27, నవంబర్ 2015, శుక్రవారం

SHASTHROKTHA / SHADRASOPETHA BHOJANAM - AYURVEDAM

మొదటి ముద్దగా అల్లం

భములో ఏది ముందు ఏం వెనుక తినాలో ఏవైనా నియమాలు
చెప్పారా? రాత్రంగా భజన చేయబారి ఏమంటారు?

* అల్లాన్ని తగినంత సైంధవ
లవణం (దొరక్కపోతే మామూలు
ఉప్పు) కలిపి నూరిన ముద్ద ఒక
చెంచాడు తీసుకుని కొద్దిగా అన్నంలో
కలుపుకుని మొదటి ముద్దగా తినాలట..
భోజనంలో కూరల్లాంటి ఘన పదార్థా
లను ముందుగానూ, మృదువైన పప్పు,
పచ్చడి లాంటివి మధ్యలోనూ, చారూ
పులుసూ లాంటి ద్రవపదార్ధాలను చివరగానూ, ఆఖరున పెరుగు లేదా మజ్జిగతో
ముగించాలి. పాలతో తయారయిన స్వీట్లను భోజనం మధ్యలో పులుసన్నం, పెరుగా
న్నంకన్నా ముందే తినేయాలి. లడ్డూ లాంటి పాలు కలవని స్వీట్లను భోజనం ఆఖరు -
తీసుకోవచ్చు. భోజనం చివర తీపి తినాలని చెప్పారు.
వడ్డించేప్పుడు తీపితో మొదలుపెడతారు. తినేప్పుడు కూర, పప్పు, పచ్చడి
పులుసు, పెరుగు వరుసలో తినటమే మంచిది. ఆయుర్వేద శాస్త్రం సూచించిన ఈ వి.
మైన భోజన విధానాన్ని దేశంలో ఒక్క తెలుగువారు మాత్రమే పాటిస్తున్నారు. తీ-
పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ తగు పాళ్లలో ఉండేలా సు
తుల్యంగా ఆహారం ఉంటే దాన్ని షడ్రసోపేతమైన భోజనం అంటారు. వగరూ చేయి
పదార్థాలను కూడా రోజూ తినటం అవసరం.


26, నవంబర్ 2015, గురువారం

RUDRA JADA / SABJA GINJALU - AYURVEDAM

చలవ చేసే సజ్జాగింజలు

సజ్జాగింజలు నానబెట్టి షుగరు రోగులు తీసుకోవచ్చా? లాభాలేమిటి? 

? - రుద్రజడ దీని అసలు పేరు. సబ్దా అనేది అరబ్బీ పదం. వేడి ఎక్కువగా ఉన్నవా
రికి ఈ గింజల్ని పది నిమిషాల సేపు నీళ్లలో నానించి ఇస్తే వెంటనే చలవ
చేస్తుంది. షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు, పోట్లు ఉన్నవారికి ఈ గింజల్ని రోజూ
తాగిస్తే మంటలు ఉపశమిస్తాయి. మూత్రంలో మంట, కడుపులో మంట, అరికాళ్లు
చేతుల్లో మంట, కళ్లు మంటలు, నాలుక మీద మంట, విరేచనంలో మంట ఇలా
మంటగా ఉండటమే వేడి అంటే! సజ్జాగింజలు ఈ వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పి
మీద కూడా పనిచేస్తాయి. పంచదార కలపకుండా షుగరు రోగులకూ, స్థూలకాయు
లకూ ఇవ్వొచ్చు. మజ్జిగలో కూడా నానబెట్టుకుని తాగవచ్చు. పాలలో వేసి ఉడికించి
టీలాగా కాచుకుని తాగవచ్చు. కిరాణా కొట్లలో ఇవి తేలికగా దొరికేవే!

PALLEELU / VERUSENAGA PAPPU ALLERGY - AYURVEDAM

పల్లీల ఎలెర్జీ?

