29, జులై 2016, శుక్రవారం

బిపి ఉందని తెలిశాక...

Kalaరా,ప్లేgu,క్షయ... ఇలా ఎన్నెన్నో రకాల
వ్యాధులు మనుషులను కబళించివేస్తుండేవి.
మానవాళి మనుగడకు ముప్పుగా మారిన ఆ వ్యాధుల
మీద జరిపిన పరిశోధనలు టీకా మందులతో, వియం
త్రణ మార్గాలనో కనుగొనటంతో పలురకాల భయం
కర వ్యాధులను అంతం చెయ్యగలిగాము.
అయితే వాటిని అంతం చేసిన అనందం అట్టే
కాలం విలవటంలేదు. కొత్త వ్యారులు బయటపడు
తున్నాయి. మనుషులకు కలరిస్తూనే వున్నాయి.
మనుషులను వేధించే అంటువ్యాధుల విషయంలో
తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్తలతో
- బయటపడగలుగుతున్నారు. కాని మానవుడికి మరో
కరినుండి సోకక తన శరీరంలోనే సమస్యలను తెచ్చి
-పెట్టేకొత్తరకం రోగాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.
- వాటిలో అధిక రక్తపోటు ఒకటి. ఇది వారి వారి శరీరా
వికి సంబంధించిన ఇబ్బందులు.
తాజా గణాంకాల ప్రకారం వయసులో వున్న
వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి అధిక రక్తపోటు
సమస్య వుంటు
న్నది. 65 ఏళ్ళ
లోపు మరణిonche

