుల ఔషధోపయోగాలు:
1. నోటిపూత: ఏలకులను చూర్ణించి, మిగడయందు బాగుగా కలిపి పాకము
చెందిన నోటిలో అంటించాలి.
2.. నోటి దుర్వాసన : ఏలక్కాయ గింజలు, పటిక బెల్లం కలిపినోట్లో వేసుకొని
చప్పరిస్తుండిన, నోటి దుర్వాసన పోతుంది.
3. వాంతులు: ఏలకుల చూర్ణాన్ని చిటికెడు తీసుకొని నిమ్మరసంలో కలిపి
సేవించాలి.
4. మూత్ర వ్యాధులు: 'టీ' డికాక్షనులో ఏలక్కాయల చూర్ణం వేసి సేవించాలి.
5. అర్శమొలలు: ప్రతిరోజు ఉదయమే ఒక అరటి పండులో ఒక ఏలక్కాయనుంచి
21 రోజులు భుజించాలి.
6. పుంస్య శక్తికి: పాలలో ఏలక్కాయల చూర్ణం కలిపి వేడి చేసి చల్లార్చి, తేనెను చేర్చి
త్రాగాలి.
7. తలనొప్పి: ఏలకులను మెత్తగా నూరి పలుచటి బట్టలో కట్టి వాసన చూసిన,
తలనొప్పి, తుమ్ములు తగ్గుతాయి.
8. మూత్ర పిండాలలో రాళ్లు: ఏలకులు, పందిరి దోసగింజలు కలిపి చూర్ణించి
తీసుకున్న, మూత్రాశయములోని రాళ్లు పోతాయి.
ఇ.....
"వాతము, పిత్తము, కఫము అను త్రిదోషాలలోని హెచ్చుతగ్గులే వ్యాధులకు కారణము"