17, డిసెంబర్ 2015, గురువారం

HEALTHY LIVING - ACUTE STROKES - HOW TO AVOID?



పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత

జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవద్దు
పక్షవాతం రాకుండా
ముందు జాగ్రత్త అవసరం

కిమ్స్ ఏఎస్ సెంటర్ప
ప్రారంభించిన ఎన్టీఆర్క్ష 

ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ చలన
చిత్ర నటుడు నందమూరి తారక రామారావు(జూని
యర్ ఎన్టీఆర్) అన్నారు. పనుల్లో పడి జీవితాన్ని ఒత్తి
డిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలన్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంట
కన్ను ఆసుపత్రి ఎండీ డా॥బి.భాస్కరరావుతో కలిసి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లా
డుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్తం
వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచే
శారు. అందుకే కిమ్స్ కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్ర
మంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి
కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేల
న్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం క్ష
వాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య
ఆకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు
తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. అత్యవసర సమ
యాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివ
దలాలని ఆయన పిలుపునిచ్చారు.
జీవనశైలి మార్పుతో పక్షవాతం ముప్పు
ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో
జీవనశైలితో పక్ష
వాతం(స్ట్రోక్ ముప్పు పొంచివుందని నిపుణులు పేర్కొ
న్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు 'ఈనాడు'
తో ప్రత్యేకంగా మాట్లాడారు. అసహజ ఆహారాన్ని విచ్చ
లవిడిగా తీసుకోవటం, వ్యాయామం లేకపోవడం వల్ల
ఊబకాయ సమస్య తలెత్తుతోందన్నారు. ఫలితంగా
అధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ పెరిగి పక్ష
వాతానికి దారితీస్తోందని వారు చెప్పారు. హైదరాబా
లో 20 శాతం మందిలో మధుమేహం, మరో 25-30
శాతం మందిలో అధిక రక్తపోటు సమస్య ఉందంటూ
ఆందోళన వెలిబుచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోక
పోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇంకా వారు
ఏమన్నారంటే. (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.
- డా||మోహన్ దాస్, న్యూరాలజీ విభాగాధిపతి, కిమ్స్
3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి
స్ట్రోక్ వచ్చిన గంటలలోపే
రోగిని వీలైనంతలో మెరుగైన
ఆసుపత్రికి తరలిస్తే కాపాడే
వీలుంది. రక్తనాళాల్లోని అడ్డంకు
లను తొలగించడానికి వీలుం
టుంది. ఆహారంలో నూనె పదా
ర్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల
దేహంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పూడిక ఏర్ప
డుతుంది. ఇది రక్త ప్రసరణకు అడ్డుపడితే పక్షవాతా
నికి దారితీస్తుంది. పొగతాగడం, మితిమీరిన మద్య
పానం కూడా స్ట్రోక్ కు హేతువులవుతాయి.
డా॥మనస పాణిగ్రహి, న్యూరోసర్జన్
పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత
పక్షవాతం (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.బి-12 విటమిన్ తగ్గినా న్యూరో సమస్యలు
చేతికందే తిండి(జంక్ ఫుడ్)తో
సమతుల, పౌష్టికాహారం తీసుకో
వడం తగ్గుతోంది. అన్ని రకాల
విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరా
నికి అందడం లేదు. ముఖ్యంగా బి-
12 విటమిన్ లోపం కారణంగా
నరాల సమస్యలు వస్తాయి. జ్ఞాపక
శక్తి కోల్పోవడం, కంటిచూపు మందగించడం, నడకలో
ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా శరీరంలో
ఒకవైపు కుంగుబాటుకు గురికావడం జరుగుతుంది.
అలాంటపుడు తక్షణ చికిత్స అందించాలి.
- డా॥ప్రవీణ్ కుమార్, న్యూరాలజిస్టు
మహిళలు.. వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
చాలమంది మహిళలు కుటుంబ
బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం
చేస్తుంటారు.
వ్యాయామానికి
దూరంగా ఉంటున్నారు. 
ప్రమాదకరం ఎక్కువ గర్భనిరోధక
మాత్రలు వాడటం వల్ల హర్మోన్లలో
తేడా వస్తుంది. రక్తనాళాల్లో పూడిక
చేరేందుకు ఇది కారణమే. ఈ నేపధ్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి
తరచూ తలనొప్పి, కాళ్లుచేతులు
గుంజడం, నీరసంగా అన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యు
లను సంప్రదించాలి.
- డా॥సీతా జయలక్ష్మి, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు

