9, జనవరి 2016, శనివారం

VUNDRALLU , AVIRI KUDUMULU - AYURVEDAM

కోటల్ కెళితే ఇడ్లీలు దొరకుతాయి
గానీ ఉండ్రాళ్ళు దొరకవు. గారెలు, వడలు
దొరుకుతాయిగానీ ఆవిరి కుడుములు
దొరకవు.
ఉండ్రాళ్ళు వినాయక చవితినాడు
మాత్రమే తినాలని మన ప్రజలు ఎందుకను
కొంటారో తెలీదు. ఆవిరి కుడుములు
వేస్తారనీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివనీ
మన వాళ్ళు చాలా మందికి తెలీదు. తెలిసినా
వండరు. అమ్మమ్మల వంటలని ఎగతాళి
చేస్తారని భయం!!
బహుశా, పూటకూళ్ళ సాంప్రదాయాన్ని
మార్చి తమిళులు, కన్నడవారూ తెలుగు నాట
హోటల్ సాంప్రదాయాల్ని ప్రవేశ పెట్టి “ఇడ్లీ
+ వడ దోసె"ల్ని మనమీద రుద్దేశారు.
దాంతో మనం మన సాంప్రదాయకమైన
ఆహారాన్ని మర్చిపోయి ఇడ్లీ సాంబార్లలో
వడి కుడితి తొట్లో ఎలుకలా కొట్టు
కొంటున్నాం... అవునంటారా.... కాదంటారా....
'విదేశీ సంస్కృతి' అంటూ అయిన
దానికి కానిదానికి ఒంటికాలుమీద లేచే మన
పెద్దలు ఇలా మనం స్వంత సంస్కృతిని
మరిచిపోతున్న నంగతిని ఎప్పుడైనా
గుర్తించారా...???
ఇడ్లీలు వాతం చేస్తాయి
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు ఎంత
మేలుచేస్తాయో మీకు వివరంగా చెప్పబోయే
ముందు ఇడ్లీ గురించి ఒక మాట...
ఇడ్లీలు ఉప్పుడు రవ్వతో తయారౌతాయి
కాబట్టి తెల్లగా మర పట్టించకుండా
బియ్యంలో సారం అంతా పోకుండా
ఉప్పుకు రవ్వలో నిలవ వుంటుంది కాబట్టి
ఉప్పుడు రవ్వ వలన బలం ఎక్కువగా
వస్తుందనీ, నాడీ ఉత్తేజం (Nerve Stimula-
tion) కల్గుతుందని అర్ధం చేసుకోవాలి.
ఇది బాగానే ఉంది కానీ, ఉప్పుడు
రవ్వవలన, అవి పులిసిన బియ్యం కాబట్టి-
వాతం పెరుగుతుంది. మలబద్ధకం కలుగు
తుంది. అందుకని కడుపులో మంట, గ్యాస్
ట్రబుల్ పేగుమాత, అమీబియాసిన్,
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు
న్నవారు, అన్నిరకాల వాతవ్యాధులున్నవారు
ఇడ్లీలు తినడం మంచిది కాదు.
చలవని కల్గించే చక్కని టిఫిను ఇదిగో...
మీ కోసం...
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు కొంచెం
ఆలస్యంగా అరుగుతాయి. అందుకని ఇవి
తేలికగా అరగడం కోసం నెయ్యివేసుకొని
తినాలి. ఇడ్లీలైనా నేతితో తిన్నప్పుడు అంతగా
చెడును కల్గించవు.
ఆరోగ్యవంతుడే కాదు, ఏ వ్యాధితో
బాధపడున్నవారైనా సరే ఉండ్రాళ్ళనూ ఆవిరి
కుడుమునూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చలవని కల్గిస్తాయి. తృప్తిని కల్గిస్తాయి. తిన్న
తర్వాత కడుపునిండినట్లు అనిపిస్తుంది. మళ్ళీ
భోజనం వేళకే ఆకలి అవుతుంది. అందుకని
టిఫిన్ గా ఉండ్రాళ్ళను గానీ, ఆవిరి కుడుము
నుగానీ తినడం మంచిది.
ఇడ్లీల వలన తృప్తి కలగదు. అందులోకి
శనగ చెట్నీ, కారప్పొడి, సాంబారు లేనిదే
అవి సహించవు. అవన్నీ కలిపి తినడం వలన
ఇడ్లీలు వేడిచేసే వాటిలో ముందు వరసగా
వచ్చేస్తున్నాయి. ఉండ్రాళ్ళుగానీ, ఆవిరి
కుడుములుగానీ ఇలా వేడిచేయనీయ
కుండానే చక్కగా, నేరుగా తినవచ్చు. ఈ
సున్నితమైన తేడాని గుర్తించండి.
మూత్ర వ్యాధులున్నవారు, మూత్ర
