Monday, 17 April 2017

నిద్ర చెడితే మెదడు చెడుతుంది.

Sleeplessness effects brain a lot.Hence we must take proper rest to keep good health of brain.నా వయసు డెబై యేక్కు రాత్రిళ్ళు సరిగా నిద్రరా
వటం లేదు. నాలుగైదు సారైనా మెలకువ
వస్తోంది. నివారణ చెప్తారా?

• నిద్ర పట్టడం లేదనేది (అనిద్ర) చాలామంది
అనుభవంలోని సమస్యే! మధ్య మధ్య మెలకువ
రాకుండా నిద్రపోయినప్పుడే సంతృప్తికరంగా నిద్ర
పట్టిందని భావిస్తారు. ముక్కలు ముక్కలుగా పట్టిన
నిద్రవలన రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్త సరఫ
రాతో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపో
తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి
సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు దాదాపు
61% వయోవృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతిన
దాన్ని గమనించారు. నిద్రాభంగం అధికంగా అవు
తున్న కొద్దీ ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు
మరింత ప్రమాదకరంగా మారడాన్ని, నాడీ వ్యవస్థ
మరింత దెబ్బతినడాన్ని గుర్తించారు. ఈ నిద్రాభం
గానికి అంతర్గతమైన కారణాలు కూడా ఉన్నాయనే
విషయం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.
ఇది రోజువారీ సమస్యగా మారినప్పుడు తప్పని
సరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర
మాత్రలు వేసుకోవటం దీనికి సరైన నివారణ కాదు.
నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసిక ఒత్తిడి
ఏర్పడవచ్చు. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబ
ధ్ధత, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహా
రాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి.
వాతం వికటించటం వలన ఫ్రాన్స్ లాంటి మానసిక
లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు
ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీ
రంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రప
ట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది.
గుండె దడ, భయంగా ఉండటంలాంటి బాధలేర్పడి
నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే,
ఇంక నిద్రపట్టదు.
ఇందుకు చికిత్స ఆయా
దోషాలకు
అనుగుnanga
చేయవలసి
వస్తుంది.
నిద్రలో తేడా వస్తోం
దంటే తేలికగా అరిగే
ఆహారాన్ని చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి! ఊరగాయ
పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదా
ర్థాలు, నూనె పదార్థాలను మానటం వలన సగం
చికిత్స పూర్తవుతుంది. శరీరానికి తగిన
వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు
నడిచి పెందరాళే ఆహారం తీసుకోవటం, టీవీ
ఇంట్లో ఉందన్న సంగతి మరిచిపోయి 9-10 లోపే

నిద్రకు ఉపక్రమించటం వలన కొంత ప్రయోజనం
- కనిపిస్తుంది. కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రా
-భంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ
-పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేం
దుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్య రాత్రిలో
మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టన్పుడు కూడా
-పుస్తకం అనే ఆయుధం ప్రయోగిస్తే, నిద్రను చెద
గొట్టే రాక్షసి వదిలిపోతుంది. రాత్రిపూట గోరు
చ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా
వస్తుంది. సుఖవంతమైన శయ్య, ఆహ్లాదకరంగా
అలంకరించిన పడకగది కూడా మంచి నిద్రజన
కాలే!
సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట,
అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు
రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని
కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర
వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద
మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు
రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గు
తుంది. ప్రాణాయామం నిద్ర
పట్టేందుకు
మంచి
ఉపాయం.
జాజికాయ, జాపత్రి,
మరాటీ మొగ్గలను 10
గ్రాముల చొప్పున తీసుకుని,
అందులో 5 గ్రాముల పచ్చ
కర్పూరం (పాయసంలో కలు
పుకునేది - హారతి కర్పూరం
కాదు) ఈ నాల్గింటినీ మెత్తగా
నూరి ఒక సీసాలో భద్రపర
చుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు
పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని
కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదే
శ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు
రెండూ వాడుతూ ఉంటే నిద్రను చెరిచే దోషాలు
తగ్గటాన్ని మా అనుభవంలో గమనించాము.

No comments:

Post a Comment