Monday, 1 May 2017

గుండె మంటకు / ఎసిడి టి - ఆహార ఔషధాలు - GUNDE MANTA KU AHARA OUSHADHALU.

గుండె మంటగా ఉండటం,ఎసిడిటి - ఆహారం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.





* ఒక్కోసారి ఆహారం తీసుకోగానే పై పొట్టలో
తాండవనాట్యం ప్రారంభమవుతుంది. పొట్టలోంచి
ఏదో తెలియని పుల్లని ద్రవం పైకి ఎగదట్టి గొంతు
లోంచి దేన్నో ముక్కులోకి, గొంతులోకి ఎగజిమ్ము
తుంది. గుండె దగ్గర బాధ పుడుతుంటుంది. ఓ
టన్ను బరువు తెచ్చి నా మీదకు ఎక్కించినట్టు బరు
వేక్కిపోవటం, త్రేన్సులు, ఎక్కిళ్ళు, హార్ట్ ఎటాక్
వచ్చిందేమోననే భయం... ఆ భయం వలన
ఒళ్ళంతా చెమటలు పట్టటం, చూసేవాళ్ళను కూడా
భయపెట్టే ఈ పరిస్థితినే గుండెల్లో మంట (హార్ట్
బర్న్) అంటారు.
గొంతు దగ్గర నుంచి పొట్టదాకా ఉండే పేగు
భాగాలలోపల సున్నితమైన పల్చని పొర ఉంటుంది.
దీన్ని మ్యూకస్ పొర అంటారు. పేగులోపల పెరిగిన
ఈ పులుపు పదార్థాలలో ఆమ్లాలు నిండడంతో ఈ
పొర భుగభగమంటుంది. లోపల ఏదో కాలుతున్న
ట్టనిపించటం వలన అది గుండెకు దగ్గరగా ఉండే
భాగంలో జరగడం వలన రోగి గుండెల్లో మండు
తోందంచాడు. కడుపు ఉబ్బరం, విరేచనానికో
మూత్రానికి వెళ్ళాల్సి రావటం, ఒకటి రెండు
వాంతులు అవటం ఇవన్నీ ఇందువలన కలుగు
తాయి.
మనకున్న జీర్ణశక్తినీ, అది అరిగించగల ఆహారాన్ని,
మనం తీసుకున్న ఆహారాన్ని గుణకారాలు Chesi ఎంత ఆమ్లాలను విడుదల చేయాలో నిర్ణయించే శక్తి
మెదడుకుంది. సాధారణంగా దాని లెక్కలు తప్పవు.
మనమే లెక్కలు వేసుకోవటంలో విఫలం అయి
గుండెలో మంట తెచ్చుకుంటూ ఉంటాం.
కడుపులో ఇలా తరచూ యాసిడ్ పెరిగిపోతుంటే
తక్కువ కాలంలోనే గొంతు నుంచి పేగులవరకూ
ఉన్న భాగంలో వాపు ఏర్పడడం, లోపల మ్యూకస్
పొర పొక్కి పోయి ఎర్రగా పూసినట్టు అవటం జరు
గుతాయి. దీన్నే రిఫ్లెక్స్
ఈసోఫేగైటిస్ అంటారు.
గుండెజబ్బు,
గుండెలో మంట జబ్బు
ఒకదానికొకటి ఆశ్రయ
ఆశ్రయీ
భావంలో
ఉంటాయి. అంటే ఒక
దాని వలన మరొకటివృద్ధి పొందుతాయన్నమాట. రిఫ్లెక్స్ ఈసో
ఫేగెటిస్ వలన కూడా ఎంజైనా అనే గుండే
నొప్పికి సంబంధించిన లక్షణాలు కనిపి
చిస్తాయి.
వంగుని ఏదైనా వస్తువును తీసుకుంటు
న్నప్పుడు పొట్టమీద వత్తిడికి గుండెలో
మంటగా నొప్పిగా అనిపిస్తే అది గుండె
మంట వ్యాధేగానీ గుండె నొప్పి కాకపోవచ్చు.
భోజనం చేయగానే డొక్కల్లోగానీ పొట్టలోగానీ
నొప్పి రావటం, వెల్లకిలా పడుకుంటే గుండె
-నొప్పిగా అసౌకర్యంగా ఉండడం, నోట్లో పుల్లటి
నీళ్లు ఊరటం, గొంతులోపల కారం పూసినట్టు
మంటగా ఉండడం, గ్యాసు పెరగటం, పొట్ట బిగదీ
యటం, వాంతి కూడా లోపల్నుంచి తన్నుకొచ్చినట్టు
కాకుండా పైనీళ్ళు పై నుండే వస్తున్నట్టు ధారగా
అవటం, భోజనం చెయ్యగానే వాంతి అవటం,
పచ్చళ్ళు కారాలు, అతిగా మసాలాలు, చింతపండు
వేసిన వంటకాలను తిన్న రోజున హార్ట్ ఎటాక్ హడా
విడి కలగటం, అర్ధరాత్రి పూట మంచి నిద్రలో
ఉండగా ముక్కులోకి, గొంతులోకి నీళ్ళు ఫౌంటెన్
చిమ్మినట్టు ఎగదట్టి, పుల్లనీళ్ళన్నీ వెనక్కి తగ్గి, ఆ
మంట చల్లారేవరకూ నిద్రపట్టకపోవటం, గొంతు
పూడుకుపోవటం, మాట పెగలకపోవటం ఇలాంటి
బాధలన్నీ పేగుల్లో యాసిడ్ పెరగటం వలన
ముంచుకొచ్చేవిగా ఉంటాయి. వీటన్నింటికీ కారణ
మైన పులుపు, మసాలాలు, కారాలను అపరిమితంగా తినడమేనని గుర్తించగలగటమే మంచి నినా
రణ.

