Saturday 9 January 2016

VUNDRALLU , AVIRI KUDUMULU - AYURVEDAM

కోటల్ కెళితే ఇడ్లీలు దొరకుతాయి
గానీ ఉండ్రాళ్ళు దొరకవు. గారెలు, వడలు
దొరుకుతాయిగానీ ఆవిరి కుడుములు
దొరకవు.
ఉండ్రాళ్ళు వినాయక చవితినాడు
మాత్రమే తినాలని మన ప్రజలు ఎందుకను
కొంటారో తెలీదు. ఆవిరి కుడుములు
వేస్తారనీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివనీ
మన వాళ్ళు చాలా మందికి తెలీదు. తెలిసినా
వండరు. అమ్మమ్మల వంటలని ఎగతాళి
చేస్తారని భయం!!
బహుశా, పూటకూళ్ళ సాంప్రదాయాన్ని
మార్చి తమిళులు, కన్నడవారూ తెలుగు నాట
హోటల్ సాంప్రదాయాల్ని ప్రవేశ పెట్టి “ఇడ్లీ
+ వడ దోసె"ల్ని మనమీద రుద్దేశారు.
దాంతో మనం మన సాంప్రదాయకమైన
ఆహారాన్ని మర్చిపోయి ఇడ్లీ సాంబార్లలో
వడి కుడితి తొట్లో ఎలుకలా కొట్టు
కొంటున్నాం... అవునంటారా.... కాదంటారా....
'విదేశీ సంస్కృతి' అంటూ అయిన
దానికి కానిదానికి ఒంటికాలుమీద లేచే మన
పెద్దలు ఇలా మనం స్వంత సంస్కృతిని
మరిచిపోతున్న నంగతిని ఎప్పుడైనా
గుర్తించారా...???
ఇడ్లీలు వాతం చేస్తాయి
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు ఎంత
మేలుచేస్తాయో మీకు వివరంగా చెప్పబోయే
ముందు ఇడ్లీ గురించి ఒక మాట...
ఇడ్లీలు ఉప్పుడు రవ్వతో తయారౌతాయి
కాబట్టి తెల్లగా మర పట్టించకుండా
బియ్యంలో సారం అంతా పోకుండా
ఉప్పుకు రవ్వలో నిలవ వుంటుంది కాబట్టి
ఉప్పుడు రవ్వ వలన బలం ఎక్కువగా
వస్తుందనీ, నాడీ ఉత్తేజం (Nerve Stimula-
tion) కల్గుతుందని అర్ధం చేసుకోవాలి.
ఇది బాగానే ఉంది కానీ, ఉప్పుడు
రవ్వవలన, అవి పులిసిన బియ్యం కాబట్టి-
వాతం పెరుగుతుంది. మలబద్ధకం కలుగు
తుంది. అందుకని కడుపులో మంట, గ్యాస్
ట్రబుల్ పేగుమాత, అమీబియాసిన్,
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు
న్నవారు, అన్నిరకాల వాతవ్యాధులున్నవారు
ఇడ్లీలు తినడం మంచిది కాదు.
చలవని కల్గించే చక్కని టిఫిను ఇదిగో...
మీ కోసం...
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు కొంచెం
ఆలస్యంగా అరుగుతాయి. అందుకని ఇవి
తేలికగా అరగడం కోసం నెయ్యివేసుకొని
తినాలి. ఇడ్లీలైనా నేతితో తిన్నప్పుడు అంతగా
చెడును కల్గించవు.
ఆరోగ్యవంతుడే కాదు, ఏ వ్యాధితో
బాధపడున్నవారైనా సరే ఉండ్రాళ్ళనూ ఆవిరి
కుడుమునూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చలవని కల్గిస్తాయి. తృప్తిని కల్గిస్తాయి. తిన్న
తర్వాత కడుపునిండినట్లు అనిపిస్తుంది. మళ్ళీ
భోజనం వేళకే ఆకలి అవుతుంది. అందుకని
టిఫిన్ గా ఉండ్రాళ్ళను గానీ, ఆవిరి కుడుము
నుగానీ తినడం మంచిది.
ఇడ్లీల వలన తృప్తి కలగదు. అందులోకి
శనగ చెట్నీ, కారప్పొడి, సాంబారు లేనిదే
అవి సహించవు. అవన్నీ కలిపి తినడం వలన
ఇడ్లీలు వేడిచేసే వాటిలో ముందు వరసగా
వచ్చేస్తున్నాయి. ఉండ్రాళ్ళుగానీ, ఆవిరి
కుడుములుగానీ ఇలా వేడిచేయనీయ
కుండానే చక్కగా, నేరుగా తినవచ్చు. ఈ
సున్నితమైన తేడాని గుర్తించండి.
