6, జూన్ 2017, మంగళవారం

రంజాన్ లో షుగర్ రోగులకు సూచనలు..

ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్. ఈ నెల రోజుల కాలంలో ప్రార్థనలు, ఉపవాసాలు వంటివి ఆరోగ్యవంతమైన ప్రతి ముస్లింకు తప్పనిసరి. వైద్యపరమైన సమస్యలు ఉన్న వ్యక్తులు అంటే మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మినహాయింపు అయినా అధిక శాతం మంది వైద్య సలహాలు అధిగమించి మరీ ఈ ఉపవాసాలు చేస్తుంటారు .ఈ కారణం చేతనే అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్, డయాబెటిస్ అండ్ రమదాన్ తో కలిసి మధుమేహరోగులు ఉపవాస సమయంలో పాటించ వలసిన నియమాలపై మార్గ నిర్దేశకత్వం చేసింది. ఈ మార్గ నిర్దేశకాలను ప్రధానంగా రోగులకు అవగాహన కల్పించడంతోపాటు ఉపవాస సమయంలో మధుమేహం నియంత్రణ గురించి తెలిపేందుకు రూపొందించారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మరింత అత్యాధునిక సమాచారంతో సలహాలు ఇవ్వడం సాధ్యం కావడంతో పాటుగా తమ రోగులకు రంజాన్ సమయంలో సహకరించడం సాధ్యమవుతుంది.
 2001లో ఎపీడీయాఆర్ అధ్యయనంలో వెళ్లడైన సమాచారం ప్రకారం 42 శాతం మంది రోగులు  టైప్ వన్ మధుమేహంతో బాధపడుతుంటే 78.7% మంది టైప్ టు మధుమేహంతో బాధపడుతూ కనీసం రంజాన్ సమయంలో 15 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో అంటే 2010 క్రీడ్ అధ్యయనంలో తేలింది ఏమిటంటే తమ అధ్యయనం కోసం నమోదు చేసుకున్న వారిలో 94.2% మంది టైప్ టు డయాబెటిస్తో బాధపడుతున్న రోగులు అయితే వారంతా కూడా కనీసం 15 రోజులు రంజాన్ సమయంలో ఉపవాసం ఉన్నారు. వీరిలో 63.6% మంది ప్రతి రోజు ఉపవాసం చేశారు. ఈ అధ్యయనాలు ప్రతి వ్యక్తికి రంజాన్ మాసంలో ఉపవాసం ఎంత ముఖ్యమో తెలుపుతుంది. అధ్యయనాలు తెలిపే దాని ప్రకారం రమదాన్ కౌన్సిలింగ్ తో హైపోగ్లసీమియా కేసులను తగ్గించడం సాధ్యమవుతుంది .ఇటీవల యూకే, పాకిస్తాన్లలో చేసిన అధ్యయనాలు వెల్లడించిన దాని ప్రకారం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ప్రభావంతమైన విద్య అందించడం ద్వారానే ఇది సాధ్యమైంది .అందువల్ల రంజాన్ సమయంలో మధుమేహాన్ని నియంత్రించడంలో అత్యంత కీలకంశం.. రోగికి గ్లూకోజ్ నియంత్రణ, పర్యవేక్షణ, పౌష్టికాహారం ,వ్యాయామం, మందుల డోస్ ని సరి చేసుకోవడం, రిస్క్ తగ్గించుకోవడం ,ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులలో ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ,హాని జరగకుండా ఏ సమయంలో ఉపవాసాన్ని విరమించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించడం అవసరం .ఉపవాస సమయంలో అతి ప్రమాదకరమైన అంశాలు అంటే హైపోగ్లసిమియా, హైపర్  గ్లైసిమియా, డిహైడ్రేషన్ వంటివి ఉంటాయి. ఉపవాసం చేయాలనుకునే మధుమేహ రోగులు రంజాన్ కు ముందుగానే పరిశీలన, కౌన్సిలింగ్ ను హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వద్ద తీసుకోవడంతో పాటుగా డైటీషియన్ సలహాలు తీసుకోవడం అతి కీలకం.

రోగి స్థితిని పరీక్షించి ,ప్రమాదకారకాలయ్యే అంశాలను గుర్తించి ,స్వీయ నియంత్రణ పట్ల రోగి ని ఎడ్యుకేట్ చేయాల్సిన  ఆవశ్యకత ఉంది .అలాగే రోగికి సంబంధించిన ప్రత్యేక ట్రీట్మెంట్ ప్రణాళిక సైతం సమర్పించాలి. హైపోగ్లీసిమియా ప్రమాదం అధికంగా కలిగిన రోగులు, మధుమేహాన్ని సరిగ్గా నియంత్రించలేని రోగులు, అధిక లేదా స్వల్ప మధుమేహాల కారణంగా ఇటీవల కాలంలో హాస్పిటల్లో చేరిన వారు, కొద్దిగా లేదంటే తీవ్ర స్థాయి మధుమేహం కలిగిన గర్భవతులైన మహిళలు, దీర్ఘకాల కిడ్నీ బాధితులు లేదా గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు, మధుమేహ సంబంధిత సమస్యలు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఉపవాసాన్ని వదిలివేయడమే మంచిది. ఫిజీషియన్ సలహాల మేరకు తప్పకుండా మందులు తీసుకోవాలి.