పిండాలలో రాళ్ళతో బాధపడున్నవారు,
మూత్రంలో మంట చీము వున్న వారు
ఉండ్రాళ్ళు తింటే మంచిది. చలవని కల్గి
స్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో ఇడ్లీ
సాంబార్లు తినడం కన్నా వీటిని తినడం
మంచిది.
రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు
తినదలచిన వారుకూడా, ఆవిరి కుడుముగానీ,
దిబ్బరొట్టెగానీ తినడం మంచిది. చపాతీలు
సరిపడని వారికీ ఇవి మంచివే. చలవ
నిస్తాయి. పెద్దగా కేలరీలు పెరగవు. గోధుమ
పిండితో వండిన వాటి కన్న మన వాతా
వరణానికి ఇవే మంచివి!
ఆవిరి కుడుముల కన్నా మంచి ఆహారం
ఇంకొకటి లేదు
ఆవిరి కుడుములు తింటే- భోజనం
3
చేయగానే వచ్చే కడుపులో నొప్పి వ్యాధిలో
చాలా మంచిది. కడుపులో పుండువలన ఈ
నొప్పి వస్తూండవచ్చు. ఉండ్రాళ్ళుకూడా ఈ
వ్యాధిలో మేలుచేస్తాయి.
ఆవిరి కుడుముల్ని రాత్రిపూట వేసుకొని
ఉదయం పూట సూర్యోదయానికి ముందే
తింటే వేసవికాలం అమితమైన చలవ
కి నిస్తుంది. తేలికగా వడదెబ్బ తగలకుండా
-దే కాపాడుతుంది.
వాత వ్యాధులు, పక్షవాతం కీలు
గా నొప్పులతో బాదపడున్న వారికి ఈ విధంగా
పెడితే వాతం త్వరగా తగ్గుతోంది. మందులు
చక్కగా పనిచేస్తాయి.
ఇడ్లీలు చల్లారితే బాగోవు. ఆవిరి
కుడుము చల్లారిన తర్వాతే బాగుంటుంది
ఆరోగ్యం కూడా!! ఆవిరి కుడుములో బియ్యం
చాలా స్వల్పంగా వుంటాయి. కేవలం
మినపప్పును, జిగురుకోసం కొద్దిగా బియ్యపు
గింజలు కలిపి నానబెట్టి రుబ్బి ఇడ్లీ ప్లేట్లలో
గానీ, వాసిన కట్టిన గుడ్డమీదగానీ ఇడ్లీ వేసినట్లే
వేసుకొని చల్లారిన తర్వాత తింటారు. ఆవిరి
కుడుముల్లో బియ్యం దాదాపుగా వేడి కాబట్టి
ఇంతకుమించిన ఉత్తమమైన ఆహారం
మధుమేహరోగులకుగానీ,
స్థలకాయులకిగానీ
ఉండదు కదా! ఆ విధంగా, కేవలం మినప
పిండితో వండినవి కాబట్టి ఆవిరి కుడుములు
వాత వ్యాధుల్లో అద్భుతమైన ప్రభావాన్ని
చూపిస్తాయి. గారెలకన్న ఆవిరి కుడుములే
శ్రేష్టం. గారెల్లో నూనె వుంటుంది. ఆవిరి
కుడుముల్లో నూనె అసలే వుండదు కదా!
అన్నం కన్నా ఉండ్రాయి మిన్న
ఇంక ఉండ్రాళ్ళు - బియ్యపు రవ్వతో
తయారుచేస్తారు. వండే విధానంలో ఇడ్లీలను
వండినట్లే వీటిని ఆవిరిమీద ఉడికించడమే
పద్ధతి. ఇందులో మినపప్పు వుండదు. రుచి
కోసం శనగపప్పు కలుపుతారు. కానీ,
మామూలు బియ్యంతో వండిన అన్నంకన్నా
ఉండ్రాళ్ళు తేలికగా అరుగుతాయి. ఎక్కువ
చలవ.
ఇవి తరతరాలుగా మన తెలుగు వారు
తిన్న టిఫిన్లు. ఆరోగ్యానికి మేలు చేసేవి.
తమిళులు, కన్నడీయులు పుణ్యమా అని,
మనం చలవచేసే టిఫిన్లను వదిలేని
వేడిచేసేవి. ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి అయిన
ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీలను తిని
బాధపడ్తున్నాం- కాదంటారా...!!
జీలకర్ర ధనియాలను విడివిడిగా నేతిలో
వేయించి, సమానంగా తీసుకొని, మెత్తగా
దంచి, తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని
నంజుకుతింటే ఇవి
తేలికగా అరుగు
తాయి. పొదీనా ఆకు
పచ్చడి కూడా వీటికి
విరుగుడుగా పని
చేస్తుంది.

