28, మే 2016, శనివారం

SUNNITHA AHARA VYAYAMALU

సున్నిత ఆహార వ్యాయామాలు
ఇ అన్నం మానేసి రన్నింగ్ చేస్తే స్థూలకాయం తగ్గి
ఎక్కువసేపు ఇంట్లోనో, ఆఫీసులోనో గడి పేకన్నా జయ
ఒకు వస్తే ఎంతో కొంత కేలరీల ఖర్చు జరుగుతుంది. కుర్చీకి
అంటుకుపోయే వృత్తి వ్యాహాల్లో ఉన్న వాళ్లు కూడా ప్రతి గంటకు
సారి పది నిమిషాలపాటు లేచి నిల్చుని, పనిచేసినా కొంత మేర క్యాల
డీలు చుపుతాయి. మైటోకాండ్రియా అనేవి శరీరంలో కణజాలానికి
శని సరహ చేసే కేంద్రాలు, శరీరానికి తగిన శ్రమను కల్పిస్తే, వీటి
సంఖ్య పెరిగి ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకునే శక్తి కలుగుతుంది. అందువ
అవ గుండెకు, మెదడుకు రక్తప్రసారం బాగా జరిగి ఆక్సిజన్ ఎక్కువగా
అందుతుంది. అలాగని, అతిగా వ్యాయామాలకు పాల్పడితే
కండరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
డా.జి.వి.పూ
స్థూలకాయం వలన కలిగే అవకారం ఒక ఎత్తయితే, దాన్ని
తగ్గించుకోవడానికి అతిగా డైటింగ్, అతిగా వ్యాయామం వలన కలిగే అవకారం
ఇంకో ఎత్తుగా ఉంటాయి. అతి వ్యాయామం కండరాల మీద సైన్స్ ని పెంచుతుంది.
అతి ఉపవాసం కండరాలకు
పోషకాలను అందకుండా
చేస్తుంది. కండరాలు బలహీన
పడి నొప్పులు పెడతాయి. మున
లితనం ముందుగానే ముంచుకు
రావటం, శరీరావయవాలలో
బలహీనతలు ఏర్పడటం, కేన్సర్
లాంటి బాధలకు ఈ 'అతి'
కారణం అవుతుంది. ఎంత
వరకూ ఆహార నియమాలు
పాటించగలరో అంతమేర నెమ్మ
దిగా అలవాటు చేస్తూ, మార్పు చేయండి. అలాగే, ఎంతమేర శరీరం శ్రమను తట్టు
కుంటుందో అంతవరకే వ్యాయామం చేయండి. క్రమేణా పెంపుచేయండి. 'అన్నప్రా
శనలో ఆవకాయ' సామెత ఇక్కడ వర్తించకూడదు. నలభైలు దాదాక పరుగులు
పెట్టటం, జమ్ములకు వెళ్ళటం, ఈతకొట్టటం, సైకిల్ తొక్కటం, ట్రెడ్ మిల్లు మీద నడ
వటం వీటిని కొత్తగా ప్రారంభించే వ్యక్తులు నిపుణుల సలహాతో క్రమేణా శరీరానికి
అలవాటు చేస్తూ ఆచరించాలి.
ఈ డైటింగులూ, వ్యాయామాలూ చాలామంది విషయంలో ఆరంభశూరత్వమే!
మూడ్డాళ్ళ ముచ్చటే! మానసికంగా శ్రమకు, కష్టానికి సిద్ధం కాకపోవడమే ఇందుకు
కారణం. డైటింగూ, వ్యాయామం మొదలు పెట్టిన నెలలో నాలుగైదు కేజీల బరువు
తగ్గుదల ఎవరికైనా కనిపిస్తుంది. అంతలోనే ఏదో అవాంతరం వస్తుంది. తిరిగి మొద
లుపెట్టడానికి బద్ధకం ఆవరిస్తుంది. ఈ లోగా తగ్గిన బరువుకు రెట్టింపు పెరుగు
తారు. మనిషి కడలిక శరీరం పైన చూపించే ప్రభావాన్ని అంచనా వేసే నిపుణుల్ని
Kinesiologists అంటారు. ఈ శాస్త్రాన్ని కైనేసియాలజీ అని పిలుస్తారు. శరీ
రాన్ని అతిగా హింసపెట్టడాన్ని 'స్ప్రింట్' అంటారు. శరీరం తట్టుకోవడాన్ని మించి
స్ప్రింట్ చేయటం వలన మామూలు ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ నిపుణులు హెచ్చ
రిస్తున్నారు. కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, తీపి, పులుపు తగ్గించి తింటే స్థూల
కాయం అదుపులోనే వుంటుంది. వరిని తగ్గించి బదులుగా గోధుమ, జొన్న, సజ్జల్ని
కొంత మేర తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా నడవటంతో ప్రారంభించి వ్యాయా
మాలను ఒక్కటొక్కటే అలవాటు చేసుకోండి. మార్పు తప్పకుండా వస్తుంది.
రాత్రికి
రాత్రే మార్పులొచ్చేయాలనే అతి ప్రయత్నం వలన అవకారం జరుగుతుంది.

