31, డిసెంబర్ 2011, శనివారం

అతిబల చెట్టు, ఆయుర్వేద ఉపయోగాలు - డా ఏల్చూరి

ఆయుర్వేద అభిమాన పాఠకులారా! మనరాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో కనిపించే
చెట్టు అతిబల. దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు వుండరు. అమితమైన బలాన్ని అందించే శక్తి
ఇందులో వుంది. కాబట్టే దీనికి అతిబల అని పేరు వచ్చింది. ప్రాచీనకాలంలో కూడా
రామాయణంలోనూ, భారతంలోనూ ఆ తరువాత కాలాలలో కూడా ఈ అతిబల మొక్క ప్రశంస
చాలాచోట్ల కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనవి.
ఇలాంటి అసాధారణమైన ఔషధ శక్తిగల ఓషధులు గ్రామ గ్రామాన వుండి కూడా వాటి గురించి
తెలుసుకోలేక ఉపయోగించుకోలేక మన భారత జాతి బలహీనమైపోతుందంటే ఇది ఎంత
దురదృష్టమో ఆలోచించండి. ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు ప్రజలందరికి తెలియజేసి
అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము.

అతిబల- పేర్లు

సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని,
తెలుగులో ముద్రబెండ, తుత్తురుబెండ, దువ్వెనకాయల
చెట్టు, అతిబల అని, లాటిన్లో Mallya Rotondifolia
ఆంగ్లంలో Mallow Tree అంటారు.

అతి బల- రూప గుణ ధర్మాలు..

తుత్తురుబెండ ఆకులు మృదువుగా, జిగట కలిగి
మేహశాంతిని కలుగజేస్తయ్. శరీరంలోని సకల
మలినాలను బయటికి తోసివేసి శుద్ధి చేస్తయ్,
గడ్డలను ,వ్రణాలను మెత్తపరచి, పక్వంచేసి మాన్పి
వేస్తయ్. ఇంకా అనేక ఉపయోగాలు తెలుసుకుందాం.

మూత్రంలో మంట, రాళ్ళు వుంటే ?

తుత్తురుబెండ నాలుగైదు ఆకులు నలిపి పావు
లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి
చల్లార్చి ఒకచెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా
తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్ళు
కరిగి మూత్రం ద్వారా పడిపోతయ్.



నేత్ర దోషాలకు - ఆకు కషాయం..

పైన చెప్పినట్లు కషాయంచేసి చల్లార్చి ఆ కషా
యాన్ని మూసిన కండ్ల పైన కడుగుతూవుంటే కంటి 
దోషాలు హరించి కంటిచూపు పెరుగుతుంది.

జ్వర తీవ్రత లో - అతి బల..

అతి బలాకులను నీటిలో నానబెట్టి వడపోసి
అందులో కొద్దిగా కండచక్కెర కలిపి కొద్ది కొద్దిగా
తాగుతూ వుంటే వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది.

* ఇదేనీరు మూడుపూటలా సేవిస్తుంటే
మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు,
దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతయ్.

పిచ్చి కుక్కవిషానికి - అతి బల

పిచ్చికుక్క కరచిన వెంటనే అతిబల ఆకుల రసం,
70 గ్రా. మోతాదుగా తాగించాలి. ఆకు ముద్దను
కాటు పైన వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి
పోతుంది.

శీఘ్ర స్కలనానికి - అతి బల

తుత్తురుబెండ గింజలు 50గ్రా,శతావరి వేర్ల పొడి
100గ్రా, ఆ రెండింటికి సమంగా పటిక బెల్లంపొడి
కలిపి నిలువ వుంచుకోవాలి. రోజు రెండుపూటలా
ఒక చెంచా పొడి చప్పరించి తిని ఒక కప్పు పాలు
తాగుతూ వుంటే శీఘ్రస్కలనం మాయమై పోయి వీర్యం
గట్టిపడి యౌవనం పెరుగుతుంది.

పైత్యపు - గుండెదడకు

అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో
నూరి బట్టలో వడపోసి ఆ రసంలో చక్కెర కలిపి
తాగుతూ వుంటే అధిక వేడి వల్ల కలిగిన గుండెదడ
తీవ్రంగా హరించి పోతుంది.

నడుము నొప్పికి - నాణ్యమైన మార్గం..

పైన తెలిపినట్లు అతి బల ఆకులతో కాచిన
కషాయం రెండుపూటలా తాగుతూ ఆకులను నలగగొట్టి
వేడిచేసి నొప్పుల పైన వేసి కట్టు కడుతూ వుంటే
కేవలం నడుము నొప్పేకాక ఎక్కడి నొప్పులైనా తగ్గి
పోతయ్.

మొలల కు - అతి బల ఆకుకూర

అతి బల ఆకులను కూర లాగా వండి రెండు పూటలా
తింటుంటే మొలల నుండి కారే రక్తం ఆగిపోతుంది.

స్త్రీల - స్తనాల వాపుకు

అతి బలవేరును నిలువ చేసుకొని, రోజూ రెండు
పూటలా కొంచెం నీటితో సానరాయిపైన ఆ వేరును
అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ వుంటే
రొమ్ముల వాపు తగ్గిపోతుంది.
అలాగే కండరాల వాపు పైన కూడా పట్టిస్తూ వుంటే
ఆ వాపు తగ్గుతుంది.

దగ్గు, ఉబ్బసం - హరించిపోవుటకు

బాగా ముదిరిన అతి బల చెట్టును సమూలంగా
పెకలించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో
ఎండబెట్టాలి. తరువాత దాన్ని కాల్చి బూడిదగా
చేయాలి. ఆ బూడిదను ఒక కుండలో పోసి నిండా
నీరుపోసి మూడు రోజులపాటు వుంచాలి. రోజుకు
ఒకసారి కర్రతో కలుపుతూ వుండాలి.
నాలుగవ రోజున పైకి తేలిన నీటిని మాత్రమే
ఉంచుకొని చిన్న మంట పైన మరిగిస్తే అంతా తెల్లటి
క్షారంగా మిగులుతుంది.దాన్ని మెత్తగా నూరి నిలువ
చేసుకోవాలి.
ఈ క్షారం రెండు మూడుచిటికెల మోతాదుగా
ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తు వుంటే దగ్గు,
ఉబ్బసం హరించిపోతయ్.

మూత్రపిండాల - నొప్పి తగ్గుటకు

అతి బల ఆకులను 50 గ్రా. తీసుకొని మెత్తగా
నూరి చిన్నచిన్న బిళ్ళలుగా తయారుచేయాలి.
తరువాత ఆవునెయ్యి 50 గ్రా. పాత్రలో పోసి పొయ్యి
మీద పెట్టి నెయ్యి మరుగుతుండగా ఈ బిళ్ళలను
అందులో వేయాలి. బిళ్ళలన్నీ వేగేవరకువుంచి దించి
వడపోసి వాటిని నిలువ చేసుకోవాలి. రోజూ
రెండుపూటలా ఒకటి లేక రెండు చెంచాల మోతాదుగా
వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గి
పోతుంది.

నులిపురుగులు హరించుటకు..

అతి బల గింజలను నిప్పుల పైన వేసి ఆ పొగను
పిల్లల గుద స్థానమునకు తగిలేటట్లుగా చేస్తే దాని
ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించి పోతయ్.

మొలల కు - అతి బల గోలీలు..

అతిబల ఆకులు ఇరవై ఒకటి, అలాగే మిరియాలు
ఇరవై ఒకటి తీసుకొని మొత్తం మెత్తగా నూరి ఏడు
గోలీలు చేయాలి. రోజు ఒక గోలీ చొప్పున ఏడు
రోజులు పరగడుపున ఒక గోలీని మంచినీటితో సేవి
స్తుంటే వాత దోషంవలన కలిగిన మొలలు హరించి
పోతయ్.

గుండె బలానికి - ముఖ కాంతికి

అతి బలవేర్లను దంచి పొడిచేసి జల్లించి నిలువ
వుంచుకోవాలి. ఈ పొడిని మూడునాలుగు చిటికెల
మోతాదుగా ఆవునెయ్యితో కలిపి రెండుపూటలా
ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గుండెకు
బలం కలగడమే కాక ముఖం కూడా కాంతివంతంగా
మారుతుంది. *



30, డిసెంబర్ 2011, శుక్రవారం

డా ఏల్చూరి - కరక్కాయతో ఆయుర్వేద ఉపయోగాలు

కన్నతల్లికి బొట్టు - కరక చెట్టు
ఈనాడు యావత్ ప్రపంచం అనేక పరిశోధనలు చేసి ఎంతో గొప్పదని కొనియాడబడుతున్న త్రిఫల చూర్ణంలో ఈ కరక్కాయ మొట్టమొదటిది. "కరక్కాయ అంటే కన్నతల్లి" అనే నానుడి మన తెలుగునాట ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ప్రతి తెలుగుతల్లి తన చీర కొంగుకు ఎల్లప్పుడూ కరక్కాయను కట్టుకొని ఉంచు కొనేది. ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఏ సమస్య వచ్చినా కరక్కాయ తోనే పరిష్కరించేది.
ఈనాడు ఈ మాతృవిజ్ఞానం లోపించడంవల్ల స్వదేశీ శాస్త్ర విజ్ఞానం మరుగునపడిపోవడంవల్ల ఇంత
అమూల్యమైన చెట్ల విలువ మనకు తెలియకుండాపోయింది. ఆ విలువను మరలా మీకు తెలియజేసి
ఆ మాతృవిజ్ఞానాన్ని మీకందించడానికే ఈ వివరాలు..

కరకచెట్టు - పేర్లు

సంస్కృతంలో హరీతకీ, అభయ, అని, హిందీలో
హరట్ అని, తెలుగులో కరక్కాయ అని, లాటిన్లో
Terminalla chebala
అని ఇంగ్లీషులో Chebulic
Myrabolan అంటారు.

కరక కాయ- రూప గుణ ప్రభావాలు.

ఇది వగరు, తీపి, చేదు రుచులు కలిగి చలువ చేసే
గుణంతో త్రిదోషాలనుహరించే దివ్య ఫలం. అయితే
స్త్రీలు గర్భవతులుగా వున్నప్పుడు దీనిని సేవించ
కూడదు. దీని సుగుణాల గురించి వర్ణించడం
బ్రహ్మతరంకూడా కాదు. కాబట్టి విశ్వాసంతో దీని
ఉపయోగాలు తెలుసుకుందాం.

సర్వరోగాలకు - సంపూర్ణపరిష్కారం

మట్టి మూకుడులో చిన్నమంటపైన దోరగా
వేయించి దంచిన కరక్కాయల బెరడు పొడి 5 గ్రా.
మోతాదుగా సమంగా పాతబెల్లం కలిపి గీష్మ
ఋతువులో సేవించాలి. అలాగే 5 గ్రా .కరకపొడిలో
3 గ్రా. సైంధవ లవణం కలిపి వర్ష ఋతువులో
సేవించాలి. అలాగే 5 గ్రా.కరకపొడిలో సమంగా
చక్కెర కలిపి శరదృతువులో సేవించాలి. తరువాత
5 గ్రా.కరకపొడిలో 2 గ్రా .దోరగా వేయించిన శొంఠి
పొడి కలిపి హేమంత ఋతువులో సేవించాలి.