5, జనవరి 2016, మంగళవారం

పాలకూర తినకూడని వ్యాధులు / PALAKOORA - THINAKOODANI VYADHULU .

పాలకూరను జీవంతి అంటారు.పేరుకుతగ్గ ఆహారద్రవ్యం ఇది.గొప్ప బలకరమైన ఔషధాల్లో పాలకూర ఒకటి.ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా తినిపించాలి.క్యాన్సర్ లాంటి ఉద్రేక స్వభావం ఉన్న వ్యాధుల్లో ఉపశమనం కలిగిస్తుంది.క్యాన్సర్,స్థూలకాయం,బిపి,షుగరు వ్యాధి,గుండె జబ్బులు,అల్సర్లు,జీర్ణకోశ వ్యాధులు ఇలా అనేక వ్యాధులకు పాలకూరలో ఔషధ గుణాలున్నాయి.కె విటమిన్ తో పాటు శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ ఉన్నాయి.రక్షనయంత్రాంగం పాలకూరలో పుష్కలంగా ఉంది.ఇది బాగా చలవ చేస్తుంది.సాధారణంగా అన్ని వ్యాధుల్లోనూ తినతగినదిగా ఉంటుంది.కొన్ని ఔషధాలతో ఇది రసాయన చర్యలు జరుపుతుంది.దానివల్ల ఆయా ఔషధాలను బట్టి ,వ్యాధులను బట్టి కొన్ని ప్రభావాలుంటాయి.చక్కెర వ్యాధిలో వాడే మందులతో పాటు పాలకూరను తీసుకుంటే చక్కెర స్థాయి బాగా తగ్గుతుందని పరిశోధనల్లో తెలిసింది.కాబట్టి షుగర్ బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళు పాలకూర తిన్నప్పుడు ఔషధాల మోతాదుని డాక్టర్ సలహా మేరకు మార్పుచేసుకోవాల్సి రావచ్చు.షుగరు సరిగా కంట్రోల్ లో లేని వాళ్ళు పాలకూరను తినటం అలవాటు చేసుకోవాలి.గుండె జబ్బులు,బిపి వ్యాధుల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మది చేసేందుకు కొన్ని ఔషధాలు వాడతారు.దీని చలువచేసె స్వభావరీత్యా రక్తస్రావాన్ని ఆపే స్వభావం కలిగి ఉంటుంది.దీనిలోని కె వితమిన్ ఇందుకు తోడ్పడుతుంది.ఇది రక్తం గడ్డ కట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నమాట.రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ఆలస్యం చేసే మందులు ,వేగవంతం చేసే ఆహరమూ రెండూ విరుద్ధ స్వభావాలను కలిగినవవుతాయి.అలాంటప్పుడు ఆ రోగులకు మాత్రమే పాలకూరను తగ్గించాలని వైద్యులు చెబుతారు.అలాగే మూత్రపిండాల్లో కాల్షియం ఆగ్జలేట్ రాల్లు ఉన్నవాళ్ళకి పాలకూరను తినవద్దని చెబుతారు.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి పొటాషియం ఉన్న పాలకూర బిపి ని తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది.బిపి రోగులు పాలకూరను తప్పని సరిగా తినాలి.కానీ మూత్రపిండాలు బాగా చెడిపోయి సోడియం,పొటాషియం సమతుల్యతలో తేడాలేర్పడతాయి.డయాలసిస్ మీద ఉన్న రోగులకు సోడియం నిలవలు తగ్గిపోయే పరిస్థితి వస్తే పాలకూరను వద్దంటారు.ఇలా పాలకూరను  తప్పనిసరిగా మానాల్సిన వ్యాధుల్లో మాత్రమే వైద్య్లు ఆ విధంగా సూచిస్తారు.దాని అర్థం పాలకూరతో కిడ్నీలో రాళ్ళొస్తాయి,కిడ్నీలు చెడిపోతాయని కాదని గుర్తించాలి.