DALCHINA CHEKKA OUSHADHAME

దాల్చిన చెక్క ఔషధమే!

దాల్చిన చెక్క మాదక ద్రవ్యం కదా! దాన్ని తినాలని ఎలా చెప్తారు?
* మసాలా ద్రవ్యాలలో గసగసాలూ, దాల్చిన చెక్క ఈ రెండింటికీ 'అలవాటు
పడేలా చేసే ఎడిక్షన్ గుణం ఉంది. దాల్చిన చెక్కలో '
కౌమారిన్ అనే మత్తునిచ్చే
రసాయనం ఈ ఎడిక్షనుకు కారణం. అది లివర్ని దెబ్బతీస్తుంది. అలాగే గసగసా
ల్లోంచి నల్లమందు తీస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అతిగా మసాలాలు తినే
వారికి ఇది హెచ్చరికే!
వైద్య పరంగా దాల్చినీ ఒక గొప్ప ఔషధం. ఔషధాన్ని ఔషధంగా తీసుకోవాలి.
పరిమితి దాటితే అది అపకారం చేసేదిగా మారిపోతోంది.
దాల్చిన చెక్కలో నిన్న
మాల్డిహైడ్ అనే అహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్ని
రకాల కేన్సర్లను నివారించగలదు. నివారించటం అంటే రాకుండా చేయటం,
సున్నితమైన కండరాలలో వాపుని తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. అందువ
లన ముఖ్యంగా కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి దాల్చిన చెక్క ఔష
ధంగా పనిచేస్తుంది. స్వరపేటిక సంబంధిత వ్యాధుల్లో ఇది ఔషధమే! సంగీతవే
త్తలు దాల్చినీ ముక్కని బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉంటే గొంతు
శ్రావ్యంగా ఉంటుంది. రక్తవృద్ధినీ, కళ్లకు కాంతినీ, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. నోటి
దుర్వాసనని అరికడుతుంది. దాల్చినీ పంచదార కలిపి నూరిన పొడి జీర్ణకోశవ్యాధుల పైన పనిచేస్తుంది.
మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గి
స్తుంది. పేగుపూత, అమీబి
యాసిస్, కామెర్లు లాంటి
| వ్యాధులున్న వాళ్లు దాల్చిన
చెక్కని ఔషధంగా తీసు
కుంటే మేలు చేస్తుంది.
దాల్చినీ, ఏలకులతో
సార్ణచందు
కాచిన టీ రుచికరంగా కూడా ఉంటుంది. కాఫీ, టీలను
మానాలనుకొనే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. క్షయ
వ్యాధిలోనూ, క్షీణింపచేసే వ్యాధులలోనూ దాల్చిని గొప్ప ఔషధం అని తేలింది.
ముందే ముంచుకొచ్చే వృద్ధాప్యాన్ని నివారించి అల్జిమర్స్ అనే మతిమరుపు
వ్యాధిని ఇది తగ్గించగలదని 2011లో పరిశోధనలు చెప్తున్నాయి.
ఔషధ ప్రయోజనాలున్న ఆహార ద్రవ్యంగా దాల్చిని చెక్కని పరిమితంగా తీసు
కుంటూ ఉంటే ఆరోగ్యం దాల్చినట్టే!

