13, సెప్టెంబర్ 2026, ఆదివారం

గర్భాశయంలో గడ్డలు, బహిష్టు సరిగా రాని సమస్యలు..

 1.) అధిక బరువు, అండాశయాల్లో నీటి బుడగలు, బహిష్టు సరిగా రాని సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

థైరాయిడ్ సమస్యతో మిగతా సమస్యలు ఏర్పడతాయి. ముందు థైరాయిడ్ అనుభవ యోగాలు ఆచరించాలి. సహజంగా మిగతా సమస్యలు తగ్గిపోతాయి.

తిప్పతీగ పొడి 100 గ్రాములు, కిస్ మిస్ పండ్లు 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రెండు పూటలా 10 గ్రాముల మోతాదుగా తింటుంటే బహిష్టు వస్తుంది. రాగానే తినటం ఆపాలి. మరలా బహిష్టుకు పది రోజుల ముందు ఆరంభించాలి. ఇలా మూడు మాసాలు బహిష్టు సమయంలో ఆచరిస్తే ఆ తర్వాత బహిష్టు సక్రమంగా వస్తుంది. 

2.) గర్భాశయంలో గడ్డల సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు..

శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, నల్ల నువ్వులు , గంటు బారంగి, బెల్లం .. ఈ పదార్థాలను ఆయుర్వేద దుకాణాల్లో ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తెచ్చుకొని, బెల్లం తప్ప మిగిలిన వాటిని దోరగా వేయించి దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి ఆ మెత్తని పొడి లో బెల్లం కలిపి దంచి నిలువ చేసుకోవాలి. ఈ అద్భుతమైన ఆహార ఔషధాన్ని పూటకు 10 గ్రాముల మోతాదుగా ఆహారానికి గంట ముందు రెండు పూటలా తింటుండాలి. దీని వల్ల గర్భాశయంలో గడ్డలు క్రమంగా కరిగిపోతాయి. బహిష్టు సక్రమంగా వచ్చి ఆరోగ్యం కుదుట పడుతుంది. 

అధిక దాహం, ఆకలి,తిమ్మిర్లు.. షుగర్ లేకుండా.. ఆయుర్వేద పరిష్కారాలు

 అధిక దాహం, అధిక ఆకలి, కాళ్లు చేతుల తిమ్మిర్లు .. మధుమేహం లేకుండా ఉన్న సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

అధిక వేడి కలిగించే పదార్థాలు బాగా తగ్గించి మాంసాహారాన్ని పూర్తిగా మాని వేయాలి. ఉత్తరేణి గింజలు సంపాదించి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి. ఆ పొడితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం అర చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. దీని వల్ల అధిక ఆకలి, అధిక కొవ్వు తగ్గిపోతాయి. ఎండు ఉసిరి ముక్కలు బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుండాలి. అధిక దాహం తగ్గిపోతుంది. రోజూ గోరు వెచ్చని నువ్వుల నూనెతో ఒళ్ళంతా రుద్దుకుని గంటాగి వేడి నీటితో స్నానం చేస్తుండాలి. తిమ్మిర్లు తగ్గుతాయి. 

2.) మర్మాంగము చిన్నగా ఉన్న సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

శృంగారవంతమైన ఆలోచనలు , అనుకూల వతి అయిన స్త్రీ , అనువైన వాతావరణం , శరీరంలో తగినంత వీర్య పటుత్వం ..ఇవన్నీ ఉన్నప్పుడే ఏ పురుషుడికైనా  మర్మాంగము ఆ సమయానికి తగినట్లు పెద్దదవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా మనసంతా చదువు మీద ఉన్నప్పుడు ఎవరికైనా అంగం చిన్నదిగానే ఉంటుంది. ఈ నిజం అర్థం చేసుకుని మనసు చదువు మీద దృష్టి పెట్టి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. 

శరీరంలో మంటలు, ముఖం మీద మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 గొంతులో, కడుపులో, ఛాతీలో మంటలు, నరాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాలు.. 

1 . ) రోజూ ఉదయం పూట లేదా సాయంత్రం పూట గోరు వెచ్చని నువ్వుల నూనె తో శరీరమంతా మర్దనా చేసుకోవాలి.చెవుల్లో, ముక్కులో రెండు రెండు చుక్కలు వేసుకోవాలి. ఒక గంట ఆగి తర్వాత స్నానం చేయాలి. దీని వల్ల నరాల వాపులు తగ్గి రక్త ప్రసరణ పెరిగి శక్తి ఉత్పన్నమవుతుంది. 