పై ప్రకారంగానే 5గ్రా. కరకపొడిలో, 2గ్రా. దోరగా
వేయించిన పిప్పళ్ళపొడి కలిపి శిశిరఋతువులో
మంచినీటితో సేవించాలి. ఆ వరుసలోనే 5 గ్రాము
కరకపొడిలో ఒక చెంచా తేనె కలిపి వసంత ఋతువులో
సేవించాలి.
ఈ విధంగా ఆరు ఋతువులలో ఆరు విధాల
అనుపానాలతో సేవించేవారికి నూరేండ్లకు పైగా
అనారోగ్యం కలుగకుండా నిండు యవ్వనంతో
జీవించగలరని మహాఋషుల వాక్కు.

రక్త మొలలకు - రంజైన యోగం.

కరక్కాయ పొడి 5గ్రా, బెల్లం గ్రా.కలిపి
భోజనానికి గంటముందు తింటూ వుంటే రక్త మొలలు
హరించిపోతయ్.

వాంతులకు - వాటమైన యోగం.

కరక్కాయ పొడి 3గ్రా. తేనె ఒక చెంచా కలిపి
రోజుకు రెండు లేదా మూడుసార్లు సేవిస్తూ వుంటే
- వాంతులు కట్టుకుంటయ్.

ఆకలి పెరుగుటకు - అన్నం అరుగుటకు

కరక్కాయ బెరడు పొడి 60 గ్రా,పిప్పళ్ళపొడి
30 గ్రా., దాల్చిన చెక్క పొడి 10 గ్రా, నల్లఉప్పు పొడి
10 గ్రా. పొంగించిన మంచి ఇంగువ పొడి 10 గ్రా
ఇవన్నీ దోరగా వేయించి కలిపి నిలువ వుంచుకోవాలి.

పూటకు రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా,
గోరువెచ్చని నీటిలో రెండుపూటలా ఆహారానికి
అరగంటముందు సేవిస్తూ వుంటే ఆకలి బాగా
పెరుగుతుంది. అన్నంబాగా అరుగుతుంది.

సుఖ విరేచనమునకు - సులభ యోగం

కరక్కాయ బెరడు పొడి20 గ్రా,ధనియాల పొడి 50గ్రా,
పటిక బెల్లం పొడి 70గ్రా, కలిపి నిలువ వుంచుకోవాలి.

రోజూ రెండుపూటలా ఒక చెంచా పొడి ఒక గ్లాసు
మంచినీటిలో కలిపి ఆహారం తరువాత సేవిస్తూ వుంటే
మెదడుకు బలం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా
ఉంటుంది. ఉదయం సుఖ విరేచనం అవుతుంది.

పిల్లల నోటిపూత తగ్గుటకు.

కరక్కాయపొడి, జీలకర్రపొడి, మాను పసుపుపొడి,
ఆకుపత్రి పొడి, వీటిని సమంగా కలిపివుంచుకొని అయి
దారు చిటికెలపొడిలో, పావుచెంచాతేనె కలిపి రంగ
రించి పట్టిస్తూవుంటే నోటిపూత హరించిపోతుంది.

చిన్నపిల్లల మలబద్దకానికి..

లేత కరక పిందెలను చిన్నమంటపైన నేతిలో
దోరగా వేయించి పొడి కొట్టి దానితో సమంగా సైంధవ
లవణం కలిపి నిలువ వుంచుకోవాలి. పూటకు ఒకటి
నుంచి మూడు చిటికెలు మోతాదుగా కొంచెం నీటితో
కలిపి తాగిస్తూ వుంటే పిల్లల కడుపునొప్పి, కడుపు
ఉబ్బరం, అగ్నిమాంద్యం, మలబద్దకం తగ్గిపోతయ్.

అన్నిరకాల అండ వృద్ధి - హరించుటకు.

కరక పెచ్చుల పొడి, సన్న రాష్ట్రంపొడి, వెల్లుల్లి
పాయలు ఈ మూడింటిని సమంగా తీసుకొని ఆముదముచెట్టు వేర్ల రసంతో బాగా మెత్తగా మర్దించి
కుంకుడు గింజలంత మాత్రలు చేసి నీడలో గాలికి
ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.

రోజూ రెండు లేదా మూడు
పూటలా పూటకు ఒక మాత్ర చొప్పున నీటితో సేవిస్తూ
వుంటే అండవృద్ధులు హరించిపోతయ్. *






అతిగా ఒంటికి చెమట పడితే ( FOR EXCESSIVE BODY SWEATING )

కరక్కాయ బెరడు
మంచి నీరు

బెరడును నీటితో మెత్తగా నూరి ,వొళ్ళంతా నలుగుపెట్టుకొని , ఆరిన తర్వాత స్నానం చేస్తుండాలి.

uses - అతి చెమట బాధ తగ్గిపోతుంది.

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు - కసివింద చెట్టు ( NEGRO COFFEE )


తెలుగు - కసివింద చెట్టు , చెన్నంగి చెట్టు.
ఇంగ్లీష్ - నెగ్రో కాఫీ
హిందీ - కసౌందీ 
సంస్కృతం - కాసారి , కాసమర్ధ 

1 . పక్ష వాతానికి ( FOR PERALYSIS )

కసివింద ఆకులు 
వెన్న

ఆకులను వెన్నతో నూరి చచ్చు బడిన పక్షవాత భాగాలపై ప్రతి రోజూ మర్దన చేస్తుండాలి.

uses - కొన్ని రోజుల్లో అవయవాలు తిరిగి బాగు  పడతాయి.

2 . గాయాల రక్తం ఆగకపోతే ( FOR NONSTOP BLEEDING FROM WOUNDS )

కసివింద ఆకులు 

ఆకులను మెత్తగా నూరి రసాన్ని గాయంపై పిండి , ఆకుల ముద్దను పైన వేసి  కట్టు కట్టాలి.

uses -  స్రవించే రక్తం ఆగిపోయి గాయం త్వరగా మానిపోతుంది.

3 . రేచీకటి తగ్గడానికి ( FOR NIGHT BLINDNESS ) 

 కసివింద పువ్వుల రసం - 1 లేదా 2 చుక్కలు

 కసివింద పువ్వులను నలగగొట్టి బట్టలో వేసి పిండి రసం తీసి ఒకటి లేదా రెండు చుక్కలను కళ్ళల్లో వేస్తుండాలి.

uses - 7 రోజుల్లో రేచీకటి తగ్గిపోతుంది .

4 . సర్ప విషం విరుగుడుకు ( FOR SNAKE BITE - POISON )

పచ్చి కసివింద ఆకు - 20 gm
మిరియాలు - 12 

 పై రెండింటిని కలిపి మెత్తగా నూరి రసాన్ని కొంచెం నీటితో కలిపి పాము కరిచిన వారికి తాగించాలి. కరిచిన చోట కసివింద ఆకు ముద్దను వేసి కట్టు కట్టాలి. ఈ విధంగా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.

uses - పాము విషం విరిగి పోతుంది.

5 . చలి జ్వరం తగ్గుటకు ( FOR MALARIA FEVER )

కసివింద వేర్లు - 10 gm
నీరు - 1 పెద్ద గ్లాస్ నిండా

 వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి, దించి వడపోసి జ్వరం వచ్చే ముందు గోరువెచ్చగా తాగిస్తుండాలి.

Uses - చలి జ్వరం రాకుండా ఆగిపోతుంది.

కమనీయ ఔషధాల సమ గంధ - కసివింద (చెన్నంగి
 దాదాపు అన్ని ప్రాంతాలలో కసివింద చెట్లు
పెరిగి వున్నయ్ గమనించండి. వీటిల్లో చిన్న కసివింద, పెద్ద కసివింద అనే రెండు జాతులు లభ్యమౌతున్నయ్.
ఈ కసివింద చెట్టును కొన్ని ప్రాంతాలలో చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు. చిన్న చెన్నంగిని
కూర చెన్నంగి అనికూడా పిలుస్తూ దాని ఆకులతో పచ్చడిగా, కారం పొడిగా తయారుచేసుకొని
వాడుకుంటూ కడుపులోని మలినాలను సుఖవిరేచనం ద్వారా బహిష్కరింపచేసే అద్భుతమైన ఆహార
సాంప్రదాయం ఈనాటికి తెలంగాణ పల్లెల్లో వుండటం ఎంతో ముదావహం. పెద్ద కసివింద సర్వాంగాలు
అంటే ఆకులు, పూలు, గింజలు, వేరుబెరడు, కాండంబెరడు అన్నీ అద్భుతమైన ఔషధ శక్తులు నింపుకొనివున్నయ్. వీటితో ఔషధ ప్రయోగాలు కూడా కోకొల్లలుగా వున్నయ్.
 కొన్ని ఉత్తమ ప్రయోగాలను అందిస్తున్నాం.

కసివింద- రూప గుణ ధర్మాలు .

దీని ఆకురసం చేదుగా వుండి వేడి చేస్తుంది.
వాతాన్ని, విషాన్ని హరించి వేస్తుంది. గాయాలను,
వ్రణాలను, చర్మ రోగాలను పోగొడుతుంది. సుఖ
విరేచనం చేస్తుంది. దీని ఉపయోగాలు తెలుసు
కుందాం.

పసిపిల్లల - బాల పాప చిన్నెలకు

కొంతమంది పసిపిల్లలకు బాలపాప చిన్నెలు అనే సమస్య వస్తుంది. ఉన్నట్లుండి పిల్లలు కళ్ళు
తేలవేసి మూర్ఛ వచ్చినట్లుగా బిగుసుకుపోతారు. అలాంటి
పిల్లలకు దోరగావేయించి దంచిన కసివింద గింజల పొడి చిటికెడు మోతాదుగా తల్లి పాలలో కలిపి రెండుపూటలా
తినిపిస్తుంటే బాలపాపచిన్నెలు తగ్గిపోతయ్.

చర్మ రోగాలకు కసివింద 

కసివింద ఆకులు, వేరు బెరడు ఆరబెట్టి పొడి చేసి నిలువ ఉంచుకోవాలి .ఈ పొడిలో తేనె కలిపి నూరి పైన లేపనం చేస్తుంటే అనేక రకాల చర్మ రోగాలు ,పుండ్లు, వ్రణాలు, గాయాలు మానిపోతాయి.

కసివింద గింజలతో కమ్మని కాఫీ..

కసివింద గింజలను దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం లాగా కాచి అందులో తగినన్ని పాలు, కండ చక్కెర కలిపి కాఫీ లాగా తాగుతుంటే సమస్త మూత్ర రోగాలు హరించి రక్త శుద్ధి జరుగుతుంది.