అదుగురిలో ఒకరి మరణానికి కారణం. ఆయన
రక్తపోటు, ఇంటిలో పెద్దలకు అనారోగ్యం కలిగినప్పుడు
మరో రకంగానో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో
అధిక రక్తపోటు గురించి వినటమో లేక మాట్లాడట
చేస్తాము. కాని వాస్తవంలో రక్తపోటు అంటే ఏమిటి
దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే
గుండె కొట్టుకుంటుంటే మనిషి బతికి వున్నట్టు
వారు చాలా తక్కువగా ఉంటున్నారు.
రక్తపోటు సమస్యలు ఏర్పడిన తర్వాత వైద్యులు
దగ్గరికి పరిగెట్టేసరికే కొంత సమయం పడుతుంది
ఈలోగా జరగాల్సిన నష్టం జరగవచ్చు. దీర్ఘకాలం
మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ముందుజాగ్రత్త ముఖ్యం
రక్తపోటు గురించి మనిషి ఆరోగ్యంగా వున్న
సమయంలోనే తెలుసుకుని తగిన జాగ్రత్తలు వహిం
చటం మంచిది. రక్తపోటు ప్రతి మనిషిలో వుండే..
లెక్క గుండె గనుక కొట్టుకుంటుంటే రక్తంలో
రంలో ప్రవహిస్తుంటుంది.
శరీరంలోని రక్తనాళాలగుండా ప్రవహించేటప్పుడు
ఆ రక్తనాళాల గోడల మీద రక్తంవల్ల ఏర్పడే ఒత్తిడిని
రక్తపోటు అంటారు. ఆ రక్తపోటు లేకుంటే రక్తం
నాళాలగుండా ప్రవహించదు. కాబట్టి మనిషి బతం
లంటే రక్తపోటు వుండి తీరాల్సిందే.
రక్తపోటు గురించి అర్థంచేసుకునేందుకు గుండె
పనితీరును తెలుసుకోవటం అవసరం. శరీరంలోని
కీలక అంగం గుండె. నిరంతరం పనిచేస్తుంది.
మానవగుండెలో నాలుగు గదులుంటాయి. వీటిలో
పైన వున్నవి కుడి, ఎడమ కర్ణికలు, కింద వున్నవి
కుడి, ఎడమలుగా విభజించబడిన జరరిక.
కర్ణికలు, జఠరికల్లోకి కవాట సహిత రంధ్రాలు
ద్వారా తెరచుకుంటాయి. కుడి కర్ణిక శరీరంలోని
మలిన రక్తాన్ని అందుకుని కుడి జఠరికలోకి పంపు
తుంది. కుడి జఠరికనుండి మలినరక్తం ఊపిరితిత్తు
లలో శుద్ధి చేసేందుకు పంపబడుతుంది.
ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గ్రహించి ఎర్రబడిన
రక్తం తిరిగి ఎడమ కర్ణిక, అక్కడినుండి ఎడమ జర్
రికలకు చేరి, అక్కడి నుండి శుద్ధరక్తం శరీర భాగాల
న్నింటికి పంపుతుంది. ఇదంతా గుండె '
లబ్
అని కొట్టుకునేటప్పుడు జరిగే ప్రక్రియ.
గుండె ఒక పంపింగ్ మిషన్వంటిది. గుండె కండ
రాలు, గుండెలోని కవాటాలు అన్నీ సక్రమంగా పని
చేస్తున్నప్పుడే గుండె సంపూర్ణ సమర్థతతో పనిచేస్తుంది. సాధారణ ఆరోగ్యవంతుని గుండె నిమిషా
వికి 60 నుండి 90సార్లు మధ్య కొట్టుకుంటుంది.
60 నుండి 60సార్లు కొట్టుకుంటే 3 నుండి 5
లీటర్ల రికాన్ని నిమిషానికి శరీరానికి సరఫరా చేస్తుంది.
శరీర అవసరాన్ని బట్టి గుండె కొన్ని సందర్భాలలో
మరింత వేగంగా కొట్టుకుంటుంది.
పరిగెట్టినప్పుడు, భయపడినప్పుడు గుండె దడ
అనిపించటం అందరికి అనుభవమే. గుండె నుండి
నేరానికి శుద్ధ రక్తం తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమ
నులని, శరీరంలో మలినపడిన రక్తాన్ని తిరిగి గుండెకు
చేర్చే నాళాలను శిరలని అంటారు.
గుండె పంప్ చేసిన రక్తం నాళాలలో తరంగంలా
ప్రవహిస్తుంది. దీనివలన ఆరక్త ఒత్తిడికి నాళం గోడ
పడి లేస్తుంటుంది. అలా రక్తనాళాలకు పెరిగిన ఒత్తిడి
