Saturday 5 November 2016

ఆస్త్మా - ఆయుర్వేదం

ఆస్తమా అంటే స్వేచ్చలేని శ్వాస. దీని బారిన పడిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలర్జీ రియాక్షన్
ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల్లో గాలి చేరటాన్ని అడ్డుకుని శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ
మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది 2.5 లక్షల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఆస్తమాను ఆయుర్వేద వైద్య విధానంతో నయం చేయొచ్చు.
లక్షణాలు: ఆస్తమా బాధితుల్లో ఉబ్బసం వచ్చినప్పుడు శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసినప్పుడు గురక రావడం,
ఛాతీ బిగుతుగా ఉండి నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరం, గడ్డం దగ్గులు, గొంతులో దురద, రాత్రివేళ
తరుచుగా దగ్గు రావడం, జలుబు, గుండె శరీరంలో బరువుగా ఉండడం, శ్లేష్మం ఎక్కువగా ఉండడం,
నడిచేటప్పుడు ఆయాసం,
రొప్పడం, నాడి వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, కళ్ల దిగువన నల్లని చారలు,
చెమట పట్టడం, వినికిడి కష్టంగా ఉండడం, ఆందోళన తదితర లక్షణాలు ఉంటాయి.
కారణాలు: సహజమైన అలర్జీ, దుమ్మూదూళి ద్వారా ఆస్తమా వ్యాపిస్తుంది. బొద్దింకలు, పొగతాగడం, పీల్చడం
వల్ల కూడా సంక్రమిస్తుంది. వంశపారంపర్యంగా కూడా దీని బారిన పడతారు. బాల్యంలో శ్వాసకోశ
వ్యాధులు, వాతావరణ జీవరసాయన ప్రక్రియలు, హార్మోన్లలో మార్పులు మహిళల్లో), ఆహార విధానాలు,
వాతావరణ మార్పులు, జీర్ణకోశవ్యాధులు, ఆస్పిరిన్, నాన్ సైరోయిడల్ డ్రగ్స్ వాడడం, జంతు చర్మాలు, గడ్డి,
పుప్పొడి, దూళిరేణువులు, జీర్ణవాహికలో రుగ్మతలు కూడా ప్రధాన కారణాలు
ఇతర పరిణామాలు
ఆస్తమా బారిన పడిన వారిలో జీవన ప్రమాణం తగ్గడం, 80-90శాతం మందిలో శ్వాసకోశ నాళాలు
స్తంభించిపోవడం, గర్భిణుల్లో రక్తపోటు, మధుమేహం, రక్తస్రావ సమస్యలు, శిశువుల్లో బరువు తగ్గడం,
శ్వాసకోశ ఇబ్బందులు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల్లో గాలి బయటకు రావడం, చర్మం పెలుసుగా మారడం,
ఎముకలు గుళ్లబారిపోవడం, చర్మ వ్యాధులు తదితర పరిణామాలు
చోటు చేసుకుంటాయి.
V
నిర్ధారణ పరీక్షలు
బ్రాంకియల్ ప్రొవోకేషన్
పల్మనరీ ఫంక్షన్
సీటీ స్కాన్
బోన్ డెన్సిటీ టెస్ట్
బోన్ స్కాన్
• స్పిరోమెట్రీ నిర్ధారణ

బ్రాంకో స్కోప్

• స్వీట్ టెస్ట్ (సిస్టిక్ ఫైబ్రోసెస్)

-ఎలర్జీ టెస్ట్
చికిత్స
ఆయుర్వేదంలో మూలికా వైద్యం, సహజ ప్రకృతి చికిత్స, ఆహార నియమాల నియంత్రణ ద్వారా ఉబ్బసాన్ని
తగ్గించొచ్చు.
- కొన్ని లవంగ మొగ్గలు అరటిపండు తొక్కలో ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి పొద్దున్నే పరిగడుపున
తేనెతో తీసుకుంటే ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి.
ఫైబ్రిఫ్యూజ్ (నేలములకు, ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ మొక్క లేదా చోటికెటారీ(సోలనేమ్ సురటెన్స్ బర్న్) మొక్కను
పూర్తిగా కషాయంగా చేసి రోజుకు 7 - 14 మి.లీటర్ల చొప్పున రెండుపూటలా సేవిస్తే జలుబు, దగ్గు,
ఉబ్బసం తగ్గుతుంది.
ట్రైలిస్పెర్మం (ఇజీవాన్), తులసి, మిరియం, అల్లం టీ, కషాయం సేవిస్తే ఉబ్బసంతో ఉపశమనం కలుగుతుంది.
పంచకర్మతో ఉపశమనం కలుగుతుంది.
• శ్వాశారిరసం, అబ్రకభస్మ ప్రవలపిష్టి, త్రికూటచూర, తోస్తాది చూర్ణం(వైద్యుని సలహా మేరకు) తేనెతో 1
గ్రాము తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
లక్ష్మీ విలాసరసం, సంజీవని మాత్రలు కూడా ఉపశమనం కలిగిస్తాయి.
టీ స్పూన్ పరిమాణంలో శ్వాసారి క్వాత్, ములేరిక్వాత్ తీసుకోవాలి. 400మి. లీటర్ల నీటిలో కలిపి 100
గ్రాములు అయ్యేవరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, మధ్యాహ్నం సేవిస్తే ఉపశమనం
కలుగుతుంది.
పసుపు, లవంగం, ఆల్జీజియా రెబ్బక్ మూలిక, బే బెర్రీ పొడి. ఎపిడ్రా, అర్జున బెరడు శీతాది చూర్ణ.
మధురం(లిక్వోరైస్), యష్టిమధు, బొర్సె పొడి, తేనె మిశ్రమం కూడా ఉపయోగపడుతుంది.
• కరక్కాయ చెబులిక్ మైరోబలన్) నమలడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది.
-మిరియాలు, తేనె, ఉల్లిరసం, కలిపి తాగితే శ్వాసకోశంలో ఇబ్బంది తగ్గుతుంది.
వాయు, పుష్కర మూలం, ముల్లన్, జనజవైన్, నల్ల మిరియాలు, అవిసెగింజలు, అల్లం, మన్నా మిల్
(లోహబాన్) తదితర మూలికలు ఉపయుక్తంగా ఉంటాయి.
శ్వాసకోశనాళాలు కుచించుకుపోవడాన్ని ఎఫ్రిండ్రా, సినికా ఆరికడతాయి.
ఆహార నియమాలు
ఆహారాన్ని నమిలి మింగాలి. కడుపునిండా భోజనం చేయొద్దు. ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఉల్లిని
ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సీ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని ఇది
పెంచుతుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులు శాఖాహార భోజనం చేయడం మంచిది. విటమిన్-ఏ ఉండే కూరలు
తినాలి. ఎమినోఏసిడ్స్, ఒమేగా-3 వల్ల శ్వాసకోశ నాళంలోని మంట తగ్గుతుంది. ఉబ్బసాన్ని నివారిస్తుంది.
తులసి చాలా మంచి ఔషధం పసుపు లేని అల్లం, మిరియాలు తరుచుగా తీసుకోవాలి. పిండిపదార్థాలు,
ప్రొటీన్లు, కొవ్వుపదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. మాంసం, గుడ్లు, చేపలు, చాక్లెట్లు, ఫుడ్ ప్రెజర్వేటివ్స్
ఆసాని పెంచే కారకాలు రోజూ 10-12 గ్లాసులు నీళ్లు తాగాలి బాడీ లోషన్స్, షాంపోలు, డియోడరెన్స్,
షేవింగ్ లోషన్స్ వాడొద్దు.