కొంత మంది
పిల్లలు పుట్టినపుడు మిగతా అందరిలా భేషు
గానే ఉంటారు. కానీ, రోజులు గడిచేకొద్దీ పిల్లల్లో కొన్ని తేడాలు
కనపడుతుంటాయి. ఆ తేడా ఐక్యూ పరమైనవే అయితే కొంత
వరకు ఫర్వాలేదు కానీ ఒక అయోమయం, ఒక గందరగోళం
కనిపిస్తుంది. అది తల్లిదండ్రుల్ని బాగా కలవరపెడుతుంది.
కొన్ని లక్షణాలు వారిని తీవ్రమైన మనోవ్యధకు గురిచేస్తాయి.
ఆ తేడాలకు కారణమయ్యే ఒక ప్రధాన సమస్య ఆటిజం,
వారిలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా ఆటిజం వ్యాధిని
గుర్తించవచ్చు. కాకపోతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు కాదు!
మూడేళ్ల వయసులో గుర్తించవచ్చు.
ఒంటరిగా ఉండాలంటే భయం
పిలిస్తే పలుకకపోవడం, పరిచయస్తుల్ని చూసినా స్పందించక
పోవడం, మిగతా పిల్లలతో కలిసి ఆడుకోకపోవడం, ముఖం
మీద భావోద్వేగాలేవీ కనిపించకపోవడం, అసహజమైన కద
లికలు, కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోవడం, ఏకకాలంలో వివిధ
వస్తువుల మీద దృష్టి పెట్టడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే
డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. ఇలాంటి సమ
యాల్లో ముఖ్యంగా పిల్లవాడికి ఆటిజం సమస్య ఏమైనా
ఉందేమో సాధ్యమైనంత త్వరగా నిర్ధారించుకోవాల్సిన అవ
సరం ఉంటుంది. నిజంగా ఈ సమస్య ఉన్నట్టు నిర్ధారణ జరి
గితే తక్షణమే చికిత్స ప్రారంభించాలి.
ఆటిజం అంటే
నిజానికి ఆటిజం వ్యాధి కాదు. ఇది మెదడు పనితనంలో ఏర్ప
డిన ఒకలోపం మాత్రమే. సాధారణంగా ఆటిజం లక్షణాలు
మూడేళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. ఆటిజం ఉన్న
పిల్లలు ప్రధానంగా కొన్ని సమయాల్లో బాగా ఇబ్బంది పడు
తుంటారు.
కారణాలు
ఆటిజం సమస్యకు బహుముఖ కారణాలే ఉన్నాయి. వీటిల్లో
జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అంటే మెదడు
ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు కూడా ఆటిజానికి
కారణమవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గర్భావస్థ
సమయంలో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల
కూడా కొంత మంది పిల్లల్లో ఈ సమస్య రావచ్చు.
లక్షణాలు
ఆటిజం పిల్లలందరిలో ఒకే లక్షణాలేమీ ఉండవు. వ్యాధి
తీవ్రత, వయసు వంటి విషయాలను బట్టి వేర్వేరు లక్షణాలు
ఉంటాయి. అందుకే దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని
కూడా అంటారు. అయితే 18 నెలలు గడిచిన తర్వాత ఆటిజం
పిల్లలను ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
కళ్లలోకి చూడలేకపోవడం -ఒంటరిగా ఉండడం, ఒంటిరిగా ఆడడం
- మాటలు ఆలస్యంగా రావడం లేదా నత్తిగా మాట్లాడడం
లేదా అసలు మాట్లాడ లేకపోవడం
- ఒకే పనిని పదేపదే చెయ్యడం
ఎప్పుడు ఒకే రంగును ఎంచుకోవడం
అసహజమైన, అసాధారణమైన శరీర కదలికలు
• కుదురుగా కూర్చుని పనిచెయ్యలేకపోవడం లేదా గంటల
తరబడి స్తబ్ధంగా ఉండిపోవడం
.
చికిత్స విధానం
ఆధునిక చికిత్సా పద్ధతిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న
విధానాలతో వ్యాధి నిర్వహణ కొంత పరిణతి వరకే సాధించ
వచ్చు. కానీ ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సా పద్ధతులను
జోడించిట్లయితే సాధ్యమైనంత వరకు ఆటిజం పిల్లలను సాధా
రణస్థితికి తీసుకురావచ్చు. ఆయుర్వేద ఔషధాలతో పాటు
అనుభవజ్ఞుడైన పంచకర్మ విశేషగ్నుడి పర్యవేక్షణలో చికిత్స జరి
గినట్లయితే సంపూర్ణలాభం చేకూరుతుంది. పంచకర్మ చికి
త్సలో అభ్యంగనం, శిరోధారా, కర్ణపూరణం, నస్యః, సర్వాం
గధార, వసికర్మ మొదలైన చికిత్సలు అవసరాన్ని బట్టి మూడు
నుంచి ఆరు వారాల వరకు రెండు లేదా మూడు పర్యాయాలు
చేయవల్సి ఉంటుంది.