సమయం సెస్టోల్'గా తగ్గిన సమయం 'డయాస్టోల్'గా
పిలుస్తారు. సిస్టోల్' అంటే ఒత్తిడి అధికం, డయా
స్టోల్ అంటే ఒత్తిడి కనిష్ఠం.
రక్తపోటు అంటే...."
సాధారణ సమయంలో సిస్టోలిక్ పోటు 160
మి.మీ. హెచ్.జిగా సిస్టోలిక్ పోటు 90 మి.మీ. హెచ్.
జిగా వుంటుంది. ఎమ్.ఎమ్ హెచ్.జి అని రక్తపోటు
కొలతను చెపుతారు. ఇందులో హెచ్.జి అనేది పాద
రసం రసాయనిక గుర్తు. మి.మీ. కొలత.
రక్తపోటును కొలిచేందుకు వాడే పరికరంలోని
సన్ననినాళంలో పాదరసం ఎంత ఎత్తుకు చేరిందో అది
సూచిస్తుంది. 160/90 కన్నా ఎక్కువవున్నా ఆరో
గ్యంగావున్నవారు లేకపోలేదు. ఐతే 160/90ని సాధా
రణ రక్తపోటుగా పేర్కొంటారు. మానవుని రక్తపోటును
కొలిచే సాధనాన్ని స్పిగ్మోమానో మీటర్' అంటారు.
ఈ రక్తపోటు మనిషిలో స్థిరంగా వుండదు. విశ్రాం
తిగాపడుకున్నా, నిద్రిస్తున్నా రక్తపోటు తక్కువగా
వుంటుంది. నిలబడినప్పుడు, నడిచినప్పుడు, మెట్లు
ఎక్కేటప్పుడు, పరిగెడుతున్నా ఆదుర్దా, ఆనందం,
భయంవేసినా రక్తపోటు పెరుగుతుంది.
పనిచెయ్యటం ఆపినా, ఆ భావోద్వేగాలనుండి
-వెనక్కి వచ్చినా తిరిగి రక్తపోటు సాధారణమవుతుంది.
గుండె, రక్తనాళాలు సాధారణ ఆరోగ్యస్థితిలో వున్న
5ప్పుడు ఇటువంటి రక్తపోటు హెచ్చుతగ్గుల్ని తట్టుకుని
నిలబడగలుగుతాయి.
5 అలాకాక అధిక రక్తపోటు- ఎక్కువసేపు నిలిచి
వుంటే అది ప్రమాదానికి దారితీస్తుంది.
గుర్తించటమెలా! -
అధిక రక్తపోటు వుందని చాలామందికి వెంటనే
తెలియదు. కీలక అంగాలకు దెబ్బ తగిలేవరకు
తాము తీవ్ర రక్తపోటు బాధితులమని తెలుసుకోరు.
రక్తపోటు సమస్యను నైపుణ్యం కలిగిన వైద్యుడు
- మాత్రమే గుర్తించగలడు.
కాబట్టి రక్తపోటు విషయంలో అప్పుడప్పుడు పరీ
క్షలు చేయించుకోవటం అవసరం. కారణాలు
స్పష్టంగా తెలియదు కాని కొన్ని వర్గాలలో మాత్రం
రక్తపోటు సమస్య వుంది.
భారీకాయంగలవారికి, ఆర్థిక సమస్యలతో సత
మతమయ్యేవారికి, 65 సంవత్సరాలు పైబడినవారు,
వంశంలో అధిక రక్తపోటు లక్షణం వున్నవారు రక్త
పోటును మధ్యమధ్యలో చెక్ చేయించుకోవాలి.
అలాగని ఆ వర్గాలకు చెందనివారికి పరీక్షలు
అక్కరలేదని కాదు. శారీరకంగా, ఆరోగ్యపరంగా
కనిపించే కొన్ని లక్షణాలను అధిక రక్తపోటు లక్షణా
లుగా భావించి పరీక్ష చేయించుకోవటం అవసరం.
తరచుగా తలనొప్పి, విడవకుండా ఆ తలనొప్పి
వేధించటం, అర్థంలేని అలసట, తల తిరుగుడు,
ఒత్తిడికి గురికావటం వంటివి కనిపిస్తే రక్తపోటు
పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా పనిచేస్తున్నప్పుడు
ఊపిరి అందక ఇబ్బందిపడుతుంటే అది రక్తపోటు
తీవ్రత లక్షణంగా తెలుసుకోండి.
సైలెంట్ కిల్లర్
అధిక రక్తపోటు అనేది ప్రమాదకరమైనది. ఎటు
వంటి హెచ్చరిక లేకుండా చాటుగా దెబ్బతీస్తుంది.
ఒకసారి అధిక రక్తపోటు సమస్య ఏర్పడితే దానిని
2917.2016
నియంత్రించుకుంటూ జీవితకాలమంతా భరించటం
తప్పించిదానిని పూర్తిగా తగ్గించుకునే మార్గం లేదు.
ముందస్తు హెచ్చరికలు చేయకుండా లోపల
కీలక అంగాలైన గుండె, మూత్రపిండం, మెదడు
లను దెబ్బతీస్తుంది. కాబట్టి హైబీపిని సైలెంట్