 ముఖ్యమైన ఆహార పద్ధతులు..

సేహర్ ,ఇఫ్తార్ నడుమ మీరు తీసుకునే రోజువారీ కేలరీలను విభజించుకోవాలి .అవసరమైతే ఒకటి నుండి రెండు స్నాక్స్ తప్పనిసరి .భోజన సమతుల్యత సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. మీరు తీసుకునే భోజనంలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్స్, 20 నుండి 30% ప్రోటీన్స్, 35 శాతం కన్నా తక్కువ ఫ్యాట్స్ ప్రధానంగా మోనో పాలీ శాచూరేటెడ్ 
 ఫ్యాట్స్ ఉండాలి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తో పాటుగా ఫైబర్ ఫుడ్స్ అందునా ఉపవాసానికి ముందు, తర్వాత నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారాన్ని జోడించాలి ఉదాహరణకు బీన్స్, రైస్, బ్రెడ్. అధికంగా పళ్ళు కూరగాయలు సలాడ్స్ జోడించాలి. అధికంగా ఉండే ఆహారం తగ్గించుకోవాలి. ఉదాహరణకు నెయ్యి, సమోసాలు ,పంచదార అధికంగా ఉండే స్వీట్లు తగ్గించుకోవాలి. అతి తక్కువ వంట నూనె వాడాలి. ఆలివ్, రాప్ సీడ్ లాంటివి మంచిది. సంధ్యా సమయం, సూర్యోదయానికి నడుమ హైడ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నించాలి .అధికంగా నీళ్లు తాగడంతో పాటుగా ఇతర స్వీట్ లేని బేవరేజెస్ తీసుకోవాలి. కెఫినెటెడ్ డ్రింక్ తాగొద్దు.. మధుమేహ రోగులకు రంజాన్ సమయంలో రెగ్యులర్ గా తప్పనిసరిగా ఎస్ఎంబిఐ తప్పనిసరి.
సూర్యోదయానికి మునుపే తినేందుకు ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే తర్వాత రోజు ఉపవాసం ప్రారంభం చేయగలరు.

 హైపో లేదా హైపర్ గ్లైసిమియా పరిస్థితి తలెత్తినప్పుడు ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి .గ్లూకోజ్ స్థాయి 80ఎంజి /డిఎల్ కన్నా తగ్గినప్పుడు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను ఏదైనా ఈ దిగువ మార్గాలలో తీసుకోండి. మూడు టీ స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ లేదా అరకప్పు యాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ లేదా ఒక సర్వింగ్ గ్లూకోజ్ జెల్ లేదా మూడు ,నాలుగు గ్లూకోజ్ టాబ్లెట్స్ లేదా ఐదు, ఆరు పీసులు హార్ట్ క్యాండీ లేదా ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా తేనె తీసుకోవాలి .15 నిమిషాలు ఆగి గ్లూకోజ్ స్థాయిని పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఈవినింగ్  మీల్ తీసుకోవడానికి ఒక గంట కన్నా ఎక్కువ లేదనుకున్న సమయంలో స్నాక్స్ తీసుకోవాలి.

5, జూన్ 2017, సోమవారం

సైంధవలవణం / SAINDHAVA LAVANA/ROCK SALT - VUPAYOGALU.