2 వేరుశనగ పప్పులు వాడితే మంచిదేనా?

* వేరుశనగ గుళ్ళు, పల్లీలు, వేరు గుళ్ళు పేరుతో మన ప్రాంతాల్లో దొరికే వేరుశనగ
గుళ్ళు మనకి మధ్య యుగాల
మలిదశలో విదేశీయులు దిగు
మతి చేసిన నూనె గింజలే. నూనె
సంగతి అలా ఉంచితే వేరుశన
గలు శనగల్లాగే పైత్యం చేసే
స్వభావం కలిగి ఉంటాయి.
యాసిడ్ని పెంచి ఆకలి చంపు
తాయి.
వేరుశనగ పప్పుల్ని కొద్దిగా
నెయ్యి వేసి దోరగా వేయించుకుని
బెల్లంముక్కతో కలిపి తింటే, అజీర్తిబాధలు, కడుపునొప్పి, గ్యాసురాకుండా ఉంటా
యని మన పెద్దవాళ్ళు వేయించిన శనగగుళ్ళను తీపితో కలిపి పెడతారు. గాంధీగారు
వేరుశనగ పప్పు, బెల్లం ముక్కతోపాటు మేకపాలు కూడా తీసుకునేవారని ప్రతీతి.
ఏమైనా వేరుశనగ గుళ్ళు మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కావు. అలాగని
నిషేధించాల్సినవి కూడా కావు. సరదాగా అప్పుడప్పుడు వేయించిగాని, ఉడకబెట్టుకు
నిగాని, తంపట పెట్టుకునిగానీ తీసుకోవచ్చు. కొందరిలో ముఖ్యంగా పిల్లల్లో
ఉబ్బసం వ్యాధికి ఇవి కారణం అవుతాయని ఇటీవల అమెరికన్ పరిశోధకులు
గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒక ఊపిరితిత్తుల ఆసుపత్రిలో పిల్లల మీద జరి
పిన పరిశోధనలో ఈ హెచ్చరిక చేశారు. వేరుశనగపప్పు తిన్న కొంత
మందిలో ఎలెర్జీని నియంత్రించే ఇమ్యునోగ్లోబులిన్-ఇ అసాధారణంగా
పెరగడాన్ని గమనించారు. ఆ వ్యక్తులకు వేరుశనగ సరిపడదని దాని
అర్ధం. సరిపడనివారు తప్ప తక్కినవారికి వేరుశనగ విరోధం లేదు.
అయినా అవి నూనెగింజలు కాబట్టి స్థూలకాయులకు జాగ్రత్త తప్పదు.


CHILAKADA DUMPA LABHALU - AYURVEDAM

వార్ణచందు చిలకడ దుంపలు

చిలకడ దుంపల వలన లాభాలు? 

 ఆలూ దుంపల్లాగానే చిలకడ దుంపలు కూడా 17వ శతాబ్దిలో అమెరికా
నుంచి విదేశీ వ్యాపారుల ద్వారా మనకు చేరాయి. వాతం చేస్తాయని, షుగరు
పెంచుతాయనీ, మలబద్ధతని తెస్తా
యని చాలామంది వీటిని తినరు.
కానీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి
ఇవి మేలే చేస్తాయి. పైగా జీర్ణశక్తిని
పెంచుతాయి కూడా! ఆ విషయంలో
ఆలూ కన్నా ఇవే మెరుగు.
ఎర్రగా ఉండే చిలకడదుంపల్ని
పిల్లలకు తరచూ వండి పెడుతూ
ఉంటే చీటికీ మాటికీ విరేచనాలయ్యే
వ్యాధిని తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెప్తోంది. చిలకడదుంపల్లో ఉండే ఎ విట
మిన్ (బీటా కెరొటీన్) పేగుల లోపలి గోడల్ని బలసంపన్నం చేస్తుందని నిర్ధారించారు.
అందువలన పేగుల్లో ఉద్రేకం కలిగించే ఆహార పదార్థాల్నీ, బాక్టీరియా దోషాలున్న
ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు పిల్లల్లో విరేచనాలు అవకుండా ఇవి పేగుల్ని కాపా
డతాయని నిర్ధారించారు.
చిలకడదుంపల్ని ఉడికించి, తాలింపు పెట్టి పిల్లలకు సాయంకాలం పూట స్కూలు
నుంచి రాగానే పెట్టడానికి వీలుగా ఉంటాయి. క్యారట్, చిలకడదుంపలు సమానశక్తి
కలిగిన ద్రవ్యాలు, వాటిని ఎ విటమిన్ లోపం ఉన్న పిల్లలకు తగుపాళ్ళలో అందించవ
లసి ఉంది. శనగపిండి స్వీట్లు, హాట్లు పేగుల్ని పాడుచేస్తాయి. చిలకడ దుంప స్వీట్లు
పేగుల్ని బాగుచేస్తాయి.