కిల్లర్ అని అంటారు.
రక్తపోటు పెరిగినపుడు రక్తనాళాలలో రక్త ప్రవాహ
నికి అడ్డంకి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో
రక్తాన్ని నాలాలలోకి సరిగా పంప్ చేసేందుకు గుండె
మరింత కష్టపడాల్సి వస్తుంది. సాధారణ స్థాయిని 4.
మించిన ఒత్తిడిలో గుండె పనిచేసినందున గుండె
కండరాలు అలసిపోయి చివరికి పనిచేయటం మాని
వేస్తాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది.
రక్తపోటు తీవ్రత ప్రభావాన రక్తనాళాలలో ఒత్తిడి
అధికమై రక్తనాళ గోడలనుండి సూక్ష్మంగా రక్తస్రావం
జరగవచ్చు లేదా రక్తనాళాలు చిట్లవచ్చు.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త
నాళాలు దెబ్బతింటే, గుండెకు అవసరమైన శక్తి
లభించక గుండెపోటు వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావాన మూత్రపిండాల పని
తీరు పాడవుతుంది. అసలు పూర్తిగా దెబ్బతినవచ్చు.
మెదడులో రక్త ప్రసరణ సమస్యవల్ల పక్షవాతం
వస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి సాధా
రణ ఆరోగ్యవంతులకన్నా పక్షవాతం, గుండెపోటు
ఇబ్బందులు రెండురెట్లు అధికంగా వుంటాయి.
ఎందుకు వస్తుంది.
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది రెండు
రకాలు. వీటిలో ఒకదానిని 'మాలిగ్నెంట్ హైపర్
టెన్షన్' అని ఇక రెండవ దానిని బినైన్ హైపన్షన్
అని అంటారు.
మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుందో
సరిగా తెలియదు. కాని ఇది యవ్వనంలో వున్న
వారికి వస్తుంది. దీనివలన కంటి చూపు కొంతమేర
2. దెబ్బతింటుంది. మూత్రపిండాల పనితీరు మంద
గించి క్రమంగా పూర్తిగా పనిచెయ్యవు. ఊపిరాడక
ఇబ్బంది పడతారు. హైపన్షన్లో గతంలో పలు
వురు మరణించేవారు. ఇప్పుడు దీనిని నియంత్రించే
మందులు మార్కెట్లోకి వచ్చాయి.
'బినైన్ అనే ఆంగ్ల పదానికి అర్థం అంతగా ప్రమాద
హేతువుకానిదని. కాని వేలాది మంది ప్రాణాలు
బలికొంటున్న దీనిని 'బినైన్ అని ఎలా అనగలం.
అయితే గతంలో ఎందుకో ఆ పేరు పెట్టారు.
ఇప్పటికీ అదే స్థిరపడింది.
'బినైన్ హైపర్టెన్షన్' ఎటువంటి ఇబ్బందులను
ప్రారంభంలో చూపించదు. ఏదీ హరాత్తుగా జర
గదు. క్రమంగా పెరుగుతూ రక్తనాళాలను, గుండెను
దెబ్బతీసి చివరికి గుండెపోటు తెస్తుంది.
'బినైన్ హైపర్ టెన్షన్' వచ్చిన వారిలో 90శాతం
మందిలో ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. ఇది
వంశపారంపర్యంగా వస్తుంది. అయితే 30 ఏళ్ళు
దాటేవరకు బయటపడదు. తల్లిదండ్రులు ఇరువురు
హైపర్ టెన్షన్' కలిగిన వారైతే సంతానానికి ఆ
ఇబ్బంది వచ్చే అవకాశం అధికం.
వంశపారంపర్యంగా హైబిపి' వుండి ఉప్పు అధి
కంగా తినే అలవాటు వుంటే హైపర్ష రావటం
ఖాయం. తాగే నీటిలో కాల్షియమ్, మెగ్నీషియమ్
లేకున్నా, కాడ్మియమ్ కలిగివున్నా హైపన్షన్
వస్తుంది. తీవ్ర భావోద్వేగాలకు గురయ్యేవారు. నిరం
తర ఒత్తిడికి గురయ్యేవారికి హైపర్టెన్షన్ వస్తుంది.
రక్తనాళాల గోడలు గట్టిపడినా, సాగేగేణం తగ్గినా
రక్తపోటు వెంటనే పెరుగుతుంది.