అతిమూత్రానికి కసివింద 

కసివింద తగ్గించాలని కొద్దిగా వేయించి పొడి చసి
 నిల్వ ఉంచుకోవాలి ఈ పొడిని పావు చెంచా నుండి అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే అతిమూత్రం అణిగిపోతుంది.

స్త్రీల సకల కుసుమ రోగాలకు 

కసివింద చెట్టు బెరడును 20 గ్రాములు తీసుకొని అర లీటర్ నీటిలో వేసి పదినిమిషాలు మరిగించి దించి చల్లార్చాలి. ఈ నీటితో స్త్రీలు మూత్రానికి వెళ్లిన ప్రతిసారి మర్మాంగాన్ని అడుగుతూ ఉంటే కుసుమ రోగాలు హరించిపోతాయి.


 వాతరోగాలకు. కసివిందతైలం 

కనివిందాకులు100(గా, చింతాకులు 100 గ్రా, వావిలాకులు 100గ్రా, జిల్లేడు అకులు 100గ్రా, ఉమ్మెత్తాకులు 100 గ్రా మొత్తం దంచి రసం తీసి ఆ రసంలో అరకేజీ నువ్వులనూవె కలిపి చిన్నమంటపైన నూనెమిగిలేవరకు మరిగించి దించి వడపోసుకోవాలి. రోజూ రెండుపూటలా 
ఈ నూనెను గోరువెచ్చగాచేసి మర్దనచేస్తుంటే అన్ని 
రకాల వాతనొప్పులు అశ్చర్యకరంగా హరించి పోత్రయ్. 


 గర్భంనిలుచుటకు 

గుప్పెడు కసివిందాకులు, దోరగా వేయించిన పిప్పళ్ల పొడి 2 గ్రా కలిపినూరి ఆమిశ్రమాన్ని అరగ్లాస్ నాటుఆవుపాలలో కలిపి బహిష్టుస్నానం చేసిన రోజునుండి వారం రోజులపాటు పరగడుపున తాగి ఆ తరువాత భర్తతో సంసారం చేయాలి. ఈ విధంగా మూడు బహిష్టుల వరకు చేస్తుంటే గర్భదోషాలు హరించి సంతాన యోగం కలుగుతుంది... 

బోదకాలుకు కసివింద 

కసివింద చెట్టు వేర్లపై బెరడును తెచ్చికడిగి అరబెట్టిదంచి జల్లించి నిలువచేసుకోవాలి. రోజూ రెండు పూటలా పూటకు 2గ్రా నుండి మొదలు పెట్టి , క్రమంగా శరీర స్థితిని బట్టి  5గ్రా వరకు పెంచుకుంటూ రెండు చెంచాల నాటు ఆవునెయ్యి కలిపి ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే బోద వాపులు తగ్గి పోతయ్‌. 

 ఈ చూర్ణం ప్రారంభించినప్పుడు విరేచనాలు కావచ్చు. అందువల్ల కొద్ది మోతాదుగా ప్రారంభించి క్రమంగా పెంచుకోవాలి. 

ఉబ్బురోగాలకు కసివింద 

కసివిందవేరు పైబెరడును పొడిచేసి నిలువ చేసుకోవాలి . ఈ పొడి 2 నుండి 3గ్రా  మోతాదు గా ఒక చెంచా తేనె కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే శరీరమంతా నిండి పోయిన చెడునీరు బహిష్కరింపబడి ఉబ్బు రోగం తగ్గిపోతుంది. 

డా ఏల్చూరి- కామంచి చెట్టుతో ఆయుర్వేదం( GARDEN NIGHT SHADE )


తెలుగులో.. కామంచి ,బుడ్డ కాశి, కాచి, కాస చెట్టు, కాసర చెట్టు  .
ఇంగ్లీషులో గార్డెన్ నైట్ షేడ్ 
హిందీలో మాకోమ్ 
సంస్కృతంలో కామాక్షి, కాకమాచిక , కాకామి శుక్ల
లాటిన్ లో సోలానం నిగ్రం

1 . కీళ్ల నొప్పులు తగ్గుటకు ( FOR JOINT PAINS )

కామంచి ఆకులు

 కామంచి ఆకులను నూరి ,వేడి చేసి నొప్పుల పైన కట్టు కట్టాలి.

uses - కీళ్ల నొప్పులు ,వాపులు తగ్గిపోతాయి.

2 . జలుబు , పడిశం తగ్గుటకు ( FOR COLD )

కామంచి ఆకులు మరియు నీరు

 ఆకులను నలగగొట్టి నీటిలో వేసి మూత పెట్టి మరగబెట్టాలి, తర్వాత పాత్రను దింపి మూత తీసి ఆ ఆవిరిని ముక్కుతో, నోటితో పీల్చాలి.

uses - జలుబు మరియు పడిశ భారం తగ్గిపోతాయి

3 . కాలేయ ఆరోగ్యానికి ( FOR LIVER HEALTH )
 
కామంచి ఆకులు

 ఆకులు దొరికినంత కాలం పప్పులో వేసుకొని గాని, పులుసు కూరగా వండుకొని గాని తింటూ ఉంటే జీవితంలో లివర్ రోగం రాదు. లివర్లో సమస్యలు ఉన్నవారు ఈ ఆకు రసాన్ని గాని ,ఆకుకూరను గాని రోజు సేవిస్తుండాలి.


uses -  కామెర్లు ,ఒళ్లంతా నిండిన చెడు నీరు, లివర్ వాపు తగ్గిపోతాయి.

*  దీని ఆకు రసాన్ని లోపలికి ఇచ్చేటప్పుడు వేడి చేసి వడపోసి చల్లార్చి ఇవ్వాలి. పచ్చి రసం వాంతులు కలిగిస్తుంది *

4 . పిచ్చి కుక్క కాటుకు ప్రథమ చికిత్స ( FIRST AID TO DOG BITE )

కామంచి ఆకుల కషాయము మరియు పసుపు 



 పిచ్చికుక్క కరవగానే కామంచి ఆకులతో కాచిన కషాయంతో కడగాలి. తరువాత కొంత కషాయాన్ని లోపలికి ఇవ్వాలి .అలాగే కామంచి ఆకులను మెత్తగా నూరి ,పసుపు కలిపి గాయం పైన కట్టు కట్టాలి .ఇది ప్రథమ చికిత్స గా చేసుకొని మిగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి.

uses - పిచ్చి కుక్క విషము విరిగిపోతుంది.

5 . చీము కారే ఎర్ర , తెల్ల,పసుపు సెగ రోగాలకు ( FOR PUS SECRETED RED ,WHITE ,YELLOW COLOURED GONORRHOEA DISEASES )

కామంచి ఆకు రసము - 3 స్పూన్స్ 
పటిక బెల్లము - కొంచెం


 ఆకు రసాన్ని వేడి చేసి వడపోసి పటిక బెల్లం కలిపి రెండు పూటలా 20 రోజుల పాటు సేవించాలి.

 uses -  ఎరుపు, తెలుపు ,పసుపు రంగులలో చీముకారే సెగ రోగాలు తగ్గిపోతాయి .ఇంద్రియానికి బలం కలుగుతుంది.

తలనొప్పికి కామంచి 

కామంచి ఆకును మెత్తగా నూరి తల పైన పట్టు వేస్తుంటే అంత తీవ్రమైన తలనొప్పి అయినా తగ్గిపోతుంది.

నేత్ర రోగాలకు కామంచి 

దీని ఆకు రసాన్ని ఒక బొట్టు కంటిలో వేసుకుంటే కంటి చపు పెరుగుతుంది. అలాగే కంటి మూలలో రంద్రం పడి ఏర్పడిన కురుపు ను కూడా మాన్పుతుంది. కామంచి ఆకులను 10 గ్రాముల మోతాదుగా ఒక గ్లాసు నీటిలో వేసి సగం గ్లాసు కషాయం మిగిలేటట్లు మరగపెట్టి వడపోసి చల్లార్చి ఆ నీటితో మూసుకున్న కండ్ల పైన సున్నితంగా కడుగుతూ ఉంటే కంటి చూపు క్రమంగా మెరుగు పడుతుంది.

గొంతు రోగాలకు కామంచి 

కామంచి ఆకులను దంచి తీసిన రసం గోరువెచ్చగా  వేడి చేసి వడపోసి ,నోటిలో పోసుకొని, పుక్కిలిస్తూ ఉంటే గొంతువాపు ,గొంతు నొప్పి ,గొంతు పుండు ,దంతాల బాధలు, నాలుక సమస్యలు తగ్గిపోతాయి.

మన ప్రియమైన  గ్రామాలలో పోలిమేర్లచుట్టూ,పొలాలచుట్టూ
ముఖ్యంగా మెట్టప్రాంతాలలో కనిపించే నల్ల బుడ్డకాశ అనబడే నల్లకామంచిచెట్టు ,ఎర్రబుడ్డకాశ
అనబడే ఎర్ర కామంచిచెట్టు మీరు గమనించారా! ఇది సాక్షాత్తూ ఆ జగజ్జనని అయిన కామాక్షమ్మ
తల్లికి మారురూపుగా ఈ భూమిపైన అవతరించిందని మన మహర్షులు కొనియాడారు. ఎర్రగా
బఠాణిగింజంత పండ్లతో ఎర్ర కామంచి, నల్లని పండ్లతో నల్ల కామంచి పెరుగుతయ్. గ్రామీణులు
ఈ పండ్లను తింటూ వుంటారు. అయితే, ఈ చెట్టు ఉపయోగాలు వారికి తెలియవు. అందుకే
సవివరంగా తెలియజేయడానికే ఈ వ్యాసం .

కామంచి - రూప గుణ ధర్మాలు
ఇది ఏఏటికాయేడు పుట్టి గిడుతూవుంటుంది...
దీనిపండ్లు నల్లగా లేక ఎర్రగా వుంటయ్. దీని
ఆకుకూరగానీ ఆకురసంగానీ వాత,పిత్త, కఫ
సంబంధమైన సమస్త దోషాలను సరిచేయగలుగు
తుంది. చచ్చుబడ్డ వీర్యానికి వేడి పుట్టిస్తుంది.
ముఖ్యంగా లివర్సంబంధమైన పాండురోగాన్ని,
వాపులను పోగొట్టి ప్రాణం పోస్తుంది. క్రిములను,
విషాలను హరించి సుఖవిరేచనంతో హృదయాన్ని
కాపాడుతూ ఆయురారోగ్యాలను అందిస్తుంది.

చెవి రోగాలకు కామంచి 

కామంచి ఆకు రసం ఒక చెంచాలో తీసుకొని కొంచెం వేడి చేసి చెవులలో వేసుకుంటే అతి వేడి వల్ల వచ్చిన చెవిపోటు వెంటనే తగ్గిపోతుంది.

మొండి వ్రణాలకు కామంచి..