JUNK FOOD - NOLLALO VELLALU

నోళ్ళలో వెల్లలు

జంక్ ఫుడ్స్ గురించి చెప్పండి!

చిన్నపిల్లల్లో స్థూలకాయం, ఈడు రాకుండానే రజస్వలలు
కావటం, బాల్యంలో షుగరు, బీవీ వ్యాధులు, అనేక మానసిక
ప్రవర్తనా వ్యాధులు కలగడానికి జంక్ ఫుడ్స్ తప్పకుండా కారణం
అవుతున్నాయి.
వెల్ల అంటే తెల్లరంగు. ఏరంగూ లేని తెల్లని స్వీటు కూడా ఈ వెల్ల (తెల్ల
రంగు) కలిపి తయారుచేసిందేనని స్వీట్ షాపువాళ్ళు చెప్తున్నారు. రంగుక
లిసిన ఆహారవిషాలు మాకు వద్దనవలసింది ప్రజలే. స్థూలకాయం వస్తుం
దీని ఇంట్లో పిల్లలకు నెయ్యి, నూనె, జీడిపప్పుల్లాంటివి పెట్టటం మానేసి,
రోడ్డుపక్కన ఆంక్ విషాహారాలు కొనిపెట్టడం ఒక రివాజు అయ్యింది.
సమోసాలు, మైనం లామినేషన్ చేసిన కరకరలు, రంగు
నీళ్ళు, చవకబారు బిస్కట్లు, కోక్ ఎక్కువగా కలిసిన చాక్లెట్లు,
రంగులద్దిన కేకులు, నీలిరంగు బూందీ, ఆకుపచ్చ కారప్పూన
ఇలాంటివి విషాలకిందకు తీసుకురావలసిన అవసరం ఉంది.
ఏవి జంక్ ఫుడో నిర్వచించి, అవి
విషపదార్థాలని ప్రభుత్వం స్పష్టం
చేయాలి. హానికారక జంక్ ఫుడ్స్న
విద్యాలయాల దగ్గర్లో అమ్మకుండా
నిషేధించే ఆలోచన ప్రభుత్వం
చేస్తున్నట్టు 2015 ఆగష్టు నెలాఖ
రులో ఒక ప్రకటన వెలువడింది.
స్కూలు యూనిఫారంలో ఉన్న
పిల్లలకు జంక్ ఫుడ్స్ అమ్మకూ
డదు, పెద్దలకు మాత్రమే అనే
నియమం పెడతారట. ఈ నియమం ఎంత అమలౌతుందో తెలీదు. తల్లిదండ్రులే జంక్
ఫుడ్స్ కొని, పిల్లలకిచ్చి సూళ్ళకు పంపుతున్నారు. తమ పిల్లలు వాటి బారినపడకుండా
నియంత్రించుకోవలసింది కన్నవారే కదా!