తీసుకుని చర్చిస్తాడు.
.
.
- హైపర్టెన్షన్ కి పరీక్ష
హైపర్ టెన్షన్ కి పరీక్ష చేయించుకున్న తర్వాత
- వైద్యుడు మూడు ముఖ్యమైన అంశాలను పరిగణలోకి
• హైపర్ టెన్షన్ స్థాయి ఏ స్థాయిలో వున్నది... దాని
వల్ల ఇప్పటికే జరిగిన నష్టం
హైపన్షనికి గల కారణాలు ఏమిటి
మీరు ఏమిచేయటంవల్ల ఇప్పటికే వున్న
రోగం
ముదురుతున్నది.
వీటికోసం కీలక అంగాలన్నింటిని పరీక్షిస్తారు.
కారణం తెలిస్తే తప్పించి చికిత్సను మొదలు పెట్ట
లేరు. ఎడ్రినల్ గ్రంధిలో కణితి వంటిది కారణమైతే
- శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తే సరిపోతుంది. కిడ్నీలకు
సోకిన ఇన్ఫెక్షన్ కారణమైతే మందులు ఇస్తారు.
కాని 90 శాతం కేసుల్లో హైపన్షన్ వాస్తవ
కారణం స్పష్టంగా తెలియదు కాబట్టి వైద్యుడు ఆ
కారణం వెతికి పట్టే యత్నం చేస్తారు.
భారీకాయం, ఒత్తిడి, డయాబెటిస్, పొగతాగే
అలవాటు, కొలెస్టరాల్ అధికంగా వున్న ఆహారం,
ట్రైగ్లిసరిన్స్... ఇలా ఏవైనా కారణం అయి వుండవచ్చు.
కాబట్టి ముందుగా వాటిని ఒక వైద్యుడిని ఎంచుకున్న
తర్వాత ఆ నిపుణుడు చెప్పిన పద్ధతిలో జీవనవిధానం
మార్చుకోవటం, మందులు వేసుకోవటం చెయ్యాలి.
వైద్యుడి సూచన మేరకు తరచు పరీక్షలు చేయించు
కోవాల్సి ఉంటుంది.
చికిత్స అనేది హై బి.పి.ని అదుపులో వుంచే
యత్నమే గాని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేది
కాదన్న వాస్తవం గుర్తించి దానికి తగినట్టుగా జీవితం
గడపటం ఎంతైనా అవసరం.
ఉప్పు తక్కువ ఆహారం, ఊరగాయలు లేని
భోజనం వంటివి సూచించినపుడు తు.చ. తప్పక
పాటించాలి. ఆహారం, అలవాట్ల విషయంలో వైద్యుడి
సమయానికి నిద్ర, తగినమేర వ్యాయామం, ఒక
అయితే వైద్యులు చెప్పనది, ఇప్పుడిప్పుడే రుం
నియమ నిబంధనల పాటింపు తప్పనిసరి. సరైన
గురవని జీవన విధానంతోపాటు తరచుగా వైద్య పరీ
వులతో అంగీకరించబడిన కొత్త ఔషదం "నప్పు...
నవ్వు హైటెన్షన్ని అదుపులో వుంచగలిగిన మాన
నవ్వినప్పుడు ప్రారంభ దశలో మనకు బి.పి.
పెరిగినట్టు అనిపించినా అది ఆ తర్వాత సాధారణ
క్షలు చేయించుకోవాలి.
సిక, శారీరక అంశం.
నవ్వితే ముఖం, మెడ,గొంతు, ఛాతి, ఉదర కండ
రాలన్నీ కదలటమే కాదు రిలాక్స్ అవుతాయి.
స్థాయికి తెస్తుంది.
1
ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆదుర్దా కలిగి
నప్పుడు ఎండార్ఫిన్స్ విడుదలై కార్టిసాల్ ప్రభావాన్ని
ఔషధంగా నవ్వుల
నప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ రక్ష
నాళాలు కుచించుకుని రక్తపోటు పెరిగేలా చేస్తే నవ్వి
తగ్గించి ప్రశాంతతను తెచ్చి పెడతాయి. దీనితో బి.పి
సాధారణమవుతుంది.
నవ్వినప్పుడు రక్తప్రసరణ మెరుగవుతుంది.
రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇది కూడా
హైబి.పి. ఇబ్బందినుండి ఉపశమనం కలిగించేదే.
అయితే చిరునవ్వులు చిందించి నవ్వుతో లాభం
కలగలేదనుకోకండి. మనసారా నవ్వగలిగితేనే ఈ
లాభం పొందగలరు. మీరు ఎంత బిగ్గరగా నవ్వగలి
గితే అంత మంచిది.
నవ్వుతో బి.పి.అదుపులో వుంటుందని భారతీయ,
జపాన్ పరిశోధకులు ధృవీకరించిన తర్వాత నేడు
ప్రతి పట్టణంలో లాఫింగ్ క్లబు ఏర్పడుతున్నాయి.
రోజూ ఉదయం లేదా సాయంత్రం తప్పని సరిగా
నవ్వులలో తేలియాడే సాటిబృందం వుంటే మీ హైపర్
టెన్షన్ సమస్యను హాయిగా మరచిపోగలరు. కనీసం
రోజులో 15 నుండి 20 నిమిషాలు మనసారా నవ్వే
వారికి చక్కని మందు దొరికినట్టే.
హై బి.పి. అనగానే భయంతో వణికిపోయి
జీవితం అంతటితో సరి అన్న ఆలోచన రానివ్వవద్దు.
ఒక వైద్యుడి నుండి మరో వైద్యుడి దగ్గరికి మారి
నంత మాత్రాన తక్షణం ఈ రోగం తగ్గుతుందన్న
భ్రమవదలటం మంచిది.
భిన్నమైన అభిప్రాయాలు వైద్యులు చెప్పినందున
గందరగోళం పెరుగుతుందే కాని తగ్గదు. ఇక హైపర్
టెన్షన్ అదుపుకు ఎక్కువ సమయం పడుతుంది.
సహనం చాలా అవసరం.
శరీరంలో సైలెంట్ కిల్లర్' చేరింది కాబట్టి దాని
మీద సహనమనే ఆయుధమే పనిచేస్తుంది. ఆదుర్దా
పడితే ఆ 'కిల్లర్' సులభంగా దెబ్బతీస్తుంది.
హైపర్ టెన్షన్ ని అదుపులో వుంచుకుని హాయిగా
జీవనం సాగించినవారు వేలల్లో వున్నారు. ఆ అవగా
హనాలేమే అసలు ఇబ్బంది.