12, డిసెంబర్ 2015, శనివారం

PACHI PALA PERUGU - AWARENESS

పచ్చిపాల పెరుగు వద్దు

| పచ్చిపాలను తోడు పెట్టిన పెరుగు తింటే పేగుపూత తగ్గుతుందని
చెప్పారు. తినవచ్చునా?

* పాలను కాయకుండా
ఏరకమైన పదార్ధాలూ తయా
రుచేయకూడదు. పచ్చిపా
లలో హానికర సూక్ష్మజీవు
లుంటాయి. బాగా కాగిన
పాలను తోడు పెట్టిన పెరుగు
కూడా పైత్యాన్ని, కడుపులో
మంటని, పేగుపూతని తగ్గి
స్తుంది. అందుకోసం పచ్చి
పాల పెరుగే వాడవలసిన
అవసరం లేదు. పచ్చిపాల పెరుగు కఫాన్ని దగ్గు జలుబు, తుమ్ములూ ఆయా
సాల్నీ పెంచుతుంది. స్థూలకాయాన్ని కలిగిస్తుంది.
దాని జోకి పోకపోవటమే
మంచిది.

LIVER VYADHULU - AHARAM

లివరు వ్యాధులు-ఆహారం...

కామెర్ల వ్యాధి వచ్చింది. లివర్ దెబ్బతింటోందనీ, ఫుడ్ విషయంలో
జాగ్రత్తగా వుండాలన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా?

* ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో లివరు ముఖ్య పాత్ర వహిస్తుంది.
అందుని కాలేయం పైన వత్తిడి పడకుండా తేలికగా అరిగే ఆహారం తీసుకో
వాలి. మెతుకు తగలకుండా ఆహారం ఇవ్వాలనే రూలేమీ లేదు.
రోగికి ఇచ్చే
ప్రతి మెతుకూ అరిగేదిగా ఉండాలి. పాత బియ్యాన్ని వేయించి, మెత్తగా వండు
కుని తినవచ్చు.
బార్లీ, సగ్గుబియ్యం, రాగి, జావలు మంచివి. బాగా చిలికి వెన్న
తీసిన మజ్జిగ, ఎక్కువగా తాగాలి. బీర, పొట్ల, సొర, గలిజేరు, గుంటగలగర
ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, చిర్రికూర, వీటితో పప్పు
గానీ, పొడికూరగానీ వండుకుని తినవచ్చు. మినప్పప్పు, శనగలు, బరా
ణీలు, నూనెలు, చింత
పండు, పులుసుకూ
రలు, ఆవపిండి కలి
సినవి, వేడి చేసేవి
మానాలి. చలవచేసే
వితింటే లివరు వ్యాధులను
అదుపు చేయటం తేలిక.

GASTRITIS - AHARA VAIDYAM


. తరచూ గ్యాస్ట్రయిటిన్ కారణంగా మాటిమాటికీ
ఎక్కువ మందులు వాడవలసి వస్తోంది. ఇలా తిరగటి
ట్టకుండా ఏదైనా సలహా చెస్తారా?