AJEERTHI NI ILA JAYINCHANDI

?
ఆజీర్తిని ఇలాజయించండి
విజయ కె.(ఒంగోలు)
| తరుచూ అజీర్తి, ఉబ్బరం, గ్యాసూ వస్తున్నాయి.
ఏవైనా ఉపాయాలు చెప్తారా?
* అజీర్తి సర్వసాధారణ లక్షణం. ఆహారపు అలవాట్లు,
జీవించే విధానం, రోజువారీ అలవాట్లే అజీర్తికి కారణమౌతాయి.
అజీర్తి వలనే కడుపు ఉబ్బరం, గుండెలో మంట, వాంతి, వికారం, విరేచ
నాలు, కొద్ది ఆహారానికే కడుపు నిండిపోవటం, భుక్తాయాసం, కడు
పులో మంట, గ్యాసు వస్తుంటాయి. వేళాపాళాలేని ఆహార అల
వాట్లు, కష్టంగా అరిగే పదార్థాలు, అన్నం తిన్న వెంటనే మంచం
ఎక్కటం, పొగత్రాగటం, మద్యపానం, గుట్కాలు, కొన్ని రకాల
మందులు కూడా అజీర్తికి కారణాలే!
అజీర్తి అనిపించిన వెంటనే కొన్ని రోజులపాటు తేలిగ్గా
డా.జి.వి.పూ
అరిగే వాటిని, జీర్ణశక్తిని పెంచే వాటిని తీసుకుంటూ కడుపులో
అగ్ని బలాన్ని పెంచే ప్రయత్నం చెయ్యాలి! ఎక్కువకాలం అజీర్తిని కొనసాగిస్తే, జీర్ణా
శయ వ్యవస్థ ధ్వంసం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అంటే గొంతులోకి ఆమ్లాలు ఎగ
జిమ్మే వ్యాధి, పేగుల్లో కేన్సర్, పేగుపూత, లివర్ వ్యాధుల్లాంటివి దీనివలన కలుగు
తాయి. కీళ్ళవాతం, ఎలర్జీ వ్యాధులు, ఇంకా అనేక
రోగాలకు అజీర్తి తలుపులు తెరు
స్తుంది.
అజీర్ణహర చూర్ణం
గింజ తీసిన కరక్కాయ బెరడు,
దానికి సమానంగా
పిప్పళ్ళను, సౌవర్చలవణం లేదా సైంధవలవణం ఈ
మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతా
దులో తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే
అజీర్తి బాధలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సైంధవల
వణం, కరక్కాయ బెరడు, పిప్పళ్ళు, వాము, శొంఠి వీటి
న్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. కడుపులో బాగోలేదనిపించి
నప్పుడు, అజీర్తికరమైనవి తిన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అర
చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. పొట్ట బాగౌతుంది.
అష్టగుణమండం
ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియాని ఆకు ముక్కలు, శాంతి,
పిప్పళ్ళు, మిరియాలు....వీటిన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని
ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యంలో సగం చాయ పెసర పప్పు తీసుకుని నీరు
ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో ఈ పొడిని
ఒకటి లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి కాచి దింపండి. ఇది అజీర్తిని
తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
వంటింటి వైద్యం
అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గడానికి ఒకటి లేదా రెండు వెల్లుల్లి
గర్భాల్ని నమలకుండా మింగేయండి. ఫలితం కనిపిస్తుంది. మసాలాల్లో వెల్లుల్లి తిన
నివాళ్ళు దీన్ని ప్రయోగించుకోవచ్చు. ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి
కాయండి. భోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్న వారికి ఈ ఉప్పు
వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
వసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీలాగా కాచుకుని
తాగితే అజీర్తి తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విషదోషా
లకు విరుగుడుగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని హరిస్తుంది. మొలలున్న
వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. దగ్గు,
ఆయాసాల్ని తగ్గిస్తుంది.
బిరియానీ ఆకు (ఆకుపత్రి) పొడిని మజ్జిగలో వేసుకుని తాగితే,
మలబద్ధత, కడుపులో నొప్పి, పైత్యం తగ్గుతాయి. బాలింతలకు తల్లి
పాలు పెరుగుతాయి. కడుపులో వాతం, గ్యాసూ, ఉబ్బరం, దుర్గం
ధంతో కూడిన అపాన వాయువులు, విరేచనాలు ఆగుతాయి. నోటి
దుర్వాసన పోతుంది. అన్నానికి బదులుగా బియ్యపు నూకను
దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు,
కార్ణచందు
మిరియాల పొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు (బొరుగులు) ఇలాంటివి జీర్ణ
శక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవడం
మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు
చేస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో
మిరియాలు పొడి కలుపుకుని అన్నం తింటే అజీర్తి తగ్గు
తుంది. లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం
పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతం నిచ్చి జీర్ణశ
క్తిని పెంచుతుంది.
కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని
అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత కలిపి,
రోజూ
ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచల్
తుంది. పైత్యం, కడుపులో యాసిడ్, పేగుపూత వ్యాధుల్లో
మంచిది. కొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి కారప్పొడిలాగా
అన్నంలో తినవచ్చు.
ఉసిరికాయ తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి)లో అల్లం, పసుపు కలిపి నెయ్య వేసు
కుని ఒకటి లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా రోజూ తింటే శరీరంలో విషదోషాలు
నెమ్మదిస్తాయి. పైత్యం, అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు, పెరుగన్నంలో దానిమ్మ
గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.
ఒక్కోసారి పేగుల కదలిక (పెరష్టాలిసిస్) కు కారణమయ్యే కండరాలు బిగుసు
కుని అజీర్తి కలగవచ్చు. అందుకనే మన పూర్వులు అజీర్తి రాకుండా తరచూ విరేచ
నాలకు వేసుకునే వాళ్ళు. విరేచనాల మందు పేగులను బాగా కదిలేలా చేస్తుంది.