VANASPATHI / DALDA

నూనెలో చెడుకొవ్వు?

డాల్డాలాంటి వనస్పతి నూనెలు వాడవచ్చా?

* నూనెని మరింత చిక్కబరచటం కోసం వంటనూనెల్లో హైడ్రోజన్ కణా
లను చేరుస్తారు. దాంతో నూనెలోని కొవ్వు ఘనపదార్ధం (Solid
Saturated Fats) గా
మారుతుంది. కరిగే
స్వభావం ఉన్న ఈ కొవ్వు
రక్తంలో చేరి గుండె జబ్బు
లకు కారణం అవుతోంది.
చాలా ఇబ్బందులు కలిగి
స్తుంది. కరిగే స్వభావం లేని
కొవ్వుని కూడా ఇది చెడుకొవ్వు Bad Cholesterol or LDL గా మారుస్తుంది. చెడుకొ
వ్వుని పెంచే ఈ వనస్పతిని వాడటం హానికరమేనని వేరే చెప్పనవసరం
లేదు. రిఫైండ్ నూనెని కూడా అధిక ఉష్ణోగ్రత దగ్గర కాచి, వేపు
డులు వంటివి వండితే, వాటిలో వనస్పతికన్నా ఎక్కువ చెడుకొవ్వు
పేరుకుని ఉంటుందని కూడా పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి
నూనెల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.


VANKAYA VANKALU - AYURVEDAM

వంకాయ వంకలు


 వంకాయ ఎలర్జీ కలిగిస్తుందనేది నిజమేనా?

* వంకాయ నూరు శాతం భారతీయమైనది. తరతరా
లుగా మన పూర్వులు తిని ఆనందించిన ఆరోగ్యదాయకమైన
ఆహార ద్రవ్యమే! దాన్ని ద్వేషించాల్సిన పని లేదు.
సరిపడని ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు కలిగే వ్యాధి లక్ష
జాలను 'ఓరల్ ఎలెర్జీ సిండ్రోమ్' అంటారు. దీనిపైన చేసిన ఒక
సర్వేలో 10% భారతీయులకు వంకాయ సరిపడదనీ, వారిలో
14% మందికి తీవ్ర రియాక్షన్ వస్తోందని తేలింది. మన శరీర
తత్వం వలన, వాటిని వండే విధానం వలన కూడా వంకాయలు సరి
పడట్లేదని గమనించాలి. (మనుషులందరికీ వంకాయ పడద
నటం సరికాదు.) ఏ ద్రవ్యం అయినా మన శరీరానికి సరిపడ డా.జి.వి.పు
కపోవచ్చు. లేత వంకాయ పిందెలు అన్ని వ్యాధుల్లోనూ తిన
దగినవిగా ఉంటాయి. వంకాయ ముదిరితే దాన్ని పారేయండి గానీ, చెల్లబెట్టా
లని చూడకండి. వంకాయతో చింతపండు, శనగపిండి లాంటివి కలిపి
వండటం వలన నూనెలో వేసి బొగ్గుముక్కల్లా మాడ్చటం వలన కూడా అది
అపకారం చేసేదిగా మారు
తుంది. అల్లం, ధనియాలు,
జీలకర్ర, మిరియాల్లాంటి
జీర్ణశక్తిని పెంచే ద్రవ్యాలతో
వంకాయని వండుకుంటే
దాని దోషాలు చాలావరకూ
తగ్గుతాయి.
ఒక్క వంకాయ విషయం
లోనే కాదు సరిపడని ఏ కూర
గాయనైనా ఇలా సంస్కరించి సరిపడేలా చేసుకోగలగాలి. తక్కువ మోతాదుతో
మొదలు పెట్టి, క్రమేణా పెంచుకుంటూ పడని దానిని పడేలా చేసుకోవడాన్ని
డీ-సెన్సిటైజేషన్ (సాత్మీకరణం) అంటారు.
జలుబు, ఉబ్బసం లాంటి ఎలెర్జీ
వ్యాధులున్న వారు పడని వస్తువుల్ని ఇలా సాత్మీకరణం చేసుకోవటం అవసరం.