కామంచి ఆకులను యవధాన్యపు పిండితో కలిపి  ఉడకబెట్టి గోరువెచ్చగా పైన వేసి కట్టు కడుతూ ఉంటే వనాలు మాడిపోతాయి.

కాలేయ రోగాలకు కామంచి షర్బత్ 

బాగా పండ్లు పండిన కామంచి చెట్టును వేర్లు తప్ప మిగతా భాగాన్ని తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి కడిగి మెత్తగా దంచాలి. ఆ ముద్దను బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంట పైన రసం ఇగిరిపోయే వరకు ఉంచి దించాలి. కొంత సేపటికి పైన తేట నీరు పేరుకుంటుంది.పాత్రను మెల్లగా వంచి ఆ  తేట నీటిని వేరే పాత్ర లోకి వంచుకోవాలి. దాని బరువుకు రెండు రెట్లు కండ చక్కెర కలిపి కరిగించి మరలా పొయ్యి మీద పెట్టి లేత పాకం వచ్చే వరకు మరిగించి దించి నిలువ చేసుకోవాలి.

ఈ పాకాన్ని పూటకు ఒకటి నుంచి రెండు చెంచాల చొప్పున సేవిస్తుంటే సాఫీగా విరేచనం జరిగి వేడి తగ్గి శరీరంలోని విషపు నీరంతా హరించి పోతుంది.కామెర్లు, కాలేయ వాపు కూడా తగ్గి పోతయ్‌.

మూత్రపిండాల వాపుకు, పుండుకు

కామంచిపూలను తగుమాత్రంగా రెండు
పూటలా ఆహారానికి గంటముందు ఒకటి లేక
రెండుగ్రాములు తింటుంటే మూత్రం ధారాళంగా
విడుదలకావడమేకాక మూత్రకోశంలోని పుండు
మూత్రపిండాలవాపు తగ్గిపోతయ్.

కాలినగాయాలకు - కామంచి

కామంచి ఆకులను నూరితీసిన రసంలో రోజ్
వాటర్ కలిపి పైన లేపనంచేస్తుంటే కాలినపుండ్లు
బొబ్బలు హరించిపోతయ్.

*గర్భిణీ స్త్రీలు పొరపాటుగా కూడా ఈ
ఆకును ఏవిధంగానూ వాడకూడదు. వాడితే గర్భ
స్రావమౌతుంది. *

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు - కాకర చెట్టు తో( BITTER GOURD )








తెలుగు లో- కాకర చెట్టు 
english - bitter gourd
హిందీ - కరేలి 
సంస్కృతం - కర్కోటకీ
లాటిన్ లో .. మోమోర్డికా కారాంషియ.

1 . చర్మ రోగ మచ్చలు తగ్గుటకు ( FOR SPOTS OF SKIN DISEASE )

కాకర పువ్వులు 

 పువ్వులను మెత్తగా నూరి మచ్చల పైన లేపనం చేయాలి.

uses -  చర్మ రోగం వల్ల వచ్చిన మచ్చలు చర్మపురంగులో కలిసిపోతాయి

2 . ప్లీహ పెరుగుదల తగ్గుటకు ( FOR ENLARGEMENT OF SPLEEN )( POT BELLY )

గొడ్డు కాకర దుంప పొడి - 2 gm
మిరియాల పొడి - 1 gm
తేనె - 2 చెంచాలు

 పై వాటిని కలిపి రోజు పరగడుపున సేవించాలి.

uses - పొట్ట పెరిగిన బల్ల రోగం ( ప్లీహ పెరుగుదల ) తగ్గిపోతుంది.


3 . నారి కురుపులు తగ్గడానికి ( FOR SKIN BOILS )

కాకర చెట్టు వేరు - 1 భాగం
అశ్వగంధ దుంప - 1 భాగం

 పై వాటిని కలిపి మెత్తగా చూర్ణం చేసి పూటకు రెండు గ్రాములు మోతాదుగా ఒక స్పూన్ నెయ్యితో కలిపి తింటూ ఉండాలి.

uses - నారి కురుపులు తగ్గిపోతాయి.

4 . అధిక రక్త పోటు తగ్గడానికి ( FOR HIGH BP )

కాకర కాయల రసం - 1 ఔన్స్

 కాకరకాయలను దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. రోజూ పరగడుపున ఈ రసం ఒక ఔన్స్ తాగి, ఒక గంట వరకు మరేమీ తినకుండా ఆ తర్వాత ఆహారం తీసుకుంటూ ఉండాలి.

uses - అధిక రక్తపోటు తగ్గిపోతుంది.

5 . శరీరమంతా ఉన్న ఉబ్బు వ్యాధి తగ్గుటకు ( FOR WHOLE BODY OEDEMA )

కాకర ఆకు రసం - 20 gm
దేశవాళీ గేదె పెరుగు - 50 gm

 పై వాటిని కలిపి రోజు ఉదయం పరగడుపున తింటూ ఉండాలి.

uses -  శరీరం అంతా అని అంటేనే చెడు మీరు హరించి ఉబ్బు రోగం తగ్గుతుంది.

కాకరచెట్టు - రూప గుణ ధర్మాలు

కాకర చెట్లు తెలుపు ,ఆకుపచ్చ రంగుల కాయ
లను కాసే రెండు విధాలుగా ఉంటయ్. అవిగాక
అగాకరకాయలు, గొడ్డుకాకరకాయలు అనే రకా
లుగా మనం వాడుకోవడం మీకు తెలుసు. ఇవి చిరు
చేదుగా వుండి రుచిని కలిగిస్తూ నేత్ర రోగాలను,
మేహాలను, కుష్టురోగాలను హరించివేస్తయ్.

మజ్జిగలో ఉడికించి నీటిని తీసివేసి మిగిలిన
దినుసులు కలిపి వండిన కూర చాలా ఆరోగ్యంగా
వుంటుంది. లేతకాకరకాయ సర్వరోగాలను
జయించగల త్రిదోషహరమైనదని ఆయుర్వేద
శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాకరకాయకూరను
నెయ్యితోగానీ, పులుసుతోగానీ, ఆవాలపొడితోగాని
తయారుచేసుకొని తింటే ఏ దోషముండదు.

కాకరకాయ వరుగు - కమనీయం

 కాకరకాయలను గుండ్రంగా తరిగి ఎండలో ఆరబెట్టి నిలువచేసుకోవాలి. అప్పుడప్పుడు వీటిని  వేయించి కూరల్లో కలుపుకొని తింటుంటే  రుచి కరంగా అన్నిరోగాలకు పధ్యంగా పనిచేస్తు ఉంటాయి.

 మధుమేహానికి 

కాకర విత్తనాలు, నేరేడు విత్తనాలు, పొడపత్రి సరి సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి, ఈ మూడు కలిపి జల్లించి నిలువ వుంచుకోవాలి .రోజూ రెందుపూటలా ఆహారానికి అరగంట ముందు రోగతీవ్రతను పట్టి పావుచెంచానుండి టీచెంచా మోతాదువరకు మంచినీటితో సేవిస్తుంటే మధుమేహం పూర్తి గా  అదుపులోకి వస్తుంది .

చర్మ రోగ మచ్చలు తగ్గుటకు..

 కాకర లేక అగాకర పువ్వులను మెత్తగా నూరి పైన లేపనం చేస్తుంటే చర్మ రోగం వల్ల వచ్చిన మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతయ్‌.

 మూర్ఛ రోగం హరించుటకు ..

బొడ్డుకాకరదుంపలను తెచ్చి కడిగి మొదలు కోసి ఆరబెట్టి ఆరిన తరువాత దంచి  నిలువ వుంచుకోవాలి. రోజు రెండుపూటలా ఆహారానికి ముందు రెండు గ్రాములపొడి ఒకచెంచా తేనె కలిపి సేవిస్తూ వుంటే నలబై రోజులలో మూర్చ హరించి పోతుంది. 

ప్లీహ పెరుగుదలకు 

గొడ్డు కాకర దుంప ను పైన తెలిపినవిధంగా పొడిచేసి 2గ్రా, మిరియాలపొడి1గ్రా ,వీటిని ఐదుచెంచాల తేనెతో కలిపి పరగడుపున సేవిస్తూ ఉంటే పొట్ట పెరిగిన బల్ల రోగం హరించి పోతుంది. 

నారి కురుపులు హరించుటకు ..

కాకర చెట్టు వేరు, అశ్వగంధ దుంప రెండింటిని సమానంగా కలిపి మెత్తగా చూర్ణం చేసి పూటకు 
3 గ్రా మోతాదు గా ఒక చెంచా నేతితో కలిపి తింటూ ఉంటే నారి కురుపులు హరించి పోతయ్‌. 

అధిక రక్తపోటు అరికట్టడానికి ..

కాకర కాయలను కడిగి దంచి బట్టలోవేసుకొని పిండి తీసిన రసం ఒక ఔన్సు మోతాదుగా రోజు పర గడుపున తాగి ఒక అరగంట లేక గంట వరకు ఏమీ తినకుండా ఆ తరువాత ఆహారం తీసుకుంటూ ఉంటే అధిక రక్తపోటు అదృశ్యమౌతుంది. 

సర్వ విషములకు చక్కని యోగం..

 గొడ్డు కాకర తీగ సమూలంగా తెచ్చి దంచి రసం తీసి 30 గ్రా. మోతాదుగా తాగితే అన్ని విషాలు హరించిపోతయ్‌.

గొడ్రాళ్ళకు సంతానయోగం ..

అగాకరకాయలలోని గింజలను తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి నిలువచేసుకోవాలి. రోజూ 5 గ్రా పొడి ఒక కప్పు ఆవుపాలతో నిద్రించేముందు తాగుతూ వుండాలి. ప్రతిరోజూ ఒకే అవుపాలను తాగాలి. ఇలాచేన్తుంటే నమస్తగర్భదోషాలు హరించి సంతానయోగం కలుగుతుంది. 

స్త్రీల యోని భ్రంశం - కుదురుటకు 

స్త్రీలకు ప్రసవం కష్టమైనప్పుడు యోని లోపలి కండరాలు బలవంతంగా బయటకు నెట్ట బడి యోని భ్రంశం అవుతుంది. ఆ సమయంలో అగాకర దుంపను తెచ్చి మెత్తగా నూరి వెలుపలికి వచ్చిన యోని కండరాలకు లేపనంచేసి వాటిని నెమ్మదిగా లోపలికినెట్టి గోచీలాగా గుడ్డ కడుతూవుంటే యోని భ్రంశం కుదురుతుంది. 

శరీరమంతా ఉబ్బిన వారికి ..

కాకరాకు రసం 20గ్రా  దేశవాళీ గేదెపెరుగు 50గ్రా కలిపి రోజూ ఉదయంపూట తింటూ వుంటే శరీరమంతా నిండిన చెడునీరు హరించి పోయి ఉబ్బురోగం తగ్గుతుంది. 

పెట్టుడు మందుకు కాకర తో పరీక్ష ..

