Saturday 28 May 2016

AJEERTHI NI ILA JAYINCHANDI

?
ఆజీర్తిని ఇలాజయించండి
విజయ కె.(ఒంగోలు)
| తరుచూ అజీర్తి, ఉబ్బరం, గ్యాసూ వస్తున్నాయి.
ఏవైనా ఉపాయాలు చెప్తారా?
* అజీర్తి సర్వసాధారణ లక్షణం. ఆహారపు అలవాట్లు,
జీవించే విధానం, రోజువారీ అలవాట్లే అజీర్తికి కారణమౌతాయి.
అజీర్తి వలనే కడుపు ఉబ్బరం, గుండెలో మంట, వాంతి, వికారం, విరేచ
నాలు, కొద్ది ఆహారానికే కడుపు నిండిపోవటం, భుక్తాయాసం, కడు
పులో మంట, గ్యాసు వస్తుంటాయి. వేళాపాళాలేని ఆహార అల
వాట్లు, కష్టంగా అరిగే పదార్థాలు, అన్నం తిన్న వెంటనే మంచం
ఎక్కటం, పొగత్రాగటం, మద్యపానం, గుట్కాలు, కొన్ని రకాల
మందులు కూడా అజీర్తికి కారణాలే!
అజీర్తి అనిపించిన వెంటనే కొన్ని రోజులపాటు తేలిగ్గా
డా.జి.వి.పూ
అరిగే వాటిని, జీర్ణశక్తిని పెంచే వాటిని తీసుకుంటూ కడుపులో
అగ్ని బలాన్ని పెంచే ప్రయత్నం చెయ్యాలి! ఎక్కువకాలం అజీర్తిని కొనసాగిస్తే, జీర్ణా
శయ వ్యవస్థ ధ్వంసం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అంటే గొంతులోకి ఆమ్లాలు ఎగ
జిమ్మే వ్యాధి, పేగుల్లో కేన్సర్, పేగుపూత, లివర్ వ్యాధుల్లాంటివి దీనివలన కలుగు
తాయి. కీళ్ళవాతం, ఎలర్జీ వ్యాధులు, ఇంకా అనేక
రోగాలకు అజీర్తి తలుపులు తెరు
స్తుంది.
అజీర్ణహర చూర్ణం
గింజ తీసిన కరక్కాయ బెరడు,
దానికి సమానంగా
పిప్పళ్ళను, సౌవర్చలవణం లేదా సైంధవలవణం ఈ
మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతా
దులో తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే
అజీర్తి బాధలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సైంధవల
వణం, కరక్కాయ బెరడు, పిప్పళ్ళు, వాము, శొంఠి వీటి
న్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. కడుపులో బాగోలేదనిపించి
నప్పుడు, అజీర్తికరమైనవి తిన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అర
చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. పొట్ట బాగౌతుంది.
అష్టగుణమండం
ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియాని ఆకు ముక్కలు, శాంతి,
పిప్పళ్ళు, మిరియాలు....వీటిన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని
ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యంలో సగం చాయ పెసర పప్పు తీసుకుని నీరు
ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో ఈ పొడిని
ఒకటి లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి కాచి దింపండి. ఇది అజీర్తిని
తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
వంటింటి వైద్యం
అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గడానికి ఒకటి లేదా రెండు వెల్లుల్లి
గర్భాల్ని నమలకుండా మింగేయండి. ఫలితం కనిపిస్తుంది. మసాలాల్లో వెల్లుల్లి తిన
నివాళ్ళు దీన్ని ప్రయోగించుకోవచ్చు. ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి
కాయండి. భోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్న వారికి ఈ ఉప్పు
వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
వసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీలాగా కాచుకుని
తాగితే అజీర్తి తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విషదోషా
లకు విరుగుడుగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని హరిస్తుంది. మొలలున్న
వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. దగ్గు,
ఆయాసాల్ని తగ్గిస్తుంది.
బిరియానీ ఆకు (ఆకుపత్రి) పొడిని మజ్జిగలో వేసుకుని తాగితే,
మలబద్ధత, కడుపులో నొప్పి, పైత్యం తగ్గుతాయి. బాలింతలకు తల్లి
పాలు పెరుగుతాయి. కడుపులో వాతం, గ్యాసూ, ఉబ్బరం, దుర్గం
ధంతో కూడిన అపాన వాయువులు, విరేచనాలు ఆగుతాయి. నోటి
దుర్వాసన పోతుంది. అన్నానికి బదులుగా బియ్యపు నూకను
దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు,
కార్ణచందు
మిరియాల పొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు (బొరుగులు) ఇలాంటివి జీర్ణ
శక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవడం
మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు
చేస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో
మిరియాలు పొడి కలుపుకుని అన్నం తింటే అజీర్తి తగ్గు
తుంది. లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం
పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతం నిచ్చి జీర్ణశ
క్తిని పెంచుతుంది.
కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని
అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత కలిపి,
రోజూ
ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచల్
తుంది. పైత్యం, కడుపులో యాసిడ్, పేగుపూత వ్యాధుల్లో
మంచిది. కొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి కారప్పొడిలాగా
అన్నంలో తినవచ్చు.
ఉసిరికాయ తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి)లో అల్లం, పసుపు కలిపి నెయ్య వేసు
కుని ఒకటి లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా రోజూ తింటే శరీరంలో విషదోషాలు
నెమ్మదిస్తాయి. పైత్యం, అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు, పెరుగన్నంలో దానిమ్మ
గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.
ఒక్కోసారి పేగుల కదలిక (పెరష్టాలిసిస్) కు కారణమయ్యే కండరాలు బిగుసు
కుని అజీర్తి కలగవచ్చు. అందుకనే మన పూర్వులు అజీర్తి రాకుండా తరచూ విరేచ
నాలకు వేసుకునే వాళ్ళు. విరేచనాల మందు పేగులను బాగా కదిలేలా చేస్తుంది.