2 .) దేశవాళీ గోమూత్రం ఉదయం సేకరించి ఏడు సార్లు వడపోసి 50 గ్రాములు మోతాదుగా పరగడుపున రోజూ సేవిస్తుండాలి. దీని వల్ల అధిక కఫం, మంటలు తగ్గి రక్త వృద్ధి, రక్త శుద్ధి కలుగుతుంది. 

3. ) గోధుమ పిండి 150 గ్రాములు తీసుకుని అందులో 30 గ్రాములు వంటాముదం కలిపి రొట్టె కాల్చుకుని అందులో కొంచెం నెయ్యి , పంచదార అద్దుకొని తింటూ ఉండాలి. 

ఇలా నాలుగైదు రోజులు తింటూ వుంటే అన్ని రకాల ఉదర సంబంధిత రోగాలు తగ్గిపోతాయి.


ముఖం పై దురదతో కూడిన నల్లని మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు. 

1 .) మంజిష్ట,కరక్కాయ పెచ్చులు , ఉసిరి కాయ పెచ్చులు ,తానికాయ పెచ్చులు , పాత చింతపండు , వస కొమ్ములు, దేవదారు చెక్క, పసుపు, తిప్ప తీగ వీటన్నింటినీ సమ భాగాలుగా తీసుకుని కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రోజూ పావు లీటరు మంచి నీటిలో ఈ పదార్థాన్ని 20 గ్రాములు వేసి సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి రోజూ పరగడుపున తాగుతుంటే శరీరంలో చెడు రక్తమంతా శుద్ధి చెంది దురదలు, కురుపులు, మచ్చలు, గడ్డలు, పుండ్లు మొదలైన అన్ని రకాల చర్మ వికారాలు తగ్గిపోతాయి. 

2 . ) జటా మాంసి తెచ్చుకొని పొడి చేసి ఉంచుకొని తగినంత పొడిని నిద్రించే ముందు మంచి నీటితో గుజ్జులా నూరి మచ్చల పైన లేపనం చేసి , ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగితే సమస్య పరిష్కారమవుతుంది. 

12, సెప్టెంబర్ 2026, శనివారం

వేయి లాభాల.. వావిలి..

 నిర్గుండీ పుష్పం తిక్తోష్ణం కృమి వాత కఫాపహం

గుల్మ ప్లీహా రుచిం కుష్టం శోఫమ్ జయేత్కటు.. 


భోజన కుతూహలం పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి పై శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులు అన్నిటిపైనా పని చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఏర్పడే అనేక వ్యాధుల పైన వీటి ప్రయోగం ఉంది. ముఖ్యంగా స్ప్లీన్ లో వచ్చే వ్యాధులన్నింటిపైనా బాగా పని చేస్తాయని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

నోటికి రుచి తెలియకపోవడం , అన్న హితవు కలగక పోవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వావిలి పూలను సేకరించి, నీడన ఆరనిచ్చి , కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. 

ధనియాలు,జీలకర్ర, శనగ పప్పు,మిరియాలు, మినప్పప్పును కూడా పైపైన వేయించి, మెత్తగా దంచిన కారప్పొడి తినడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు వారికి బాగా అందుబాటులో ఉండే మొక్క ఇది. రైతులను గానీ, మొక్కల గురించి బాగా తెలిసిన వారిని గానీ అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా సార్లు చూసిన మొక్కే ఇది. ఒక్కో కణుపు దగ్గర ఐదు ఆకుల చొప్పున ఉంటాయి. ఈ మొక్కను గుర్తు పట్టడానికి ఇదే కొండ గుర్తు. శనగ గింజంత నీలి రంగు పూలు పూస్తాయి. 

కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము,  వాపులు తగ్గించే ఆయుర్వేద ఔషధాలలో వావిలి ని కూడా చేరుస్తారు. దీని ఆకులు చవకగా దొరుకుతాయి. వావిలి ఆకులు, పూలు, పండ్లు , గింజలు, వేళ్ళు.. వీటన్నింటికీ వాతాన్ని తగ్గించే శక్తి ఉంది. వీటితో కీళ్ల వాతము పైన పని చేసే నిర్గుండీ తైలాన్ని తయారు చేస్తారు. 

వావిలి పూలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎక్కువ. " సింధు వారస్య పుష్పెణ బద్దో ముచ్యేత బంధనాథ్ " అని" పుష్ప చింతామణి"  అనే గ్రంథం పేర్కొంది. 

వావిలి పువ్వులు సమర్పిస్తే అన్ని అడ్డంకులు తొలగి , బంధనాల నుంచి విముక్తి పొందుతారని అర్థం. ఈ పూలు సూర్యుడికి ప్రీతి పాత్రమని , వావిలి వలన పుత్ర లాభం కూడా కలుగుతాయని ఈ గ్రంథం పేర్కొంది. 