SHANAGA PINDI MANCHI CHEDU - AYURVEDAM

శనగపిండి మంచి - చెడూ

శనగపిండి మంచి ప్రొటీన్లతో కూడిన ఆహారం కదా! వైద్యులు దాన్ని
తినవద్దని ఎందుకు చెప్తారు?
* శనగపిండి తినకూడని చెడ్డ ఆహార పదార్ధం కాదు. ఆ మాటకొస్తే ఏ ఆహారద్రవ్యాన్ని తినకూడనిదిగా ముద్ర వేయటము మంచిది కాదు. మీరన్నట్టు
శనగపిండి మంచి పోషక విలువలు కలిగిన ఆహార ద్రవ్యమే!
సహజంగా శనగపిండితో చేసిన వంటకాలు కష్టంగా అరిగే స్వభావం
ఆకలి కలిగిన వారికి దీన్ని నిరభ్యంతరంగా పెట్టవచ్చు. తిన్న తరువాత
కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఉర్ణశక్తి బలంగా ఉన్నవారికీ, అతి
ఎలాంటి ఇబ్బంది కలిగించనప్పుడు దాన్ని మానాలని చెప్పాల్సిన అవ
సరం లేదు. జఠరాగ్ని బలహీనంగా ఉన్న వారికి మాత్రమే దీని జాగ్రత్తలు
వర్తిస్తాయి.
పోషక విలువలు ఉన్నవన్నీ అరిగించుకోగల స్థితిలో వ్యక్తి
ఉన్నప్పుడే
..వంటబడతాయి. కాబట్టి, అరిగించుకోగల
వారికి వర్తించే విషయాలు అగ్నిబలం తక్కువగా ఉన్నవారికి
వర్తించవని అర్ధం చేసుకోవాలి. అలాంటి వాళ్లకు శనగలు, శనగపప్పు, శనగపిండి
అపకారం చేసేవిగానే ఉంటాయి. జీర్ణశక్తి ననుసరించి, శనగపిండి తినడమో మాన
డమో ఎవరికివారు నిర్ణయించుకో
అని చెప్పవచ్చు. 
శనగపిండి వేడి శరీర తత్వం ఉన్న
వారికి కడుపులో ఆమ్లాన్ని పెంచు
తుంది. వాత శరీరతత్వం ఉన్నవారికి
కీళ్ళవాతం ఇతర వాత బాధలను
పెంచుతుంది. కఫతత్వం ఉన్నవారిలో
మందగుణం, ఉత్సాహం, చలాకీ
తనం లేకుండా చేస్తుంది. షుగరు,
బీపీ, అర్ధరయిటీస్, ఎలర్జీలు, పేగుపూత, స్థూలకాయం వగైరా వ్యాధులున్నవారికి
అపకారం చేస్తుంది. చిక్కిపోతున్నవారికి, శుష్కించిపోతున్న వారికి జీర్ణశక్తిని పెంపొం
దేలా చికిత్స చేస్తూ శనగపిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.
శరీర శ్రమ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఏది తిన్నా అరిగించుకోగలవాళ్ళకు శనగ
పిండి మేలే చేస్తుంది. ఆయుర్వేదశాస్త్రంలో చెప్పిన చికిత్సా సూత్రం ప్రకారం,
ప్రయత్న పూర్వకంగా రోగి జఠరాగ్ని బలాన్ని కాపాడవలసి ఉంది. అగ్ని బలం పెరి
గితే, రోగి బలం పెరిగి, రోగ బలం తగ్గుతుంది. అప్పుడు వ్యాధిని తగ్గించటం తేలికవు
శనగపిండి ప్రస్తావన దీర్ఘ వ్యాధుల విషయంలో వచ్చినప్పుడు జీర్ణశక్తిని బట్టి తినా
తుంది.అప్పటికప్పుడు ముంచుకొచ్చిన వ్యాధుల్లో అగ్నిబలం ముఖ్యం
కాబట్టి శనగపిండిని ఆపాలని చెప్పవచ్చు.. ఏ వ్యాధులూ లేనివాళ్లకు, మంచి జీర్ణశక్తిఉన్నవాళ్లకు శనగపిండిని నిరభ్యంతరంగా వాడుకోవాలని చెప్పవచ్చు.

2, జనవరి 2016, శనివారం

THYROID JABBU - AHARA NIYAMALU - AYURVEDAM



* అయోడిన్‌ తగినంత సరీమాణంలో అహారం ద్వారా అందనష్పుడు 
గ్రంథి వాచిపోయి అనేక రుగ్యతలకు దారి తీస్తుంది. శరీరంలోని జీవనక్రియే లన్నింటికీ ఈ థైరాయిడ్‌ గ్రంథి అధార భూతంగా ఉంటుంది. దాని పని తీరు తగ్గిపోతే మెదడు, నరాలు, చర్మం, వెంట్రుకలు కడుపులోని అనేక అవయ వాల మీద దాని ప్రభావం చెడుగా ఉంటుంది. మీకు డాక్టరుగారు రాసి చ్చిన మాత్రలు అయోడిన్‌ మాత్రలు కావు, అవి థైరాక్సిన్‌ అనే హార్మోను మాత్రలు థైరాయిడ్‌ గ్రంథి నరిగా పనిచేయకపోవటం వలన ఈ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతోంది. అది ఎంత మేర అవనరమో అంతకు తగ్గ మోతాదులో ఆ బిళ్లలు వాడుకోవాలి. ఎక్కువైనా ప్రమాదమే... తక్కు వైనా ప్రమాదమే! 
" ఆమోడిన్‌ కలిసిన ఉప్పు వాడటం వలన ,  తైరా 