పెట్టుడు మందు పెట్టారని అనుమానించే వ్యక్తిని ఉదయం పండ్లు తోమక ముందే పరగడుపున వుండగా అతని చేతిలో కాకరాకు పసరు పోయాలి. 

అది అప్పటికప్పుడే గట్టిగా గడ్డ కడితే మందు పెట్టినట్లే, లేకుంటే మందు లేనట్లే .

విరేచనాలు తగ్గుటకు..

కాకర ఆకు రసం 3గ్రా , దానిమ్మాకు రసం 3గ్రా, మేక పాలు 10 గ్రా. కలిపి వుంచి అందులో దూది ముంచి ఆ దూదిని బొడ్డు పైన వుంచితే కొద్దిసేపట్లోనే ఎంత తీ(వ్రమైన విరేచనాలైనా ఆగిపోతయ్‌. 

ఇన్సులిన్ కు బదులు కాకర రసం ..

రోజూ పరగడుపున కాకరకాయలరసం 10గ్రా.మోతాదుగా  తాగి పొట్టు గోధుమపిండితో తయారు చేసిన రొట్టెలో వెన్న కలుపుకొని తింటూ వుంటే మూడు , నాలుగు వారాల్లో చక్కెర రోగం  పూర్తిగా అదుపులోకి వస్తుంది.  ఇన్సులిన్‌ ఎక్కువగా ఉపయోగించే వారు తమ శారీరక బలాన్ని బట్టి కాకరాకు రసం 20గ్రా. వరకు తీసుకొంటూ క్రమంగా ఇన్సులిన్‌ ని మాని వేయవచ్చు. 

AYURVEDA PADAMULU VATI ARTHALU ( AYURVEDIC WORDS AND THEIR MEANINGS )

వివిధ ఆయుర్వేద పదములు వాటి వివరణ..


dashamoolamulu  దశ మూలములు : chinna mulaka చిన్నములక,pedda mulaka పెద్ద ములక,nakka thoka ponna నక్క తోక పొన్న,muyyaku ponna ముయ్యాకు పొన్న,palleru పల్లేరు , maredu మారేడు ,kooranelli కూర నెల్లి,gummudu గుమ్ముడు,dundilamu దుండి లము,kaligottu.కాలిగొట్టు


dasha ksharamulu : munaga ,mullangi dumpa,moduga,chintha,allamu,chitramoolam,vepa,gummudu,vuttareni,vakudu
 
దశక్షారములు ..ముల్లంగి దుంప మునగ మోదుగ చింత అల్లము చిత్రమూలము వేపా గుమ్ముడు ఉత్తరేణి వాకుడు

dasha kashaya moolamulu : nalla vuppi,thella vuppi,kolaku ponna,muyyaku ponna,chitramoolam,seethaphalamu,chedu potla,vavili,varagogu,nela vusirika

దశ కషాయం మూలములు ..నల్ల ఉప్పి తెల్ల ఉప్పి కోలాకు పొన్న ముయ్యకు పొన్న చిత్రమూలం సీతాఫలము చేదుపుట్ల వావిలి వార గోగు నేల ఉసిరిక 
ashta dasha dhanyamulu : yavalu,godhumalu,vari,nuvvulu,korralu,vulavalu,minumulu,pesalu,chiru senagalu,anumulu,chamalu,aavalu,gavedhukamulu,nivvari dhanyamu ,kandulu,sale nakamulu ,shenagalu,cheenee dhanyamu.
అష్టాదశ ధాన్యములు.. యవలు గోధుమలు వరి నువ్వులు కొర్రలు ఉలవలు మినుములు పెసలు చిరు శనగలు అనుములు చామలు ఆవాలు గావీదుకములు నివారి ధాన్యము కందులు సలీనకములు శనగలు చిని ధాన్యము

yeka vimshathi patramulu : ganesha vrathamlo gala 21 pathramulu ,maredu,garika ,mamidi,thella maddi,vuttareni ,thummi,ganneru,jilledu ,vummetta ,vishnukrantha,regu ,thulasi ,danimma,deva daru ,maruvakamu ,vavili,jaji,kamanchi,jammi,raavi,machi patramu.

ఏకవింశతి పత్రములు గణేశ వ్రతంలో గల 21 పత్రములు మారేడు గరిక మామిడి తెల్లమద్ది ఉత్తరేణి తుమ్మి గన్నేరు జిల్లేడు ఉమ్మెత్త విష్ణు క్రాంత రేగు తులసి దానిమ్మ దేవదారు మరువకము వావిలి జాజి
కామంచి జమ్మి,రావి మాచి పత్రం
divya vanamulu : meruvunaku vuttaramuna nandanamu,thoorpuna jaithra rathamu ,dakshinamuna gandha madanamu ,pashchimamuna vaibhrajanamu kalavu.

దివ్య వనములు మేరువు నకు ఉత్తరమున నందనము తూర్పున జైత్ర రతము దక్షిణమున గంధ మాదనము పశ్చిమమున వైభ్రా జనము కలవు. 
deva tharuvulu : mandaramu ,kalpa vrukshamu ,paari jatham ,hari chandanamu .
దేవ తరువులు.. మందారం కల్పవృక్షము పారిజాతము హరిచందనము

aranyamulu : saindhava ,dandaka ,naimisha ,kuru ,jaangala ,vuthpattavrutha ,jamboo marga ,pushkara ,himalaya parvathamulu .
 
అరణ్యములు సైంధవ దండక నైమిశా కురు జంగాల ఉత్పత్తవృత జంబూ మార్గ పుష్కర హిమాలయ పర్వతాలు 

nava dhanyamulu : vadlu ,vulavalu ,pesalu ,minumulu ,nuvvulu ,godhumalu ,anumulu ,kandulu ,shenagalu.

నవధాన్యములు వడ్లు ఉలవలు పెసలు మినుములు నువ్వులు గోధుమలు అనుములు కందులు శనగలు
ashta yagna dravyamulu : raavi ,medi ,juvvi ,marri ,nuvvulu ,aavalu ,paramaannam ,neyyi.
అష్ట యజ్ఞ ద్రవ్యములు రావి మేడి జువ్వి మర్రి పువ్వులు ఆవాలు పరమాన్నము నెయ్యి
ashta vargamulu : medha ,maha medha ,kaakoli ,ksheera kaakoli ,jeevakamu ,rushabhakamu ,buddhi ,vruddhi.
అష్ట వర్గములు మేధా మహామేధా కాకోలి క్షీరకాకోలి జీవకము వృషభకము బుద్ధి వృద్ధి
ksharashtakamu : moduga ,munaga ,vuttareni ,chintha ,jilledu , nuvvu chettu ,yava ksharam , sajja ksharam.
క్షార అష్టకము.. మోదుగ మునగ ఉత్తరేణి చింత జిల్లేడు నువ్వు చెట్టు యవక్షారము సజ్జా క్షారము
ashta gandhamulu : pacha karpooram ,manchi gandham ,thunga musthalu ,deva daru ,kunkuma puvvu ,gorojanamu ,naga kesaramulu ,vatti vellu.
అష్టగంధములు పచ్చ కర్పూరము మంచి గంధము తుంగముస్తలు దేవదారు కుంకుమ పువ్వు గోరోజనము నాగ కేసరములు వట్టి వేళ్ళు 
gandhashtakamulu : jaapathri ,lavangamulu , dalchina chekka ,yelakulu ,naga kesaramulu ,miriyamulu ,kasthuri ,aku pathri.
గంధ అష్టకములు .. జాపత్రి లవంగములు దాల్చిన చెక్క యాలకులు నాగకేసరములు మిరియములు కస్తూరి ఆకుపత్రి
bilvashtakamu : thulasi ,maredu ,vavili ,vuttareni ,velaga ,jammi ,garika ,vusirika akulu .
బిల్వాష్టకము తులసి మారేడు వావిలి ఉత్తరేణి వెలగ జమ్మి గరిక ఉసిరిక ఆకులు
ashta varsha parvathamulu : hima chalamu,hema kootamu,nishadhamu,neelamu,shwethamu,shrungi,malya vanthamu,gandha madanamu.

అష్టావర్ష పర్వతములు .. హిమాచలము హేమకూటము నిషాధము నీలము శ్వేతము శృంగి మాల్య వంతం గంధ మాదనము
ashta moolamulu : addasaramu,kammagaggera,thippatheega,thulasi,parpatakamu,chedu potla,vishnukranthamu,chittamutti.

అష్టమూలములు.. అడ్డ సరము కమ్మ గగ్గెర తిప్ప తీగ తులసి పర్పాటకము చేదు పొట్ల విష్ణు క్రాంతము చిట్ట ముట్టి 
ashta bilvamulu : thulasi,maredu,vavili,vuttareni,velaga ,shami ( jammi ) ,amalaka ( nelli ) ,doorva ( garika )

అష్ట బిల్వములు..తులసి మారేడు వావిలి ఉత్తరేణి వెలగ, శమి /జమ్మి, అమలక /నెల్లి, దూర్వ/గరిక

ashta dhoopa dravyamulu : guggilamu ,vepaku,vacha,chengalva kost,karakkaya,aavalu,yavalu,neyyi.
అష్ట ధూప ద్రవ్యములు గుగ్గిలం వేపాకు వచ చెంగల్వ కోష్ట్ కరక్కాయ ఆవాలు యవలు నెయ్యి

sapthopa vishamulu : jilledu palu,jemudu palu,potti dumpa,ganneru,guriginja,nalla mandu ,vummetta.
సప్తోప విషములు ..జిల్లేడు పాలు జెముడు పాలు పొట్టి దుంప గన్నేరు గురిగింజ నల్ల మందు ఉమ్మెత్త
saptha dhathuvulu : bangaram,vendi,ragi,thagaramu,sattu,seesamu,inumu

సప్త ధాతువులు..బంగారం వెండి రాగి తగరము సత్తు సీసము ఇనుము 
saptha santharpanamulu : draksha pandu , pulla danimma pandu , kharjoora pandu , pancha daara ,vari pelalu ,thene ,neyyi.

సప్త సంతర్పణములు.. ద్రాక్ష పండు, పుల్ల దానిమ్మ పండు, ఖర్జూర పండు, పంచ దార వరి పేలాలు తేనె నెయ్యి
deepyakashtakamu : kunkuma puvvu ,grandhi thagaramu , chitramoolam, jilakar, nimma ,mayura shikha.
దీప్యకాష్టకము.. కుంకమపువ్వు, గ్రంథి తగరము, చిత్ర ములం జీలకర నిమ్మ మయూర శిఖ..

డా ఏల్చూరి ఆయుర్వేదం- గుంట గలగర తో(THISTLES )


 రోగాలను గుంటలో పెట్టి గంట వాయించే గుంటగలగర..

