30 ఏళ్లకే ఆయాసం, నలభై ఏళ్లు దాటితే
నీరసం, ఇటీవల చాలా మందిలో చూస్తున్న
పరిస్థితి ఇది. ఇక యాభయ్యో పడిలో పడితే
గుప్పెడు మాత్రలు మింగుతూ ఇంటిపట్టున
కృష్ణా,రామా అనుకుంటూ కూర్చోవలసిందే!
మన దగ్గర ఇలా ఉంటే జపాన్ దగ్గరున్న
'ఒకినావా దీవి వాసులు మాత్రం శతాధిక
వృద్ధులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతు
న్నారు. అక్కడి జిరోమాన్ కిమురా అనే
శతాధిక వృద్ధుడు ఏకంగా 118 ఏళ్ల దాకా
బతికి ఇటీవల కొత్త రికార్డు సృష్టించాడు.
ఇతనికి ముందు మిసావో ఒకావా అనే
మహిళ 115 ఏళ్లు జీవించిన శతాధికురాలిగా
పేరు తెచ్చుకుంది. జపనీయులు వందేళ్లు
జీవిస్తూ పేరు తెచ్చుకుంటే, ఒకినావా
వాసులు ఏకంగా సెంచరీ కూడా దాటేసి
ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు. అయితే
వీళ్ళింత సుదీర్ఘకాలం జీవించటం వెనకో
ఆరోగ్య రహస్యం ఉంది. అదే. .. ఒకినావా డైట్.
ఒకినావా అనేది జపాన్ లోని ఓ దీవి. ఈ
దీవిలోని వాళ్లంతా నిండు నూరేళ్ల పాటు
జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరి
దీర్ఘాయుషు కోసం వీళ్లంతా ఏం తిన్నారు. ఆ
వివరాలు తెలియాలంటే ఒకినావా ఆహారశైలి
గురించి తెలుసుకోవాలి.
ఒకినావా వాసుల్లా వందేళ్లు నిక్షేపంగా
జీవించాలంటే ఈ ఒకినావా ఫుడ్ లిస్టు కు
దైనందిన ఆహారంలో చోటు కల్పించాలి.
బిట్టర్ మెలన్స్..
పచ్చి పుచ్చకాయలను
ఇతర కూరగాయలతో కలిపి స్టిర్ ఫ్రై చేసి
తినాలి. బిట్టర్ మెలన్లో మధుమేహానికి
వ్యతిరేకంగా పోరాడే గుణాలుంటాయి.
టోపు..
ఫ్రెంచ్ వాళ్లకు బ్రెడ్,ఐరోపా వాళ్లకు బంగాళా
దుంపల్లా, ఒకినావా వాసులకు టోపు అంత ప్రియమైన ఆహారం. వీళ్ల దైనందిన ఆహారంలో టోపు ఉండాల్సిందే!
అమెరికన్ల కంటే 8 రెట్లు ఎక్కువగా టోపు తింటారు. ఇతర సోయా ఉత్పత్తు ల్లాగే టోపు గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది.
మాంసం బదులుగా సోయా ఉత్పత్తులు
తిన్నవాళ్లలో గుండె జబ్బులకు కారణ
మయ్యే టైగిసరైడ్స్, కొలస్టరాల్స్ తక్కువగా ఉన్నట్లు తేలింది.
ఒకినావా చిలకడ దుంప..
ఒకినావా ద్వీపంలో ఇప్పుడు కనిపించే
శతాధిక వృద్ధులందరూ 1903 - 1914 మధ్య
కాలంలో పుట్టిన వాళ్లే. వీళ్ల జీవితంలో మొదటి
పావు భాగం వరకు. అంటే 1940 వరకూ
ఎక్కువ శాతం, దాదాపు 60% క్యాలరీలను
ఒకే ఒక పదార్థం నుంచే తీసుకున్నారు. అదే
'ఐమో'. ఐమో అనేది ఒకినావా ద్వీపంలోని
చిలకడ దుంప. వంకాయ లేదా పసుపుపచ్చ
రంగులో ఉండే ఈ స్వీట్ పొటాటో 400
ఏళ్లకు పూర్వం అమెరికా నుంచి ఈ దీవికి
తరలి వచ్చింది. దీన్లో అత్యధిక ప్లావనాయిడ్స్,
విటమిన్ సి, కెరోటినాయిడ్స్, ఆలస్యంగా
ఖర్చయ్యే పిండి పదార్థాలున్నాయి.