21, మే 2016, శనివారం

MAMIDI PANDU VEDI CHESTHUNDHA ?


మామిడిపండ్లు తింటే వేడి
చేస్తుందని, ఒళ్లంతా సెగ్గ
డ్డలు వస్తాయని అంటుంటారు కదా... అది నిజమేనా. మధు
మేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినవచ్చా?

సంస్కృతంలో మామిడికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి.
ఆమ్ర, రసాల, సహకార, అతిసౌరభ, కామాంగ, చూతక,
మంజరీ మొదలైనవి. మామిడిపండ్లు రెండు రకాలు. మొదటివి
చెట్టుకు పండినవి. రెండోవి ముదిరిన కాయలను ఎండుగడ్డిలో
పదిలపరచి, వేడిమి ద్వారా ముగ్గబెట్టినవి. (గమనిక : కార్బైడు
వంటి రసాయనాల ద్వారా ముగ్గిస్తే మాత్రం అది విషతుల్యం.
అది సహజంగా ముగ్గబెట్టిన రెండో కోవలోకి రాదు).
సహజంగా సక్రమంగా ముగ్గబెట్టిన 'పండు' (కృత్రిమ పక్వ
ఫలం) గుణాలు : చాలా తియ్యగా ఉంటుంది (మధుర
రసం). చలవ చేస్తుంది (శీతవీర్యం), తేలికగా జీర్ణ
మవుతుంది (లఘువు). మలవిసర్జన సాఫీగా
అయ్యేలా చేస్తుంది (సరం). బలకరం. వీర్య
వర్థనం (శుక్రకరం). మొత్తం పండు తింటే
దీనివల్ల కలిగే ఫలం, ఫలితం కనిపిస్తాయి.
అదే పిండి కేవలం రసం మాత్రమే స్వీక
రిస్తే ప్రయోజనాలు తగ్గుతాయి. అలా
రసం మాత్రమే తీసుకుంటే కాస్త ఆల
స్యంగా జీర్ణమవుతుంది (గురువు). వాత
హరం. కఫకరం.
చెట్టుకు పండిన పండు : దీంట్లో తియ్యదనంతో
పాటు కొంచెం పులుపు కూడా ఉంటుంది (అమ్లరసం).
కాబట్టి పిత్తాన్ని వృద్ధి చేసి కొంచెం వేడిచేస్తుంది. వాతహరం.
పూర్తిగా మగ్గని పండు అమ్లరసంతో కూడి, ఉష్ణవీర్యమై, మలవి
సర్జనకు సహకారం అందించదు. కాబట్టి ఎలా పండినదైనా
వాటిని అతిగా తింటే అనర్ధమే.
శ్లోకం : "తదేవ వృక్షసంపర్వం గురు
వాతహరపరం మధురామరసం కించిత్ 
భవేత్ పిత్త ప్రకోపనం: ఆమ్రం కృత్రిమ 
పక్వంచ తత్ భవేత్ పిత్తనాశనం... ,
చూపితం తత్పరం రుచ్యం. బల్యం.