' ప్రియమిత్రులారా! గుంటగలగర మొక్కలు తెలియనివారు ఇంతకుముందు ఒక్కరు కూడా ఉండేవారు  కాదు. కానీ ప్రస్తుతం ఈ మొక్కలు కండ్ల ముందే కనిపించినా గుర్తు పట్టలేని వారే ఎక్కువమంది వున్నారు. నీటి తడి ఉండే చోట వరిచేనుల  గట్ల పైన,చెరువుల ఒడ్డున విస్తారంగా పెరిగే మొక్క గుంటగలగర. చూడడానికి ఇది చాలా చిన్నదిగా కనిపించినా దీని ప్రయోజనాలు వర్ణనాతీతం. ఇది  వందల ఏళ్ల ఆయువును అందించగల రసాయనమని దీనిని సేవించి తమ వయస్సును పెంచుకున్న ఎందరో సాధువులు తమ అనుభవాలను వ్రాశారు. పూర్వకాలం మన పెద్దలు ఈ గుంటగలగర గొప్ప తనం తెలుసుకొని దీన్ని కేవలం తల వెంట్రుకల  దృఢత్వం కోసం మాత్రమేకాక, పచ్చడిగా, బెషధంగా కూడా తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. మన ఆయుర్వేద గ్రంథాల్లో గుంటగలగర ప్రయోజనాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని గ్రామీణులకు ,పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆ జ్ఞానాన్ని అందించాలి.

గుంటగలగర = రూప గుణ ప్రభావాలు 

ఈ మొక్కల్లో తెలుపు, పసుపు, నలుపు, నీలి రంగుల పూలు పూసే వివిధ రకాలున్నయ్‌. ఏ జాతి మొక్క ఆకునైనా కొద్దిసేపు వేళ్లతో నలిపితే ఆ రసం ఆరి పోగానే వేళ్ళన్ని నల్లగా మారిపోతయ్‌. ఇది శ్లేష్మ, మేహ, నేత్ర, దంత, చర్మ ,శిరోవ్యాధులను పోగొడుతుంది. దీని సేవనము వల్ల వెంట్రుకలు శాశ్వతంగా నల్ల బడతయ్‌. 

తలనొప్పికి గుంటగలగర

 గుంటగలగర ఆకు రసం తలకు పూసినా గానీ, లేక మూడు చుక్కలు ముక్కుల్లో వేసుకున్నా గానీ తలనొప్పి తణమే తగ్గిపోతుంది. 

గొంతు రోగాలకు గుంటగలగర..

నాటు ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకొని అందులో గుంటగలగర ఆకులు 10 గ్రాములు తీసుకొని కొద్దిసేపు మరిగించి వడపోసి ఆ నీటిని మూడు పూటలా కొద్దికొద్దిగా నోటిలో వేసుకొని మింగుతూ ఉంటే గొంతు శుభ్రపడి బొంగురు పోవడం తగ్గి మంచి కంట స్వరం కలుగుతుంది. 

పొట్ట రోగాలకు - గుంట గలగర 

గుంటగలగరాకులు 10 గ్రాములు తీసుకొని అందులో రెండు గ్రాముల ఉప్పు కలిపి మెత్తగా నూరి గోలీలు చేసి మింగుతూ ఉంటే మలబద్ధకం వల్ల వచ్చిన కడుపు నొప్పి ఎంతో కాలం నుండి వేధిస్తున్న పాత కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది.

రోజు గుంటగలగర సేవిస్తుంటే..

గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చి కడిగి, నీడలో ఎండించి ,దంచి  ,జల్లించి నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని రోజూ 3 వేళ్ళకు వచ్చినంత నోటిలో వేసుకొని నీరు తాగుతూ ఉంటే క్రమంగా దృష్టి శక్తి పెరుగుతుంది. అమితమైన వీర్యం పుడుతుంది. రక్త శుద్ధి జరిగి చర్మవ్యాధులు హరించి పోతాయి. ముఖ్యంగా లివర్, ప్లీహాలను రోగగ్రస్తం కాకుండా కాపాడటంలో ఈ మొక్కది అందవేసిన చేయి.


తేలుకాటుకు గుంటగలగర..

తేలు కుట్టిన వెంటనే గుంటగలగర ఆకును నూరి పుట్టిన చోట రసం పిండి ఆ ముద్దను పైన వేసి కట్టు కడితే వెంటనే విషం విరిగిపోతుంది.


మానవజాతి - మరువకూడని మహా భృంగరాజ -రసాయనం పుష్యమీనక్షత్రం ఆదివారం వచ్చిన రోజున గుంటగలగరమొక్కలకు హృదయపూర్వకంగానమస్కరించి
పూజచేసి కావలసినన్ని మొక్కలను వేళ్ళతోసహా తీసు
కొచ్చికడిగి ముక్కలుచేసి నీడలో గాలి తగిలేచోట
ఆరబెట్టి దంచి పలుచని నూలుబట్టలో వస్త్రఘాళితం
చేయాలి. ఈ చూర్ణాన్ని వెడల్పాటి గాజు లేక పింగాణి
గిన్నెలోపోసి ఆచూర్ణం మునిగేవరకు పచ్చిగుంటగలర
మొక్కల సమూలనిజరసం (నీళ్ళు కలపకుండా తీసి
నది) పోసి కలిపి రాత్రి నానబెట్టి మరునాడు పగ
లంతా ఎండించాలి. మళ్ళీ రాత్రిపూట గుంటగలగర
రసంపోసి తరువాత రోజు ఎండించాలి. ఈ విధంగా
21సార్లు భావన చేసిన తరువాత మరలా మెత్తగా నూరి
జల్లించాలి. ఈ పొడి 80గ్రా, ఉసిరికకాయపొడి
40గ్రా, తానికాయల పొడి20 గ్రా, కరకపిందెల పొడి
10గ్రా. కలపాలి. ఈ మొత్తం చూర్ణానికి సమంగా
కండ చెక్కర, తగినంత ప్రశస్తమైన బాదంనూనె, కలిపి
మెత్తగా దంచి ముద్ద చేసి నిలువ చేసుకోవాలి.
దీనిని రెండుపూటలా 5గ్రా. మోతాదుగా తింటూ
పాలు సేవిస్తుంటే క్రమంగా తెల్ల వెంట్రుకలన్నీ పూర్తిగా
నల్లబడటమేగాక అపారమైన రక్తశుద్ధికలిగి దేహ
కాంతి, దారుధ్యము, దీర్ఘయౌవనం, చిరాయువు, ప్రాప్తి
స్తయ్. *

కండ్లకు గుంటగలగర కాటుక..

శుభ్రమైన తెల్లని నూలుబట్టను గుంటగలగర సమూల రసంలో ముంచి కొద్దిగా పిండి ఎండించాలి మళ్లీ రసంలో ముంచి మళ్లీ ఎండించాలి ఇలా ఏడుసార్లు చేసి ఆ గుడ్డను నాలుగు ముక్కలుగా కత్తిరించి వత్తులుగా చేయాలి. గాజు సీసా మూతకు రంధ్రం పెట్టి ఆ రంద్రం గుండా ఈ వత్తిని దూర్చిఅందులో నువ్వుల నూనె గాని ,ఆవు నెయ్యి గాని  పోసి  వెలిగించాలి. పైన దీపం మసి తగిలేటట్లుగా మంటపైన రాగి పాత్రను బోర్లించాలి. క్రమంగా పాత్ర పైన నల్లగా ఒక పదార్థం పేరుకుంటుంది. తర్వాత పాత్రను తీసి తాటాకుతో మసిని గీకి కాటుక భరణి లోనికి నింపాలి. అందులో తగినంత ఆవు నెయ్యి, చిటికెడు పచ్చ కర్పూరము కలిపి ,కరిగించి నిలువ ఉంచుకోవాలి. ఇదే అపురూపమైన గుంటగలగర కాటుక. ఈ కాటుకను రోజూ రాత్రి నిద్రించే ముందు పెసర బద్దంత కంటిలో పెట్టుకుంటూ ఉంటే క్రమంగా కంటి పొరలు ,శుక్లాలు, మసకలు వాటి నేత్ర వ్యాధులు హరించిపోయి చూపు నిర్మలమవుతుంది.

నోటి రోగాలకు గుంటగలగర 

 గుంటగలగర ఆకు రసములో సగం నీరు కలిపి నోటిలో పోసుకొని రెండు పూటలా పుక్కిలిస్తూ ఉంటే నోటి పూత, నోటిలో పుండ్లు, దంతాల నొప్పులు, చిగుళ్ళు పగలడం వంటి నోటి వ్యాధులు హరించిపోతాయి.

telugu - గుంటగలగర , కాటుక ఆకు
english - thistles
hindi - భాంగ్రా 
సంస్కృతంలో - భృంగరాజ్, కేశ రాజా,కుంతల వర్ధన ,భృంగ
Latin లో ఎక్లిప్టా ప్రోస్ట్రేటా

1 . ముక్కు రోగాలు తగ్గుటకు ( FOR RUNNING NOSE , RHINITIS,HEAT ,BAD ODOUR OF THE NOSE )

గుంటగలగర ఆకు రసం - 3, 4 చుక్కలు

 ఆకు రసాన్ని ముక్కులో వేసి పీలుస్తుండాలి.

uses -  ముక్కులోపలి దుర్వాసన, ముక్కువెంటకారే నీరు, ముక్కులోని వేడి, తుమ్ములు తగ్గి పోతాయి.

2 . శరీరం పై గ్రంథులు తగ్గుటకు ( FOR STRONG CISTS ON THE SKIN )

గుంటగలగర ఆకులు మరియు నెయ్యి

 ఆకులను నెయ్యిలో ఉడికించి గ్రంధుల పైన వేసి కట్టు కట్టాలి.

uses - గ్రంథులు కరిగిపోతాయి.

3 . తెల్ల పొడలకు ,ఎర్ర పొడలకు ( FOR WHITE AND RED TYPE SKIN DISEASES )

గుంటగలగర ఆకు 

 ఆకులను మెత్తగా నూరి పైన లేపనం చేయాలి.

uses -  తెల్ల పొడలు, ఎర్ర పొడలు మాయమైపోతాయి.

4 . బోదకాలు తగ్గడానికి ( FOR FILARIA )

గుంటగలగర సమూల రసం - 20 gm
నువ్వుల నూనె -  20 gm

 పై వాటిని కలిపి బోదకాలు పై రుద్దుతూ ఉండాలి.

uses -  బోద వాపులు తగ్గిపోయి రోగం కుదురుతుంది.

5 . వెంట్రుకలు పొడవుగా పెరగడానికి ( FOR LONG HAIR GROWTH )

గుంటగలగర ఆకులు - 1 bhagam
అతిమధురం పొడి - 1 bhagam

పై రెండింటినీ కలిపి మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి ఎండిన తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి.
uses -  వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.