భోజన కుతూహలం వావిలి పూల ఆహార యోగ్యతను మాత్రమే సూచించింది కానీ, వీటిని ఎలా వండుకోవచ్చో చెప్పలేదు. ఐతే వేప పూలను ఏ విధంగా ఉపయోగిస్తామో వావిలి పూలను కూడా అలాగే వాడుకోవచ్చు. 

చరకుడు వావిలి పూలను విష దోషాలు హరించేదిగా పేర్కొన్నాడు. ఎలర్జీ కారణంగా వచ్చే చర్మ రోగాలు , దురదలు, ఉబ్బసం, నీరు పట్టి ఉబ్బు ఏర్పడే వ్యాధుల్లో , ఊపిరి తిత్తులు, మూత్ర , స్త్రీల వ్యాధుల్లో వావిలి పని చేస్తుంది. 

పిల్లల మతిమరుపు, అధిక ఋతు రక్త స్రావం సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 పిల్లల మతిమరుపు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

మన బిడ్డలకు తగిన ఆహార ఔషధం, మన ఇంట్లోనే, మన చేతుల్లోనే ఉంది. సోంపు గింజలు, ధనియాల గింజలు కొంచెం దోరగా వేయించి , కొంచెం నలగ గొట్టి, పొట్టు తీసి, విడి విడిగా దంచి చూర్ణాలను తయారు చేసుకోవాలి. వాటితోపాటు చిన్న ఏలకులు పొడిచేసి, ఇంకా సీమ బాదం పప్పులు తెచ్చి ఒక రాత్రి నానబెట్టి పై తోలు తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే పటిక బెల్లం కూడా పొడి చేసుకుని , అన్ని చూర్ణాలూ సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజూ ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలతో కలిపి రాత్రి భోజనం తర్వాత మూడు గంటలు ఆగి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల మెదడు బలపడి, శరీరం కూడా పుష్టికరంగా మారి , జ్ఞాపక శక్తి అపారంగా పెరుగుతుంది. 


బహిష్టులో అధిక రక్త స్రావ సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

అతి మధురం పొడి అరచెంచా మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి రోజూ మూడు పూటలా తాగాలి. అతి త్వరలోనే అధిక ఋతు రక్త స్రావం ఆగిపోతుంది. మొదటి రోజు లోనే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. 

రక్త హీనత, తీవ్ర మలబద్దక సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 రక్తం తగ్గిపోయే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు. 


తెల్ల గలిజేరు చెట్టుకు పూజ చేసి దాని వేళ్ళు తీసుకొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి , ఆ ముక్కలను దారంతో దండలాగ కట్టి ఎల్లప్పుడూ మెడలో వేసి ఉంచుకోవాలి. దీని వల్ల క్రమంగా కాలేయం శక్తివంతమౌతుంది. దీంతో పాటు ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా నిమ్మ రసం , ఒక చెంచా టమాటా రసం, ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు తాగాలి. దీని వల్ల ఆకలి పెరిగి ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఆయుర్వేద అంగడిలో బోడ తరం పూలు తీసుకొచ్చి పొడి చేసి సమంగా పటిక బెల్లం పొడి కలిపి పూటకు పావు చెంచా పొడి మంచి నీటితో రెండు పూటలా సేవించాలి. ఇలా చేస్తూ అరగని పదార్థాలు, బంగాళా దుంపలు, గరం మసాలా, మాంసం, చల్లని పదార్థాలు వాడవద్దు. బార్లీ బియ్యం, సగ్గు బియ్యం , పెసర కట్టు, ముల్లంగి దుంపలు , నారింజ, ఆపిల్, బత్తాయి మొదలైనవి వాడాలి. క్రమంగా సహజమైన రక్తోత్పత్తి జరుగుతుంది. 


తీవ్ర మలబద్దక సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

పొట్టు తీయకుండా ఆడించిన గోధుమ పిండిలో అర చెంచా నుండి ఒక చెంచా వరకు వంటాముదం, పావు చెంచా జీలకర్ర పొడి , పావు చెంచా మిరియాల పొడి , పావు చెంచా అల్లం రసం, పావు చెంచా సైంధవ లవణం పొడిని కలిపి రొట్టెలాగా చేసి రాత్రి ఆహారంగా తింటుంటే హాయిగా సుఖ విరేచనం అవుతుంది. ఆహారంలో నెయ్యిని బాగా ఉపయోగించాలి. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...