గుండెలో మంట ఉన్నవాళ్ళు ఉదయం పూట టిఫిన్లు
తినటం మానేసి చల్లన్నం లేదా పెరుగన్నం తినటం
అవసరం. టిఫిన్లే ఎసిడిటీకి ముఖ్య కారణాలు,
శనగపిండి, చింతపండు, ఇతర పులుపు పదార్థాలు,
నూనెలో వేసి వేయించిన వేపుళ్ళు, బాగా వేడిచేసే
వస్తువులు... ఇవి ఎసిడిటీకి పెంపుడు తల్లులు, వాటి
మీద వ్యామోహం వదులుకోవాలి. బియ్యం, కంది
పప్పు, పెసరపప్పు, ఉలవలు వీటిని దోరగా
వేయించి వండుకోండి. తేలికగా అరుగుతాయి.
కేరట్, ముల్లంగి, యాపిల్ లేదా కర్బూజా లేదా
బొప్పాయి... వీటిని సమానంగా తీసుకుని మిక్సీ పట్టి
జ్యూసు చేసుకుని ఒక గ్లాసు మోతాదులో రోజు
రెండు పూటలా తాగండి. ఎసిడిటీ తగ్గుతుంది.
దాహం తీర్చుకోవడానికి మజ్జిగమీద తేరుకున్న నీటినిగానీ, పల్చని మజ్జిగను గానీ తాగటం మంచిది.
బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నానిన
నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది.
పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది. ఈ వ్యాధిలో
పాలు, పాల పదార్థాలు నిషేధం.
బూడిదగుమ్మడి, సొర, బీర, పొట్ల వీటి గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని అన్నంలో తింటే ఎసిడిటీ
పెరగకుండా ఉంటుంది. పులిసిన, పులవబెట్టిన
పదార్థాలను పూర్తిగా మానేయండి. మరమరాల్లాం
టివి తేలికగా అరుగుతాయి.
దానిమ్మ, ఉసిరి కూడా
ఎసిడిటీని పెంచకుండా మేలుచేస్తాయి.
పండిన వెలగపండు ఎసిడిటీ పైన ఔషధంలా పనిచే
స్తుంది. అరటి,
జామ, బొప్పాయి, సపోచాలు మేలు
చేస్తాయి. వేసవిలో లేత తాటి ముంజెలు ఎసిడిటీని
తగ్గిస్తాయి.
కానీ అతిగా తినకూడదు.
అరుగుదల మీద దృష్టి పెట్టి ఆహారం తీసుకునే
వాళ్ళకు ఎసిడిటీ జన్మలో రాదు.




No comments:

Post a Comment