GUMMA PALU - AYURVEDAM

గుమ్మపాలు



ఇంటికొచ్చి పాలు పోసి అబ్బాయి గుమ్మపాలు తెచ్చి పెడతానంటు
న్నాడు. వాటిని తాగవచ్చా?

* గుమ్మపాలకూ పచ్చి
పాలకూ తేడా తెలిస్తేనే మీ
ప్రశ్నకు సరైన సమాధానం
వస్తుంది. గుమ్మపాలను ధార
స్థాలు అంటారు. ఎందుతున్న
ప్పుడు గిన్నెలో ధారగా వస్తున్న
పాలు వేడిగా ఉంటాయి. పితు
కుతూ ఉండగా వచ్చే గోరు
వుని పాలధారను గుమ్మపాలం
వారు. గిన్నెలోకి చేరిన మరు నిమిషంలోనే అవి పచ్చిపాలుగా మారిపో
తాయి. గేదె/అవు సొంతదార్లకు తప్ప ఇతరులకు వేడి మీద తాగటం సాధ్యం
కాదు. వాటిని తాగకపోతే మనం కోల్పోయే అమృతం కూడా ఏమీ
లేదు. పాలు కాయకుండా తాగకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
టీబీ, టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి అంటువ్యాధులను తెచ్చే
సూక్ష్మజీవులు ఈ పచ్చిపాలలో ఉంటాయి. రెండు మూడు పొంగులు
వచ్చే వరకూ పాలు మరిగిస్తేగానీ ఈ బాక్టీరియా చావదు. పచ్చిపా
లను గుమ్మపాలుగా భ్రమించి కొత్త జబ్బులు తెచ్చుకోకూడదు.

RAVVA GODHUMALU - AYURVEDAM

రవ్వగోధుమలు

అమ్య గోరుములు మంచివా? ఉంది. గోరుములు
ముందూ? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది

గోధుమలనీ పిలుస్తారు. బ్రిటికం తురుమ్ అనేది దీని వృక్ష
నామం దురుమ్ అంటే లాటిన్ భాషలో గట్టిగా ఉండటం అని అర్థం.
సింది గోధుముల కన్నా రవ్వగోధుమల్లో గుటెన్ పదార్థం తక్కువగా
ఉంటుంది. ఈ గ్లుటెన్ అనేది గోధుమ పిండిని మెత్తదనాన్నిచ్చే
ప్రొటీన్ పదార్థం. అది చాలా మందికి సరిపడక పోవచ్చు. అలాంటి
వాళ్లకు గోధుమ రవ్వ ఇబ్బంది పెట్టకపోవచ్చు. తిని చూసుకోవాలి.
పిండి గోధుమల్లో కన్నా రవ్వ గోధుమల్లో కేలరీలు
తక్కువ, రవ్వ గోధుమలు ఎండి పట్టించుకుని ఆ పిండితో
రొట్టెలు, చపాతీలు చేసుకోవటం వలన, స్థూలకాయం షుగరు
వ్యాధులున్నవారికి మేలు
అట్లు, జంతికలు, మిఠాయి
తయారీకి రవ్వ గోధుమల
పిండిని లేదా రవ్వను వాడు
కుంటే మంచిది. రవ్వ గోధు
మల పిండితో రాగి పిండి గానీ,
జొన్న పిండి గానీ సమానంగా
కలిపి కాల్చిన చపాతీలు,
పుల్కాలూ రుచిగా ఉంటాయి.
తక్కువ కేలరీలను కలిగి
ఉంటాయి. అన్నం మానేని
పుల్కాలను తిన్నా ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగా
వేయించి చిక్కని జావ కాచి ఉప్పూ, మిరియాల పొడి కలిపి తయారుచేసిన పారిజ్
లేదా సూపు సురక్షితమైన ఆహార పదార్థం. గోధుమ రవ్వని అన్నంగానూ, ఉప్మా
గానూ, మినప్పిండి కలిపి ఇడ్లీ, దోసెలుగా కూడా తినవచ్చు. వ్యాధులు వచ్చిన
ప్పుడు పిండి గోధుమల కన్నా రవ్వగోధుమలకే ప్రాధాన్యత ఇవ్వండి. మొలకెత్తిన
రవ్వగోధుమ విత్తనాలు తినేవారు శనగలు, పెసలు, బొబ్బర్ల కన్నా గోధుమ మొల
కలు తినే అలవాటు చేసుకోవటం మంచిది.


