Saturday 16 January 2016

DAMPUDU BIYYAM - SUGER DISEASE - AYURVEDAM

సుగరు రోగులకు దంపుడు బియ్యం పెడితే కలిగే ప్రయోజనం వివ
రించగలరు.

* షుగరు వ్యాధిలో బియ్యం వాడ
కాన్ని సగానికి తగ్గించాలని వైద్యులు సూచి
స్తున్నారు. ఆ మిగిలిన సగానికి సరిపడే
రాగి,
జొన్న, సజ్జ, గోధుమలను వాడుకోవ
లసిందని చెప్తున్నారు. కాబట్టి, దంపుడు
బియ్యం మాత్రమే తినాలని అనుకోనవ
సరం లేదు. షుగరు వ్యాధిలో దంపుడు
బియ్యాన్నో లేక 'పట్టు తక్కువ బియ్యాన్నో
తినటం వలన జీర్ణాశయ వ్యవస్థ మరింత
దెబ్బ తింటుంది. గోధుమలూ, రాగులు, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండు
కుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం
ఉండదు. కాబట్టి, షుగర్ రోగులు దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ,
రాగులు, సజ్జలూ వగైరా తృణధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. దంపుడు
బియ్యం తింటే ఏ పోషకాలు దొరుకుతాయని ఆశిస్తున్నారో అవన్నీ అంతకన్నా ఎక్కు
వగానే ఈ ప్రత్యామ్నాయ ధాన్యంలో దొరుకుతాయి.
అన్నీ సవ్యంగానే ఉన్నప్పుడు దంపుడు బియ్యం మేలు చేసేదే! షుగర్ రోగులకు,
స్థూలకాయులకు, కొవ్వు కారణంగా ఏర్పడే వ్యాధులతో బాధపడేవారికీ రాగి, జొన్న,
సజ్జ, గోధుమలు మంచివి.