* గ్యాస్ట్రయిటిస్ వ్యాధి కేవలం నోటి ద్వారా మాత్రమే కదు
పులోకి ప్రవేశిస్తోంది. దొంగ ఏదారిన వస్తున్నాదో ఆ దారిని ముందు
మూసేయాలి కదా! కాబట్టి ఆహార పానీయాల విషయంలో తగిన
జాగ్రత్తలు తీసుకోండి. హోటళ్ళలోనూ అలాగే, రోడ్డు పక్కన బళ్ళ
మీదవి తినటం పూర్తిగా మానేయండి. ఇంట్లో శుచిగా వండినవి
మాత్రమే తినండి. త్రాగు నీరుస్వచ్ఛంగా ఉండాలి. వ్యక్తిగత పరిశు
భ్రత అవసరం.
పుల్లనివి, పులిసినవి, ఊరబెట్టినవి గ్యాస్ట్రయిటిస్ వ్యాధిని తీర
గబెడతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ ఈ వ్యాధిని పెంచు
తాయి. తేలికగా అరికేవి
తినాలి. పాలకు బదులు మజ్జిగ
ఎక్కువగా
తీసుకోండి. పెరుగు
కన్నా చిలికిన మజ్జిగ మంచిది.
ఫ్రిజు చల్లదనం తగ్గాకే మజ్జిగ
తాగండి. ఇడ్లీ, అట్టు, పూరీ,
ఉప్మాలకు బదులు, రాత్రి
వండిన అన్నంలో పాలుపోసి
తోడు పెట్టి ఉదయాన్నే పులవక
ముందే తినటం ఉత్తమం. మజ్జి
గలో నానబెట్టి కూడా తినవచ్చు. తాలింపు పెట్టి రుచిగా చేసుకోవచ్చు. రోజూ
బార్లీ జావగానీ, సగ్గుబియ్యం జావగానీ, మరమరాలు లేదా బొరుగులతో జావ
గానీ కాచుకుని పెరుగు వేసి చిలికిన చిక్కని మజ్జిగ తాగండి. చలవ చేసే వన్నీ
ఈ వ్యాధిని తగ్గిస్తాయి. వేడి చేసేవి పెంచుతాయి. కందికట్టు లేదా పెసరకట్టు
(చింతపండు వేయని పప్పుచారు) అన్నంలో తినండి. అన్ని కూరలు తినదగినవే
పులుపు లేనివి, పులుపు కలపకుండా వండినవీ ఈ వ్యాధిని తగ్గిస్తాయి. పులుపు
కోసం దానిమ్మగింజలు, వెలగపండు, ఉసిరికాయ నల్లపచ్చడి పరిమితంగా
తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మసాలాలు అతిగా తినటం వలన, వేపుడు కూరల
వలన, ఊరగాయల వలన ఈ వ్యాది తిరగబెడ్తోంది.

10, డిసెంబర్ 2015, గురువారం

PARAGADUPUNA IVI VADDHU


క్షణం తీరికలేని జీవనశై
లిలో భాగంగా చాలా
మంది ఆరోగ్యం, తీసుకునే
ఆహారం పట్ల దృష్టి
పెట్టరు. ఎప్పుడు ఏం తీసు
కుంటున్నారన్నది పట్టిం
చుకోరు. కానీ పరగడు.
పున తీసుకునే ఆహారం,
చేసే పనుల మీద శ్రద్ధ
పెట్టడం మంచిది.
ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగం
గానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీ
యాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశ
యంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవు
తాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు
కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీ
బాధిస్తాయి. వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడం
మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓపదినిమిషాల
తరవాత వీటిని తీసుకోవాలి.
పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణ
వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా
టొమాటోలను పరగడుపున తీసుకోకుడదు.
చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటో
రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే
ముందు కాసిని పాలు తాగడమో. వేరే పదార్థ
మేదైనా తినడమో చేయాలి.
కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగం
కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్
టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి
ముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ
లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం
వల్ల కొవ్వు త్వరగా కరగదు.
పరగడుపున అరటి పండు జోలికి వెళ్లకూ
డదు. అరటి పండులో మెగ్నీషియం
ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ
మోతాదులో అందడం మంచిది కాదంటారు.
ఆరోగ్య నిపుణులు.

3, డిసెంబర్ 2015, గురువారం

SUGAR VYADHI - NALLA PACHADI - AYURVEDIC USE

 

shuగరు వ్యాధి ఉన్న వారికి నల్లపచ్చడి పెట్టవచ్చా?"