మూత్ర వ్యాధులున్నవారు, మూత్ర
పిండాలలో రాళ్ళతో బాధపడున్నవారు,
మూత్రంలో మంట చీము వున్న వారు
ఉండ్రాళ్ళు తింటే మంచిది. చలవని కల్గి
స్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో ఇడ్లీ
సాంబార్లు తినడం కన్నా వీటిని తినడం
మంచిది.
రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు
తినదలచిన వారుకూడా, ఆవిరి కుడుముగానీ,
దిబ్బరొట్టెగానీ తినడం మంచిది. చపాతీలు
సరిపడని వారికీ ఇవి మంచివే. చలవ
నిస్తాయి. పెద్దగా కేలరీలు పెరగవు. గోధుమ
పిండితో వండిన వాటి కన్న మన వాతా
వరణానికి ఇవే మంచివి!
ఆవిరి కుడుముల కన్నా మంచి ఆహారం
ఇంకొకటి లేదు
ఆవిరి కుడుములు తింటే- భోజనం
3
చేయగానే వచ్చే కడుపులో నొప్పి వ్యాధిలో
చాలా మంచిది. కడుపులో పుండువలన ఈ
నొప్పి వస్తూండవచ్చు. ఉండ్రాళ్ళుకూడా ఈ
వ్యాధిలో మేలుచేస్తాయి.
ఆవిరి కుడుముల్ని రాత్రిపూట వేసుకొని
ఉదయం పూట సూర్యోదయానికి ముందే
తింటే వేసవికాలం అమితమైన చలవ
కి నిస్తుంది. తేలికగా వడదెబ్బ తగలకుండా
-దే కాపాడుతుంది.
వాత వ్యాధులు, పక్షవాతం కీలు
గా నొప్పులతో బాదపడున్న వారికి ఈ విధంగా
పెడితే వాతం త్వరగా తగ్గుతోంది. మందులు
చక్కగా పనిచేస్తాయి.
ఇడ్లీలు చల్లారితే బాగోవు. ఆవిరి
కుడుము చల్లారిన తర్వాతే బాగుంటుంది
ఆరోగ్యం కూడా!! ఆవిరి కుడుములో బియ్యం
చాలా స్వల్పంగా వుంటాయి. కేవలం
మినపప్పును, జిగురుకోసం కొద్దిగా బియ్యపు
గింజలు కలిపి నానబెట్టి రుబ్బి ఇడ్లీ ప్లేట్లలో
గానీ, వాసిన కట్టిన గుడ్డమీదగానీ ఇడ్లీ వేసినట్లే
వేసుకొని చల్లారిన తర్వాత తింటారు. ఆవిరి
కుడుముల్లో బియ్యం దాదాపుగా వేడి కాబట్టి
ఇంతకుమించిన ఉత్తమమైన ఆహారం
మధుమేహరోగులకుగానీ,
స్థలకాయులకిగానీ
ఉండదు కదా! ఆ విధంగా, కేవలం మినప
పిండితో వండినవి కాబట్టి ఆవిరి కుడుములు
వాత వ్యాధుల్లో అద్భుతమైన ప్రభావాన్ని
చూపిస్తాయి. గారెలకన్న ఆవిరి కుడుములే
శ్రేష్టం. గారెల్లో నూనె వుంటుంది. ఆవిరి
కుడుముల్లో నూనె అసలే వుండదు కదా!
అన్నం కన్నా ఉండ్రాయి మిన్న
ఇంక ఉండ్రాళ్ళు - బియ్యపు రవ్వతో
తయారుచేస్తారు. వండే విధానంలో ఇడ్లీలను
వండినట్లే వీటిని ఆవిరిమీద ఉడికించడమే
పద్ధతి. ఇందులో మినపప్పు వుండదు. రుచి
కోసం శనగపప్పు కలుపుతారు. కానీ,
మామూలు బియ్యంతో వండిన అన్నంకన్నా
ఉండ్రాళ్ళు తేలికగా అరుగుతాయి. ఎక్కువ
చలవ.
ఇవి తరతరాలుగా మన తెలుగు వారు
తిన్న టిఫిన్లు. ఆరోగ్యానికి మేలు చేసేవి.
తమిళులు, కన్నడీయులు పుణ్యమా అని,
మనం చలవచేసే టిఫిన్లను వదిలేని
వేడిచేసేవి. ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి అయిన
ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీలను తిని
బాధపడ్తున్నాం- కాదంటారా...!!
జీలకర్ర ధనియాలను విడివిడిగా నేతిలో
వేయించి, సమానంగా తీసుకొని, మెత్తగా
దంచి, తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని
నంజుకుతింటే ఇవి
తేలికగా అరుగు
తాయి. పొదీనా ఆకు
పచ్చడి కూడా వీటికి
విరుగుడుగా పని
చేస్తుంది.