వ్యాధుల లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుంటే మందులు వాడున్నంత కాలమే కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.ఆ మందులు కాస్త మానేయగానే సమస్య మళ్ళీ మొదలవుతుంది.ఈ సారి ఇన్ని రోజులుగా వాడిన మందుల దుష్ప్రభావాలు అదనంగా కనిపిస్తాయి.ఈ సమస్యలన్నింటికీ శరీరం వ్యాధుల మూలాల నుండి పూర్తిగా విముక్తం కాకపోవడమే కారణం.శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే దీనికి సరైన పరిష్కారం.అందుకొరకు రెండే రెండు మౌలిక సూత్రాలు అనుసరించాలి.1. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవడం. 2.శక్తి నిలువలను తగ్గకుండా చూసుకోవడం.ఇందులో భాగంగా శరీరంలో ఆక్సీజన్ , నీటి నిలువలు , హిమోగ్లోబిన్ , విటమిన్ నిలువలు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.ఈ మౌలిక సూత్రాలు విస్మరించి , డాక్టర్ సూచించిన ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు.ఒక్క మాటలో చెప్పాలంటే , వ్యాధి నుండి విముక్తం కావాలంటే ,వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.
No comments:
Post a Comment