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు. / PAGATI NIDRA - RATHRI DUTIES - HEALTH TIPS

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు.

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం 5,6 ఏళ్ళ పాటూ రాత్రిళ్ళు మేల్కొని పని చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ప్రకృతికి ఇలా విరుద్ధంగా జీవించటాన్ని సర్కాడియన్ రిథం డిస్రప్షన్ అంటారు .పాతికేళ్ళకు పైగా నైట్ డ్యూటీలు చేస్తున్నవాళ్ళు ఉన్నారు,వాళ్ళలో చాలామందికి పగటి డ్యూటీ వేస్తే చేయలేనంతగా రాత్రి డ్యూటీకి అలవాటు పడిపోయి ఉంటారు.కొన్ని తరాలపాటూ ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చు కూడా.వీళ్ళు ఒక సామాజిక అవ్యవస్థకు / సోషల్ జెట్ లాగ్ గురవుతుంటారు.స్త్రీలలో ఈస్ట్రోజన్ లాంటి పునరుత్పాదక హార్మోనుల ప్రభావం తోడవడం వల్ల , నడివయస్సు దాటిన వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మన అవసరాలు గడవడం కోసం , బాహ్య ప్రకృతిని, పర్యావరణాన్నే కాకుండా , మన శరీర ప్రకృతులను కూడా మనం విధ్వంసం చేస్తున్నాము.అతిగా నిద్ర మేల్కోవడం వల్ల బుర్ర పని చేయడం తగ్గిపోతుంది.పనిలో నాణ్యత పడి పోతుంది.మనిషి పక్షవాతానికి, బీపీ,గుండె జబ్బులు,షుగరు,జీర్ణకోశవ్యాధులకు,కీళ్ళవాతానికి లోనవుతాడు.చీకట్లో మెలకువ, పగలు నిద్ర ప్రకృతి విరుద్ధాలే.తప్పనిసరిగా పనిచేసినపుడు శరీరంలో వాతం,వేడి పెరిగిపోతాయి.కావున ఆహారపదార్థాల ద్వారా వాతాన్ని తగ్గించి,చలువ చేసే వాటిని తీసుకోవాలి.రాత్రి జాగరణవల్ల వాతం వికారం చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.ఇది పక్షవాతానికి కారణంకూడా కావచ్చని తాజా పరిశోధన తెలుపుతోంది.కాబట్టి చలువ చేసే ఆహారపదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి.పులుపులేని కూరగాయలు,ఆకుకూరలు అన్నీ మేలు చేస్తాయి.కానీ వాటిని అతిగా చింతపండుతోనో ,అల్లం వెల్లుల్లితోనో ,శనగపిండితోనో,నూనెతోనో వండినందువల్ల వేడి , వాతం చేసేవిగా మారిపోతాయి.

ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి,ఒక ఆపిల్ / లెద పులుపు లేని ఒక పండు  ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగాలి.వాతం , వేడి తగ్గుతాయి.శరీర అనుకూలత సాధించుకోవటానికి , వాతహరంగా, వేడిని రూపు మాపేదిగా ఉండే ఆహార పదార్థాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. బూడిద గుమ్మడిని సోరకాయా పద్ధతిలో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.ఇది శరీరంలో నిద్రలేమి వల్ల కలిగే అలసటను పోగొడుతుంది.మర్నాడు నిద్రచాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.బార్లీ జావ , సగ్గు బియ్యం జావ , స్బజా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి నైట్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి.అలసటను నివారిస్తాయి.
పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి.రకరకాల కూరగాయల ముక్కలు వేసి చేసిన పెరుగు పచ్చడి జీర్ణకోశాన్ని బల సంపన్నం చేస్తుంది.ధనియాలు, జిలకర,శొంఠి లను సమానంగా తీసుకొని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకొని , కొద్దిగా ఉప్పు వేసుకొని రోజూ ఒకటి రెండుసార్లు తాగాలి.

పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ఏమీ తినకుండా పడుకొని నిద్రపోవడం మంచిది.రాత్రి 10 గంటల తర్వాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఇలాగే ఉదయం నిద్రపోతే నిద్రలేమి రాదు అని సుశ్రుతుడు చెప్పడం జరిగింది.పచ్చళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి.మద్యం,సిగరెట్లు వాడడం రాత్రి డ్యూటీలు చేసేవారిలో అనారోగ్యాన్ని వేగవంతం చేస్తుందని గ్రహించాలి.

19, జూన్ 2016, ఆదివారం

లడ్డూలు - ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలుLADDOOLU AYURVEDA AROGYA PRAYOJANALU.


లడ్డూ అంటే తెలుగువారికెంతో భక్తి ,పవిత్రం , శుభం.ఇవి మన సంస్కృతిలో ఒక భాగం.సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం.లడ్డూ చేసుకోవడం అంటే తెలుగు వారికి పండగ చేసుకోవడమే.పెళ్ళిళ్ళలో తొలి వడ్డన లడ్డు.తిరుపతి లడ్డు లాగా బందరు లడ్డు / తొక్కుడు లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది.