క్సిన్‌ హార్మోన్ల ఉత్పత్తి లోపం కలగదని ఆ విధంగా అయోడిన్‌ ష్పుని వాడేస్తున్నారు. కానీ థైరాయిడ్‌ దెబ్బతినటొనికి అయోడిన్‌ లోపం ఒక్కటీ కారణం కాదు. మన జీవన విధానం, మన ఆహార విహారపు అలవాట్లు, బజార్లో 
మనం కొనుక్కుంటున్న ఆహార ద్రవ్యాలు అన్నీ అంతో ఇంతో కారణం అవుతు న్నాయి. విషరసాయనాల కల్తీలు, రంగులు కలిసిన ఆహార పదార్థాలు, వాతావరణ 
కాలుష్యం లాంటివి కూడా కారణాలవుతున్నాయి. గత 80 యేళ్లుగా అయోడిన్‌ కలి సిన ఉప్పే వాడుతున్నప్పటికీ, 
రోజురోజుకీ థైరాయిడ్‌ గ్రంథి % చెడిపోతున్నరోగుల సంఖ్య పెరు 
గుతోందే గానీ తగ్గటం లేదు, గొ అందుకే, అయోడిన్‌ ఉప్పుకీ ష్‌ థైరాయిడ్‌ కోసం వాడే మందు ౯ లకూ సంబంధం లేదు. దేని దారి 
దానిదే. 

థైరాయిడ్‌ వ్యాధిలో ప్రthyekamaina ఆహారం అంటూ ఏమీ లేదు. సా ధ్యమైనంత వరకూ కాయగూరలకు, అకుకూరలకూ ప్రాధాన్యత ఇచ్చేలా bhoja నం తీరుని మార్పు చేసుకోవాలి. ఫైబర్‌ ఎక్కుvaga ఉండే ఆకుకూరలు, కాషగూ రలూ, వళ తినండి. రాగి, జొన్న నజ్జ ధాన్యాలు ఈ వ్యాధిలో కొంత మేలు చేస్తాయి 

6 రుచులూ కలిసిన ఆహారాన్ని ఆయుర్వేదంలో సమతుల్య ఆహారం (బ్యాలెన్స్‌ ల అంటారు. వగరూ, చేదు రుచులు కలిగిన పదార్థాలు కూడా తగినంతగా భోజ ర తో ఉందేలా చూసుకోండి. బాగా చిలికిన, పలచని మజ్జిగ వగరు రులి కలిగి వ్రయోజనకరంగా ఉంటుంది. అయోడిన్‌ ఉప్పుని ఆపకండి. జీర్ణశన్ని baలంగా ఉండేలా చూసుకుంటే థైరాయిడ్‌ బాగా అదుపులో ఉంట్రుంdi. 

AVAKAYA / VOORAGAYA PACHADI - AYURVEDAM



* మనకే కాదు, క్లియోపాత్రకి దోసావకాయ అంటే మహాప్రీతి
అని చరిత్రకారులు చెప్తారు. ఊరుగాయలు ప్రపంచ ప్రాచీన ఆహార
పదార్ధం. పళ్ళూ, కాయలూ, మాంసం దొరకని అన్ సీజన్లో కూడా
వాటిని కమ్మగా తినేందుకు ఊరుగాయ ప్రక్రియని మన పూర్వులు ఉప
యోగించుకున్నారు.
కూరగాయ మొక్కలు తరిగి ఉప్పు పట్టించి నిలవబెట్టడాన్ని ఊరపె ర్ధదం అంటారు. ఉప్పు తగలగానే కూరగాయ ముక్కల్లోంచి నీరు ఆస్మాసిన్‌ వద్ధతిలో బయటకు వచ్చేన్తుంది. నీటిని పిండేసి ఆవసెండి, మంతిపిండిలొంటి సుగంధ ద్రవ్యాలను కలిపితే అది ఊరు 
గాయ (వికిల్‌. పికిల్‌ అంటే ఉప్పులో ఊరపెట్టటం అని అర్ధం. మూగాయని ఊరుగాయగా మొదలుపెట్టి మామిడి ముక్కలోని నీరంతా తీసేనీ 
టి చివరికి ఆ ఒరుగుల్ని మళ్ళీ ఆ పుల్లటి నీళ్ళలోనే వేసి తాలింపు పెడుతు 
న్నారు. అంటే ఊరుగాయని
పుల్లగాయగా మారుస్తున్నారు.
ఊరబెట్టినదాంట్లో మెంతిపిండి
వగైరా కలిపి తాలింపు పెట్టు
కుంటే ఆ మాగాయిలో పులుపు
సమానంగా ఉంటుంది. రుచిగా
ఉంటుంది. ఉప్పు, కారాలు
తక్కువ పడతాయి. ఆరోగ్యానికి
హాని చెయ్యదు.