For
Daily Use
सेंध नमक
THE NATURE'S BEST GIFT FOR OUR HEALTH
సైంధవలవణం (ఉప్పు) 100% vegetarian
త్రిదోషనాశకము
ROCK SALT
त्रिदोषनाशक
Purest Cooking Salt on the Earth
పవిత్ర హిమాలయాల నుండి ఉత్పన్నమైనది
ఉప్పుస్లో పాయిజన్ (ఉప్పుకు బదులుగా సైంధవలవణం (అమృతం) వాడండి) రుచి సేమ్
ముఖ్య సూచన : ఉప్పు 3 చెంచాలు వాడితే ఈ సైంధవలవణం 2 చెంచాలు మాత్రమే వాడాలి
సైంధవలవణం (ఉప్పు) ప్రకృతి ప్రసాదించినది. ప్రకృతిచే శుద్ధి చేయబడినది. దీనిలో ఎటువంటి రసాయనాలు కలపబడవు. అధిక ఉష్ణోగ్రత పైన
వేడి చేయబడదు. భూమిపై అన్నింటికంటే స్వచ్ఛమైన ఉప్పు మన శరీరానికి కావలసిన
84 రకాల పోషక విలువలు కలిగినది. ఉదా॥ కాల్షియం, కాపర్,
ఐరన్, మెగ్నిషియం, పాష్ఫరస్, పోటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ మొదలగు పోషక విలవలు కలిగినది. ఈ ఉప్పు నిత్యం
వంటల్లో వాడిన వారికి పలు వ్యాధుల నుండి ఉపశమనం లభించును. రోగనిరోధక శక్తి పెంచును. 100% శాఖాహారం తక్కువ సోడియం మోతాదు
కలది. లక్షలాది సంవత్సరాల పురాతనమైనది. దీర్ఘకాలం నిలువ చేయగలిగినది. వైద్యులచే ఆమోదించబడినది.
పిహెచ్ విలువలను తటస్థంగా ఉంచునది
మౌళిక స్థాయిలో అనగా కణము స్థాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించినది. సుఖ నిద్రకు సహాయకారి అస్తమా, సైనసైటిస్ ను అదుపు చేస్తుంది.
శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకల దృఢత్వాన్ని క్షిస్తుంది, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
యవ్వన శక్తిని పెంపొందిస్తుంది. పళ్లను, చిగుళ్ళను పటిష్టపరుస్తుంది. మధుమేహాన్ని (షుగర్)ని నియంత్రించుటలో సహాయకారి, రక్తనాళాలు
ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. స్నానము చేసే నీళ్ళల్లో కొంచెం
| సైంధవలవణం (ఉప్పు) వేసి స్నానము చేసిన అలసట పోగొట్టి శరీర దుర్గందాన్ని పోగొట్టును. శారీరక నొప్పులను, వత్తిడిని అరికట్టును. ఈ ఉప్పుతో
పళ్ళు తోమితే పళ్ళు తెల్లబడి దంతాలు దృడంగా అయి నోటి దుర్వాసన అరికడుతుంది. అసిడిటీని తగ్గించును. థైరాయిడ్ అరికట్టును.
నేడు సముద్రం నీరు కలుషితం అయినది. అనేక పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, విష రసాయనాలు ఇందులో కలుపుచున్నారు. పెట్రోల్ చమురు వల్ల
కూడా సముద్రం కలుషితమవుతుంది. సముద్రంలో వుండే లక్షలాది జంతువుల చెడిపోయిన మాంసం మరియు చెడిపోయిన జంతువుల అవశేషాలు
ఇందులోనే వుండి సముద్ర నీరును కలుషితం చేస్తున్నాయి. అదే సైంధవలవణం సముద్రం నీటితో సంబంధం లేకుండా హిమాలయాల్లోని పర్వత
ప్రాంతాల్లో సైంధవలవణం గనుల నుండి తీయబడినది.
ఆర్థరైటీస్ సమస్య, పక్షవాతం సమస్య, నపుంసకత్వ సమస్య మొదలగు సమస్యలను అరికట్టును. భారతదేశంలో 1930 కంటే ముందు సైంధవ
లవణం మాత్రమే వాడేవారు. అసలైన సైంధవ లవణం మిమ్మల్ని ప్రకృతికి దగ్గరగా చేర్చును. పూర్వం ఆయుర్వేద ఋషులు సైంధవ లవణాన్ని బంగారం
కంటే విలువైనదిగా గుర్తించి వివిధ వ్యాధులక, మూలికలతోపాటు సైంధవ లవణాన్ని కలిపి ఇచ్చేవారు.
నిత్యం వంటల్లో వాడే ఆహ్లాదకరమైన రుచిని ఆస్వాదిస్తారు. మామూలు వంటలు కూడా చక్కని రుచిని అందిస్తుంది. అధికంగా (కామన్ సాల్ట్)