వీర్యకరం లము...

పక్వంతు మధురం వృష్యం సిద్ధం

బల సుఖ ప్రదం... హృద్యం, వర్ణం"
కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వేసవి
రాజ ఫలమైన మామిడిపండును ఆస్వాదించండి. ఒకవేళ పుల్లని
మామిడి పండ్లను తిన్నట్లయితే, వెంటనే అరచెంచాడు జీలక
గ్రను నమిలి తినండి. లేదా మూడు గ్రాముల శుంఠి చూర్ణాన్ని
తిని వేడినీళ్లు తాగండి. దుర్గుణాలకు ఇది విరుగుడుగా
పనిచేస్తుంది. ఇది పండ్లను అధికంగా తినడం వల్ల
కలిగే అనర్థాలకు కూడా విరుగుడుగా పని
చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు: తియ్యటి
పండ్లను ఒకపూట ఆహారంగా నిర్భయంగా
తినవచ్చు. అన్నం,
రొట్టెల వంటి ఆహారంతో
పాటు తినవద్దు. సాధారణంగా మధుమేహ
రోగులు పాటించే ఆహార విహార (వ్యాయా
మం, ప్రాణాయామం, తగినంత నిద్ర మొదలై
నవి) నియమాలను పాటిస్తూ, వ్యాధి తీవ్రతను
బట్టి వాడే మందులను వాడుకుంటూ, ఒకరోజు
మొత్తం మీద తీసుకోవాల్సిన ఆహారంలో భాగంగా మామిడి
పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అప్పుడది వాతకరం
కాదు. కాబట్టి మధుమేహానికి వ్యతిరేకం కాదని ఆయుర్వేద
సిద్ధాంతం.

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

VESAVI LO AHARA VIHARALU

వేసవిలో ఆహార విహారాలు

వేసవిలో జాగ్రత్తలు చెప్పండి!

* మన ఆహార విహారాలు వేసవికి బలి చేసేవిగానే
ఉంటాయి. వేసవిలో మిర్చిబజ్జీలు, పునుగులు తినే వారి సంఖ్య
ఎక్కువ. ఏకాలంలో ఏది చెయ్యకూడదో అదే చేస్తాం మనం.
1. వేసవిలో క్రిమికీటకాలు, ఈగలు దోమలు వైరసుల తాకిడి
ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, అవసరం లేకుండా బయట తిరగటం
మానుకోవాలి. ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
2. ఒకప్పుడు తెల్లని బట్టలు కట్టుకుని, గొడుగు వేసుకుని బయ
టకు వెళ్ళేవారు. ఇప్పుడు గొడుగు నామోషీ అయ్యింది. దాని స్థానంలో
నైలాన్ టోపీలు వచ్చాయి. ఇవి ఎండను ఆపుతాయిగానీ, గాలి ఆడనీ
యక విపరీతంగా చెమట పట్టేస్తాయి. పరోక్షంగా వడదెబ్బకు