 ఊరుగాయల్లో ఉత్తమమైంది. ఉసిరికాయతో పెట్టిన ఊరుగాయ. ఉసిరికాయ
లోపలి గింజలు తీనేని ఉప్పు కలిపి ఊరబెట్టి, తొక్కి నిలవబెడతారు. అందుకని
తొక్కుడు పచ్చడి, నల్లపచ్చడి అని కూడా పిలుస్తారు. ఊరుగాయని జాడీలో వాసెనా
కట్టి ఆరునెలలు మాగేలా చేస్తారు. ఎప్పటికప్పుడు కొద్దిగా ఇవతలకు తీసి, కొత్తిమీర వగైరా కలివి తాలింపుపెట్టి తాజాదనాన్ని కాపాడుకుంటూ ఉంటారు. పాతబడి. ఉనీరి తొక్కు, చింతకాయ తొక్కు, చూమిడి తొక్కు, ఇంకా కంద, వెలగ, టమోటా వంకాయ, దోనే, నిమ్మ, కాకర ఇలా రకరకాల కాయగూరలతో లేదా పళ్ళతో ఊర గొయలు పెడుతుంటారు. 
ఆవకాయకన్నా, తొక్కు పచ్చడి లేదా నల్లపచ్చడి ఆరోగ్యదాయకం. గోంగూరని
ఉప్పుతో ఊరబెట్టి చింతపండు రసం పోసి నిలవ పచ్చడి పెడితే అది తప్పకుండా అప
కారం చేస్తుంది. పులుపుని తగ్గించడానికి ప్రయత్నిస్తే ఊరుగాయలు మేలు చేస్తాయి.
పులుపు పెరిగే కొద్దీ ఉప్పూకారం నూనెల మోతాదు పెరుగుతుంది. వాటివలన
మరింత చేటు కలుగుతుంది. కానీ, కూరగాయల్లో చేసిన ఊరుగాయలు పేగులకు
బలం ఇచ్చి విరేచనం అయ్యేలా చేస్తాయి. జీర్ణశక్తిని కాపాడతాయి. సౌర, బీర, ద్రాక్ష
బొప్పాయి, అరటి, బూడిద గుమ్మడి లాంటి కూరగాయలన్నింటితోనూ మేలు చేసే
విధంగా ఊరుగాయలు పెట్టుకోవచ్చు.

23, డిసెంబర్ 2015, బుధవారం

GORU VECHANI NEERU / WARM WATER - HEALTH BENEFITS


గోరువెచ్చని నీళ్లు
తాగితే మేలే!


రోజులో
ఎన్ని
గ్లాసుల నీళ్లు
తాగితే అంత
మంచిది.
అయితే ఓ
గ్లాసు వేణ్నీళ్లు
కూడా ప్రతి
రోజూ తీసుకుంటే మరింత మంచిదంటు
న్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం
వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని
నీళ్లు తాగుతారు. నిజానికి భోంచేశాక తాగడం
వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అరుగుదలలో
ఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుం
టుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది.
చిన్నారులకు కూడా వేణ్నీళ్లు తాగే అలవాటు
చేయడం మంచిది. చురుగ్గా ఉంటారు.
ఆ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు
రకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చని
నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకో
వచ్చు. చర్మ సంబంధిత
సమస్యలు తగ్గు
ముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే ఈ
గ్లాసు వేణ్నీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసం
కలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది.
శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ
పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని
చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా
త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి
బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే
సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట
తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందు
తుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా
నిద్రపడుతుంది.

22, డిసెంబర్ 2015, మంగళవారం

TOMATO VANTA - AYURVEDAM



? టమాటాలను వందకూడదంటారు. నిజమేనా?
* టమాటాల్నే కాదు, సి.విటమిన్ పుష్కలంగా ఉన్న ఏ ఆహార ద్రవ్యాన్ని అధిక ఉష్ణో
గ్రత దగ్గర వండకూడదు. 50
నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట
మధ్య వందితే వాటిలో ఉండేని
విటమిన్ మనకు దక్కుతుంది.
ఎక్కువ ఎండలో ఎక్కువసేపు
ఎండ పెట్టినా సి విటమిన్ మనకు
దక్కకుండా పోతుంది. అలాగని
గడ్డ
కట్టేంత చల్లదనంలో అంటే
డీప్ ఫ్రిజ్ఞులో పెట్టినా కూడా
విటమిన్ దక్కదని పరిశోధకులు చెప్తున్నారు.
చారు, పప్పు, కూరలాంటివి వండుకునేప్పుడు టమాటా ముక్కల్ని కుక్కరులో
ఉంచి ఉడికించటం వలన అందులోని విటమిన్ ఎగిరిపోతుంది. సి విటమిన్లకపోతే
టమోటాలో రుచి కూడా చచ్చిపోతుంది. చారు గానీ, పప్పు గానీ కూరగానీ వండుకో
వటమే అయ్యాక చివరికి దింపేప్పుడు టమాటా కలిపి కొద్దిసేపు ఉంచి దింపేస్తే
టమాటా తిన్నందువలన అసలు ప్రయోజనాలు దక్కుతాయి. అసలైన రుచి కూడా
దక్కుతుంది.
టమాటాని ఎక్కువ నీళ్లలో ఉడికించకండి. సన్న సెగన నిదానంగా
వండండి. ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత దగ్గర టమోటాను వండకండి. వండిన
పదార్థాన్ని తిరిగి వేడి చేయటం (రీ హీటింగ్ గానీ తిరిగి వండటం (ఈ
కుకింగ్ గానీ చేయకండి. టమాటాలను ఎక్కువగా కొని ఫ్రిజ్రుల్లో
పెట్టుకోవడం మంచిది కాదు. తాజాగా కొనుక్కోవటమే మంచిది. ని
విటమిన్న మనం ఎంత దక్కించుకోగలమనే దాని మీద దృష్టి పెట్టి
టమాటాలను వండుకోవాలి.