వాడడం వల్ల వచ్చిన దుష్ఫలితాలను అరికడుతుంది. ఉప్పులన్నింటిలోకి అత్యుత్తమైనది, మలబద్ధకాన్ని, గ్యాస్టికన్ను తగ్గిస్తుంది.
1. రోచన : రుచి మెరుగుపరుస్తుంది 2. దీపన : జీర్ణక్రియ బలం మెరుగుపరుస్తుంది. 3. వృష్య : నిరోధకంగా పనిచేస్తుంది. 4. చక శుష్య : కళ్ళకు
మంచిది. ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం 5. వైదేహి : మంటను అరికడుతుంది. 6. హృదయ : గుండెకు మంచిది 7. హిక్కనాశన : ఎక్కిళ్లకు మంచిది.
నెలసరి సమయంలో కడుపు నొప్పికి వాముపొడి, సైంధవలవణం కలిపి తింటుండాలి. ఎండు ద్రాక్ష కొద్దిగా నేతిలో వేయించి సైంధవ లవణం కలిపి
తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగలో సైంధవలవణం వేసి తాగాలి. జీలకర్రలో సైంధవలవణం కలిపి తింటే
వాంతులు తగ్గుతాయి. సైంధవలవణం, పసుపు, శొంఠి పొడి అన్నంలో కలుపుకొని తింటే ఆకలి పెరుగుతుంది. తులసి ఆకులు గుప్పెడు తీసుకొని నీళ్ళలో
వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవలవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది. జిగట విరేచనాలు, గ్యాస్ వంటి
సమస్యలు తగ్గుతాయి. అజీర్ణంతో బాధపడేవారు, భోజనానికి ముందు అల్లం రసం, సైంధవలవణం చిటికెడు కలిపి తీసుకుంటే సత్వర ఉపశమనం
దొరుకుతుంది. నిమ్మరసంలో సైంధవలవసం కలిపి రోజు త్రాగుతూ వుంటే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి. ఆరబెట్టిన తులసి పొడి
ఒక టీ స్పూన్ చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన మొదలైన సమస్యలు నివారించవచ్చు. బి.పి.
ఉన్నవారు స్నానము చేసే నీళ్ళలో సైంధవలవణం వేసి స్నానం చెయ్యాలి, లో బి.ఏ. వారు ఒక గ్లాసు మంచి సిటీలో సైంధవ లవణం తగు మాత్రం వేసి త్రాగాలి,
కూరగాయలు సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే, పెస్టిసైడ్స్ యొక్క దుష్ఫలితాలను కొంతవరకు నివారించవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని
విసర్జిస్తుంది. చెడునీరును బయటకు పంపేందుకు తోడ్పడుతుంది.
సైంధవలవణం రాయిని మీ ఆఫీసులో / ఇంట్లో కంప్యూటర్ టేబుల్ పై పెట్టుకుంటే నెగిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష
నివారిణి, ఇంట్లోని గాలిని శుద్ధి చేయును. పచ్చళ్లలో సైంధవలవణం వాడితే పచ్చళ్లు రుచికరంగా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. శరీరంలోని అధిక
వేడిని నియంత్రిస్తుంది. శరీంలోని అధిక కొలెస్ట్రాల్ ని, అధిక రక్తపోటును నియంత్రించి తద్వారా గుండెకుపోటును రాకుండా నియంత్రిస్తుంది.
అధిక బరువు, అస్తమాకు లాభసాటి, గుండెకు లాభసాటి, షుగర్ నియంత్రిస్తుంది. ఆస్ట్రియా పారోసిస్ రాకుండా కాపాడును, వత్తిడిని తగ్గిస్తుంది.
హిమాలయాల్లోని పర్వత ప్రాంతాలలో సైంధవలవనం (ఉప్పు) గనుల నిక్షేపాలు అపారంగా వున్నవి. ఈ ప్రాంతంలో ఎటువంటి జనసంచారంగాని,
పరిశ్రమలు గాని లేవు. కాలుష్య రహిత ప్రదేశం కనుక ఈ ఉప్పు అన్ని ఉప్పులలో శ్రేష్టమైనది, ఉత్తమమైనది, అత్యధిక పోషక విలువలు కలిగినది. కనుకనే
మన మహర్షులు ఈ ఉప్పును ఆయుర్వేదంలో నిత్యం వంటలో వాడమని సూచించినారు.