కారణం అవుతాయి. జుట్టు పాడవుతుంది కూడా!
3. మామిడి పంట వచ్చే కాలం కాబట్టి ఊరగాయల
సీజను ఇది. పూర్వం ఊరుగాయని పెట్టిన తరువాత జాడీ మూతికి వాసెన కట్టి,
మూడు నెలలు కదలకుండా చీకటిగా ఉండేచోట భద్రపరిచేవారు. అలా మాగిన
ఊరుగాయలో తీక్షణత తగ్గి కమ్మదనం వస్తుంది. అది మరచిపోయి, వేసవినంతా
ఊరుగాయలతోనే గడుపుతున్నాం. దీనివలన జీర్ణాశయం, మూత్రపిండాలు, రక్తప్ర
సారవ్యవస్థలు దెబ్బతింటాయి. ఆయా రోగాలకు ఆహ్వానం పలకటమే అవుతుంది.
4. వేసవిలో ఉదయం
పూట ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా
ఐజీ పునుగులకన్నా మజ్జిగ
అన్నం తినటం మంచిది.
రాత్రిపూట అన్నంలో మజ్జిగ
పోసి తెల్లవార్లూ నానిన
అన్నం తింటే చలవ చేస్తుంది,
ఉల్లి టమోటా, కేరట్, బీట్
రూట్, ముల్లంగి, బూడిద
గుమ్మడి, సొరకాయ, కొత్తిమీర ఇలాంటి కూరగాయలను ముక్కలుగా తరిగి
పెరుగు కలిపి తాలింపు పెట్టుకున్న పెరుగు పచ్చడి వేసవి తాపానికి విరుగుడుగా
పని చేస్తుంది.
5. ముల్లంగి, కేరట్, యాపిల్ లేదా జామ లేదా దానిమ్మ లేదా కర్పూజా పండు
ఈ మూడింటిని జ్యూసు తీసుకుని రోజూ తాగితే వడదెబ్బకు శరీరం తట్టుకోగలుగు
తుంది.
6. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని దంచి,
తగినంత ఉప్పు కలిపి సీసాలో భద్రపరచుకోండి. గ్లాసు మజ్జిగలో ఒక చెంచా
పొడిని కలిపి తాగితే వడకొట్టదు.
7. జీర్ణశక్తి బలంగా ఉన్న వారికన్నా, అజీర్తితో బాధపడేవారికి త్వరగా వడ
తగుల్తుందని గుర్తించండి. వేసవిలో చింతపండు, అల్లం వెల్లుల్లి తగ్గించి వాడు
కుంటూ, నూనె పదార్థాలు తినకుండా ఉండటం మంచిది.