* షుగరు వ్యాధి ఉన్నవారికి ఉసిరి అమోఘమైన ఔషధం. ఆమలకి అని పిలిచే
ఉసిరికాయని తొక్కి గింజ తీసి
ఉప్పు కలిపి తాలింపు పెట్టిన
నిల్వ పచ్చడి కొద్దిగా నల్లగా
ఉంటుంది. కాబట్టి దాన్ని నల్లవు
చ్చడి అన్నారు. ఉసిరితొక్కు
పచ్చడి అని కూడా అంటారు.
రోజూ కనీసం ఒక చెంచా పచ్చ
దినైనా తినటం అవసరం. నిల్వ
పచ్చడి అయినా సాధారణంగా
కడుపులో మంటను తీసుకు
రాదు. ఊరగాయ మాదిరి తయారు చేసింది ఇబ్బంది పెడుతుంది. ఈ తేడాని
మొదట గమనించాలి. ఉసిరికాయ శరీరంలో విషదోషాలను హరించే యాంటీ
ఆక్సిడెంట్ ఔషధంగా అందరికీ తెలిసిందే! కానీ ఆయుర్వేద శాస్త్రం ఈ ఉసిరికాయ
పొదిలో ఎత్తుకు ఎత్తు మంచి పసుపును కలిపి షుగరు వ్యాధిలో శక్తి ఉత్పత్తికి,
తోడ్పడే ఒక గొప్ప ఔషధం తయారుచేసింది. దాన్ని నిశామలకి చూర్ణం అన్నారు.
రోజూ ఒక చెంచా మోతాదులో ఈ పొడిని ఏదో ఒక విధంగా కడుపులోకి తీసు
కుంటే మంచి సహాయకారి. ఉసిరి నల్లపచ్చడిలో కూడా పసుపు కలిపి కొత్తిమీర
వేసి తాలింపు పెట్టుకుని తింటే షుగరు వ్యాధికి మంచి ఔషధం వాడుతున్నట్టేనని
గమనించాలి.

FUNGUS INFECTION - AYURVEDIC SOLUTIONS



ఫంగస్ ఇన్ఫెక్షన్
తగాలంటే
* చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు
అది తగ్గడానికి గోరింటాకును మెత్తగా
నూరి ఇన్ఫెక్షన్ ఉన్న చోట రోజు రెండు
పూటలా రాయాలి. ఇలా నాలుగైదు
రోజులు చేస్తే ఇన్ఫెక్షన్ తొలగుతుంది.
+ వేపాకులను మెత్తగా నూరి ఇన్ ఫెక్షన్ ఉన్న
చోట రాత్రి పూట రాసి అలాగే దాన్ని
ఉండనివ్వాలి. మర్నాడు ఉదయం
కడిగేయాలి. ఇలా నాలుగైదు రోజులు
చేస్తే ఇన్ ఫెక్షన్ పోతుంది.
* చల్లని పదార్థాలు, పుల్లని ఆహారం.
పెరుగు వాడరాదు. ఇన్ ఫెక్షన్ ఉన్న చోట
వెచ్చని నీటితో కడిగి శుభ్రంగా తడి
లేకుండా తుడిచి వేయాలి.

SHIREESHA KASHAYAM - VEGETABLES CLEANING - AYURVEDAM



కూరగాయలపై ఉండే పెస్టిసైడ్ అవశేషాలు తొలగించే
శిరీష కషాయం
కూరగాయలను పండించడంలో రైతులు అనేక రకాల క్రిమి, తెగుళ్ళ
నివారణ మందులు వాడుతున్నారు. వాటివల్ల కాపు కూడా బాగా
ఉంటుంది. కాయలు ఏపుగా పెరుగుతాయి. కాని వాటిపై
రసాయనిక అవశేషాలు ఉండిపోయి, త్వరగా పోవు.
వాటిని ఎంతగా కడిగినప్పటికీ, రసాయనిక అవశేషాలు కొన్ని అలాగే
ఉంటాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా
దెబ్బతింటుంది. ఇలాంటి తెగుళ్ళ మందులలో ఎక్కువగా ఆర్గనో
ఫాసర (మలాథియాన్) ఉంటుంది.
కాయగూరలను ఎంతగా కడిగినప్పటికీ, ఈ కెమికల్ అవశేషాలు
పూర్తిగా పోవు. అయితే దీన్ని పూర్తిగా తొలగించే అవకాశం కూడా
ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లోని షెకావటి
ఆయుర్వేద కాలేజిలో ఒక అధ్యయనం జరిగింది.




