Friday 29 April 2016

VESAVI LO AHARA VIHARALU

వేసవిలో ఆహార విహారాలు

వేసవిలో జాగ్రత్తలు చెప్పండి!

* మన ఆహార విహారాలు వేసవికి బలి చేసేవిగానే
ఉంటాయి. వేసవిలో మిర్చిబజ్జీలు, పునుగులు తినే వారి సంఖ్య
ఎక్కువ. ఏకాలంలో ఏది చెయ్యకూడదో అదే చేస్తాం మనం.
1. వేసవిలో క్రిమికీటకాలు, ఈగలు దోమలు వైరసుల తాకిడి
ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, అవసరం లేకుండా బయట తిరగటం
మానుకోవాలి. ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
2. ఒకప్పుడు తెల్లని బట్టలు కట్టుకుని, గొడుగు వేసుకుని బయ
టకు వెళ్ళేవారు. ఇప్పుడు గొడుగు నామోషీ అయ్యింది. దాని స్థానంలో
నైలాన్ టోపీలు వచ్చాయి. ఇవి ఎండను ఆపుతాయిగానీ, గాలి ఆడనీ
యక విపరీతంగా చెమట పట్టేస్తాయి. పరోక్షంగా వడదెబ్బకు

కారణం అవుతాయి. జుట్టు పాడవుతుంది కూడా!
3. మామిడి పంట వచ్చే కాలం కాబట్టి ఊరగాయల
సీజను ఇది. పూర్వం ఊరుగాయని పెట్టిన తరువాత జాడీ మూతికి వాసెన కట్టి,
మూడు నెలలు కదలకుండా చీకటిగా ఉండేచోట భద్రపరిచేవారు. అలా మాగిన
ఊరుగాయలో తీక్షణత తగ్గి కమ్మదనం వస్తుంది. అది మరచిపోయి, వేసవినంతా
ఊరుగాయలతోనే గడుపుతున్నాం. దీనివలన జీర్ణాశయం, మూత్రపిండాలు, రక్తప్ర
సారవ్యవస్థలు దెబ్బతింటాయి. ఆయా రోగాలకు ఆహ్వానం పలకటమే అవుతుంది.
4. వేసవిలో ఉదయం
పూట ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా
ఐజీ పునుగులకన్నా మజ్జిగ
అన్నం తినటం మంచిది.
రాత్రిపూట అన్నంలో మజ్జిగ
పోసి తెల్లవార్లూ నానిన
అన్నం తింటే చలవ చేస్తుంది,
ఉల్లి టమోటా, కేరట్, బీట్
రూట్, ముల్లంగి, బూడిద
గుమ్మడి, సొరకాయ, కొత్తిమీర ఇలాంటి కూరగాయలను ముక్కలుగా తరిగి
పెరుగు కలిపి తాలింపు పెట్టుకున్న పెరుగు పచ్చడి వేసవి తాపానికి విరుగుడుగా
పని చేస్తుంది.
5. ముల్లంగి, కేరట్, యాపిల్ లేదా జామ లేదా దానిమ్మ లేదా కర్పూజా పండు
ఈ మూడింటిని జ్యూసు తీసుకుని రోజూ తాగితే వడదెబ్బకు శరీరం తట్టుకోగలుగు
తుంది.
6. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని దంచి,
తగినంత ఉప్పు కలిపి సీసాలో భద్రపరచుకోండి. గ్లాసు మజ్జిగలో ఒక చెంచా
పొడిని కలిపి తాగితే వడకొట్టదు.
7. జీర్ణశక్తి బలంగా ఉన్న వారికన్నా, అజీర్తితో బాధపడేవారికి త్వరగా వడ
తగుల్తుందని గుర్తించండి. వేసవిలో చింతపండు, అల్లం వెల్లుల్లి తగ్గించి వాడు
కుంటూ, నూనె పదార్థాలు తినకుండా ఉండటం మంచిది.