ఎండాకాలం వస్తోంది
అంటేనే ప్రజలు భయపడి ఎన్నో
ముందు జాగ్రత్తలు చేసుకుంటారు.
ప్రిట్లు, ఏనీలు, కూలర్లు రిపేరు
చేసుకుంటారు. ఎండాకాలంలో
ముసలివారు. పిల్లలు చాలా జాగ్రత్త
వహించాలి. మనల్ని మనం ఎలా వేసవి
బాధల నుండి కాపాడుకోవాలి. ఏం
జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లాంటి
విషయాలను ఆయుర్వేదం మనకు
వివరిస్తుంది.
ఎండాకాలంలో భూమి
సూర్యునికి అతి దగ్గరగా ఉంటుంది.
కావున సూర్యుడు మన శరీరంలోని
బలాన్ని, నీటిని లాగేస్తాడు. దీనితో మన
శరీరంలోని లవణాలు తగ్గి, వేడి
పెరుగుతుంది. ఈ లక్షణాలను మనం
పట్టించుకొన్నట్లైతే వడదెబ్బ తగిలే
ప్రమాదం ఏర్పడుతుంది. ఇందులో
జ్వరం, తీవ్ర తలనొప్పి, వాంతులు,
చెమట ఆగిపోవటం, మనసు భ్రాంతి,
ఎగశ్వాన ఏర్పడుతుంది. అప్పుడు
తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించాలి.
అంతవరకు రానివ్వకుండా మనం మన
ఆయుర్వేదం చెప్పే ముందు జాగ్రత్తలు
పాటించి మనల్ని మనం కాపాడు
కుందాము.
1 హెూళీ పండుగ నుంచి 30 రోజుల
వరకు రోజు ఒక పిడికెడు వేపపూలను
పడిగడుపున తింటే అసలు ఎండాకాలం
వేడి కూడ తెలియదు.
2) సులభంగా జీర్ణమయ్యే ఆహారం
తినాలి.
3) పలుచని లేత రంగు నూలు వస్త్రాలను
ధరించాలి.
4) గంధము, కలబంద గుజ్జు పైపూతగా
రాసుకుంటే చెమటకాయలు రావు.
5) డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు శాతం.
తగ్గుటకు ఇంట్లో లభ్యమయ్యే దినుసు
లతో జ్యూసులు చేసుకొని వాడండి.
ఎ) చింతపండు పులుసులో నీరు కలిపి
పచ్చి పులుసు లేదా చారుచేసి
వాడండి.
బి) పచ్చి మామిడి కాయ ఉడక పెట్టి
పిసికి అందులో ఉప్పు, చక్కెర,
జీలకర పొడి కలిపి చల్లార్చి
1
తాగండి.
సి) బెల్లం పానకం అనగా బెల్లంని
నీళ్ళలో కరిగించి అందులో
యాలక్కాయ (ఇలాచీ) పొడి
నిమ్మరసం కలిపి తాగండి.
6) మూత్రంలో మంట తగ్గించటానికి...
ఎ) ధనియాలు 1 చెంచా, ఒక గ్లాసు
నీళ్లలో కలిపి మరిగించి వడబోసి
అందులో చక్కెర కలిపి తాగండి.
బి) మోదుగ పూలను 10 పూలు 200
మి.లీ. నీళ్ళలో ఉడికించి వడబోసి
అందులో పంచదార కలిపి
తాగండి.
సి) శతావరి చూర్ణం 1 చెంచా నీటితో
1
1:
1
లేదా పాలతో తీసుకొనిన మూత్రం
లో మంట తగ్గును.
7) సామాన్య దౌర్బల్యంలో ఉసిరి జ్యూస్,
క్యాండీ లేదా చూర్ణం రూపంలో
తీసుకోవాలి.
8)వేసవి విరేచనాలు...
ఎ) మారేడు చూర్ణం బెల్లంతో కలిపి
1
తినాలి లేదా మార్కెట్లో మురబ్బా
దొరుకుతుంది. వాడుకోవచ్చు.
బి) వట్టివేర్లను ఒక వస్త్రంలో చుట్టి
నీటికుండలో వేసి రోజు ఆనీటినే
1
తాగితే విరేచనాలు కాకుండా
ఆపవచ్చు కాని అయినప్పుడు అదే
వట్టివేర్లను కషాయం అనగా
1
నీటిలో మరిగించి వడపోసి తాగితే
వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
9) ముక్కు నుంచి రక్తస్రావం...
ఎ) ఉల్లిరసం 1-2 చుక్కలు ముక్కులో
వేయాలి.
బి) గరిక రసం 1-2 చుక్కలు ముక్కు
లో వేయాలి.
రేటర్ నీరు తాగకండి, మద్యపానం
10) ఆపుకోలేని దాహంలో...
ఎ) కుండ నీటిని ఒక గ్లానులో
పోసుకుని ఒక దగ్గర కూర్చుని
నోటికి ఆనించి మెల్లగా తాగాలి.
బి) కొబ్బరి నీరు, ఉసిరి జ్యూస్, కోకం
జ్యూన్, సుగంధపాల జ్యూన్
తాగాలి.
సి) అరటిపండుని కొబ్బరి నీటిలో పిసికి
తినాలి.
డి) తాజా బూడిద గుమ్మడికాయ రసం
త్రాగాలి.
11) శరీరంలో వేడిని తగ్గించడానికి ఉల్లి
రసం, గంధం, కలబంద గుజ్జును గాని
ఒంటిపై రాయాలి.
12) చెమట కాయలు లేదా చెమట వలన
వచ్చే చర్మ రోగాలు: ఎండిన లేదా పచ్చి
మామిడాకులు రాత్రి నీటిలో నానబెట్టి
ఉదయం ఆ నీటితో స్నానం చేయండి.
ఇందులో గులాబీ రేకులు, మల్లెపూలు
కూడా వేసుకోవచ్చు.
13) వేయించిన ఆహారం, మసాల ఆహారం,
మాంసాహారం, ఎక్కువగా తినకండి.
14) సిల్కు పాలిస్టర్ వస్త్రములు ధరించ
కండి.
15) ఉ|| 11.00 గం||ల నుండి సాయంత్రం
4.00 గం||ల వరకు వీలైనంత బైటికి
వెళ్ళకండి.
16) సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, రిఫ్రిజ్
చేయకండి.