1, మే 2017, సోమవారం

గుండె మంటకు / ఎసిడి టి - ఆహార ఔషధాలు - GUNDE MANTA KU AHARA OUSHADHALU.

గుండె మంటగా ఉండటం,ఎసిడిటి - ఆహారం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.





* ఒక్కోసారి ఆహారం తీసుకోగానే పై పొట్టలో
తాండవనాట్యం ప్రారంభమవుతుంది. పొట్టలోంచి
ఏదో తెలియని పుల్లని ద్రవం పైకి ఎగదట్టి గొంతు
లోంచి దేన్నో ముక్కులోకి, గొంతులోకి ఎగజిమ్ము
తుంది. గుండె దగ్గర బాధ పుడుతుంటుంది. ఓ
టన్ను బరువు తెచ్చి నా మీదకు ఎక్కించినట్టు బరు
వేక్కిపోవటం, త్రేన్సులు, ఎక్కిళ్ళు, హార్ట్ ఎటాక్
వచ్చిందేమోననే భయం... ఆ భయం వలన
ఒళ్ళంతా చెమటలు పట్టటం, చూసేవాళ్ళను కూడా
భయపెట్టే ఈ పరిస్థితినే గుండెల్లో మంట (హార్ట్
బర్న్) అంటారు.
గొంతు దగ్గర నుంచి పొట్టదాకా ఉండే పేగు
భాగాలలోపల సున్నితమైన పల్చని పొర ఉంటుంది.
దీన్ని మ్యూకస్ పొర అంటారు. పేగులోపల పెరిగిన
ఈ పులుపు పదార్థాలలో ఆమ్లాలు నిండడంతో ఈ
పొర భుగభగమంటుంది. లోపల ఏదో కాలుతున్న
ట్టనిపించటం వలన అది గుండెకు దగ్గరగా ఉండే
భాగంలో జరగడం వలన రోగి గుండెల్లో మండు
తోందంచాడు. కడుపు ఉబ్బరం, విరేచనానికో
మూత్రానికి వెళ్ళాల్సి రావటం, ఒకటి రెండు
వాంతులు అవటం ఇవన్నీ ఇందువలన కలుగు
తాయి.
మనకున్న జీర్ణశక్తినీ, అది అరిగించగల ఆహారాన్ని,
మనం తీసుకున్న ఆహారాన్ని గుణకారాలు Chesi ఎంత ఆమ్లాలను విడుదల చేయాలో నిర్ణయించే శక్తి
మెదడుకుంది. సాధారణంగా దాని లెక్కలు తప్పవు.
మనమే లెక్కలు వేసుకోవటంలో విఫలం అయి
గుండెలో మంట తెచ్చుకుంటూ ఉంటాం.
కడుపులో ఇలా తరచూ యాసిడ్ పెరిగిపోతుంటే
తక్కువ కాలంలోనే గొంతు నుంచి పేగులవరకూ
ఉన్న భాగంలో వాపు ఏర్పడడం, లోపల మ్యూకస్
పొర పొక్కి పోయి ఎర్రగా పూసినట్టు అవటం జరు
గుతాయి. దీన్నే రిఫ్లెక్స్
ఈసోఫేగైటిస్ అంటారు.
గుండెజబ్బు,
గుండెలో మంట జబ్బు
ఒకదానికొకటి ఆశ్రయ
ఆశ్రయీ
భావంలో
ఉంటాయి. అంటే ఒక
దాని వలన మరొకటివృద్ధి పొందుతాయన్నమాట. రిఫ్లెక్స్ ఈసో
ఫేగెటిస్ వలన కూడా ఎంజైనా అనే గుండే
నొప్పికి సంబంధించిన లక్షణాలు కనిపి
చిస్తాయి.
వంగుని ఏదైనా వస్తువును తీసుకుంటు
న్నప్పుడు పొట్టమీద వత్తిడికి గుండెలో
మంటగా నొప్పిగా అనిపిస్తే అది గుండె
మంట వ్యాధేగానీ గుండె నొప్పి కాకపోవచ్చు.
భోజనం చేయగానే డొక్కల్లోగానీ పొట్టలోగానీ
నొప్పి రావటం, వెల్లకిలా పడుకుంటే గుండె
-నొప్పిగా అసౌకర్యంగా ఉండడం, నోట్లో పుల్లటి
నీళ్లు ఊరటం, గొంతులోపల కారం పూసినట్టు
మంటగా ఉండడం, గ్యాసు పెరగటం, పొట్ట బిగదీ
యటం, వాంతి కూడా లోపల్నుంచి తన్నుకొచ్చినట్టు
కాకుండా పైనీళ్ళు పై నుండే వస్తున్నట్టు ధారగా
అవటం, భోజనం చెయ్యగానే వాంతి అవటం,
పచ్చళ్ళు కారాలు, అతిగా మసాలాలు, చింతపండు
వేసిన వంటకాలను తిన్న రోజున హార్ట్ ఎటాక్ హడా
విడి కలగటం, అర్ధరాత్రి పూట మంచి నిద్రలో
ఉండగా ముక్కులోకి, గొంతులోకి నీళ్ళు ఫౌంటెన్
చిమ్మినట్టు ఎగదట్టి, పుల్లనీళ్ళన్నీ వెనక్కి తగ్గి, ఆ
మంట చల్లారేవరకూ నిద్రపట్టకపోవటం, గొంతు
పూడుకుపోవటం, మాట పెగలకపోవటం ఇలాంటి
బాధలన్నీ పేగుల్లో యాసిడ్ పెరగటం వలన
ముంచుకొచ్చేవిగా ఉంటాయి. వీటన్నింటికీ కారణ
మైన పులుపు, మసాలాలు, కారాలను అపరిమితంగా తినడమేనని గుర్తించగలగటమే మంచి నినా
రణ.

