Saturday 28 May 2016

DALCHINA CHEKKA OUSHADHAME

దాల్చిన చెక్క ఔషధమే!

దాల్చిన చెక్క మాదక ద్రవ్యం కదా! దాన్ని తినాలని ఎలా చెప్తారు?
* మసాలా ద్రవ్యాలలో గసగసాలూ, దాల్చిన చెక్క ఈ రెండింటికీ 'అలవాటు
పడేలా చేసే ఎడిక్షన్ గుణం ఉంది. దాల్చిన చెక్కలో '
కౌమారిన్ అనే మత్తునిచ్చే
రసాయనం ఈ ఎడిక్షనుకు కారణం. అది లివర్ని దెబ్బతీస్తుంది. అలాగే గసగసా
ల్లోంచి నల్లమందు తీస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అతిగా మసాలాలు తినే
వారికి ఇది హెచ్చరికే!
వైద్య పరంగా దాల్చినీ ఒక గొప్ప ఔషధం. ఔషధాన్ని ఔషధంగా తీసుకోవాలి.
పరిమితి దాటితే అది అపకారం చేసేదిగా మారిపోతోంది.
దాల్చిన చెక్కలో నిన్న
మాల్డిహైడ్ అనే అహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్ని
రకాల కేన్సర్లను నివారించగలదు. నివారించటం అంటే రాకుండా చేయటం,
సున్నితమైన కండరాలలో వాపుని తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. అందువ
లన ముఖ్యంగా కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి దాల్చిన చెక్క ఔష
ధంగా పనిచేస్తుంది. స్వరపేటిక సంబంధిత వ్యాధుల్లో ఇది ఔషధమే! సంగీతవే
త్తలు దాల్చినీ ముక్కని బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉంటే గొంతు
శ్రావ్యంగా ఉంటుంది. రక్తవృద్ధినీ, కళ్లకు కాంతినీ, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. నోటి
దుర్వాసనని అరికడుతుంది. దాల్చినీ పంచదార కలిపి నూరిన పొడి జీర్ణకోశవ్యాధుల పైన పనిచేస్తుంది.
మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గి
స్తుంది. పేగుపూత, అమీబి
యాసిస్, కామెర్లు లాంటి
| వ్యాధులున్న వాళ్లు దాల్చిన
చెక్కని ఔషధంగా తీసు
కుంటే మేలు చేస్తుంది.
దాల్చినీ, ఏలకులతో
సార్ణచందు
కాచిన టీ రుచికరంగా కూడా ఉంటుంది. కాఫీ, టీలను
మానాలనుకొనే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. క్షయ
వ్యాధిలోనూ, క్షీణింపచేసే వ్యాధులలోనూ దాల్చిని గొప్ప ఔషధం అని తేలింది.
ముందే ముంచుకొచ్చే వృద్ధాప్యాన్ని నివారించి అల్జిమర్స్ అనే మతిమరుపు
వ్యాధిని ఇది తగ్గించగలదని 2011లో పరిశోధనలు చెప్తున్నాయి.
ఔషధ ప్రయోజనాలున్న ఆహార ద్రవ్యంగా దాల్చిని చెక్కని పరిమితంగా తీసు
కుంటూ ఉంటే ఆరోగ్యం దాల్చినట్టే!