23, ఏప్రిల్ 2017, ఆదివారం

ఆవు పేడ తో ఆయుర్వేద, ఆరోగ్య ప్రయోజనాలు.

గోమాతను పవిత్రంగా భావించి పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆవుపాలతో పాటు అంతే శ్రేష్టంగా భావించే ఆవు పేడ, ఆవు మూత్రంతో మానవునికి హాని చేయని విధంగా పలు రకాల వస్తువులను తయారు చసి విక్రయించేవారు సమాజంలో మంచి పేరు గడిస్తున్నారు. ఇదివరకు ఆవుపేడ అంటే కేవలం ఎరువుగా మాత్రమే వాడతారని తెలుసు. కానీ దానితో మనిషికి ఎంతో ఉపయోగకరంగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే పలు రకాల వస్తువులను తయారుచేసి మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. అలాంటి ఉత్పత్తులలో కిందివి ముఖ్యమైనవి.

అగ్ని హోత్ర..

అగ్ని హోత్ర అనే వస్తువును ఆవు పిడకలు, పంచకము,
నెయ్యి కలిపి తయారు చేస్తారు. దీని వలన ప్రాపలిన్ అనే పదార్థంలో పాటు ఆక్సిజన్ విడుదల అవు
ఉంది. దీంతో మృత్యువుని జయించే శక్తితో పాటు
వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటిలో గొడవలు,
అల్లర్లు జరుగకుండా ఉండే ప్రశాంత వాతావరణం కలిగించే శక్తి
ఇందులో నుంచి వెలువడుతుంది. ఈ పిడకలతో
పాటు నెయ్యివేసి ,హోమం చేస్తే వర్షాలు కురిసే అవకాశాలు
ఎక్కువ. ఆ బూడిదను వేస్తే నీరు శుద్ధిగా అవుతుంది.

దీపం వత్తి..
..
పేడ, పంచకము, నెయ్యితో
తయారు చేసిన దీపం వత్తి తయారు చేయాలి.. దీపం అనేది
ఏకాగ్రత కోసం వాడుతారు.దీపంలో దూది వత్తి,రసాయనాలు కలిపిన నూనెలు వాడటం వల్ల 
అనారోగ్య సమస్యలు ఎదురు
రాయి. కానీ, ఆవు పేడతో చేసిన దీపం వత్తి ని ఇంట్లో కాల్చితే
నిత్యం హోమం చేసినట్లుగా భావిస్తారు. అలాగే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని 
నమ్మకం.

దూప్ స్టిక్..

ధూప్ స్టిక్ ను ఆవు పేడ, పంచకము,
వనమూలికలతో తయారు చేస్తారు.
ఇళ్లలో దూప్ స్టిక్ ను వెలిగించడం వలన
ఏకాగ్రత, బుద్ధికుశలత కలిగించే ఔషధంగా
ఉపయోగపడుతుంది. ఆవుపేడ,
పంచకం, వనమూలికలతో చేయటం
వలన ఆరోగ్యానికి మంచిది.

పళ్ల పొడి..

ఆవు పేడతో తయారు చేసిన పిడకల బూడిద, మిరియాలు, పటిక,
లవంగ, త్రిఫల చూర్ణంతో కలిపి పళ్ళ
పొడిని తయారు చేస్తారు. అలా తయారు చేసిన పొడిలో ఎలాంటి రసాయనాలు
 ఉండవు. ఈ పొడితో పళ్లు
తోముకుంటే పిప్పళ్లు, దంత సమ
వ్యలు, నోటి దుర్వాసన వంటిని
దరి చేరవు. ఊడిపోయే పళ్లు సైతం
గట్టి పడే అవకాశాలు ఉన్నాయి.

ఫినాయిల్..

ఫినాయిల్ ను ఆవు పంచకము,
వేపాకు రసం, ఫైన్ ఆయిల్ తో తయారు
చేస్తారు. పంచకం చల్లిన ప్రదేశం శుద్ధి
అవుతుంది. ఈ ఫినాయిలు వాడడం
వలన దుర్వాసన, క్రిమికీటకాల నుంచి రక్షణ లభిస్తుంది. విష పూరిత రసాయనాలు
 లేకుండా ఫినాయిల్ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

దోమల బిళ్లలు..

దోమల బిళ్లలను ఆవు పేడ, పంచ
కము, వేప ఆకులతో తయారు చేస్తారు.
రసాయనాలు వాడకుండా వీటిని తయారు
చేయడం వలన దోమల నివారణతో
పాటు, ఆవు పేడ, పంచకంతో తయారు
అవుతున్నందున ధనధాన్యాలు సమృద్ధిగా
ఉండే అవకాశాలుంటాయని నమ్మకం.

పేడ బాల్స్..

పేడ, పంచకము, త్రిఫల
చూర్ణం, తులసితో బాల్స్ ను
తయారు చేస్తారు. చిన్న పిల్లలు
సామాన్యంగా ఆడుకోవడానికి
ప్లాస్టిక్, రబ్బర్ బాల్స్ ఉపయోగి
స్తారు. వాటిని నోట్లో పెట్టుకోవు
టంతో అనారోగ్య సమస్యలు తలె 
త్తుతాయి. ఆవు పేడ, పంచకం
త్రిఫల చూర్ణం, తులసితో
తయారు చేసిన బాల్స్ తో పిల్లలు
ఆడుకోవచ్చు. నోట్లో పెట్టుకున్నా
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా
ఉంటాయి.

హోమపిడకలు..

ఆవు పేడ,పంచకము, వన మూలికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని హోమంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పవ
చ్చును.

ఇటుకలు..

ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉంచినట్లయితే చాలా మంచిది .

11 రకాల వస్తువుల తయారీ..

ఆవు పేడను సేకరించటమే ఒక వింతగా భావించే
నేటి సమాజంలో నిత్యం ఆవు పేడ, మూత్రంతోనే గడపడం ప్రత్యేకతే.వాటితో మనిషి ఆరోగ్యం పై ఎలాంటి
ప్రభావం చూపని 11 రకాల వస్తువులను తయారు చేసి,
మార్కెట్‌లోకి తీసుకు రావటం అరుదైన విషయమని
చెప్పొచ్చు. మనం ఇళ్లలో నిత్యం ఉపయోగించే వస్తువుల తో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 
విషయం తెలిసిందే. అయితే ఆవు పేడతో తయారైన ఈ
వస్తువులతో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు ఉండవని ఆ  11రకాల వస్తువులను వాడడం ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...