గుండెలో మంట ఉన్నవాళ్ళు ఉదయం పూట టిఫిన్లు
తినటం మానేసి చల్లన్నం లేదా పెరుగన్నం తినటం
అవసరం. టిఫిన్లే ఎసిడిటీకి ముఖ్య కారణాలు,
శనగపిండి, చింతపండు, ఇతర పులుపు పదార్థాలు,
నూనెలో వేసి వేయించిన వేపుళ్ళు, బాగా వేడిచేసే
వస్తువులు... ఇవి ఎసిడిటీకి పెంపుడు తల్లులు, వాటి
మీద వ్యామోహం వదులుకోవాలి. బియ్యం, కంది
పప్పు, పెసరపప్పు, ఉలవలు వీటిని దోరగా
వేయించి వండుకోండి. తేలికగా అరుగుతాయి.
కేరట్, ముల్లంగి, యాపిల్ లేదా కర్బూజా లేదా
బొప్పాయి... వీటిని సమానంగా తీసుకుని మిక్సీ పట్టి
జ్యూసు చేసుకుని ఒక గ్లాసు మోతాదులో రోజు
రెండు పూటలా తాగండి. ఎసిడిటీ తగ్గుతుంది.
దాహం తీర్చుకోవడానికి మజ్జిగమీద తేరుకున్న నీటినిగానీ, పల్చని మజ్జిగను గానీ తాగటం మంచిది.
బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నానిన
నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది.
పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది. ఈ వ్యాధిలో
పాలు, పాల పదార్థాలు నిషేధం.
బూడిదగుమ్మడి, సొర, బీర, పొట్ల వీటి గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని అన్నంలో తింటే ఎసిడిటీ
పెరగకుండా ఉంటుంది. పులిసిన, పులవబెట్టిన
పదార్థాలను పూర్తిగా మానేయండి. మరమరాల్లాం
టివి తేలికగా అరుగుతాయి.
దానిమ్మ, ఉసిరి కూడా
ఎసిడిటీని పెంచకుండా మేలుచేస్తాయి.
పండిన వెలగపండు ఎసిడిటీ పైన ఔషధంలా పనిచే
స్తుంది. అరటి,
జామ, బొప్పాయి, సపోచాలు మేలు
చేస్తాయి. వేసవిలో లేత తాటి ముంజెలు ఎసిడిటీని
తగ్గిస్తాయి.
కానీ అతిగా తినకూడదు.
అరుగుదల మీద దృష్టి పెట్టి ఆహారం తీసుకునే
వాళ్ళకు ఎసిడిటీ జన్మలో రాదు.




23, ఏప్రిల్ 2017, ఆదివారం

ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటే ఏం చెయ్యాలి? / EPPUDOO EDO OKA ANAROGYA SAMASYA VEDHISTHUNTE EM CHEYYALI?



వ్యాధుల లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుంటే మందులు వాడున్నంత కాలమే కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.ఆ మందులు కాస్త మానేయగానే సమస్య మళ్ళీ మొదలవుతుంది.ఈ సారి ఇన్ని రోజులుగా వాడిన మందుల దుష్ప్రభావాలు అదనంగా కనిపిస్తాయి.ఈ సమస్యలన్నింటికీ శరీరం వ్యాధుల మూలాల నుండి పూర్తిగా విముక్తం కాకపోవడమే కారణం.శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే దీనికి సరైన పరిష్కారం.అందుకొరకు రెండే రెండు మౌలిక సూత్రాలు అనుసరించాలి.1. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవడం. 2.శక్తి నిలువలను తగ్గకుండా చూసుకోవడం.ఇందులో భాగంగా శరీరంలో ఆక్సీజన్ , నీటి నిలువలు , హిమోగ్లోబిన్ , విటమిన్ నిలువలు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.ఈ మౌలిక సూత్రాలు విస్మరించి , డాక్టర్ సూచించిన ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు.ఒక్క మాటలో చెప్పాలంటే , వ్యాధి నుండి విముక్తం కావాలంటే ,వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.

ఆవు పేడ తో ఆయుర్వేద, ఆరోగ్య ప్రయోజనాలు.

గోమాతను పవిత్రంగా భావించి పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆవుపాలతో పాటు అంతే శ్రేష్టంగా భావించే ఆవు పేడ, ఆవు మూత్రంతో మానవునికి హాని చేయని విధంగా పలు రకాల వస్తువులను తయారు చసి విక్రయించేవారు సమాజంలో మంచి పేరు గడిస్తున్నారు. ఇదివరకు ఆవుపేడ అంటే కేవలం ఎరువుగా మాత్రమే వాడతారని తెలుసు. కానీ దానితో మనిషికి ఎంతో ఉపయోగకరంగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే పలు రకాల వస్తువులను తయారుచేసి మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. అలాంటి ఉత్పత్తులలో కిందివి ముఖ్యమైనవి.

అగ్ని హోత్ర..