వాటిని శిరీష క్వాతతో ధావన (కడ
గడం) చేసి ఫలితం తెలుసుకోవడం వారి
-లక్ష్యం. మంచినీటితో ఆనపకాయను కడ
గడం, శిరీష క్వాతతో ఆనపకాయను కడగడం
వల్ల కనిపించే తేడా ఏమిటి? ఫ్రిజ్ లో ఆనప
కాయలను ఉంచినందువల్ల వాటిలోని రసాయ
నిక అవశేషాలు తొలగుతాయా? లేదా? అనే
దానిని పరిశీలించడం ముఖ్య ఉద్దేశ్యం.
పద్ధతి
పరిశోధకులు అప్పటికప్పుడు కొన్ని
ఆనపకాయలను (సొరకాయలు) తెప్పించి
వాటిని రెండుగా విభజించారు. ఒకటి
కంట్రోల్ గ్రూపు, రెండవది. ప్రయోగాత్మక

గ్రూపు రెందవగ్రూపును మళ్ళీ నటి
గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూపులోని
కాయలపై మలథాన్ వేశారు. రెండో గ్రూపు
లోని కాయలను మంచినీటితో కడిగారు..
మూడో గ్రూపులోని కాయలను శిరీష క్పాతతో
ఉంచారు. దీని తర్వాత అన్ని ఆనపకాయలపై
శుభ్రం చేశారు. నాలుగో గ్రూపులోని
కాయలను నాలుగు రోజులపాటు ఫ్రీజ్ లో
రసాయనిక పరీక్షలు చేశారు.
ఫలితం
మంచినీటితో కడిగిన వాటికంటే
ఫ్రిజ్ లో ఉంచిన వాటికంటే శిరీష క్వాతతో
శుభ్రంచేసిన కాయలలోని రసాయనిక
అవశేషాలు చాలావరకు తొలగిపోయాయి.
ముగింపు
ఈ ప్రయోగాన్నిబట్టి కాయగూరలను
మంచినీటితో కాకుండా శిరీష క్వాథతో పరిశు
భ్రం చేయడం చాలా మంచిదని రుజువైంది.

PADHALALO MANTALU - AYURVEDAM

పాదాలలో
మంటలు
• గోరింటాకు ఆకులను మెత్తగా నూరి కాళ్లకు, పాదాలకు
రోజు పొద్దున్నే పూయాలి. మళ్లీ సాయంత్రం పూయాలి.
ఇలా మంటలు తగ్గే వరకు పూస్తుండాలి.
• వస ఆకులను మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని పాదాలకు,
మడిమలకు రాయాలి. పాదాలలో మంటలు తగ్గేవరకు ఇలా
చేయాలి.
• శతావరి వేర్లను తెచ్చి వాటిని మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని రోజు పొద్దున,
సాయంత్రం పాదాలకు మడిమలకు రాయాలి. ఇలా పాదాలలో మంటలు తగ్గేవరకు
చేయాలి.
• పాదాల్లో మంటలు తగ్గే వరకు నూనె పదార్థాలు, తియ్యటి పదార్థాలు, ఘాటైన
పదార్థాలను తినరాదు.