DR.ELCHURI RECIPES WITH CHINTHA CHETTU ( TAMARIND TREE )

ఆయుర్మాత పుత్రులారా! చింతచెట్టులేని ఊరులేదు. చింతచెట్టు పోగొట్టలేని రోగము లేదు. చింత అంటే
విచారము, దు:ఖము లేకరోగము అనే అర్థంలో అలాంటి చింతలను పోగొట్టేశక్తి ఈ చెట్టులో వుంది కాబట్టే
మన పెద్దలు దీనికి చింతచెట్టు అని నామకరణం చేశారు. చింతచిగురుతో, చింతపువ్వుతో, చింతపండుతో
చింతాకుతో వివిధరకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని నిలువచేసుకొని వాడుకొనే సంప్రదాయ
ఆహారపద్ధతులు మన తెలుగునాట బహుళ ప్రచారంలో వుండేవి. దురదృష్టవశాత్తు ఆధునిక యుగారంభంతో
ఆరోగ్యసంప్రదాయాలు మరుగునపడిపోవడంతో ఆ అమూల్యమైన దేశీయ ఆహారవిజ్ఞానాన్ని మనం
కోల్పోయాం. మరలా ఆ విజ్ఞానాన్ని వెలికితీసి అందరికి పంచిపెడదాం....

చింతచెట్టు - పేర్లు

సంస్కృతంలో తింత్రిణీ, వృక్షామ్ల, ఫలామ్లక,
అని, హిందీలో ఇట్లే అని, తెలుగులో చింతచెట్టు
అని, లాటిన్లో Tamarindus Indica ఆంగ్లంలో The
Tamarind tree అంటారు.

చింతచెట్టు - రూప గుణ ప్రభావాలు..

దీని లేతకాయలు వగరు, పులుపు రుచులతోను,
ముదిరిన కాయలు పుల్లగాను వుంటయ్. బాగా పండిన
తరువాత పులుపు తీపి కలిసి వుంటయ్. ఇవి వేడిచేసే
గుణంతో వాతరోగాలను పోగొడతయ్. అయితే, కొత్త
చింతపండును అతిగా వాడితే రక్తదోషమేర్పడుతుంది.
కడుపులో ఉబ్బరం పుడుతుంది. అందువల్ల ఎప్పుడు
పాతచింతపండునే వాడాలి.


తేలువిషం - విరిగిపోవుటకు

చింతగింజను నీటితో అరగదీసి ఆ గంధాన్ని
దట్టంగా తేలుకుట్టినచోట పట్టిస్తే అది ఆరేటప్పటికి
విషం దిగిపోతుంది.



1 . వాపులు తగ్గుటకు ( FOR SWELLINGS )

చింత ఆకు
ఆముదం లేదా నెయ్యి

ఆకును  నలగ కొట్టి ,ఆముదముతో గాని నెయ్యితో గాని దోరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెట్టాలి.

uses - వాపులు తగ్గిపోతాయి.

2 . అతి మూత్ర రోగం తగ్గుటకు ( FOR EXCESSIVE URINATION )

చింత ఆకు రసం - 30 gm
గేదె మజ్జిగ - 1/2 cup

 పై వాటిని కలిపి రోజూ రెండు పూటలా సేవించాలి.

uses -  40 రోజులలో అతిమూత్ర వ్యాధి తగ్గిపోతుంది మేహ రోగాలు కూడా అదుపులోకి వస్తాయి.

3 . వీర్య వృద్ధి , వీర్య స్థంభన కొరకు ( FOR SEMEN IMPROVEMENT AND PENIS STRENGTH )

చింత గింజల పొడి - 1 స్పూన్
పాలు - 1 కప్ 

చింత గింజలను వేయించి నానబెట్టి పైై పొట్టు తీసి పప్పును ఎండబెట్టి మెత్తగా పొడిచేసి జల్లించి నిల్వ ఉంచుకోవాలి ఒక స్పూన్ పొడి ఒక కప్పు వేడి పాలలో కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి.

uses -  వీర్య వృద్ధి ,వీర్య స్తంభన కలుగుతాయి

4 . కామెర్లు తగ్గుటకు ( FOR JAUNDICE )

చింతాకు రసము - 1 ఔన్స్

 చింత ఆకును దంచి రసం తీసి రోజూ పరగడుపున ఒక మోతాదుగా మూడు రోజులపాటు తాగాలి. చప్పిడి పథ్యం పాటించాలి.

uses - కామెర్లు తగ్గిపోతాయి

5 . విరిగిన ఎముకల నొప్పి తగ్గుటకు ( FOR PAINS OF BROKEN BONES )

నువ్వుల నూనె ,చింతపండు, మెత్తని ఎర్ర మట్టి.

 పై వాటిని కలిపి కొద్దిగా వేడిి చేసి ,బట్టలో వేసి కాపడం పెట్టాలి.

uses -  ఎముకల నొప్పి త్వరగా తగ్గిపోతుంది.అని భావ మిశ్ర పండితుల మాట.

6 . RECIPE FOR BODY SWELLINGS

వాపులు తగ్గడానికి

చింతాకు
ఆముదం లేదా నెయ్యి

ఆకును నలగగొట్టి ఆముదం లేదా నెయ్యి తో గాని దోరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెడుతుంటే వాపులు తగ్గిపోతాయని హరీత మహర్షి నిర్ధారించారు.

7 . RECIPE FOR SMALL POX

మశూచికం తగ్గడానికి

చింతాకు రసం
మంచిపసుపు

పై రెండింటిని కలిపి 1 , 2 చెంచాలు , రోజూ రెండు పూటలా సేవిస్తుంటే మశూచికం తగ్గిపోతుంది

8 . RECIPE FOR TASTE LESS NESS OF TOUNGE

అరుచి తగ్గడానికి

చింతపండు
కొద్దిగా బెల్లం
కొద్దిగా దాల్చిన చెక్కపొడి
కొద్ది  ఏలకుల పొడి
కొద్దిగా మిరియాల పొడి

పై అన్నింటిని కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బుగ్గన పెట్టుకొని చప్పరించి రసం మింగుతుంటే నోటి అరుచి తగ్గిపోయి బాగా ఆకలి పుడుతుంది.

ఉదరములో పాములు - ఉరికి వచ్చుటకు

చింతపండు, రేలచిగుర్లు సమంగా కలిపి మెత్తగా
నూరి రేగిపండంత మాత్రలుచేసి ఆరబెట్టి నిలువ
చేసుకోవాలి. రోజూ రాత్రి నిద్రించేముందు పిల్లలకు
ఒక మాత్ర పెద్దలకు రెండు మాత్రలు చప్పరించి
తింటూ వుంటే ఉదయం లేవగానే సుఖ విరేచనమై దాని
ద్వారా ఏలికపాములు పడిపోతయ్.

తామర వ్యాధిని - తరిమి కొట్టుటకు

చింతగింజలను నిమ్మకాయ రసంతో అరగదీసి ఆ
గంధాన్ని తామర పైన పట్టిస్తూవుంటే నాలుగైదు
రోజుల్లో తామర వ్యాధిని తరిమి కొడుతుంది.

కుష్ఠు పుండ్లు - ఖతం ఖతం

చింత బెరడును కాల్చి జల్లించిన బూడిద, సూరే
కారంపొడి సమంగా కలిపి ఆ మొత్తంలో సగభాగం
వంతు రాతి సున్నంపొడి కలిపి వుంచుకొని రోజూ
తగినంత పొడిని నీటితో నూరి కుష్టుపుండ్లపైన లేపనం
చేస్తూవుంటే ఆ పుండ్లు అతి త్వరగా మాని పోతయ్.

వడ దెబ్బనుండి - రక్షణ పొందుటకు

నీటిలో చింతపండును బాగా పిసికి వడపోసి
తగినంత పంచదార కలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు
పూటలు తాగుతూ వుంటే వడదెబ్బ వలన కలిగిన
నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో
రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో
తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

అజీర్ణం హరించి - ఆరోగ్యం కలుగుటకు

చింతపండు 20 గ్రా, మంచినీరు 50 గ్రా కలిపి
పిసికి వడకట్టి అందులో నల్లుప్పు 3 గ్రా, మిరియాల
పొడి 1 గ్రా, పుదీనా ఆకులు 40 కలిపి తాగుతుంటే
అరుచి, అజీర్ణం హరించిపోతయ్. *

వాంతులు,డోకులు - హరించుటకు

గింజలు తీసిన చింతపండును మెత్తగా నూరి శనగ
గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
పూటకు రెండుమూడు మాత్రలు బుగ్గన పెట్టుకొని
రెండుపూటలా చప్పరిస్తుంటే వాంతులు ఆగిపోతాయి.

ప్రతి ఇంటా -చింత పూల కారంపొడి

చింతపూవులను ఎక్కువగా తెచ్చుకొని గాలికి
ఆరబెట్టి ఎండిన తరువాత శుభ్రమైన కుండలో నిలువ
చేసుకోవాలి. నెలకు ఒకసారి తగినంత పువ్వును తీసి
దంచి పొడిచేసి సమంగా కరివేపాకు పొడి కలిపి
మిగతా జిలకర ధనియాలవంటి దినుసులు చేర్చి
కారంపొడి తయారుచేసుకోవాలి. ఇది చాలా రుచిగా
సకల రోగాలకు పథ్యంగావుండి జీవితంలో ఎప్పుడూ
కాలేయ (లివర్)రోగాలు రాకుండా కాపాడుతుంది.
ప్రతిరోజూ ఆహారంలో వాడుకోవచ్చు.
* ఇదే ఎండిన పూవ్వులను ప్రతిరోజూ
కూరలలో చింతపండుకు బదులుగా పులుపుకోసం
ఉపయోగించుకొంటూ వుంటే ఇక ఆ యింట్లో
వ్యాధులు రానే రావు. ఎందుకంటే దీనివల్ల ఎల్లప్పుడు
లివర్ బాగుంటుంది కాబట్టి, అది బాగుంటే శరీర
మంతా బాగుంటుంది.


దురదలు, వ్రణాలు-దూరం దూరం

చింతగింజలను నీటితో సాన రాయిపైన అరగదీసి ఆ
గంధాన్ని పైన పట్టిస్తూ వుంటే భయంకరమైన మంట
లతో పోట్లతో బాధపెట్టే వ్రణాలు గానీ, దురదలు గానీ
దూరంగా పారిపోతయ్..

29, డిసెంబర్ 2011, గురువారం

DR. ELCHURI RECIPES WITH GORINTA CHETTU ( HENNA PLANT )


గురిచూసి రోగాలను తరిమికొట్టు - గోరింటచెట్టు

ప్రియాతి ప్రియమైన అభిమానపాఠకులారా! పూర్వకాలంలో గోరింట చెట్టును ఊరూరా విరివిగా
పెంచుకునేవారు. ప్రతి పండుగ సందర్భంలో గోరింటాకును చేతులకు అలంకరించుకునే వారు. స్త్రీలు పాదాలకు
కూడా గోరింటాకును పెట్టుకోవడం పాద సౌందర్యాన్ని పెంచుకోవడం మన ఆచారంగా వుండేది. అయితే,
చాలామందికి గోరింట అంటే కేవలం చేతులకు అలంకారంగా పెట్టుకునే సాధనం మాత్రమే అని తెలుసు. కానీ,
గోరింట ఒక గొప్ప ఔషధం కూడా అని తెలియదు. ఈనాడు గోరింట పేరుతో అనేకరకాల విష రసాయనాలు కలిపిన
మిశ్రమాలు అలంకరణ కోసం అమ్మ బడుతున్నయ్. ఈ విషపు గోరింటను వాడటమే చాలా సులభం అనే
ఆలోచనలతో నేటి ఆధునికులు ఆ విషాన్ని తమ చేతులకు పాదాలకు పులుము కుంటూ లేనిపోని కొత్త రోగాలను
కొనుక్కుంటున్నారు. ప్రజలలో ఈ విష గోరింట దుష్పరిణామాలను వివరించి అసలైన మనదేశవాళ గోరింటాకు
మాత్రమే వాడుకోవాలని చెబుతూ ఈ క్రింద వివరించబోయే ఇతర ఉపయోగాలను కూడా అందరికీ పంచిపెట్టండి.