లడ్డూలను శనగపిండితోనే చేయాలని నియమం ఏమీ లేదు.సున్ని ఉండలు , కొబ్బరి ఉండలు ,నువ్వుండలు ఇవన్నీ లడ్డూలే.మహారాష్ట్ర , బెంగాళీల ప్రభావంతో స్వాతంత్రోద్యమ కాలంలో శనగ పిండి వంటకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి.అంతకు పూర్వం మినప,జొన్న,సజ్జ,వరి ,గోధుమ,ధాన్యం వంటి చిరుతిళ్లన్నీ వండుకునే వాళ్లు.ఇటీవలి కాలంలో శనగ పిండి వాడకం వేలం వెర్రి అయింది.లడూకి ఆ రుచినిస్తుంది శనగ పిండి మాత్రమే కాదు అందులో చేర్చిన నెయ్యి , పటిక బెల్లం,పచ్చ కర్పూరం,జీడి పప్పు , కిస్మిస్ , యాలకులూ వగైరా.ఇవి సమృద్ధిగా ఉంటే ఏ పిండితో చేసినా రుచిగానే ఉంటాయి.

" ద " అనే అక్షరంలో ఉండే చిర్రి శనగలు లేదా దేశవాళీ శనగలతో చేసినదైతే శనగ పిండి మంచిదే.శనగ పప్పుని మర పట్టించిన శనగ పిండిని వాడుకోవడం మంచిది.బలకరం,కానీ కష్టంగా అరుగుతుంది.జీర్ణశక్తి బలకరంగా లేనివారికి అపకారం చేస్తుంది.పర్వతాలు ఫలహారం చేయగలవారికి శనగ పిండి మేలు చేస్తుంది.శనగ పిండి తిని తట్టుకోగలగాలి.అంతేకాని శనగ పిండి మంచిది కాదు అని ముద్ర వేయడం సరికాదు.

బొంబాయి రవ్వతో ఆయుర్వేద , ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ? BOMBAYI RAVVATO AYURVEDA AROGYA PRAYOJANALU EMITI?


బొంబాయి రవ్వను గోధుమల్లోంచే తయారు చేస్తారు.మెత్తగా పిండి చేస్తే అదే మైదా పిండి అవుతుంది.రవ్వగా పట్టిస్తే అది బొంబాయి రవ్వ అవుతుంది.గోధుమ రవ్వను రవ్వ గోధుమల నుండి తీస్తారు.రెండూ వేర్వేరు గోధుమలు.గోధుమ రవ్వలో కేలొరీలు తక్కువ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి.బొంబాయి రవ్వకన్నా గోధుమ రవ్వ మేలైనది.చక్కెర వ్యాధిలో కూడా తినదగినదిగా ఉంటుంది.బొంబాయి రవ్వ ఆకలిని , జీర్ణ శక్తిని చంపుతుంది.కడుపులో ఆంలాన్ని పెంచుతుంది.వేడి చేస్తుంది.కాబట్టి పరిమితంగా వాడుకోవాలి.

మనకు గోధుమ పిండి , గోధుమ రవ్వ తెలిసినంతగా బొంబాయి రవ్వ తెలియదు.కొందరు దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు.జొన్న రవ్వ , గోధుమ రవ్వ , బియ్యపు రవ్వలతో చేసే వంటకాలన్నీ బొంబాయి రవ్వ వంటకాలుగా మారిపోయాయి.ఉప్పుడు రవ్వ స్థానం లో బొంబాయి రవ్వ ఇడ్లీ వచ్చింది.గోధుమ పిండితో చేసే హల్వా స్థానంలో కేసరి వచ్చింది.బియ్యపు రవ్వ ఉప్మా స్థానే బొంబాయి రవ్వ ఉప్మా ,జొన్న రవ్వ లేదా గోధుమ రవ్వతో చేసే కిచిడీ స్థానే బొంబాయి రవ్వ కిచిడి ఇలా వంటకాలు బొంబాయి రవ్వ పార్టీలోకి వెళ్ళిపోయాయి.సజ్జ అప్పాలను సజ్జ రవ్వతో చేసే వాళ్ళు ఇప్పుడు బొంబాయి రవ్వతో చేస్తున్నారు.బొంబాయి రవ్వ పూర్ణాలు ,బొంబాయి రవ్వ ఉప్మా బోండాలు , రవ్వ దోశెలు ,రవ్వ లడ్డూలు ఇలా ఒకటేమిటి వంట గదిలో బొంబాయి రవ్వ ఉంటే ఇంకేమి అక్కర్లేదన్నంతగా పరిస్థితి మారిపఒయింది.ఉపయోగం తక్కువ , అపకారం ఎక్కువ ఉండేదే బొంబాయి రవ్వ.