ఎండాకాలం వస్తోంది
అంటేనే ప్రజలు భయపడి ఎన్నో
ముందు జాగ్రత్తలు చేసుకుంటారు.
ప్రిట్లు, ఏనీలు, కూలర్లు రిపేరు
చేసుకుంటారు. ఎండాకాలంలో
ముసలివారు. పిల్లలు చాలా జాగ్రత్త
వహించాలి. మనల్ని మనం ఎలా వేసవి
బాధల నుండి కాపాడుకోవాలి. ఏం
జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లాంటి
విషయాలను ఆయుర్వేదం మనకు
వివరిస్తుంది.
ఎండాకాలంలో భూమి
సూర్యునికి అతి దగ్గరగా ఉంటుంది.
కావున సూర్యుడు మన శరీరంలోని
బలాన్ని, నీటిని లాగేస్తాడు. దీనితో మన
శరీరంలోని లవణాలు తగ్గి, వేడి
పెరుగుతుంది. ఈ లక్షణాలను మనం
పట్టించుకొన్నట్లైతే వడదెబ్బ తగిలే
ప్రమాదం ఏర్పడుతుంది. ఇందులో
జ్వరం, తీవ్ర తలనొప్పి, వాంతులు,
చెమట ఆగిపోవటం, మనసు భ్రాంతి,
ఎగశ్వాన ఏర్పడుతుంది. అప్పుడు
తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించాలి.
అంతవరకు రానివ్వకుండా మనం మన
ఆయుర్వేదం చెప్పే ముందు జాగ్రత్తలు
పాటించి మనల్ని మనం కాపాడు
కుందాము.
1 హెూళీ పండుగ నుంచి 30 రోజుల
వరకు రోజు ఒక పిడికెడు వేపపూలను
పడిగడుపున తింటే అసలు ఎండాకాలం
వేడి కూడ తెలియదు.
2) సులభంగా జీర్ణమయ్యే ఆహారం
తినాలి.
3) పలుచని లేత రంగు నూలు వస్త్రాలను
ధరించాలి.
4) గంధము, కలబంద గుజ్జు పైపూతగా
రాసుకుంటే చెమటకాయలు రావు.
5) డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు శాతం.
తగ్గుటకు ఇంట్లో లభ్యమయ్యే దినుసు
లతో జ్యూసులు చేసుకొని వాడండి.
ఎ) చింతపండు పులుసులో నీరు కలిపి
పచ్చి పులుసు లేదా చారుచేసి
వాడండి.
బి) పచ్చి మామిడి కాయ ఉడక పెట్టి
పిసికి అందులో ఉప్పు, చక్కెర,
జీలకర పొడి కలిపి చల్లార్చి
1
తాగండి.
సి) బెల్లం పానకం అనగా బెల్లంని
నీళ్ళలో కరిగించి అందులో
యాలక్కాయ (ఇలాచీ) పొడి
నిమ్మరసం కలిపి తాగండి.
6) మూత్రంలో మంట తగ్గించటానికి...
ఎ) ధనియాలు 1 చెంచా, ఒక గ్లాసు
నీళ్లలో కలిపి మరిగించి వడబోసి
అందులో చక్కెర కలిపి తాగండి.
బి) మోదుగ పూలను 10 పూలు 200
మి.లీ. నీళ్ళలో ఉడికించి వడబోసి
అందులో పంచదార కలిపి
తాగండి.
సి) శతావరి చూర్ణం 1 చెంచా నీటితో
1
1:
1
లేదా పాలతో తీసుకొనిన మూత్రం
లో మంట తగ్గును.
7) సామాన్య దౌర్బల్యంలో ఉసిరి జ్యూస్,
క్యాండీ లేదా చూర్ణం రూపంలో
తీసుకోవాలి.
8)వేసవి విరేచనాలు...
ఎ) మారేడు చూర్ణం బెల్లంతో కలిపి
1
తినాలి లేదా మార్కెట్లో మురబ్బా
దొరుకుతుంది. వాడుకోవచ్చు.
బి) వట్టివేర్లను ఒక వస్త్రంలో చుట్టి
నీటికుండలో వేసి రోజు ఆనీటినే
1
తాగితే విరేచనాలు కాకుండా
ఆపవచ్చు కాని అయినప్పుడు అదే
వట్టివేర్లను కషాయం అనగా
1
నీటిలో మరిగించి వడపోసి తాగితే
వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
9) ముక్కు నుంచి రక్తస్రావం...
ఎ) ఉల్లిరసం 1-2 చుక్కలు ముక్కులో
వేయాలి.
బి) గరిక రసం 1-2 చుక్కలు ముక్కు
లో వేయాలి.
రేటర్ నీరు తాగకండి, మద్యపానం
10) ఆపుకోలేని దాహంలో...
ఎ) కుండ నీటిని ఒక గ్లానులో
పోసుకుని ఒక దగ్గర కూర్చుని
నోటికి ఆనించి మెల్లగా తాగాలి.
బి) కొబ్బరి నీరు, ఉసిరి జ్యూస్, కోకం
జ్యూన్, సుగంధపాల జ్యూన్
తాగాలి.
సి) అరటిపండుని కొబ్బరి నీటిలో పిసికి
తినాలి.
డి) తాజా బూడిద గుమ్మడికాయ రసం
త్రాగాలి.
11) శరీరంలో వేడిని తగ్గించడానికి ఉల్లి
రసం, గంధం, కలబంద గుజ్జును గాని
ఒంటిపై రాయాలి.
12) చెమట కాయలు లేదా చెమట వలన
వచ్చే చర్మ రోగాలు: ఎండిన లేదా పచ్చి
మామిడాకులు రాత్రి నీటిలో నానబెట్టి
ఉదయం ఆ నీటితో స్నానం చేయండి.
ఇందులో గులాబీ రేకులు, మల్లెపూలు
కూడా వేసుకోవచ్చు.
13) వేయించిన ఆహారం, మసాల ఆహారం,
మాంసాహారం, ఎక్కువగా తినకండి.
14) సిల్కు పాలిస్టర్ వస్త్రములు ధరించ
కండి.
15) ఉ|| 11.00 గం||ల నుండి సాయంత్రం
4.00 గం||ల వరకు వీలైనంత బైటికి
వెళ్ళకండి.
16) సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, రిఫ్రిజ్
చేయకండి.