తక్కువ క్యాలరీలు:
ఒకినావా వాసులు
జపనీయుల కంటే 20% తక్కువ క్యాలరీ
లున్న ఆహారం తింటారు. ఒక గ్రాము ఆహా
రానికి ఒక గ్రాము క్యాలరీ ఉండేలా చూసు
కుంటారు. వారి (బాడీ మాస్
ఇండెక్స్) సుమారుగా 20. దీన్ని బట్టి క్యాలరీ
లను కంట్రోల్ చేస్తే బరువు అదుపులో ఉండ
టంతోపాటు ఈ క్రింది ప్రయోజనాలు కూడా
ఉన్నాయి.
ఆరోగ్యం మెరుగవుతుంది.వృద్ధాప్యం ఆలస్యమవుతుంది.
ఒకినావాలు పళ్లు, కూరగాయలను గ్రీన్,
ఆరెంజ్, ఎల్లో (జీ ఓ వై). ఈ మూడు
రంగుల్లో వర్గీకరించుకుటారు. ఈ
రంగుల్లో ఉండే పళ్లు, కూరగాయలు,
దుంపలను మాత్రమే తింటారు. జీఓవై
ఫుడ్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా
కెరోటిన్, లుటీన్, గాంధీన్ వంటి
పోషకాలుంటాయి.
తక్కువ చక్కెర, కొవ్వులు..
ఆరోగ్యాన్ని
శుష్కింపజేసేవి చక్కెర, కొవ్వులే. కాబట్టి ఒకినావా డైట్
లో వీటికి స్వల్ప స్థానం ఉంటుంది.వీళ్ల దైనందిన
ఆహారంలో 25%
చక్కెర, కొవ్వులు ఉంటాయి. మిగతా 75% పప్పు,ధాన్యాలతో
నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు,
గుండెపోట్లు రావు.
కూరగాయలు, సముద్రాహారం..
ఎక్కువ మంది ఒకినావాలు శాకాహారులే .వారుండే ప్రదేశం దీవి కాబట్టి ,వీరిలో కొందరు సముద్రాహారం కూడా తింటారు.
అయితే తక్కువ
మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు ,గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు..
ఒకినావా డైట్ ఎంతో క్రమశిక్షణతో కూడుకు
న్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుష్షును
కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టి అక్కడి వారికి అంత దీర్ఘాయుష్షు.
స్వీట్ పొటాటో..
మిగతా దుంపల్లా చిల
కడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిని
పెంచదు. వీటి ఆకులతో సూప్ తాగినా
ఫలితం ఉంటుంది. చిలకడ దుంపల్లో
వృద్ధాప్యాన్ని కుంటు పరిచే స్పారామిన్ అనే
యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
పసుపు..
ఒకినావాలు పసువు సుగంధ
ద్రవ్యంగా, టీ గా కూడా వాడతారు.
యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,
యాంటీ ఆక్సిడెంట్ అయిన పసుపు లోని యాంటీ ఏజింగ్
గుణాల గురించి అధ్యయనాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టే
ఒకినావా వాసుల్లో అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగా ఉన్నారు.
సముద్రపు నాచు..
తక్కువ క్యాలరీలు, ఎక్కువ
పోషకాలున్న పదార్థం సీ వీడ్. ఈ
సముద్రపు నాచు ను ఒకినావా వాసులు
సూప్స్ ,స్కూలలో వాడతారు. సీ వీడ్ లో
కెరోటినాయిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం,
క్యాల్షియం, ఐరన్, అయోడిన్లు ఉంటాయి.