14, నవంబర్ 2015, శనివారం

PATIKA PANCHADARA - AYURVEDIC USES

పటికిపంచదార

బెల్లం మంచిదా? పటికబెల్లం మంచిదా?

* తెల్లగా అచ్చులాగా ఉండి లోపల పొరలు పొరలుగా ఉండేది పటిక పంచదార.
మన వైపున దారికేది అంత
తెల్లగా ఉండదు. దీన్ని పటిక
బెల్లం అంటారు. బెల్లం కన్నా
పటిక బెల్లం, పటిక పంచదార
శ్రేష్టంగా ఉంటాయి. వేడి, వాతం
తగ్గిస్తాయి. కడుపులో ఎసిడిటీ
వలన కలిగే ఉద్రేకం తగ్గుతుంది.
వేడి చేసినందువలన వచ్చే పొడి
దగ్గుని తగ్గిస్తుంది. ఉడుకు విరేచనాల్లో సగ్గుబియ్యం జావలో పటికి పంచదార కలిపి
తాగితే విరేచనాలు ఆగుతాయి. తీపిని అతిగా తింటే వాంతులు అవుతాయి. ఆకలి
చచ్చిపోతుంది. మలబద్ధత ఏర్పడుతుంది.


VEYINCHI VANDADAM - AYURVEDIC USES



వేయించి వండితే మేలు

 ధాన్యాన్ని వేయించి వండితే లాభం ఏమిటి?

బియ్యం, రాగులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉల
పలు, అలచందలు... వీటిని కొద్దిగా సెగ చూపించినట్టు వేయిస్తే
వాటిలో దాగి
ఉన్న ఆరోమా
(సుగంధం) బయటకు
వచ్చి అమిత రుచిక
రంగా ఉంటాయి.
తేలికగా వేయించి
నందు వలన గింజ
లోపల ఉండే తేమ
అవిరై పోయి, తేలికగా అరిగే గుణాన్ని పొందుతాయి. కందిపప్పు,
పెసరపప్పులను దోరగా వేయించి పప్పు వండుకుంటే ఉబ్బరం
రాకుండా ఉంటుంది. బియ్యాన్ని కూడా ఇలా వేయించి వండితే చాలా తేలికగా అరు
గుతాయి. రుచికరంగా ఉంటుంది. ఒక చెంచా నెయ్యి వేసి వేయిస్తే మరీ మంచిది.
కందినున్ని పెసరసున్ని, ఉలవనున్ని ఇలాంటివి వేయించిన కారణంగా అరుగుదలను
పొందుతాయి. వేగిన మినపప్పుతో చేసిన సున్ని ఉండలకు ఆ రుచి వేపినందు వలనే
కలుగుతోంది. శరీర శ్రమ బాగా ఉన్నవారికీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికీ వేయించి
వండి పెడితే మేలు చేస్తాయి. అతి ఆకలి కారణంగా ఎప్పుడూ ఏదో ఒకటి తిననిదే
ఉండలేకపోవటం వీటి వలన తగ్గుతుంది. ప్రయాణాల్లో తినేందుకు వీలుగా
ఉంటాయి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...