అగ్ని హోత్ర అనే వస్తువును ఆవు పిడకలు, పంచకము,
నెయ్యి కలిపి తయారు చేస్తారు. దీని వలన ప్రాపలిన్ అనే పదార్థంలో పాటు ఆక్సిజన్ విడుదల అవు
ఉంది. దీంతో మృత్యువుని జయించే శక్తితో పాటు
వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటిలో గొడవలు,
అల్లర్లు జరుగకుండా ఉండే ప్రశాంత వాతావరణం కలిగించే శక్తి
ఇందులో నుంచి వెలువడుతుంది. ఈ పిడకలతో
పాటు నెయ్యివేసి ,హోమం చేస్తే వర్షాలు కురిసే అవకాశాలు
ఎక్కువ. ఆ బూడిదను వేస్తే నీరు శుద్ధిగా అవుతుంది.

దీపం వత్తి..
..
పేడ, పంచకము, నెయ్యితో
తయారు చేసిన దీపం వత్తి తయారు చేయాలి.. దీపం అనేది
ఏకాగ్రత కోసం వాడుతారు.దీపంలో దూది వత్తి,రసాయనాలు కలిపిన నూనెలు వాడటం వల్ల 
అనారోగ్య సమస్యలు ఎదురు
రాయి. కానీ, ఆవు పేడతో చేసిన దీపం వత్తి ని ఇంట్లో కాల్చితే
నిత్యం హోమం చేసినట్లుగా భావిస్తారు. అలాగే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని 
నమ్మకం.

దూప్ స్టిక్..

ధూప్ స్టిక్ ను ఆవు పేడ, పంచకము,
వనమూలికలతో తయారు చేస్తారు.
ఇళ్లలో దూప్ స్టిక్ ను వెలిగించడం వలన
ఏకాగ్రత, బుద్ధికుశలత కలిగించే ఔషధంగా
ఉపయోగపడుతుంది. ఆవుపేడ,
పంచకం, వనమూలికలతో చేయటం
వలన ఆరోగ్యానికి మంచిది.

పళ్ల పొడి..

ఆవు పేడతో తయారు చేసిన పిడకల బూడిద, మిరియాలు, పటిక,
లవంగ, త్రిఫల చూర్ణంతో కలిపి పళ్ళ
పొడిని తయారు చేస్తారు. అలా తయారు చేసిన పొడిలో ఎలాంటి రసాయనాలు
 ఉండవు. ఈ పొడితో పళ్లు
తోముకుంటే పిప్పళ్లు, దంత సమ
వ్యలు, నోటి దుర్వాసన వంటిని
దరి చేరవు. ఊడిపోయే పళ్లు సైతం
గట్టి పడే అవకాశాలు ఉన్నాయి.

ఫినాయిల్..

ఫినాయిల్ ను ఆవు పంచకము,
వేపాకు రసం, ఫైన్ ఆయిల్ తో తయారు
చేస్తారు. పంచకం చల్లిన ప్రదేశం శుద్ధి
అవుతుంది. ఈ ఫినాయిలు వాడడం
వలన దుర్వాసన, క్రిమికీటకాల నుంచి రక్షణ లభిస్తుంది. విష పూరిత రసాయనాలు
 లేకుండా ఫినాయిల్ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

దోమల బిళ్లలు..

దోమల బిళ్లలను ఆవు పేడ, పంచ
కము, వేప ఆకులతో తయారు చేస్తారు.
రసాయనాలు వాడకుండా వీటిని తయారు
చేయడం వలన దోమల నివారణతో
పాటు, ఆవు పేడ, పంచకంతో తయారు
అవుతున్నందున ధనధాన్యాలు సమృద్ధిగా
ఉండే అవకాశాలుంటాయని నమ్మకం.

పేడ బాల్స్..

పేడ, పంచకము, త్రిఫల
చూర్ణం, తులసితో బాల్స్ ను
తయారు చేస్తారు. చిన్న పిల్లలు
సామాన్యంగా ఆడుకోవడానికి
ప్లాస్టిక్, రబ్బర్ బాల్స్ ఉపయోగి
స్తారు. వాటిని నోట్లో పెట్టుకోవు
టంతో అనారోగ్య సమస్యలు తలె 
త్తుతాయి. ఆవు పేడ, పంచకం
త్రిఫల చూర్ణం, తులసితో
తయారు చేసిన బాల్స్ తో పిల్లలు
ఆడుకోవచ్చు. నోట్లో పెట్టుకున్నా
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా
ఉంటాయి.

హోమపిడకలు..

ఆవు పేడ,పంచకము, వన మూలికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని హోమంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పవ
చ్చును.

ఇటుకలు..

ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉంచినట్లయితే చాలా మంచిది .

11 రకాల వస్తువుల తయారీ..