గోరింట చెట్టు రూప గుణ ప్రభావాలు 

దీని మానుబెరడు రసం గానీ, కషాయం గానీ, లేక చూర్ణం గానీ చెడిపోయిన శరీర తత్వాన్ని మంచిగా మారుస్తయ్‌. పాండు రోగం,ప్లీహ రోగం, మూత్ర కృచ్చం కలిగిన చర్మరోగాలు, కాలిన పుండ్లు, (వ్రణాలు, నోటిపూత, తలనొప్పి, స్ఫోటకము, కంతులు, గ్రంథులు, తల వెంట్రుకల రోగాలు మొదలైన అనేక అనారోగ్య సమస్యలను గోరింట చెట్టు సునాయాసంగా పరిష్కరించగలదు. 

వాపులు, నొప్పలు తగ్గుటకు

గోరింటాకు కొంచెం సబ్బు ముక్క కలిపి నీటితో మెత్తగా నూరి పైన పట్టు వేస్తుంటే, దెబ్బల వల్ల కలిగిన వాపులు, దెబ్బల నొప్పి, కీళ్ళనొప్పులు, కీళ్ళ పట్లు, మేహవాత నొప్పులు కూడా తగ్గిపోతయ్‌. 



కాళ్ళు, చేతులు పగిలి వుంటే 

గోరింటాకును మెత్తగా నూరి చేతుల పైన, కాళ్ళ పైన, పిప్పిగోళ్ళ పైన, వ్రేళ్ళ సందులలో, పాచి వున చోట లేపనం చేయాలి. ఇలా రోజూ రాత్రిపూట చేస్తూవుంటే పై సమస్యలు తొలగి పోవడమే కాక, లేనివారికి ఎప్పటికీ రాకుండా వుంటయ్‌. 

శరీరంపై కంతులకు, మొండి గ్రంథులకు

 పచ్చి గోరింటాకును తెచ్చి నీరు కలపకుండా మెత్తగా నూరి ఆ ముద్దను రాత్రి నిద్రించే ముందు కంతుల పైన, గ్రంధుల పైన వేసి దూది పెట్టి ఊడిపోకుండా కట్టు కడుతూవుంటే అవి తగ్గిపోతాయి. 

వేసవిలో నీరసం తగ్గుటకు

 పచ్చి గోరింటాకులు 10 గ్రా. తీసుకొని పావు లీటరు మంచినీటిలో వేసి రాత్రి నుండి ఉదయం వరకు నానబెట్టి, ఉదయంపూట ఆకులను పిసికి బట్టలో వడ పోసుకోవాలి. ఆ నీటిలో కండ  చక్కెర పొడి 50(గ్రా .కలిపి పరగడుపున నెల రోజుల పాటు విడవకుండా తాగుతుంటే ఎంత ఎండలో తిరిగినా గ నీరసం రాకపోవడమే కాక రక్తశుద్ధి జరి శరీరానికి బలం కూడా కలుగుతుంది. 

తెలుగు - గోరింట , గోరింత,మైదాకు
english - henna plant
హిందీ - మెహందీ
సంస్కృతం - నఖ రంజన ,మేధిక

1 . అరికాళ్ళ మంటలు తగ్గుటకు ( FOR FOOT BURNS )

గోరింటాకు - 1 భాగం
మాచికాయ - 1 భాగం
నారింజ ఆకు - 1 భాగం

 పై వాటిని కలిపి మెత్తగా నూరి అరికాళ్ళకు పూసుకోవాలి.

uses -  మంటలు త్వరగా తగ్గిపోతాయి.

2 . నోటి పూత తగ్గడానికి ( FOR MOUTH ULCERS )

మంచి నీరు- 1 గ్లాస్
గోరింటాకు లు - 15

 పై వాటిని కలిపి చిన్న మంటపైన ఒక కప్ కషాయం మిగిలే వరకు మరిగించాలి .తర్వాత వడ పోసి గోరువెచ్చగా అయిన తర్వాత నోటిలో పోసుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు పుక్కిలించి ఊసివేయాలి . రోజూ రెండు పూటలా ఇలా చేయాలి.

uses - తీవ్రమైన నోటి పూత ,నోటి  పుండ్లు అతి త్వరగా తగ్గిపోతాయి.

3 . తల నొప్పి తగ్గడానికి ( FOR HEADACHE )

గోరింటాకు

ఆకును మెత్తగా నూరి ఆ గుజ్జును కనతలపైన మందంగా పట్టువేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.

uses - గోరింట గుజ్జు ఎండిపోయేటప్పటికి తలనొప్పి తగ్గిపోతుంది.

4 . గజ్జి,తామర, చిడుము,దురదలు,దద్దుర్లు ( FOR SCABIES ,RING WORM ,ITCHINGS ETC SKIN DISEASES )

గోరింటాకు

 ప్రతిరోజు పచ్చి గోరింటాకును తెచ్చి మెత్తగా రుబ్బాలి. గుజ్జును చర్మ సమస్య ఉన్నచోట దట్టంగా లేపనం చేయాలి లేపనం పూర్తిగా ఎండిపోయిన తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఒకసారి చేస్తూ వంకాయ గోంగూర మాంసాహారం చేపలు వంటి పదార్థాలను తినకుండా ఆహార నియమాలు పాటించాలి.

uses -  గజ్జి తామర మొదలగు చర్మ సమస్యలు సులువుగా తగ్గిపోతాయి.

5 . గోర్ల సమస్యలు తగ్గడానికి. ( FOR VARIOUS NAIL PROBLEMS )

గోరింటాకు

 ఆకును మెత్తగా నూరి నిద్రపోయే ముందు గోర్ల పైన లేపనం చేసుకోవాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేయాలి.

uses -  పుచ్చిన గోర్లు , గొగ్గిరి గోర్లు , మొదలగు గోర్ల సమస్యలు తగ్గుతాయి.
.
కండ్ల నొప్పికి - కమనీయ మార్గం

పచ్చిగోరింటాకు 40గ్రా. తీసుకొని మెత్తగా
దంచి ముద్ద చేయాలి. ఆ ముద్దను గారె లాగా
వెడల్పుగా చేతితో చరిచి దానిని ఒక నూలు బట్టపై
పెట్టి ఆ ముద్ద ఆను కొనేటట్లు ఆసనానికి పెట్టి గోచీ
కట్టుకోవాలి. రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచి
ఉదయంపూట గోచీ గుడ్డను తీసివేయాలి. ఇలా
చేస్తుంటే కండ్ల నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది.

పుండ్లు పడి - చర్మం మందమైతే

కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన
పుండ్లు వచ్చి అవి తగ్గిన తరువాత పై చర్మం లావుగా
మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి
రోజూ నిదురించే ముందు తగినంత గోరింటాకు
తీసుకొని మెత్తగా నూరి ఆ ముద్దను పైన వేసి కట్టు
కడుతూ వుంటే క్రమంగా మందంగా వున్న చర్మం
తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది.

జగ మొండి - చర్మ రోగములకు

గోరింటాకు చిగుర్లు, పూలు వీటిని 20 గ్రా.
మోతాదుగా తీసుకొని ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక
కప్పు కషాయం అనగా నాలుగవ వంతు కషాయం
మిగిలే టట్లు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా
తాగుతుంటే చర్మరోగాలు హరించి పోతయ్. *


సంభోగ సౌఖ్యానికి - ముళ్ళ గోరింట

ముళ్ళ గోరింట గింజలను మేలి రకమైన తేనెతో
మెత్తగా నూరి దానిని పురుషులు తమ మర్మాంగము పై లేపనం చేసుకొని ఆరిన తరువాత సంభోగం
చేస్తుంటే ఎక్కువ సమయం వీర్యం నిలుస్తుంది.

దంతాలు ఊడకుండా - గట్టి పడుటకు

ఒక గ్లాసు నీటిలో పది గ్రాముల నల్ల పూల ముళ్ళ
గోరింటాకును వేసి ఒక కప్పు కషాయం మిగిలే
వరకు మరిగించి వడపోసి అది గోరువెచ్చగా
అయిన తరువాత నోటిలో పోసుకొని అయిదు నిమిషాలసేపు పుక్కిలించి వూసి వేయాలి. ఇలా చేస్తుంటే
పండ్లు గట్టిపడి నోటిపూత కూడ తగ్గిపోతుంది.

నోటినుండి రక్తం పడుతూ వుంటే 

పసుపుపచ్చని పూలు పూసే ముళ్ళ గోరింట
వేరును తెచ్చి కడిగి ఆర బెట్టుకోవాలి. ఈ వేరును
కొంచెం తేనెతో అరగదీసి ఆ గంధాన్ని 5 గ్రా. మోతాదుగా కొద్దికొద్దిగా నాలుకతో నాకుతూ వుంటే నోటి
నుండి పడే రక్తం ఆగిపోతుంది.

నిద్ర రాని వారికి - నిద్ర వచ్చుటకు

చాలామందికి వివిధరకాల మానసిక ఆందోళనల వల్ల లేక నరాల బలహీనతల వల్ల రాత్రిపూట
చాల సేపటి వరకు నిద్ర రాదు. అలాంటివారు
గోరింట చెట్టునుండి పూలు తెచ్చుకొని ఆ పూలను
దిండు కింద పరచి ఆ దిండు పైన తల బెట్టి కళ్ళు
మూసుకొని పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.

అన్నిరకాల - సర్పి రోగాలకు

గోరింటాకు,ధనియాలు, ఎర్రచందనం, వీటిని
సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి,
జల్లెడ పట్టి ఆ తరువాత ఒకదానిలో ఒకటి వరుసగా
కలిపి ఒక గాజు పాత్రలో నిలువ వుంచుకోవాలి.

రోజూ పూటకు 3 గ్రా. మోతాదుగా నీటితో
రెండుపూటలా ఆహారానికి అరగంట ముందు
సేవిస్తూ, ఉప్పు వేయని గోధుమ రొట్టెను నేతితో తింటూ 
వుంటే క్రమంగా అన్నిరకాల సర్పి వ్యాధులు
తప్పకుండా హరించి పోతయ్.  


Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...