శీతాకాలంలో / చలికాలంలో ఏం తినాలి? / SHEETHAKALAM LO YEM THINALI - AYURVEDAM


శీతాకాలంలో వాతవ్యాధులు తిరగబెడుతుంటాయి.మిరియాలు,వాము,జీలకర్ర ,దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుకోవడం మంచిది.వీటిలో ఏదైనా ఒక పొడిని ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ మోతాదులో కలిపి మరిగించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని  తాగితే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.జలుబు , ఉబ్బసం లాంటి ఎలర్జీ వ్యాధులున్నవారికి, కీళ్ళవాతం ఉన్నవారికి ఈ వాంవాటర్ , జీరా వాటర్ , ధనియా వాటర్ లేదా దాల్చిన వాటర్ చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ఏ - విటమిన్ కలిగిన ఆహార పదార్థాలు , చలికాలంలో వచ్చే జబ్బులు , నొప్పులను నివారిస్తాయి.ఎక్కువ చలిని ఓర్చుకోవటానికి ఏ - విటమిన్ శరీరానికి బాగా తోడ్పడుతుంది.

ములక్కాడలు , మునగాకు , మామిడి , బొప్పాయి ,ఎర్ర గుమ్మడి పండు ,చిలగడ దుంపలు , కంద,పెండలం , క్యారెట్లు ,ఆకు కూరలు, కోడి గుడ్లు ,బఠానీలు చలి కాలంలో తినదగినవిగా ఉంటాయి.పిల్లలకు మిరియాలు , బెల్లం కలిపిన పాలు తాగిస్తూ ఉండాలి.

అల్లం , ఉప్పు కలిపి నూరిన ముద్దను అన్నంలో మొదటి ముద్దగా తింటే కడుపులో జఠర అగ్ని బలంగా ఉంటుంది.వాతం పెరగకుండా కాపాడుతుంది.ఈ కాలంలో పిల్లలకు అల్లం కానీ, వాము కానీ కలిపి శనగ పిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.సంక్రాంతి వంటకాలలో వాతం చేసే అరిసెల పక్కన నువ్వు పొడి వేసిన కజ్జి కాయల్లాంటి వేడి చేసే వంటకాలను ,చిలకల్లాంటి చలవ చేసే వాటినీ చేర్చేది సమతుల్యత కోసమే.


THAVUDU THO SWEET - AYURVEDAM



12 కీళ్లవాతం వ్యాధులు రావడానికి బియ్యంలో చిట్టు తవుడు తీసేయటమే కారణం
అంటున్నారు కదా! చిట్టు, తవుడులతో ఏదైనా వంటకం చేసుకోవచ్చా?

* చేసుకోవచ్చు. అలాంటి ఆలోచన చేయటం తప్పేమీ కాదు. ఇంకొంచెం లోతుగా
ఆలోచిస్తే గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఆరికల్లాంటి ప్రత్యామ్నాయ ధాన్యాల్లో చిట్టు,
తవుడు తీసేయకుండా
పూర్తి ధాన్యాన్ని పిండి
లేదా రవ్వగా తయారు
చేసుకుంటున్నాం. కాబట్టి,
రోజువారీ అవసరానికి
సరిపడగా ఈ ప్రత్యా
మ్నాయ ధాన్యాలను
కూడా తింటూ ఉంటే,
తవుడుని కోల్పోయిన
లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఎల్లకాలం ఒకే ధాన్యం మీద ఆధారపడి పోవటం కూడా
మంచిది కాదు. అన్నంలో రాగి పిండి కలిపి చేసే సంకటిలాంటి ప్రత్యామ్నాయ వంట
కాలను తినటం కూడా అలవాటు చేసుకోవాలి. మొదట మనం తినటం మొదలెడితే,
మనల్ని చూసి ఇతరులు కూడా తింటారు. ఇతరులు తినటం చూసి మనం అనుసరిం
చటంలో గొప్పేమీ ఉండదు.
అయినా, చిట్టు, తవుడుతో ఏదైనా వంటకం గురించి అడిగారు. బాగుచేసిన తవు
డుని నేతితో కమ్మగా వేయించి బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకులు వగైరా వేసి సున్ని
ఉండలు కట్టుకోవచ్చు. కావాలంటే కొద్దిగా మినప్పిండి కలుపుకోవచ్చు కూడా!
ఆహారం విషయంలో ఆరోగ్యం కోసం కొత్తగా ఆలోచించాలనే మీ తపనకు
అభినందనలు.