ఆవు పేడను సేకరించటమే ఒక వింతగా భావించే
నేటి సమాజంలో నిత్యం ఆవు పేడ, మూత్రంతోనే గడపడం ప్రత్యేకతే.వాటితో మనిషి ఆరోగ్యం పై ఎలాంటి
ప్రభావం చూపని 11 రకాల వస్తువులను తయారు చేసి,
మార్కెట్‌లోకి తీసుకు రావటం అరుదైన విషయమని
చెప్పొచ్చు. మనం ఇళ్లలో నిత్యం ఉపయోగించే వస్తువుల తో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 
విషయం తెలిసిందే. అయితే ఆవు పేడతో తయారైన ఈ
వస్తువులతో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు ఉండవని ఆ  11రకాల వస్తువులను వాడడం ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. 



17, ఏప్రిల్ 2017, సోమవారం

నిద్ర చెడితే మెదడు చెడుతుంది.

Sleeplessness effects brain a lot.Hence we must take proper rest to keep good health of brain.నా వయసు డెబై యేక్కు రాత్రిళ్ళు సరిగా నిద్రరా
వటం లేదు. నాలుగైదు సారైనా మెలకువ
వస్తోంది. నివారణ చెప్తారా?

• నిద్ర పట్టడం లేదనేది (అనిద్ర) చాలామంది
అనుభవంలోని సమస్యే! మధ్య మధ్య మెలకువ
రాకుండా నిద్రపోయినప్పుడే సంతృప్తికరంగా నిద్ర
పట్టిందని భావిస్తారు. ముక్కలు ముక్కలుగా పట్టిన
నిద్రవలన రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్త సరఫ
రాతో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపో
తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి
సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు దాదాపు
61% వయోవృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతిన
దాన్ని గమనించారు. నిద్రాభంగం అధికంగా అవు
తున్న కొద్దీ ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు
మరింత ప్రమాదకరంగా మారడాన్ని, నాడీ వ్యవస్థ
మరింత దెబ్బతినడాన్ని గుర్తించారు. ఈ నిద్రాభం
గానికి అంతర్గతమైన కారణాలు కూడా ఉన్నాయనే
విషయం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.
ఇది రోజువారీ సమస్యగా మారినప్పుడు తప్పని
సరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర
మాత్రలు వేసుకోవటం దీనికి సరైన నివారణ కాదు.
నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసిక ఒత్తిడి
ఏర్పడవచ్చు. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబ
ధ్ధత, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహా
రాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి.
వాతం వికటించటం వలన ఫ్రాన్స్ లాంటి మానసిక
లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు
ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీ
రంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రప
ట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది.
గుండె దడ, భయంగా ఉండటంలాంటి బాధలేర్పడి
నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే,
ఇంక నిద్రపట్టదు.
ఇందుకు చికిత్స ఆయా
దోషాలకు
అనుగుnanga
చేయవలసి
వస్తుంది.
నిద్రలో తేడా వస్తోం
దంటే తేలికగా అరిగే
ఆహారాన్ని చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి! ఊరగాయ
పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదా
ర్థాలు, నూనె పదార్థాలను మానటం వలన సగం
చికిత్స పూర్తవుతుంది. శరీరానికి తగిన
వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు
నడిచి పెందరాళే ఆహారం తీసుకోవటం, టీవీ
ఇంట్లో ఉందన్న సంగతి మరిచిపోయి 9-10 లోపే

నిద్రకు ఉపక్రమించటం వలన కొంత ప్రయోజనం
- కనిపిస్తుంది. కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రా
-భంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ
-పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేం
దుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్య రాత్రిలో
మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టన్పుడు కూడా
-పుస్తకం అనే ఆయుధం ప్రయోగిస్తే, నిద్రను చెద
గొట్టే రాక్షసి వదిలిపోతుంది. రాత్రిపూట గోరు
చ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా
వస్తుంది. సుఖవంతమైన శయ్య, ఆహ్లాదకరంగా
అలంకరించిన పడకగది కూడా మంచి నిద్రజన
కాలే!
సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట,
అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు
రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని
కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర
వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద
మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు
రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గు
తుంది. ప్రాణాయామం నిద్ర
పట్టేందుకు
మంచి
ఉపాయం.
జాజికాయ, జాపత్రి,
మరాటీ మొగ్గలను 10
గ్రాముల చొప్పున తీసుకుని,
అందులో 5 గ్రాముల పచ్చ
కర్పూరం (పాయసంలో కలు
పుకునేది - హారతి కర్పూరం
కాదు) ఈ నాల్గింటినీ మెత్తగా
నూరి ఒక సీసాలో భద్రపర
చుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు
పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని
కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదే
శ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు
రెండూ వాడుతూ ఉంటే నిద్రను చెరిచే దోషాలు
తగ్గటాన్ని మా అనుభవంలో గమనించాము.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...