Saturday 21 May 2016

MAMIDI PANDU VEDI CHESTHUNDHA ?


మామిడిపండ్లు తింటే వేడి
చేస్తుందని, ఒళ్లంతా సెగ్గ
డ్డలు వస్తాయని అంటుంటారు కదా... అది నిజమేనా. మధు
మేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినవచ్చా?

సంస్కృతంలో మామిడికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి.
ఆమ్ర, రసాల, సహకార, అతిసౌరభ, కామాంగ, చూతక,
మంజరీ మొదలైనవి. మామిడిపండ్లు రెండు రకాలు. మొదటివి
చెట్టుకు పండినవి. రెండోవి ముదిరిన కాయలను ఎండుగడ్డిలో
పదిలపరచి, వేడిమి ద్వారా ముగ్గబెట్టినవి. (గమనిక : కార్బైడు
వంటి రసాయనాల ద్వారా ముగ్గిస్తే మాత్రం అది విషతుల్యం.
అది సహజంగా ముగ్గబెట్టిన రెండో కోవలోకి రాదు).
సహజంగా సక్రమంగా ముగ్గబెట్టిన 'పండు' (కృత్రిమ పక్వ
ఫలం) గుణాలు : చాలా తియ్యగా ఉంటుంది (మధుర
రసం). చలవ చేస్తుంది (శీతవీర్యం), తేలికగా జీర్ణ
మవుతుంది (లఘువు). మలవిసర్జన సాఫీగా
అయ్యేలా చేస్తుంది (సరం). బలకరం. వీర్య
వర్థనం (శుక్రకరం). మొత్తం పండు తింటే
దీనివల్ల కలిగే ఫలం, ఫలితం కనిపిస్తాయి.
అదే పిండి కేవలం రసం మాత్రమే స్వీక
రిస్తే ప్రయోజనాలు తగ్గుతాయి. అలా
రసం మాత్రమే తీసుకుంటే కాస్త ఆల
స్యంగా జీర్ణమవుతుంది (గురువు). వాత
హరం. కఫకరం.
చెట్టుకు పండిన పండు : దీంట్లో తియ్యదనంతో
పాటు కొంచెం పులుపు కూడా ఉంటుంది (అమ్లరసం).
కాబట్టి పిత్తాన్ని వృద్ధి చేసి కొంచెం వేడిచేస్తుంది. వాతహరం.
పూర్తిగా మగ్గని పండు అమ్లరసంతో కూడి, ఉష్ణవీర్యమై, మలవి
సర్జనకు సహకారం అందించదు. కాబట్టి ఎలా పండినదైనా
వాటిని అతిగా తింటే అనర్ధమే.
శ్లోకం : "తదేవ వృక్షసంపర్వం గురు
వాతహరపరం మధురామరసం కించిత్ 
భవేత్ పిత్త ప్రకోపనం: ఆమ్రం కృత్రిమ 
పక్వంచ తత్ భవేత్ పిత్తనాశనం... ,
చూపితం తత్పరం రుచ్యం. బల్యం.

వీర్యకరం లము...

పక్వంతు మధురం వృష్యం సిద్ధం

బల సుఖ ప్రదం... హృద్యం, వర్ణం"
కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వేసవి
రాజ ఫలమైన మామిడిపండును ఆస్వాదించండి. ఒకవేళ పుల్లని
మామిడి పండ్లను తిన్నట్లయితే, వెంటనే అరచెంచాడు జీలక
గ్రను నమిలి తినండి. లేదా మూడు గ్రాముల శుంఠి చూర్ణాన్ని
తిని వేడినీళ్లు తాగండి. దుర్గుణాలకు ఇది విరుగుడుగా
పనిచేస్తుంది. ఇది పండ్లను అధికంగా తినడం వల్ల
కలిగే అనర్థాలకు కూడా విరుగుడుగా పని
చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు: తియ్యటి
పండ్లను ఒకపూట ఆహారంగా నిర్భయంగా
తినవచ్చు. అన్నం,
రొట్టెల వంటి ఆహారంతో
పాటు తినవద్దు. సాధారణంగా మధుమేహ
రోగులు పాటించే ఆహార విహార (వ్యాయా
మం, ప్రాణాయామం, తగినంత నిద్ర మొదలై
నవి) నియమాలను పాటిస్తూ, వ్యాధి తీవ్రతను
బట్టి వాడే మందులను వాడుకుంటూ, ఒకరోజు
మొత్తం మీద తీసుకోవాల్సిన ఆహారంలో భాగంగా మామిడి
పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అప్పుడది వాతకరం
కాదు. కాబట్టి మధుమేహానికి వ్యతిరేకం కాదని ఆయుర్వేద
సిద్ధాంతం.