17, డిసెంబర్ 2015, గురువారం

ALLERGY KI AHARA VAIDYAM - AYURVEDAM

* దగ్గు జలుబు తుమ్ములు ఆయానంతో బాధవడుతున్హాము. ఎలెర్టీ అన్హారు. నివారణగా ఉండే ఒకటి రెండు ఆవోరాలు చెవృండీ. 

* ఎలెర్జీ వ్యాధులతో బాధపడేవారు ఆగాకరకాయలను తరచూ వండుకుని తింటూ ఉంటే శరీరంలో విషదోషాలు పోయి ఎలెర్జీ &ీవ్రత తగ్గుతుంది. 

రోజూ ప్రొద్దునే ఒక చెంచా మెంతులు నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తే కఫం అడ్డుపడటం ఆగి ఉబ్బనం ఉపశమిన్తుంది. పది తులసాకులు రెండు లేక మూడు మిరి యపు గింజలు కలిపి నమిలినా లేదా దంచి ఉండలు కట్టుకొని మింగినా ఎలెర్జీలో ఉవ శమనం ఉంటుంది. తులసాకులు, పూలు, వెన్ను గింజలు కూడా దగ్గునీ అయాసాన్నీ తగ్గిస్తాయి. వీటితో టీ కాచుకుని తాగవచ్చు. వనకొమ్మును దంచిన పొడి, మిరియాల పొడి, తులసాకులు పొడి, టీ పొడి నాలుగూ నమభాగాలుగా తీనుకుని టీ కాచుకుని తాగితే దగ్గు, జలుబు తుమ్ములు ఉబ్బసాల మీద లాగా పనిచేన్తుంది. 

AJEERTHI RAKUNDA AHARAM - AYURVEDAM

2. అజీర్తి రాకుండా చేసే మంచి ఆహారం చెప్పండి!
* ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు,
కొంది, పిప్పళ్ళు మిరియాలు..వీటన్నింటినీ సమంగా తీసుకుని mettaga దంచి ఒక చెంచా పొడి తీసుకోండి. చిన్న గ్లాసుడు బియ్యం,
అందులోనగం చాయ పెసరపప్పు తీసుకుని జావలాగా ఉడికించండి.
ఉడికిన తరువాత, ఈ చెంచాడు పొడిని కలిపి మరికాసేపు ఉడికించి,,
Dimపండి. దీన్నే అష్టగుణ మందం అంటారు. ఇది అజీర్తి రాకుండా చేసే
గొప్ప ఔషధం. రోజూ తీసుకోవచ్చు. భోజనానికి ముందు తాగితే భుక్తా
మానం రాకుండా ఉంటుంది.కొత్తిమీరని మిక్సీపట్టి ఓ గ్లాసురసంలో తగినంత ఉప్పు, మిరియాల
పొడి కలిపి, రోజు ప్రొద్దునపూట తాగుతూ ఉంటే అజీర్తిరాదు.
ఎసిడిటీ తగ్గుతుంది. గ్యాసు రాదు. ప్రతిరోజూ అల్లం, తగినంత
ఉప్పుకలిపి దంచి, అన్నంలో మొదటి ముద్దగా కలిపి, నెయ్యివేనుకుని తింటే భోజనంలో ఉండే దోషా లు లన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక kaluguthundi.ajeerthi rakunda untundi.
Biryani aku
Ajeerthi ni ,. బియ్యంలో దోషాలు పోగొడు thundi

. తుంది. కొత్తబియ్యం, దుద్దుబియ్యం 
లాంటివి నరిపడని వారికి బిరియానీ ఆకు వేసి అన్నం వండితే ఎలాంటీ ఇబ్బందీ కల 
గకుండా ఉంటుంది. అవకాశం ఉన్న వంటకాలలో అవపిండిని చిటికెడంత కలిపి 
వండుకుంటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది. పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే పైత్యం తగ్గి అరుచిపోతుంది. అజీర్తి కలగకుండా ఉంటుంది. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...