అట్టు,చపాతి,పుల్కా,పూరి ,వీటిలో ఏది మంచిది? /ATTU ,CHAPATHI , PULKA ,POORI MANCHIDHA?POORI ,VEETILO EDI MANCHIDHI?

మంచి చెడు అనేవి అట్టులోనో ,పూరీలోనో ఉండవు.ఏ ఆహర పదార్థమైనా దాని తయారీలో కలిపిన ద్రవ్యాలు ,వాటిని వండే తీరును బట్టి ఉంటాయి.చపాతీని గోధుమ పిండితో చేసి ,కుర్మాతో తినాలని,పూరిని ఆలుగడ్డ కూరతోనే తినాలనీ, పుల్కాలను పాలక్ పనీర్ , మిక్ష్ డ్ వెజిటబుల్ కర్రీ లంటి వాతితో తినాలని నియమాలు పెట్టుకున్నది మనమే.ఇడ్లీ ,అట్టు ,పూరీల్లాంటివి విందు భోజనాల్లో వడ్డించేందుకే గాని , ఇలా ఉదయం పూట పెరుగన్నానికి బదులుగాను,రాత్రి పూట ఉపాహరంగాను తినటానికి  ఉద్దేశించినవి కాదు.ఉత్తరాది వారు రోటీలు తింటారు.మనం రోటీలు , అన్నం రెండూ తింటాం,అదీ తేడా.
అట్టు లేదా దోసెలను మినప పప్పు,బియ్యం రుబ్బి తయారు చేస్తారు.రెండూ ఎక్కువ కెలొరీలను పెంచేవే.చపాతీలను ,రాగులు,జొన్న,సజ్జలతో కూడా చేసుకోవచ్చు.ఆరోగ్యానికి మంచివి.నంజుకునేందుకు అన్నంలోకి తయారు చేసుకున్న కూర ,పప్పు లాంటివి మంచివి.
వొంటి పొర మీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద వత్తితే దౌపాతి ,మూడు పొరల మీద వత్తితే త్రిపాతి, నాలుగు పొరల మీద వత్తితే చపాతి అంటారని పరిశోధకులు భావిస్తున్నారు.పొరల మధ్య నూనె ఎక్కించి చపాతీలు తయారు చేస్తారు.నూనె లేకుండా నాలుగు మడతలు వేసి వత్తినందువల్ల అది మందపాటి రొట్టె అవుతుంది అంతే.కావున పూరీలు ,చపాతీలు నూనెకు నిలయాలుగా ఉంటాయి.వాటిని సరదాగా అప్పుడప్పుడు మాత్రమే తినటం మంచిది.చక్కగా విశ్లేషిస్తే పుల్కానే మంచిది అని చెప్పవచ్చు.

18, జూన్ 2016, శనివారం

మొలకెత్తిన పెసర్లతో ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు. / MOLAKETTHINA PESARLATHO AYURVEDA AAROGYA PRAYOJANAALU.....


పోషకాలు అందించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో పెసర్లు ముఖ్యమైనవి.పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసర్లలో విటమినులు , ప్రొటీనులు ,ఖనిజ లవణాలు,ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.మొలకెత్తిన పెసర్లతో చాలా ప్రయోజనాలు ఉంటాయి.

1 . వీటిలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకు , కొవ్వు కరిగించేందుకు చెడు కొలెస్టరాల్ ను నిర్మూలించేందుకు దోహదపడుతుంది.

2 .వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువగా తిన్న భావన కలుగుతుంది.అందువల్ల మాటిమాటికి ఆకలి వేయదు.క్రమంగా ఒక మంచి డైట్ విధానం అలవడుతుంది.

3 .పెసర్లను మొలకెత్తిన గింజల రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.

4 .విటమిన్ ఏ,బి,సి,డి,ఇ,కె,థయమిన్,రిబోఫ్లావిన్,ఫోలిక్ ఆసిడ్స్,మొలకెత్తిన పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి ఉపయోగపడతాయి.

5 . దృష్టి సంబంధ సమస్యలు కూడా నయమౌతాయి.గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.

6 . రక్తహీనత సమస్య తొలగిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.రక్తంలఒని చక్కెర స్థాయులను తగ్గించే గుణం వీటిలో ఉంటుంది.

7 .యాంటి ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి.ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి.

8 . శరీరంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ లను తొలగించే యాంటి ఆక్సిడెంట్ గుణాలు పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి కణజాల నాశనాన్ని అడ్డుకుంటాయి .

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...