CHEVI POTU / KARNA SHOOLA - AYURVEDAM

శరీరంలో చెవి చాలా సున్నితమైన
భాగం కావడం వల్ల అనేక సమస్యలు
వస్తాయి. ఎక్కువగా చెవిలో ఇన్ఫెక్షన్
వచ్చినప్పుడు చెవిపోటు వస్తుంది. ఇది
వచ్చినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా
ఉంటుంది. అయితే సాధారణంగా ఇది
చిన్న పిల్లలకు వస్తుంటుంది. ఇది
వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుంది.
కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే
వైద్యం చేయించకపోతే చెవుడు కూడా వచ్చే
అవకాశం ఉంటుంది.
ఎక్కువ సేపు నీటిలో నానడం, ఈత
కొట్టడం, దాని వల్ల చెవిలోకి నీరు పోవడం,
మనిసి
నీటిలో బాక్టీరియా ఉండి ఇన్ ఫెక్షన్ రావడం,
జలుబు, ఒత్తిడి, సరైన ఆహారాన్ని తీసుకోక
పోవడం మున్నగు వాటి వల్ల చెవిపోటు
వస్తుంది.
తులసి రసాన్ని కొద్దిగా వేడిచేసి, ఆ
రసం రెండు మూడు చుక్కలు చెవిలో
వేస్తే నొప్పి తగ్గుతుంది.
ఉల్లిగడ్డను వేయించి, దాని రసాన్ని తీసి,
ఆ రసం రెండు మూడు చుక్కలను
చేవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది.
నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలను
వేసి, కాచి వడబోసి మూడు నాలుగు
చుక్కలను చెవిలో వేస్తే నొప్పి
తగ్గుతుంది. లేదా వేపాకుల రసం తీసి
రెండు చెక్కలను చెవిలో వేసినా నొప్పి
తగ్గుతుంది.


30, నవంబర్ 2015, సోమవారం

DETOX CHEYADAM ANTE

డిటాక్స్ చేయడం అంటే?

శరీరానికి సంబంధించి డిటాక్సిఫి
కేషన్ అంటే క్యాలరీ లోడ్ను తగ్గించు
కోవడం. ముఖ్యంగా కొవ్వు, ఆల్కాహాల్, ప్రాసెస్ట్ పదా
ర్థాల తాలూకూ భారాన్ని తగ్గించడం.
ఈ డిటాకు ఫేడ్ డై గానో లేక వెయిట్ లాస్
టెక్నిక్ గానో ఏమాత్రం భావించకూడదు.
డిటాక్సిఫికేషన్ వెనుకగల ఆలోచన శరీరంలోకి
టాక్సిన్లు లేదా విషతుల్యాలు ప్రవేశించకుండా అడ్డు
కోవడం. కాబట్టి చెడు ఆహార అలవాట్లకు స్వస్తి చెప్పి,
కొత్త అలవాట్లు సృష్టించుకోవాలి.
ఇందుకోసం ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి
21 రోజులనుంచి 62 రోజులదాకా పట్టవచ్చు.
కాబట్టి వీటిని ఓపిగ్గా అనుసరించాలి. అంటే రెగ్యు
లక్ఆహారాన్ని పూర్తిగా మానేసి రోజు మొత్తం గ్రీన్
జ్యూస్లు తాగుతూ బ్రతికేయాలని అర్థం కాదు. సింపు
గా ఆరోగ్యవంతమైన ఆహారం తింటే చాలు.
రోజుకు మూడు భోజనాలు,ఒక స్నాక్ సరిపోతాయి.
చక్కెర పదార్థాలన్నింటినీ కట్చేసేయాలి. అలాగే ఆల్కా
హాల్, డిజర్టులూనూ, పండ్లు వీలయినంత ఎక్కువగా
తినాలి. దీనివల్ల శరీరానికి ఇతర పోషకాలతోపాటు
మంచి చక్కెరలు కూడా లభిస్తాయి.
మధ్యమధ్యలో రోజుకు కనీసం ఎనిమిదినుంచి
పదిగ్లాసుల నీరు తాగాలి. వేయించిన పదార్థాలు అవి
చిప్స్ అయినా సరేతినవద్దు. ఏది తినాలనిపించినా శరీ
రాన్ని డిటాక్సింగ్ చేస్తున్నామన్న విష
యాన్ని గుర్తుంచుకోవాలి. పప్పు,
మొలకలు, లీన్మట నుంచి ప్రొటీన్లు
అందే మాదిరి చూసుకోవాలి.
స్టీమ్ చేసిన లేదా ఉడికించిన
పదార్థాలు తినాలి. ఇక్కడ ఆహారం
తినడం మానేయమని అర్థం కాదు-
చెడు ఆహారాన్ని పూర్తిగా మానేయా
లన్నది కీలకాంశం.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...