ధనియాల్లో మసాలా అంశాలే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.ప్రత్యేకించి రక్తపోటును నియంత్రించే అంశాలు ధనియాల కషాయంలో విరివిగా ఉన్నాయి.ఈ కషాయాన్ని హిమకల్పం అంటారు.
హిమకల్పం తయారీ విధానం -
25 గ్రాముల ధనియాలను నూరి , ఒక వెడల్పాటి పాత్రలో వేసి పావు లీటర్ నీటిని పోసి రాత్రిపూట ఆరుబయట పెట్టాలి.ఆ పాత్రపైన మూతపెట్టకుండా ఏదైనా పలుచని గుడ్డను కట్టాలి.ఉదయం లేవగానే ఆ పాత్రలోని ధనియాలను చేతితో బాగా పిసకాలి.తర్వాత ఒక గ్లాసులో దానిని వడకట్టి కొద్దిగా పంచదార కలుపుకొని రోజూ సేవిస్తే బీపీ అదుపులోకి రావడమే కాకుండా పిత్త సంబంధ రోగాలన్నీ హరించుకు పోతాయి.చాలా కాలంగా వేధించే కడుపు మంట , మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.