AYUSSHUNICHE SORAKAYA




ఆయుషునిచ్చే సొర

2. సొరకాయ తింటే జలుబు చేస్తుందా?
* సొరకాయ లేదా ఆనపకాయని కలబాష్, బాటిల్ గోర్డ్, లాంగ్ మెలాన్
పేర్లతో పిలుస్తారు. అడవి కాయల్ని తినే కూరగాయలుగా పెంపుడు చేసుకున్న
తొలి కాయగూరల్లో సొరకాయ ఒకటి.
లేత సొరకాయ, లేత సొర ఆకులు కూడా ఇంచుమించు సమాన గుణాలు కలి
గినవే! తోటకూర లాంటి రుచిని కలిగి ఉంటాయి. తోటకూర మాదిరిగానే అన్ని
వంటకాలూ చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే, కాయలో కన్నా సొర ఆకుల్లోనే విట
మిన్లు, ఖనిజాలూ ఎక్కువగా ఉన్నాయి. కామెర్ల వ్యాధిలో సౌరాకులు ఔషధంలా
పనిచేస్తాయి. వేసవి కాలంలో సొరకాయని తరచూ తింటే వడ కొట్టకుండా
ఉంtundi.
100 గ్రాములకు 14 కేలరీలు మాత్రమే ఉన్న సొరని తినటమే ఒక
యోగం. లివరు వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, పేగుపూత,
అమీబియాసిన్, మలబద్ధత లాంటి జీర్ణకోశ వ్యాధుల్లో ఇవి మేలు
చేస్తాయి. చలవనిస్తాయి. సొరకాయలో అధిక శాతం నీరు ఉంది
కాబట్టి జలుబు చేస్తుందనేది ఒక అపోహ! ఇది తియ్య కూర కాబట్టి
దీన్ని వండటానికి ఎక్కువ ఉప్పూకారాల అవసరం ఉండదు. కానీ,
అలా తియ్యగూరగా వండితే పథ్యం కూర అని ఈసడిస్తారు.

చింతపండుతోనో, శనగపిండితోనో వండితే ఎక్కువమంది
ఇష్టంగా తింటారు. వాటి వలన జలుబు చేస్తుంది. తినేదేమో
పులుసునీ, తిట్టేదేమో సొరకాయనీ అవుతుంది. ఎలాంటి అనారోగ్యంలోనయినా
సొరకాయనీ సొర ఆకుల్ని వండుకుని తినవచ్చు. పులుపు కలిపి వండటానికి
ప్రాధాన్యత తగ్గిస్తే సొరకాయ ఆయుర్దాయాన్నిస్తుంది.
గర్భవతులు సొరకాయను తరచూ తింటూ ఉంటే కడుపులో ఎదిగే బిడ్డ నాడీ
వ్యవస్థ బలంగా రూపొందు
తుంది. లేత సొరకాయ జ్యూస్
తీసుకుని అందులో పావు
చెంచా మంచి పసుపు, తగి
నంత నిమ్మరసం, మిరియాల
పొడి కలుపుకుని రోజూ ఉద
యాన్నే ఖాళీ కడుపున ఒక
గ్లాను చొప్పున తాగుతూ ఉంటే
'ని' విటమిన్ సమృద్ధిగా అందు
తుంది. కేన్సర్ పెరుగుదలను
అరికట్టేందుకు ఈ పానీయం తోడ్పడుతుంది. ఇందులో ఆహార సంబంధమైన
పీచుపదార్థం ఎక్కువగా ఉన్నందువలన ఇది షుగరునీ, కొవ్వునీ రక్తంలో ఎక్కు
వగా చేరకుండా నిరోధిస్తుంది. స్థూలకాయం, షుగర్ వ్యాధి, కీళ్ళవాతం, ఇతర
వాతవ్యాధుల్లో సొరకాయ ఆ విధంగా ఔషధంలా మేలు చేస్తుంది. మంచి నిద్రపడు
తుంది. మెదడు సంబంధమైన వ్యాధుల్లోనూ, మూర్చల అబ్బులోనూ సార
పానీయం బాగా మేలు చేస్తుంది. శరీరానికి, మనసుకు ప్రశాంతతనిస్తుంది. విష
దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఈ పానీయం తాగితే జుట్టు నల్ల
గానూ, ఏపుగానూ పెరుగుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. సొరగుజ్జుని,
ఆవనూనెతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...